breaking news
harrassed
-
ఆ ముసుగులో కోరికలు తీర్చుకుంటున్నాడు!
ఫేస్బుక్ ఫ్రెండ్ ముసుగులో అమ్మాయిలను లొంగదీసుకుని కోరికలు తీర్చుకుంటున్న కేటుగాడి ఉదంతం బట్టబయలైంది. హైదరాబాద్‌లో శుక్రవారం బట్టబయలైన ఫేస్బుక్ క్రిమినల్ మాజీద్ లాంటి కేసే మరొకటి రాజమండ్రిలోనూ వెలుగు చూసింది. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని, వారికి దగ్గరై ఆ తరువాత వారిని లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్న బొబ్బా హరిశ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో మంది అమ్మాయిలు వీడిబారిన పడగా ఒకరు మాత్రం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లైంగికంగా వేధించడంతోపాటు... మోసం చేశాడని ఆరోపిస్తూ కేశవరానికి చెందిన ఓ కాలేజీ విద్యార్ధిని తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హరీశ్.. తనతో స్నేహం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడని, ఆ తరువా మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు బొబ్బా హరిష్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేశారు. -
విద్యార్థినికి లైంగిక వేధింపులు!
-
తారా చౌదరి ఇంట్లో గొడవ...ముగ్గురిపై కేసు
హైదరాబాద్:సినీ నటి తారా చౌదరి నివాసంలో గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ ఫేజ్-3 వివేకానంద స్కూల్ సమీపంలో సినీ నటి తారాచౌదరి అలియాస్ రావిళ్ల రాజేశ్వరి నివాసముంటోంది. నివాసంతో పాటు సినిమా కార్యాలయం కూడా అక్కడ కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె నివాసంలో రామినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో తారాచౌదరిని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె...గత కొద్ది రోజుల నుంచి సినిమాలో హీరో వేషం కోసం తన కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వీరమాచినేని సందీప్ అనే యువకుడిని పిలిపించింది. దీంతో సందీప్ తన స్నేహితుడు ఉదయ్, రాజేష్‌ను వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ హల్చల్ చేస్తున్న దుర్గాప్రసాద్‌ను సందీప్ అడ్డుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తన భార్యతో గొడవ పడుతుంటే మధ్యలో మీకెందుకంటూ ప్రసాద్ వారిని నెట్టివేశాడు. సందీప్ రాయితో కొట్టడంతో ప్రసాద్‌కు గాయాలయ్యాయి. గొడవ పెద్దది కావటంతో తారాచౌదరి రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వారందరినీ స్టేషన్‌కు తరలించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్, ఉదయ్, రాజేష్‌లపై పోలీసులు ఐపీసీ 448, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.