breaking news
Giza pyramids
-
భూకంపాలకే సవాల్.. 4500 ఏళ్ల గీజా పిరమిడ్ల రహస్యం ఇదే!
కైరో: సుమారు 4500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈజిప్ట్‌లోని గీజా మహా పిరమిడ్లు భారీ భూకంపాలను తట్టుకుని ఎలా నిలబడగలిగాయి? 1992లో సంభవించిన 5.8 తీవ్రత గల భూకంపం వల్ల వీటి వెలుపలి భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, వీటి ప్రధాన కేంద్రం (కోర్) మాత్రం చెక్కుచెదరలేదు. శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఈజిప్ట్ భూభౌతిక శాస్త్రవేత్త ఆసిమ్ సలామా నేతృత్వంలోని బృందం ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం, ఈ నిర్మాణాల వెనుక ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యాలను వెల్లడించింది.సిస్మిక్ ఫ్రీక్వెన్సీ మిస్‌మ్యాచ్ పరిశోధకులు హారిజాంటల్-టు-వర్టికల్ స్పెక్ట్రల్ రేషియో అనాలసిస్ పద్ధతిని ఉపయోగించి పిరమిడ్ అంతర్గత, బాహ్య ప్రాంతాల్లోని 37 చోట్ల సూక్ష్మ వైబ్రేషన్లను నమోదు చేశారు. ఈ అధ్యయనంలో పిరమిడ్ సహజ పౌనఃపున్యం (Natural Frequency) 2.0 నుండి 2.6 హెర్ట్జ్ (Hz) మధ్య ఉండగా, దాని చుట్టూ ఉన్న నేల ఫ్రీక్వెన్సీ కేవలం 0.6 హెర్ట్జ్ మాత్రమే ఉన్నట్లు తేలింది. భూకంపం వచ్చినప్పుడు నేల యొక్క ఫ్రీక్వెన్సీ, కట్టడం ఫ్రీక్వెన్సీతో సరిపోలితే 'రెజోనెన్స్' (అనునాదం) ఏర్పడి కట్టడాలు కూలిపోతాయి. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల భూకంప శక్తి పిరమిడ్ లోపలికి బదిలీ కాలేకపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇంటర్నల్ షాక్ అబ్జార్బర్స్ ఈ పిరమిడ్లలోని అంతర్గత నిర్మాణాలు భూకంప ప్రకంపనల తీవ్రతను తగ్గించే యాక్టివ్ షాక్ అబ్జార్బర్లుగా పనిచేస్తున్నాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ముఖ్యంగా పిరమిడ్ లోపల ఉండే ‘కింగ్స్ ఛాంబర్’ (రాజు గది) పైభాగంలో అమర్చిన ప్రత్యేక గదులు వైబ్రేషన్లను భారీగా తగ్గిస్తున్నట్లు తేలింది. వీటితో పాటు, పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించిన దట్టమైన గ్రానైట్ శిలల్లో ఉండే క్వార్ట్జ్ స్ఫటికాలు భూకంప తరంగాలను శోషించుకోకుండా (absorb చేయకుండా) తిరిగి పరావర్తనం (reflect) చెందిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల ప్రత్యేకమైన ధ్వని ప్రభావాలు కూడా ఏర్పడుతున్నాయి.అద్భుతమైన ఆకృతి.. శాస్త్రీయ నిర్మాణంఆధునిక భూకంప నిరోధక డిజైన్లు కేవలం ఫ్రీక్వెన్సీలపైనే కాకుండా నిర్మాణపు బరువు, లెక్సిబిలిటీ, సెంటర్ ఆఫ్ మాస్ (ద్రవ్యరాశి కేంద్రం) పై ఆధారపడతాయి. గీజా పిరమిడ్ వెడల్పైన బేస్ (పునాది), భూమికి దగ్గరగా ఉండే తక్కువ సెంటర్ ఆఫ్ మాస్, పైకి వెళ్లే కొద్దీ ఇరుకుగా మారే టేపరింగ్ ఆకృతి, ఖచ్చితమైన సమమితి (Symmetrical plan) దాని స్థిరత్వాన్ని పెంచాయి. నాటి పురాతన ఇంజనీర్లు అత్యంత సమర్థవంతమైన డిజైన్, ఇంజనీరింగ్ నైపుణ్యంతోనే వీటిని నిర్మించారని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమవుతోంది.ఇది కూడా చదవండి: తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర? -
ఫారోల అమూల్య బ్రాస్లెట్ అదృశ్యం
కైరో: ఈజిప్ట్ నాగరికతతో ఫారో చక్రవర్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఫారో చక్రవర్తుల కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ల నిర్మాణం జరిగింది. అద్భుతమైన పాలనతో మంచి పేరు తెచ్చుకున్న ఫారో చక్రవర్తులకు చెందిన ఒక ముంజేతి కంకణం ఇప్పుడు కనబడకుండాపోయింది. ఈజిప్ట్ రాజధాని కైరో నగరంలోని తహ్రీర్ స్క్వేర్‌లోని ప్రఖ్యాత మూజియంలో చివరిసారిగా ఇది బహిరంగంగా కనిపించింది. మధ్యలో లాపిస్ లజూలీ మణిపూస పొదిగిన ఈ కంకణాన్ని స్వచ్ఛమైన స్వర్ణంతో తయారుచేశారు. మ్యూజియంకు చెందిన పునరుద్ధరణ లే»ొరేటరీకి తీసుకురాగా ఆ తర్వాత ఇది కనిపించకుండాపోయిందని ఈజిప్ట్ పర్యాటకం, పురాతత్వ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. దీనిని దొంగలించిన వ్యక్తులు విదేశాలకు అక్రమ రవాణా చేయొచ్చని ఈజిప్ట్ ప్రభుత్వం అనుమానిస్తోంది. అనుకున్నదే తడవుగా వెంటనే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయలు, సరిహద్దుల వద్ద తనిఖీలను ముమ్మరంచేసింది. బ్రాస్లెట్ ఫొటోలను ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సాప్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్చేస్తోంది. వేల ఏళ్ల పాత కంకణం క్రీస్తు పూర్వం 1,076 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 723 సంవత్సరాల కాలంలో ఈజిప్ట్‌ను పరిపాలించిన రాజవంశానికి చెందిన అమేనీమోప్ రాజుకు చెందిన కంకణంగా దీనిని గుర్తించారు. తూర్పు నైలు నదీతీర ప్రాంతంలోని టానిస్‌లో ఖననంచేసిన అమేనీమోప్ ఆన్‌ఆర్‌టీ–4 ఛాంబర్లో ఈ కంకణాన్ని గతంలో కనుగొన్నారు. తొలుత వేరే చోట అమేనీమోప్ పారి్థవదేహాన్ని ఖననంచేసి కొన్నాళ్లకు సుసేన్నెస్ రాజు సమీప ఛాంబర్‌కు మార్చారు. ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒకడిగా సుసేన్నెస్ వెలుగొందారు. అమేనీమోప్ సమాధాని 1940లో కనుగొన్నారు. ‘‘వేల ఏళ్ల చరిత్ర గల ఇలాంటి కంకణం కనబడకుండా పోవడం వింతేమీ కాదు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా విలువ ఉంది. స్మగ్లర్లు వీటిని దొంగించి విదేశాలకు తరలిస్తారు’’అని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఫోరెన్సిక్ పురాతత్వవేత్త క్రిస్టోస్ సిరోగియాన్నిస్ చెప్పారు. ‘‘త్వరలోనే ఇది ఎక్కడో, ఏ దేశంలోనో ప్రఖ్యాత వేలం సంస్థ వేలంపాటలోనే, ఆన్లైన్లోనే ప్రత్యక్షమవుతుంది. ఫారో చక్రవర్తుల వస్తువులను సొంతం చేసుకునే సంపన్నులకూ కొదువలేదు. వాళ్లు వీటిని బ్లాక్మార్కెట్లో కొని దాచుకుంటారు’’అని ఆయన అన్నారు. ‘‘చోరీకి గురై తమ దేశంలోకి వచి్చన పురాతన వస్తువులను కొన్ని అరబ్ దేశాలు తిరిగి ఈజిప్ట్‌కు అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని అయితే అధికారికంగా అప్పగించే ఉద్దేశంలేక మ్యూజియం తోటలోనే, ప్రాంగణాల్లోనూ తర్వాత పడేసి వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి’’అని ఆయన గుర్తుచేశారు. ‘‘కంకణంలోని బంగారం కరిగించి సొమ్ముచేసుకునే అవకాశం చాలా తక్కువ. కరిగిస్తే వచ్చే బంగారం విలువ కన్నా అలాగే కంకణం రూపంలోనే అమ్మితే లెక్కలేనంత సొమ్ము సంపాదించొచ్చు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ఈజిప్ట్‌కు దశాబ్దాలుగా పురాతన వస్తువుల స్మగ్లింగ్ అనేది పెద్ద తలనొప్పిగా తయారైంది. శక్తిమేరకు కాపాడుతున్నా ప్రతి ఏటా ఎక్కడో ఓ చోట ఇలా విలువైన వస్తువులు అదృశ్యమవుతూనే ఉన్నాయి. -
ఈజిప్టు పర్యటన.. గిజా పిరమిడ్‌ను సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ సందర్శించారు. అనంతరం రాజధాని కైరో నగర శివారులో ఉన్న గిజా పిరమిడ్‌ను ప్రధాని సందర్శించారు. పిరమిడ్ ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ఏడు వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. గిజా పిరమిడ్ ప్రస్తుతం ఉన్న పిరమిడ్లన్నింటిలో అతి పెద్దది. నైలు నది పశ్చిమ ఒడ్డున రాతి పీఠభూమిపై ఉన్న ఈ పిరమిడ్.. ఈజిప్టు పాలకుల్లో నాల్గవ రాజవంశానికి చెందిన ఫారో ఖుఫు సమాధిగా భావిస్తారు. క్రీస్తు పూర్వం 26వ శతాబ్దంలో దాదాపు 27 ఏళ్లపాటు వీటిని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. VIDEO l Prime Minister Narendra Modi visits the Great Pyramid of Giza in Egypt. pic.twitter.com/Tx6DYmrIZl — Press Trust of India (@PTI_News) June 25, 2023 ఈజిప్టు అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ఆహ్వనం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించారు. తర్వాత ఆ దేశ ప్రభుత్వ పెద్దలతోనూ, అక్కడి ప్రముఖులతోనూ, ప్రవాస భారత సంఘాలతోనూ సమావేశం అయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదీ చదవండి: అమెరికా పర్యటన ముగిసిన నేపథ్యంలో ఈజిప్టుకు ప్రయాణమైన ప్రధాని -
ప్రాచీన పిరమిడ్ సందర్శనకు అనుమతి
కైరో : కొన్ని దశాబ్దాల తర్వాత ఈజిప్టులో అత్యంత ప్రాచీనకాలానికి చెందిన పిరమిడ్ సందర్శనకై పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. దీని పేరు బెంట్ పిరమిడ్. ఇది ఈజిప్టు రాజధాని కైరోకు దక్షిణాన 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తుపూర్వం 4600 సంవత్సరాల క్రితం దీన్ని ఈజిప్టు నాల్గవ రాజవంశానికి చెందిన కింగ్ స్నెఫేరు కోసం నిర్మించారు. ఈ బెంట్ పిరమిడ్‌ను తెరవడంతో పిరమిడ్ నిర్మాణాలపై పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వనుందని పురావస్తు శాస్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 101 మీటర్ల ఎత్తుతో అసాధారణంగా ఉన్న ఈ పిరమిడ్ తర్వాత కాలంలో పిరమిడ్ల నిర్మాణానికి అత్యున్నత దశగా పేర్కొనే ప్రఖ్యాత గిజా పిరమిడ్ కట్టడానికి మార్గదర్శి అని తెలిపారు. ఇది తొలిదశలో నిర్మించిన పిరమిడ్లకు, తర్వాత తరంలోని పిరమిడ్లకు మధ్య వారధిలా నిలిచిందని పేర్కొన్నారు. బెంట్ పిరమిడ్‌లో 79 మీటర్లు ఉండే ఇరుకైన సొరంగమార్గం గుండా ప్రధాన చాంబర్‌కు చేరుకోవచ్చు. ఈజిప్టు పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖా మంత్రి ఖలీద్ మాట్లాడుతూ 1965లో దీన్ని మూసివేశామని, బెంట్పిరమిడ్ తో పాటు అల్కాడాగ్మటిక్ అనే మరో పిరమిడ్‌లో కూడా సందర్శకులకు అనుమతి ఇచ్చామన్నారు. బెంట్పిరమిడ్, పిరమిడ్ల నిర్మాణానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. అలాగే సమీప ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 4,000 సంవత్సరాల నాటి పురాతన అవశేషాలను కనుగొన్నారు. ‘రాయి, బంకమట్టి మరియు చెక్క నిర్మాణాలతో కూడిన మమ్మీపై భాగాలు దొరికాయని, అలాగే కొన్ని మమ్మీలు కనుగొన్నామని ’ పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
40 మంది ముష్కరుల కాల్చివేత
గిజా: ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్ర మూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. గిజాతోపాటు సినాయ్ ద్వీపకల్పంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి 40 మందిని కాల్చి చంపింది. శుక్రవారం గిజాలో పర్యాటకుల బస్సుపై ఉగ్ర వాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం దేశస్తులతోపాటు ఒక ఈజిప్టు గైడ్ చనిపోగా మరో 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులు, విదేశీ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వేకువజామున గిజాలోని రెండు ప్రాంతాలతోపాటు సినాయ్ ప్రావిన్స్‌లో ఉగ్ర స్థావరాలపై బలగాలు ఒక్కసారిగా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మొత్తం 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంపాటు ఈజిప్టును పాలించిన హోస్నీ ముబారక్ 2011లో వైదొలిగాక దేశంలో తీవ్ర అస్థిరత నెలకొంది. దేశంలో సుస్థిర పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్న తరుణంలో జరిగిన తాజా ఉగ్ర దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. -
4,500 ఏళ్ల కిందటి గృహాలు
వాషింగ్టన్: ఈజిప్టులోని గిజా పిరమిడ్ సమీపంలో శాస్త్రవేత్తలు రెండు పురాతన గృహాలను గుర్తించారు. అవి దాదాపు 4,500 సంవత్సరాల కిందటివని తేల్చారు. పిరమిడ్ నిర్మాణానికి పనిచేసిన సిబ్బందికి, సైన్యానికి ఆహార సరఫరాను పర్యవేక్షించే అధికారుల నివాసాలని అమెరికాకు చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక భవనంలో నివసించే అధికారులు జంతు మాంసానికి సంబంధించిన బాధ్యతలు చూసుకునేవారని, మరో భవనంలో ‘వాదాత్’లుగా పిలిచే సంస్థల అధిపతులు (సన్యాసులు) నివసించేవారని చెప్పారు. ఈజిప్షియన్ల చరిత్రలో ‘వాదాత్’కు ప్రత్యేక స్థానముందని, వాటి అధిపతులుగా పనిచేసేవారు ప్రభుత్వ ఉన్నత హోదా ర్యాంకును కలిగి ఉండేవారని ప్రముఖ పరిశోధకుడు మార్క్ లెహ్నర్ తెలిపారు. పిరమిడ్ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను కూడా వీరు పర్యవేక్షించినట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. -
గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
ఈజిఫ్ట్ పిరమిడ్లకు ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత ఉంది. అందులోనూ గిజా పరిమిడ్ రహస్యాలను కనుక్కోవాలని.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా గిజా పిరిమడ్ లోపల నిర్మాణం ఎలా ఉంది? అనే విషయంపై సైంటిస్టులకు అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఈ గిజా పిరిమడ్పై తాజాగా కొందరు ఔత్సాహిక పరిశోధకులు పరిశోధనలు చేశారు. అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చేశాయి. పిరిమిడ్‌లోని గ్రాండ్ గాలరీ నుంచి 30 మీటర్ల లోతు వరకూ సైంటిస్టులు ‘కాస్మిక్ రే ఇమేజింగ్’ టెక్నాలజీ సాయంతో సైంటిస్టులు పరిశోధనలు చేశారు. గ్రేట్ పిరమిడ్‌లో లోపల రహస్యంగా ఉన్న సొరంగాలు, వంకీ ఆకారంలో ఉన్న నిర్మాణాలను, ఇతర కీలక అంశాలను సైంటిస్టులు దీని ద్వారా గుర్తించారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిఫ్ట్ నిర్మాణం ఎలా చేశారన్న అంశంపై ఇప్పటివరకూ సైంటిస్టులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దీనిని క్రీస్తుపూర్వం 2550లో ఫారో రాజులు నిర్మించారు. తాజాగా సైంటిస్టులు కాస్మిక్ టెక్నాలజీతో చేసిన పరిశోధన వల్ల పిరమిడ్ నిర్మాణం గురించి తెలుసుకోవడంలో పురోగతి సాధించారు. అప్పట్లోనే ఆధునిక భౌతిక శాస్త్రాన్నినిర్మాణశాస్త్రంలో వినియోగించడంపై సైంటిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గిజా పిరమిడ్ లోపల ఇప్పుడు అనుకుంటున్నట్లుగా.. కాకుండా మరో గ్రాండ్ గాలరీతో పాటు, విభిన్న ఆకృతులతో కూడిన నిర్మాణాలు ఉన్నట్లు తెలిసింది. -
గిజా పిరమిడ్ రహస్యం ఇదే..!
-
బాంబు పేలుడు : తొమ్మిది మంది మృతి
కైరో : ఈజిప్టులోని అత్యంత పురాతనమైన గిజా పిరమిడ్ల వద్ద శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఉన్నారని చెప్పారు. దేశంలో విప్లవం చోటు చేసుకుని... వచ్చే సోమవారంతో నాలుగేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో పోలీసులు గిజా పిరమిడ్ల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఆ క్రమంలో ఈ బాంబు పేలుడు చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.


