Hemorrhoids
-
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
ముళ్ల మీద కూర్చోవడం అనే మాట వాడుకగా వాడుతుంటారు. మొలల సమస్య ఉంటే ఈ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. ‘మొల’ అంటే మేకు అని అర్థం. ఆకృతిలోనూ అవి మేకును పోలి ఉంటాయి. అలాగే కూర్చునే చోట నిజంగా మేకులే ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో తెలుసు కాబట్టే ఈ సమస్యకు ఆ పేరొచ్చిందేమో అనిపిస్తుంటుంది. మలద్వారం దగ్గర వచ్చే మొలల సమస్యను ఇంగ్లిష్‌లో పైల్స్ అనీ, హిమరాయిడ్స్ అని అంటారు. ఈ సమస్యకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మలద్వారం దగ్గరి కణజాలంలో రక్తనాళాలు చాలా ఎక్కువ. ఒకరకంగా ఇది దేహానికి చివరి ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తనాళాలు ఎక్కువ సంఖ్యలో అల్లుకు΄ోయినట్టుగా ఉంటాయి. కొందరిలో ఈ రక్తనాళాలు వ్యాకోచించినట్లుగా అయి ఉబ్బి బుడిపెలా మారతాయి. ఇలా బుడిపెలుగా వచ్చే వాటిని తెలుగులో మొలలు అనీ మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఇవి కొందరిలో మల ద్వారం నుంచి బయటకూ వచ్చేసి బాధిస్తుంటాయి. ఒక్కోసారి కొందరిలో ఆ బుడిపెలు ఒరుసుకు΄ోవడం వల్ల ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుంటుంది. మలద్వారం వద్ద తీవ్రమైన దురదా నొప్పీ కూడా ఉంటాయి. వెరసి అవన్నీ కూర్చోనివ్వకుండా, కదల్లేకుండా బాధపెడుతుంటాయి. కారణాలు... మలద్వారం వద్ద రక్తనాళాల వాపునకు కారణమైన ఏ అంశాల వల్లనైనా ఇవి రావచ్చు. ఉదాహరణకు...కడుపులో ఒత్తిడి పెరగడం (మలబద్ధకం ఉన్నవాళ్లు ముక్కుతూ విసర్జన చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం మొలలకు ప్రధాన కారణం)స్థూలకాయం హై΄ో థైరాయిడిజం మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కడుపు కండరాలపైనా, రక్తనాళాలపైనా పడే ఒత్తిడి వల్లశారీరక శ్రమ లేని వృత్తుల్లో ఉన్నవాళ్లలో దేహానికి తగినంత వ్యాయామం లేకపోవడంతోదీర్ఘకాలం పాటు నీళ్ల విరేచనాలు అవుతుండటం (డయేరియా)... ఈ అంశాలన్నీ మొలల సమస్యకు కొన్ని కారణాలు నివారణ / చికిత్స... మూలశంకవ్యాధిలో లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఇందుకు కారణాలను తెలుసుకుని వాటినీ అదుపు చేయాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు... మలబద్దకం, స్థూలకాయం, బరువు పెరగడం వంటి అంశాలు కారణమైతే వాటినీ అదుపు చేయాలి. అక్కడి రక్తనాళాలను గాయపరచకుండా విసర్జితమయ్యేందుకు మలం మృదువుగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలిష్ చేయని తృణధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇక ద్రవాహారం, నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ ఒకేవేళలో మలవిసర్జనకు వెళ్లేలా విసర్జన అలవాట్లు ఉండాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలతో కొద్దిపాటి తీవ్రత ఉన్న మొలలను నివారించుకోవచ్చు. కాని నొప్పి తీవ్రతరమై, రక్తస్రావం అవుతుంటే దానికి చికిత్స అవసరం. తీవ్రతను బట్టి డాక్టర్లు కొన్ని రకాల చికిత్సలు మొదలుకొని శస్త్రచికిత్స వరకు సూచిస్తుంటారు. ఈ శస్త్రచికిత్సల్లోనూ లేజర్, క్రయోథెరపీ, మినిమల్లీ ఇన్వేజివ్ ప్రోసీజర్ ఫర్ హీమరాయిడ్స్ / హీమరాయిడోపెక్సీ (ఇందులో అదనంగా పెరిగిన రక్తనాళాలకు రక్తసరఫరా జరగకుండా ఆపి, అవి తొలగి΄ోయేలా చేయడంతో పాటు నొప్పి, రక్తస్రావం వీలైనంతగా నివారించే అడ్వాన్స్డ్ ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ‘రఫాలో ప్రొసిజర్’ అనే నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. లక్షణాలు... మొలల వ్యాధి ఉన్నా... చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. మొలలు ఉన్నాయన్న విషయమే వాళ్లకు తెలియకపోవచ్చు కూడా. మరికొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... మలవిసర్జన తర్వాత ప్రక్షాళన సమయంలో ఓ ఉబ్బులాగా లేదా కండలాగా చేతికి తగలడం. (అందులో రక్తం గడ్డకట్టి ఉంటే గట్టిగా కూడా తగలవచ్చు) కొందరిలో మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటం ∙మల విసర్జన తర్వాత మలంపై రక్తపు చారికలా కనిపించడంకొన్సిసార్లు లోపలి దుస్తులకు తడిలా నీళ్లలా ఏదైనా మరకలా అంటడం మలద్వారం చుట్టూరా దురదగా అనిపించడం.కొందరిలో అరుదుగా నొప్పి... పైల్స్ వల్ల నొప్పి చాలా అరుదుగా కలుగుతుంది. మొలలలోపల రక్తం గడ్డకట్టినప్పుడు మాత్రమే మొలలతో నొప్పి తెలుస్తుంది. కొందరిలో పైల్స్‌తో పాటు మలద్వారంలో చిన్న పగులు (ఫిషర్) కూడా ఉండవచ్చు. అలాంటి సమయంలో మాత్రం నొప్పి రావచ్చు. కొందరిలో మల విసర్జన వల్ల లోపల ఉండే మొలలన్నీ గుత్తిలా బయటకు రావచ్చు. అలాంటప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మొలల సమస్యలో ఇది సమస్య తీవ్రతకు ఇదొక తార్కాణం.డాక్టర్ ఆసిఫ్ మెహరాజ్, సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ (చదవండి: జీఎస్ఎమ్’: చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!) -
ఫోన్ ‘అక్కడి’ దాకా తీసుకెళ్తున్నారా?
ఇంట్లో.. వీధుల్లో, క్లాసుల్లో.. ఆఫీసుల్లో కూడా.. మన చేతుల్లో స్మార్ట్‌ఫోన్ లేని సందర్భమంటూ ఉండదు. కానీ మనలో కొందరు ఇక్కడికే పరిమితం కావడం లేదు. ఉదయాన్నే బాత్రూమ్ల్లోకి వెంట తీసుకెళ్తున్నారు. రీల్స్ తిరగేస్తూ కాల కృత్యాలు తీర్చుకునే ఈ పద్ధతి కాస్తా డేంజర్‌గా మారుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేసే వారిలో కనీసం సగం మందికి ‘హెమరాయిడ్స్’ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకు? ఎలా? ఏమిటి? అని అనుకుంటున్నారా?...మలద్వారంలో ఒత్తిడి పెరిగిపోవడం, మంట/వాపులకు గురవడం వల్ల అక్కడి నరాలు వాచిపోతుంటాయి. వీటినే హెమరాయిడ్లు లేదా పైల్స్ అని పిలుస్తుంటారు. రోజంతా కూర్చొనే ఉండటం, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం, మలబద్ధకం, మహిళలైతే గర్భధారణ సమయంలో ఈ హెమరాయిడ్లకు కారణాలని వైద్యశాస్త్రం చెబుతోంది. బాత్రూమ్లలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అన్నది తాజాగా ఈ జాబితాలోకి చేరింది. బోస్టన్ (అమెరికా)లోని బెత్ ఇజ్రాయెల్ డెకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మల విసర్జన సమయంలో స్మార్ట్ఫోన్లను వాడితే హెమరాయిడ్లు వచ్చే అవకాశం 46 శాతం వరకూ ఎక్కువ అని తేలింది. స్మార్ట్ఫోన్లు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయన్న దానిపై ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామని.. ఎప్పుడు? ఎక్కడ? ఎలా వాడతామన్నది అనూహ్యమైన పరిణామాలకు దారితీయవచ్చును అనేందుకు తాజా పరిశోధన ఒక నిదర్శనమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ త్రిషా పశ్రీచా అంటున్నారు.సంబంధం ఏమిటి? స్మార్ట్ఫోన్లను బాత్రూమ్లలో వాడితే హెమరాయిడ్లు ఎందుకు వస్తాయన్న ప్రశ్నకు డాక్టర్ పశ్రీచా బదులిస్తూ.. ‘స్మార్ట్‌ఫోన్లల వాడకం వల్ల సమయం గుర్తుండకపోవడం చాలా సహజం. ఫలితంగా ఆ సమయంలో మలద్వారం వద్ద ఉన్న కండరాలు, నరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఫలితంగా కాలం గడుస్తున్న కొద్దీ హెమరాయిడ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి’ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ పశ్రీచా బృందం 45 ఏళ్లు పైబడ్డ వారు 125 మందిని పరిశీలించింది. వీరందరూ పేగుల పరీక్ష (కొలనోస్కోపీ)కి సిద్ధంగా ఉన్న వారు. ఆహార అలవాట్లు, ఉండేచోటు, బాత్రూమ్లలో స్మార్ట్ఫోన్లు వాడతారా? లేదా? వంటి పలు వివరాలను వీరి నుంచి సేకరించారు.అలాగే మల విసర్జన అలవాట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. కొలనోస్కోపీ సమయంలో వీరికి హెమరాయిడ్లు ఉన్నదీ లేనిది స్పష్టం కాగా.. స్మార్ట్ఫోన్లు వాడని వారితో పోల్చి చూసినప్పుడు వాడే వారిలో హెమరాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. పరిశీలించిన ఈ 125 మందిలో 66 శాతం మంది బాత్రూమ్లలో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే వీరు ఐదు నిమిషాలు ఎక్కువ సమయం బాత్రూమ్లలో గడుపుతున్నారు.స్మార్ట్ఫోన్లను బాత్రూమ్ల వరకూ తీసుకెళ్లకూడదన్న సాధారణ సలహాకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోందని, మలవిసర్జనకు ఎక్కువ సమయం పడుతూంటే ఎందుకు అన్న ప్రశ్న వేసుకుని అలవాట్ల సరిచేసుకోవాలని డాక్టర్ పశ్రీచా సూచించారు. అయితే కొంతమంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు మాత్రం స్మార్ట్‌ఫోన్ వాడినా, వాడకపోయినా బాత్రూమ్లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం అంత ఆరోగ్యకరమైన అంశం కాదని స్పష్టం చేస్తున్నారు.-గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
కూర్చున్నా బాధించే హేమోరాయిడ్స్... కారణాలు, లక్షణాలు, చికిత్స
మలద్వారం మరియు పురీషనాళంలో ఎర్రబడిన మరియు ఉబ్బిన సిరలను హేమోరాయిడ్స్ అంటారు. ప్రేగు కదలికలు, గర్భం దాల్చిన సమయంలో, లేదా ఊబకాయం వల్ల కలిగే ఒత్తిడి హేమోరాయిడ్లకు కారణమవుతుంది. అంతర్గత హేమోరాయిడ్లు రక్తస్రావానికి కారణమవుతాయి కానీ నొప్పి కలిగించవు.. ఇవి పురీషనాళం లోపల కనిపిస్తాయి. మలద్వారం బయటకు ఉబ్బే ప్రోలాప్స్డ్ హెమోరాయిడ్స్ ఇవి..బాధించేవి, తీవ్రంగా ఉంటాయి. టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత, ఈ సిరలు మలద్వారం గుండా వెళ్లి శరీరం నుంచి బయటకు వేలాడుతూ కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలలో ప్రోలాప్స్డ్ హెమోరాయిడ్స్ చాలా సాధారణం. కారణాలివే... ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్లు వాటిని ఉంచే కణజాలం బలహీనపడినప్పుడు సంభవిస్తాయి. బంధన కణజాలం బలహీనపడటానికి ప్రేగు కదలిక సమయంలో లేదా మలబద్ధకం విరేచనాలతో బాధపడుతున్నప్పుడు ప్రేగులను గట్టిగా పిండడం వంటి అనేక కారణాలున్నాయి. ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్లు బహిర్గతమవుతాయి. కూర్చున్నప్పుడు లేదా ప్రేగు కదలిక సమయంలో ఇవి నొప్పిని మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇతర రకాల హేమోరాయిడ్లతో పోల్చినప్పుడు సాధారణంగా ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్లు దురదతో పాటు, కూర్చునే సమయంలో అసౌకర్యం, రక్తస్రావం కలిగిస్తాయి, బాత్రూమ్ ఉపయోగించడంలో ఇబ్బంది పెట్టి రోజువారీ జీవితం కష్టంగా మారుస్తాయి. లక్షణాలు ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్స్ సాధారణ లక్షణాలు దురద, గడ్డ, రక్తస్రావం అసౌకర్యం. ఇది ఏర్పడిన ప్రాంతంలో చుట్టుపక్కల ఉబ్బినట్లు అనిపించవచ్చు ప్రేగు కదలిక సమయంలో తర్వాత నొప్పిగా ఉంటుంది. హేమోరాయిడ్ ప్రోలాప్స్ అయినప్పుడు, అది పాయువు చుట్టూ ఉన్న సున్నితమైన ప్రాంతాన్ని చికాకు పెట్టే శ్లేష్మాన్ని తీసుకువస్తుంది. అందువల్ల, మలద్వారం చుట్టపక్కల ప్రాంతాలను శుభ్రంగా పొడిగా ఉంచడం, వీటి వల్ల కలిగే దురదను తగ్గించడానికి ఉత్తమ మార్గం. పరీక్షలు అవసరం.. మూత్రంలో లేదా టాయిలెట్ పేపర్లో లేదా లోదుస్తులలో కూడా రక్తాన్ని గమనించినట్లయితే – కారణాన్ని తెలుసుకోవడానికి పరీక్ష చేయించుకోవాలి. రక్తస్రావం హేమోరాయిడ్స్ వల్ల సంభవించినట్లయితే, అది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో నీరులాగా పల్చగా ఉంటుంది ఇది పేగు రక్తస్రావంతో సంబంధం కలిగి ఉంటుంది. మరొక లక్షణం అసౌకర్య భావన లేదా ప్రేగుల యొక్క అసంపూర్ణ తరలింపు భావన లేదా ప్రేగు కదలిక తర్వాత కూడా మలం విసర్జించాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించడం... ఇంటి చికిత్సలు ఉన్నాయి.. ప్రోలాప్స్డ్ హెమోరాయిడ్స్ చాలా వరకు వాటంతట అవే సాధారణ స్థితికి చేరుకుంటాయి, అయితే కొన్నింటికి స్వీయ–సంరక్షణ ఇంటి చికిత్సలు అవసరం కావచ్చు, ఐస్ ప్యాక్‌లు వేయడం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మలం మృదువుగా పోయేలా ఆ సమయంలో ఒత్తిడిని నివారిస్తుంది. ప్రేగు కదలిక, ఆల్కహాల్ కెఫిన్ వినియోగాన్ని పరిమితం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సాధారణ నడక రక్త ప్రవాహాన్ని పెంచడానికి మలబద్ధకాన్ని నిరోధించడానికి తోడ్పడుతుంది. మందులు, శస్త్ర చికిత్సలు... అయితే కొన్ని పెద్ద ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్లకు మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఆయింట్మెంట్స్, స్టూల్ సాఫ్ట్నర్లు, వంటి కొన్ని మందులు వాడవచ్చు. వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో రబ్బర్ బ్యాండ్ లిగేషన్ వంటి ప్రక్రియలను చేయించుకోవలసి ఉంటుంది – ఈ ప్రక్రియలో ఒక బ్యాండ్‌ను గట్టిగా చుట్టడం ద్వారా సిరకు రక్త ప్రసరణ కత్తిరించబడుతుంది, ఇది హేమోరాయిడ్ తగ్గిపోవడానికి దారితీస్తుంది, అలాగే స్క్లెరోథెరపీ చికిత్సలో హేమోరాయిడ్ కుంచించుకుపోయే పదార్థం ఇంజెక్ట్ చేయబడుతుంది అసౌకర్యమే కానీ ప్రాణాంతకం కావు.. ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్స్ అసౌకర్యంగా ఉంటాయి, కానీ అవి ప్రాణాంతకమైనవి కావు. స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు ఇంటి వైద్యం ద్వారా కూడా నివారించవచ్చు. అయినప్పటికీ, రోగికి తీవ్రమైన లక్షణాలు/అంటువ్యాధులు ప్రేగు కదలిక సమయంలో రక్తస్రావం ఉంటే, వైద్యుడిని సందర్శించడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల వలన ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్లు వృద్ధి చెందకుండా నిరోధించవచ్చు అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగిస్తే.. శాశ్వతంగా వీటిని తగ్గించవచ్చు. –డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్, కొలొరెక్టల్ – హెచ్‌పిబి సర్జన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, కొండాపూర్


