breaking news
heavily cut
-
పింఛన్.. వంచన!
పింఛన్ గత సంఖ్య {పస్తుత సంఖ్య వృద్ధాప్య 1,73,946 1,34,622 వితంతు 1,31,946 1,15,647 వికలాంగులు 41,446 39,906 చేనేతలు 6,581 5,751 ఇతరులు 661 559 సాక్షి, గుంటూరు జిల్లాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం అడ్డగోలుగా తొలగించింది. పింఛన్ల సర్వే కమిటీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి భారీగా కోత విధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో మొత్తం 53,095 పింఛన్లు తొలగించారు. ఇందులో భారీగా అవకతవకలు జరిగినట్లు అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం పునఃపరిశీలనకు ఆదేశించింది. ప్రస్తుతం పింఛన్ రాలేదని తెలుసుకొన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా పింఛన్ అందుకుంటున్న వారి పేర్లు సైతం గల్లంతు కావడం అర్హులను ఆవేదనకు గురిచేస్తోంది. జిల్లాలో సర్వేకు ముందు 3,49,580 పింఛన్లు ఉండగా ఇందులో 2,96,485 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. మిగిలిన 53,095 మంది పింఛన్లను తొలగించారు. పునః పరిశీలన.... పింఛన్ల తొలగింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు నిర్ధారించుకొన్న ప్రభుత్వం పునః పరిశీలన చేపట్టింది. మళ్లీ దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఆ గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసింది. తొలగించిన వాటిల్లో ఇప్పటికే 20 వేలు అర్హమైనవిగా గుర్తించి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసినట్లు సమాచారం. వయస్సు తక్కువ ఉందనే సాకుతో తొలగించిన 5,992 వితంతు పింఛన్లు పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. -
రేషన్ కోత
సాక్షి, గుంటూరు: పేదల నోటికాడి ముద్దను ప్రభుత్వం లాగేసుకోంటోంది. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం పేరుతో రేషన్‌కార్డుల్లో భారీగా కోత పెడుతోంది. కుంటి సాకులు చూపుతూ పేద ప్రజల కడుపుకొడుతోంది. ఆధార్ కార్డులు అందించిన వారికి సైతం కొందరికి రేషన్ నిలిపి వేసింది. దీంతో భారీ సంఖ్యలో కార్డుదారులు రేషన్, ఆధార్ కార్డులు చేత పట్టుకొని రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. మళ్లీ ఆధార్ కార్డు ఇస్తే సీడింగ్ చేస్తామని అధికారులు చెబుతుండటంతో కార్యాలయాల్లో బారులు తీరుతున్నారు. కావాలనే కార్డుల్లో కోత విధించిందని పాలకులను శాపనార్థాలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి గుంటూరు నగరంతోపాటు, మున్సిపాలిటీల్లో ఎక్కువగా ఉంది. జిల్లాలో 1,81,036 రేషన్‌కార్డులు, 9,83,663 వ్యక్తిగత యూనిట్లలకు ఈనెలలో రేషన్ బియ్యాన్ని నిలిపి వేశారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేషన్ కేటాయింపులు ఇలా... జిల్లాలో గతంలో మొత్తం 13,88,348 రేషన్ కార్డులు, 43,21,408 వ్యక్తిగత యూనిట్లకు 19,248.96 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆధార్ కార్డుల అనుసంధానం అనంతం ఈ నెల కోటాకు సంబంధించి 12,07,312 కార్డులు, 33,37,745 వ్యక్తిగత యూనిట్లకు 15217.591 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు 1,81,036 కార్డులు, 9,83,663 యూనిట్లకు 4031.369 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కోత విధించారు. దీంతో పేద ప్రజలకు రేషన్ బియ్యం అందక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. పేదలం బతికేదెలా?.. స్వర్ణభారతినగర్‌లోని 244 నంబరు రేషన్ షాపు ద్వారా రేషన్ తీసుకుంటాను. ఆధార్ నిర్ణీత సమయానికి ముందే రేషన్ షాపులో ఇచ్చాను. ఈ రోజు ఉదయం రేషన్ షాపుకు వెళ్తే నీ కార్డుకు రేషన్ కేటాయించలేదు అని షాపు నిర్వాహకుడు చెప్పడంతో కంగుతిన్నాను. గుమస్తాగా పని చేసి కుటుంబాన్ని పోషించుకునే నాలాంటి పేదలకు ఇలా చేప్తే ఎలా అని ప్రశ్నించాను. రేషన్ ఎందుకు ఆపారో అర్ధం కావడంలేదనిమా డీలర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పేదలంటే అధికారులకు ఇంత అలుసా? పని మానుకొని అధికారుల చుట్టూ తిరగాలంటే బతికేదెలా? - నరసింహారావు, స్వర్ణభారతినగర్, గుంటూరు పస్తులుండాల్సిందేనా..?.. గత నెల కూడా 142 షాపు ద్వారా రేషన్ తీసుకున్నాను. కుటుంబసభ్యుల ఆధార్ కార్డులన్నీ గత నెలలోనే ఇచ్చాను. అయినా ఈనెల రేషన్ ఆపారు. గతంలో కంది పప్పు, నూనె కూడా ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం కూడా ఆపేశారు. అసలే నిరు పేదలం. బియ్యం కూడా ఇవ్వకపోతే పస్తులు ఉండాలా ? - గట్టు వెంకటరమణ, నల్లచెరువు, గుంటూరు ఇదేమి న్యాయం.. నాకు 97 నంబరు షాపులో రేషన్ ఇస్తున్నారు. ఆధార్ అన్నీ ఇచ్చాను. ఈ రోజు రేషన్ షాపుకు వెళితే కార్డులో అమ్మాయి పేరు తీసేశారని చెప్పారు. కార్డులోని నలుగురిలో ఒకరి పేరు తీసేసి రేషన్ తగ్గించడం ఏమి న్యాయం? నిరుపేదలం మాకు రేషన్ బియ్యమే ఆధారం ఇక్కడికి రావటం వలన కూలీ డబ్బులు పోయాయి. - ఎస్.కె ఖైరు, పాత గుంటూరు కోతకు ముందూ.. తర్వాత కార్డు రకం కార్డుల సంఖ్య వ్యక్తిగత యూనిట్లు గతంలో {పస్తుతం గతంలో ప్రస్తుతం తెల్లకార్డులు 12,49,644 10,93,838 39,24,405 30,46,022 అంత్యోదయ 82,640 73,219 2,33,982 1,75,242 అన్నపూర్ణ 1,374 939 1721 1,119 ఎన్టీఆర్ పింఛను 54,690 39,316 1,61,300 1,17,362 కూపన్లు మొత్తం 13,88,348 12,07,312 43,21,408 33,37,745