breaking news
	
		
	
  gift pack
- 
      
                   
                                                     
                   
            Diwali 2025: దీపావళికి అలరించనున్న గిఫ్ట్ ఫ్యాక్స్
దీపావళి పండుగకు నగరం ముస్తాబవుతోంది.. ముఖ్యంగా ఈ పండుగలో స్వీట్స్దే అగ్రభాగం.. ఈ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పలుకరించుకుని స్వీట్స్, లేదా డ్రైఫ్రూట్స్ వంటి గిఫ్ట్ బాక్సులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సారి దీపావళికి అందమైన ర్యాపింగ్తో ఆకట్టుకునే గిఫ్ట్ ప్యాక్స్ హడావుడి మొదలైంది.. మార్కెట్లో వివిధ రకాల స్వీట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో ఈ గిఫ్ట్ ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రంగు రంగుల ర్యాపింగ్, రకరకాల మోడళ్లలో గిఫ్ట్ ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహికులతో నగరంలోని బేగంబజార్ సందడిగా కనిపిస్తోంది. సంప్రదాయ వెరైటీ డిజైన్లలో తయారు చేసిన డ్రైఫ్రూట్స్, స్వీట్ బాక్సులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి వివిధ రకాల ఆకారాల్లో, వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇమిడిపోయిన సంప్రదాయం.. దీపావళికి గిఫ్ట్ బాక్సులు ఇచ్చే సంస్కృతిని మార్వాడీలు, గుజరాతీలు ఎక్కువగా పాటిస్తారు. ఇదే పద్ధతి ప్రస్తుతం నగరంలోని ప్రజల్లోనూ క్రమంగా ఇమిడిపోయింది. దీంతో పండుగ పూట ఇంటికి వచ్చే అతిథులకు, లేదా ఇరుగు పొరుగు వారికి, మరీ ముఖ్యంగా సన్నిహితులకు ఈ గిఫ్ట్ బాక్సులు అందజేస్తుంటారు. కొనుగోళ్లు షురూ.. ఇప్పటికే బేగంబజార్‌లో కొనుగోళ్లు షురూ అయ్యాయి. డ్రై ఫ్రూట్ మార్కెట్ కిటకిటలాడుతోంది. స్వీట్‌షాపుల నిర్వాహకులు, సాధారణ ప్రజలు కొనుగోళ్లకు వస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఉద్యోగులు, వ్యాపారుల్లో ఈ గిఫ్ట్స్ ఇచ్చే సంస్కృతి పెరిగిపోయింది. దీంతో గిఫ్ట్ బాక్సుల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. – రాజ్‌కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని బాక్స్‌ల ధరలు ఇలా.. సాధారణంగా ఈ గిఫ్ట్ బాక్స్‌ల ధరలు రూ.250 నుంచి రూ.2 వేల వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన బాక్స్‌ల్లో బాదం, కాజు, కిస్మిస్, పిస్తా, ఆప్రికాట్‌తో పాటు అంజీర వంటి డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు. వీటితో పాటు కొందరు వివిధ రకాల స్వీట్లు కూడా ప్యాక్ చేస్తుంటారు. ఈ బాక్స్‌ల్లో డ్రైఫ్రూట్స్ 750 గ్రాములు, 500 గ్రాములు, 250 గ్రాములు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. - 
      
                   
                                                     
                   
            Ramadan 2025 హైదరాబాదీ..ప్యార్ కా తోఫా..!
గోల్కొండ: రంజాన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఉపవాస దీక్ష.. ఉదయం నుంచి కఠిన ఉపవాసం చేసి సాయంత్రం పూట ఇఫ్తార్ విందులో రకరకాలైన పండ్లు ఆరగించి దీక్ష విరమిస్తారు. అందులో భాగంగా మార్కెట్లో పెద్దఎత్తున లభించే సీజనల్ ఫ్రూట్స్‌ను అందంగా ప్యాకింగ్ చేసి స్నేహితులు, బంధువులకు అందజేయడం హైదరాబాదీల ప్రత్యేకత.. కొత్తగా బంధుత్వాలు కలిసిన వారు తమ బంధుత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి వారి వారి స్థాయి మేరకు ఫ్రూట్స్ ప్యాక్స్‌ను అందజేస్తుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, స్నేహితులు ఇలా అందరూ పండ్లను అందజేసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ మహా నగరంలో ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్ అందజేసే సంస్కృతి కొనసాగుతోంది. రంజాన్ మాసంలో కొంత మంది షాపుల యజమానులు ప్యాకింగ్ చేయడంలో సిద్ధహస్తులైన వారిని నియమించుకొని ప్యాకింగ్ చేయించుకుంటారు. గిఫ్ట్ ప్యాక్‌లో పెట్టడానికి వాడే పండ్ల రకాలను బట్టి ధరలు ఉంటాయని మెహిదీపట్నం ఎస్ఏ రాయల్ ఫ్రూట్ మార్ట్ వ్యాపారి అబ్దుల్ అజీజ్ అంటున్నారు. మొత్తం 23 రకాల పండ్లతో సుపీరియర్ గిఫ్ట్ ప్యాక్‌లను ప్రత్యేకంగా తయారు చేస్తామని అన్నారు. ఇందులో 23 రకాల పండ్లతో మొత్తం 19 కిలోల పండ్లు ఉంటాయి. అదే డీలక్స్ ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్‌లో 18 రకాల పండ్లు ఉండగా వీటిలో 14 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా 11 రకాల పండ్లతో 10 కిలోల బరువు ఉండే ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఏడు రకాల పండ్లు, ఆరు కిలోల గిఫ్ట్ ప్యాక్‌లు కూడా ఎక్కువగా అమ్ముడవుతాయి. నెంబర్ వన్ క్వాలిటీ ఖర్జూరా పండ్లు ఉపయోగిస్తామని ఆయన వివరించారు. వీటి ధరలు రూ.550 నుంచి రూ.18 వేల వరకు ఉంటాయని చెప్పారు. - 
      
                   
                               
                   
            న్యూ ఇయర్ జోక్స్

 కానుక
 డిసెంబర్ 31 పార్టీకి సిద్ధమవుతూ అలసి పోయి ఆ మధ్యాహ్నం చిన్న కునుకు తీసింది మంగతాయారు. నిద్ర లేచాక భర్తతో నర్మగర్భంగా అంది - ‘ఇప్పుడే నాకో కలొచ్చింది. అందులో మీరు నాకు డైమండ్ రింగ్ కానుకిచ్చినట్టుగా కనిపించింది. దానర్థం ఏమిటో’.
 భర్త నవ్వి భార్యను దగ్గరకు తీసుకొని అన్నాడు- ‘రాత్రికి నువ్వే తెలుసుకుంటావుగా’. సరిగ్గా అర్ధరాత్రి అయ్యి కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే భర్త ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ తెచ్చి భార్య చేతిలో ఉంచాడు. మంగతాయారు ఉత్సాహంగా విప్పింది. అందులో ఒక పుస్తకం ఉంది. దాని మీద ఇలా ఉంది- ‘మీ కలలకు అర్థం తెలుసుకోండి’.
 
 అసలు మనిషి
 పబ్‌లో న్యూ ఇయర్ పార్టీ ఆర్భాటంగా సాగుతోంది. భర్తలు తాగుతూ ఉన్నారు. భార్యలు కబుర్లలో తల మునకలుగా ఉన్నారు. మరి కొద్ది నిమిషాల్లో అర్ధరాత్రి పన్నెండు అవుతుంది. ఇంతలో ఒకామె లేచింది. ‘ఫ్రెండ్స్... ఇంకా కేవలం అరవై సెకండ్లు మాత్రమే ఉన్నాయి. అవి గడిచి పెద్ద ముల్లు చిన్న ముల్లు మీదకు వచ్చేసరికి ఇక్కడ ఉన్న మగాళ్లంతా తమ జీవితాన్ని అర్థవంతం చేసిన వ్యక్తి పక్కన నిల్చోవాలి.టక్.. టక్.. టక్... పెద్ద ముల్లు చిన్న ముల్లును తాకింది. చాలా ఇబ్బందికరమైన సంగతి.మగళ్లంతా తమకు మందు సర్వ్ చేస్తున్న వెయిటర్ పక్కన నిలవడానికి మీదపడి అతణ్ణి తొక్కి చంపినంత పని చేశారు.
 
 స్టేజ్ 1
 న్యూ ఇయర్ పార్టీ జోరుగా సాగుతోంది. రాము సోమును సిగరెట్ అడిగాడు.
 సోము: ఈ సంవత్సరం నుంచి సిగరెట్లు మానేస్తానని నిర్ణయం తీసుకున్నట్టున్నావ్?
 రాము: అవును. తీసుకున్నాను. ఆ క్రమంలో మొదటి దశలో ఉన్నాను.
 సోము: మొదటి దశ? అంటే?
 రాము: ప్రస్తుతానికి కొనడం మానేశాను.
 
 లెక్చర్
 డిసెంబర్ 31 తెల్లవారుజామున నాలుగ్గంటలకు ఒక కారును పోలీసులు ఆపారు. సీటులో ఓ పెద్దమనిషి ఉన్నాడు. చూస్తే తాగినట్టున్నాడు.
 పోలీస్: ఎక్కడకు వెళుతున్నారు.
 పె.మ: లెక్చర్ వినడానికి.
 పోలీస్: ఈ టైమ్‌లో ఇంత తెల్లవారుజామున మీకు లెక్చర్ ఇచ్చేవాళ్లు ఎవరు?
 పె.మ: నా భార్య.
 - 
      
                   
                               
                   
            ఆఫర్ అంటూ కుచ్చుటోపీ..

 వలిగొండ (నల్లగొండ జిల్లా) : మీరు చాలా కాలంగా మా నెట్వర్క్ నెంబర్ వాడుతున్నారు, మీకు మా కంపెనీ ఆఫర్ ప్రకటించిందంటూ.. వచ్చిన ఫోన్ కాల్ నమ్మి ఓ వ్యక్తి చేతి చమురు వదిలించుకున్నాడు. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్లకు చెందిన వరికుప్పల ఆగమయ్యకు పది రోజుల క్రితం 911133564001, 911133564044 నెంబర్ల నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎన్ని రోజులుగా మా నెట్వర్క్ వాడుతున్నారని అవతలివారు అడిగారు. దీంతో ఆగమయ్య.. పది సంవత్సరాలుగా వాడుతున్నానని తెలిపాడు. మీరు చాలా కాలంగా మా నెట్వర్క్ వాడుతున్నందున మా నెట్వర్క్ కంపెనీ మీకు మంచి ఆఫర్ ప్రకటించిందని తెలిపారు. మీకు సామ్సంగ్ సెల్‌ఫోన్, 4జీ మొమరీ కార్డు, రెండు గడియారాలు, 5 వేల విలువ చేసే షాపింగ్ వోచర్లు పది రోజులలో పంపిస్తామని చెప్పారు. అలా చెప్పి ఆగమయ్య పోస్టల్ అడ్రస్ తీసుకున్నారు.
 
 ఈ గిఫ్ట్ ప్యాక్ తీసుకునే సమయంలో ఫోస్టాఫీస్లో కేవలం రూ.3 వేలు చెల్లించండని తెలిపారు. గిఫ్ట్‌ప్యాక్ పంపించాం, అందిందా అని తిరిగి సోమ, మంగళవారాలలో 911133564031 నెంబరు నుంచి ఫోన్ చేశారు. వీరి ఫోన్ రావడంతో ఆగమయ్య మంగళవారం గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లాడు. పోస్టాఫీస్‌లో ఆయన పేరున గిఫ్ట్ ప్యాక్ వచ్చి సిద్ధంగా ఉంది. దీంతో వారు చెప్పిందంతా నిజమని నమ్మిన ఆగమయ్య 3 వేలు చెల్లించి గిఫ్ట్ ప్యాక్‌ను అందుకున్నాడు. వెంటనే గ్రామస్తుల ముందు దానిని ఓపెన్ చేసి చూడగా వారు చెప్పింది ఒక్కటి కూడ లేదు. అందులో హనుమాన్ చిన్న విగ్రహం, యంత్రం, దేవుడి ఫోటో, సీడీ క్యాసెట్ మాత్రమే కనిపించాయి. దీంతో ఆగమయ్య పరిస్థితి ఆగంగా మారింది. నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నాడు. - 
      
                   
                               
                   
            సరుకులిచ్చిన నెలకు..సంచులొచ్చాయ్!

 పాలకొండ: సంక్రాంతి వెళ్లి నెలైంది. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో సర్కారు ఆర్భాటంగా సరఫరా చేసిన సరుకులూ జీర్ణమైపోయాయి. కానీ ఆ సరుకుల సరఫరాకు ఉద్దేశించిన సంచులు తీరిగ్గా ఇటీవల మండలాలకు చేరాయి. వాటిని ఏం చేయాలో తెలియక అధికారులు ఆ మూటలు సైతం విప్పకుండా కార్యాలయాల్లో అలాగే ఉంచేశారు. వీటి విలువ ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైనే ఉంటుంది. ఇవన్నీ వృథా అయినట్లే. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చెబుతూ చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం ఇటువంటి అనవసర ఆర్భాటాలకు పోయి కోట్లాది రూపాయలు వృథా చేయడమెందుకున్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రలో తొలి సంక్రాంతిని ప్రభుత్వపరంగా జరుపుతామంటూ సంబరాల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది.
 
 అందులో భాగంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రేషన్‌కార్డుదారులకు ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. వాటిని గిఫ్ట్ ప్యాక్‌గా అందించేందుకు చంద్రబాబు ఫొటోతో సంచుల తయారీకి కూడా పురమాయించింది. జనవరి 10-14 తేదీల మధ్య లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేశారు. అయితే నిర్దేశించిన అన్ని రకాల సరుకులు పూర్తిస్థాయిలో అందకపోవడం, అందినవి నాసిరకంగా ఉండటం విమర్శలపాలైన విషయం తెలిసింది. దాన్ని పక్కన పెడితే సరుకుల ప్యాకింగ్‌కు నిర్దేశించిన సంచులు సకాలంలో అందకపోవడంతో చాలా చోట్ల రేషన్ డీలర్లు సొంత డబ్బులతో పాలిథిన్ కవర్లు కొనుగోలు చేసి సరుకులను ప్యాక్ చేసి లబ్ధిదారులకు అందించారు. సంక్రాంతి సంబరాలు ముగిసి సంచుల విషయం అందరూ మరచిపోయిన తరుణంలో ఇటీవల సంచులు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని మూడు నాలుగురోజుల క్రితం మండల కేంద్రాలకు పంపించారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక స్థానిక అధికారులు మూలన పడేశారు.
 
 జిల్లాలో తెల్ల రంగు, అంత్యోదయ, అన్నపూర్ణ, చేనేత కేటగిరీలకు చెందిన 785056 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటితోపాటు 52వేల గులాబీ కార్డులు ఉన్నాయి. గులాబీ కార్డులు మినహాయించి మిగిలిన వాటికి ఉచిత సరుకులు అందించారు. ఈ లెక్కన కార్డుకు ఒకటి చొప్పున 785056 సంచులు అందాయి. వీటి తయారీ బాధ్యతను ఒక్కో సంచికి రూ.14 రేటుకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సరుకుల సరఫరా సమయంలో ఇది అందకపోవడం, ఇప్పుడు వచ్చినా ఉపయోగం లేకపోవడంతో వీటి కోసం చేసిన ఖర్చు వృథా అయినట్లే. జిల్లాకు అవసరమైన సంచుల తయారీకి రూ. 1.99 కోట్లు ఖర్చయినట్లు అంచనా. అయితే కొన్ని ప్రాంతాలకు సంచులు సకాలంలో అందినట్లు చెబుతుండగా.. ఎలా చూసుకున్నా రూ.కోటికి పైగా వృథా అయ్యిందని అంటున్నారు. సకాలంలో అందని సంచుల తయారీ ఆర్డర్‌ను అప్పుడే రద్దు చేసి ఉంటే ఈ ఖర్చు మిగిలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 - 
      
                   
                               
                   
            పండక్కిచంద్రన్న కానుక.. అందని పండేనా!

 సంక్రాంతికి ఆరు రకాల దినుసులు ఉచితమన్న సర్కారు
 ఆశగా ఎదురుచూస్తున్న తెల్లరంగు రేషన్‌కార్డుదారులు
 పండుగ దగ్గర పడ్డా ఇంకా జిల్లాకు చేరని సరుకులుఅందరికీ అందడం అసాధ్యమే!
 
 కాకినాడ : ‘ఆకేసి...పప్పేసి...నెయ్యేసి.. నిరుపేదల ఇళ్లలో నిజమైన సంక్రాంతిని చూడాలని ముఖ్యమంత్రి కలలు కన్నట్టు చెపుతున్నారు. ఇందుకోసం తలపెట్టిన గిఫ్ట్ప్యాక్కు ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ అనే నామకరణం కూడా చేశారు. ఆ గిఫ్ట్‌ప్యాక్‌లో తెలుపురంగు రేషన్‌కార్డుదారులకు రూ.220 విలువచేసే ఆరు సరుకులు ఉచితంగా అందచేస్తామన్నారు. సంక్రాంతి పండుగ లోపు ఆరు సరుకులతో గిఫ్ట్ ప్యాక్ అందజేయాలని నిర్ణయించారు. ఆ ప్యాక్‌లో అరకేజీ కందిపప్పు, అరలీటర్ పామాయిల్, అరకేజీ బెల్లం, కేజీ శనగలు, కే జీ గోధుమపిండి, వంద గ్రాముల నెయ్యి పంపిణీ చేయాల్సి ఉంది. ఇదంతా ఉచితమే అని చంద్రబాబు ప్రకటించడంతో కార్డుదారులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2643 చౌకదుకాణాల పరిధిలో ఉన్న 15,19,406 మంది రేషన్ కార్డుదారులు చంద్రన్న కానుకతో ఈ పండుగ ప్రత్యేకంగా జరుపుకోవాలని ఉబలాటపడుతున్నారు.అయితే చంద్రన్న కానుకతో నిరుపేదలకు తమ ప్రభుత్వం ఉదారంగా సాయపడుతోందని ప్రజల్లోకి వెళ్లి గొప్పగా ప్రకటించుకుని వారి అభిమానం పొందాలన్న అధికారపార్టీ జిల్లా ప్రజాప్రతినిధుల ఆశలు కూడా ఫలించేలా లేవు.
 
 కొన్ని సరుకులు పది శాతమే వచ్చాయి..
 
 ఐదు రోజుల్లో సంక్రాంతి మొదలు కానుంది. ఆ లోపే గిఫ్ట్‌ప్యాక్‌లో సరుకులన్నీ రేషన్‌షాపులకు చేరవేయాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వచ్చాయి. మండలస్థాయిలో పౌరసరఫరాలశాఖ గోడౌన్ల నుంచి అన్ని రేషన్ షాపులకూ ఈ నెల 10 కల్లా గిఫ్ట్‌ప్యాక్‌లు చేరవేయాలి. కార్డుదారులకు ఆ సరుకుల పంపిణీ ప్రక్రియను 12వ తేదీకి పూర్తి చేయాలి. అంటే పండుగకు ఒక రోజు ముందుగానే చంద్రన్నకానుక అందచేయాలని నిర్దేశించారు. కానీ శుక్రవారం (9వ తేదీ) రాత్రికి కనీసం మండలస్థాయి గోడౌన్లకు కూడా పూర్తిగా ఆరు సరుకులూ చేరలేదు. సరుకులు ఎప్పుడు వస్తాయి, గోడౌన్ల నుంచి రేషన్‌షాపులకు ఎప్పుడు వెళతాయి, కార్డుదారులకు ఎప్పుడు చేరతాయో తెలియని అయోమయం నెలకొంది. ఈ విషయంలో పౌరసరఫరాల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గిఫ్ట్‌ప్యాక్ సరుకుల్లో ఏ ఒక్క సరుకూ నూరుశాతం జిల్లాకు రాలేదు. అయినా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రన్నకానుకను కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాకు కందిపప్పు 759.703 మెట్రిక్ టన్నులు, బెల్లం 759.703 టన్నులు, గోధుమపిండి 1519.406 టన్నులు, శనగలు 1519.406 టన్నులు, నెయ్యి 151.941 టన్నులు, పామాయిల్ 759.703 కిలో లీటర్లు కేటాయించారు. మూడు సరుకులు 10 శాతమే రాగా, మిగిలినవీ 40, 50, 60 శాతాల్లోపే వచ్చాయి. అవన్నీ వేయడానికి సంచులు అవసరమైన దానిలో 10 శాతం మించి రాలేదు. ఈ పరిస్థితుల్లో సంక్రాంతికి చంద్రన్నకానుక అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది.
 
 ‘చంద్రన్న కానుక’ తూకంలో తరుగు
 
 ముమ్మిడివరం: సంక్రాంతి సందర్భంగా ప్రవేశ పెట్టిన ‘చంద్రన్న కానుక’ సరుకుల తూకాలను శుక్రవారం తూనికల కొలతల జిల్లా ఇన్స్పెక్టర్ ఎన్.జనార్దనరావు తనిఖీ చేశారు. ముమ్మిడివరం మండల గోదాములో ఉంచిన సరుకుల తూకాలను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేశామని, గోధుమ పిండి ప్యాకెట్ కిలో ఉండాల్సి ఉండగా కొన్నింటిలో 15 నుంచి 22 గ్రాముల వరకు తక్కువ ఉందని ఇన్స్పెక్టర్ తెలిపారు. గోధుమ పిండి మహరాష్ట్రకు చెందిన త్రిశూల్ కంపెనీకి చెందినది కాగా విశాఖకు చెందిన కేంద్రీయ బండారీ సంస్థ కాంట్రాక్టు పద్ధతిపై సరఫరా చేసిందన్నారు. ఆ సంస్థలపై కేసు నమోదు చేస్తామన్నారు.
 
 - 
      
                   
                               
                   
            చంద్రన్న సంక్రాంతి కానుక డౌటే !

 కడప సెవెన్‌రోడ్స్ : సంక్రాంతి పర్వదినానికి ప్రభుత్వం పేదలకు అందించే గిఫ్ట్ సరుకులు సకాలంలో అందుతాయూ అనేది సందేహంగా ఉంది. పండుగ రోజు పిండి వంటలతో పేదల ఇళ్లు ఘుమఘుమ లాడాలని రాష్ట్ర ప్రభుత్వం ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరుతో ఆరు సరుకుల గిఫ్ట్ ప్యాక్‌ను చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, సంక్రాంతికి సకాలంలో అందించగలమా? అని పౌరసరఫరాల అధికారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
 సమయం చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. పైగా సంచుల కొరత, ప్యాకింగ్ వంటి సమస్యలు వేధిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా ఉన్నతాధికారులు మాత్రం ఈనెల 6వ తేదీ నుంచి గిఫ్ట్ ప్యాక్‌లను జిల్లాలకు సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామంటున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలిసే ్త ఈ నెల 10వ తేదీ నాటికి గిఫ్ట్ ప్యాక్‌లు జిల్లాకు చేరుకునే అవకాశం ఉంటుందని ఇక్కడి అధికారులు భావిస్తున్నారు.
 
 ఈ నెల 12వ తేదీ నాటికి చౌక ధరల దుకాణాలకు గిఫ్ట్ ప్యాక్‌లు చేరాలని ప్రభుత్వం చెబుతోంది. అలా చేరినపుడే పండుగ సమయానికి ప్రజలకు ప్యాక్‌లు అందజేయడానికి అవకాశం ఉంటుంది. గిఫ్ట్ ప్యాక్‌లో ఒకటైన శనగలను అధికారులు జిల్లా స్థాయిలోనే సేకరించారు.
 
 గిఫ్ట్ ప్యాక్‌లు ఈనెల 10వ తేదీకి జిల్లాకు చేరినప్పటికీ శనగల ప్యాకెట్లను కూడా వాటిలో చేర్చి అన్నీ కలిపి ఒక సంచిలో నింపడానికి సమయం పడుతుందని అంటున్నారు. ప్యాక్ చేసిన కానుకలను మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి చౌక ధరల దుకాణాలకు సరఫరా చేయడానికి కొన్ని రోజుల సమయం తీసుకుంటుందని చెబుతున్నారు.
 
 ఆరు సరుకులు ఇవే...
 జిల్లాలో బియ్యం కార్డులు 6,14,924, రచ్చబండ కూపన్లు 26,718, అంత్యోదయ అన్న యోజన కార్డులు 59,289, అన్నపూర్ణ కార్డులు 799 వెరసి 7,01,730 ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు ఒక గిఫ్ట్ ప్యాక్ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో ప్యాక్‌లో అర కిలో కందిపప్పు, కిలో శనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, అరకిలో పామోలిన్, 100 గ్రాముల నెయ్యి ఉంటాయి. 


