breaking news
GT
-
IPLలో నేడు డబుల్ ధమాకా
-
IPL 2026: రాకాసి బౌన్సర్ దెబ్బకు పుర్రె పగిలిపోయేది..!
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ ఛౌదరి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అశోక్ కుమార్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ ముకుల్ ఛౌదరి తలను బలంగా తాకింది. గంటకు 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతి ముకుల్ హెల్మెట్‌ను తగిలి థర్డ్ మన్ దిశగా చాలా దూరం వెళ్లింది. దీన్ని బట్టి బంతి ఎంత వేగంగా వచ్చిందో అంచాన వేయవచ్చు. pic.twitter.com/c7dQanPPqN— crictalk (@crictalk7) April 12, 2026ఈ దెబ్బకు హెల్మెట్ ఉన్నా, ముకుల్ దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మైదానం మొత్తం ఒక్క క్షణం నిశబ్దం ఆవహించింది. ఫిజియో హుటాహుటిన వచ్చి ముకుల్‌కు కంకషన్ టెస్ట్ చేశాడు. అదృష్టవశాత్తూ ముకుల్‌కు ఎలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ ఆ బంతి హెల్మెట్ కవర్ చేయని ప్రాంతంలో తగిలి ఉంటే, ముకుల్ పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టంగా ఉండేది. ఒకవేళ ముకుల్ హెల్మెట్ లేకుండా బరిలోకి దిగుంటే అతని పుర్రె పగిలిపోయేది. అశోక్ ఎంత వేగవంతమైన బౌలరో ఇదివరకే రుజువైంది. ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన అతను.. క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బంతి (154.2) కూడా అశోక్ ఖాతాలోనే ఉంది.ముకుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత మ్యాచ్‌లో (కేకేఆర్‌పై) లక్నోను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపుపై ఎమాత్రం అంచనాలు లేని సమయంలో 27 బంతుల్లో 54 పరుగులు చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముకుల్ కొట్టిన 7 సిక్సర్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ముకుల్ వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ముకుల్ కూడా ధోని తరహాలోనే వికెట్‌కీపింగ్ బ్యాటర్‌గా ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది. -
SRH vs GT: మైదానంలో పరిస్థితి ఇదీ.. ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్
-
SRH Vs GT: సన్‌రైజర్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌లో?!
-
బీఎండబ్ల్యూ ‘3జీటీ’ @ రూ.47.5 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో (జీటీ) మోడల్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర శ్రేణి రూ.43.3 లక్షలు-రూ.47.5 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేసింది. ఇది డీజిల్, పెట్రోల్ వెర్షన్లలో అందుబాటులో ఉండనుంది. అలాగే వినియోగదారులు ఈ మోడల్‌ను స్పోర్ట్ లైన్, లగ్జరీ లైన్ అనే రెండు వేరియంట్లలో పొందొచ్చు. 3జీటీ స్పోర్ట్‌లో 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. దీని ధర రూ.43.3 లక్షలుగా ఉంది. ఇక డీజిల్ 3జీటీ లగ్జరీ వేరియంట్ ధర రూ.46.5 లక్షలుగా ఉంది. పెట్రోల్ 3జీటీ లగ్జరీ వేరియంట్ ధర రూ.47.5 లక్షలుగా ఉంది. ఈ కొత్త మోడల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ స్పేర్ వీల్, వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.


