breaking news
gmc Balayogi International Stadium
-
నేటి నుంచి రగ్బీ ప్రీమియర్ లీగ్
సాక్షి, హైదరాబాద్: ఏడాది క్రితం భారత యువ క్రీడాభిమానులకు అలరించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి టోర్నీకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదిక కావడం విశేషం. నేడు ప్రారంభం కానున్న రగ్బీ లీగ్ ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. పురుషుల విభాగంలో 34, మహిళల విభాగంలో 14 కలిపి 13 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల విభాగంలో 6 టీమ్‌లో బరిలో నిలిచాయి. చెన్నై బుల్స్ డిఫెండింగ్ చాంపియన్ కాగా...హైదరాబాద్ హీరోస్, ఢిల్లీ రెడ్స్, కోల్‌కతా బంగా టైగర్స్, ముంబై డ్రీమర్స్, బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ పోటీ పడుతున్నాయి. గత ఏడాది టోర్నీలో హైదరాబాద్ హీరోస్ మూడో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఇవే పేర్లతో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు జట్లకు మహిళల విభాగంలో ప్రాతినిధ్యం లేదు. రగ్బీ సెవెన్ ఫార్మాట్లో లీగ్‌ను నిర్వహిస్తారు. 22 నిమిషాల పాటు జరిగే ఒక్కో మ్యాచ్‌ను నాలుగు క్వార్టర్లుగా నిర్వహిస్తారు. మ్యాచ్‌లో ఒక్కో క్వార్టర్ తర్వాత 2 నిమిషాల చొప్పున మూడు ‘బ్రేక్’లు ఉంటాయి. టోర్నీ ఆరంభానికి ముందు రోజు సోమవారం జరిగిన కార్యక్రమంలో రగ్బీ ఇండియా అధ్యక్షుడు, ప్రీమియర్ లీగ్ కమిషనర్ అయిన రాహుల్ బోస్ ట్రోఫీతో పాటు టోర్నీ ప్రత్యేక బంతిని ఆవిష్కరించారు. -
హైదరాబాద్ తొమ్మిదో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తాజా సీజన్లో హైదరాబాద్ పరాజయాలకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా లేదు. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–3 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీ చేతిలో ఓడింది. దీంతో సీజన్లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. చెన్నై ఆటగాడు వాల్‌స్కీస్ (43వ, 65వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రాఫెల్ (40వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మార్సెలినో (87వ నిమిషంలో) చేశాడు. 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఐదు పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో ఒడిశా ఎఫ్‌సీ తలపడుతుంది. -
నృత్యాభిషేకం
నృత్యాభిషేకం తూర్పూ పడమర ఏకమై నృత్య సౌరభాలు వెద జల్లాయి. ఆ సౌగంధాల పరిమళాలతో కళాభిమానుల హృదయాలు ఆనందార్ణవంలో తేలియాడాయి. దేశ, విదేశాలకు చెందిన కళాకారులు కూచిపూడికి నృత్యాభిషేకం చేశారు. విభిన్న రూపకాలను ప్రదర్శించి...ఆహూతులను ఆనంద పరవశుల్ని చేశారు. జీఎంసీ బాలయోగి అంతర్జాతీయ స్టేడియంలో సిలికానాంధ్ర నేతృత్వంలో నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనం సమ్మోహితులను చేసింది.


