breaking news
German Aerospace Center (DLR)
-
బుధగ్రహం కుంచించుకుపోతోంది!
కేప్ కేనర్వాల్: సౌరకుటుంబంలోని బుధగ్రహం వేగంగా కుంచిచుకుపోతున్నట్లు శాస్త్రవేత్తల తాజా అధ్యయనం చెబుతోంది. ద్రాక్షపండు ఎండకు ఎండి ముడుతలుపడి ఎండుద్రాక్షగా మారినట్లు! జర్మనీ ఏరోస్పేస్ సెంటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం బుధగ్రహం ఇలా కుంచించుకుపోవడం మునుపు వేసిన అంచనా కంటే 30 శాతం ఎక్కువగా ఉంది. గ్రహం వ్యాసం 4900 కిలోమీటర్లతే.. 23 కిలోమీటర్ల మేరకు సైజు తగ్గినట్లు వీరు చెబుతున్నారు. బుధగ్రహ ఉపరితలం చాలా ఎగుడుదిగుడుగా ఉంటుంది. పైగా దీనిపైకి వచ్చిపడే ఉల్కా/గ్రహ శకలాల కారణంగా ఏర్పడే గుంతలు, వాటి నుంచి ఎగజిమ్మే శిథిలాల కారణంగా రూపురేఖలు నిత్యం మారుతూ ఉంటాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బుధ గ్రహ పరిశీలన కోసం యూరోప్, జపాన్‌లు కలిసి వారం రోజుల క్రితమే బెపికొలంబో పేరుతో ఒక అంతరిక్ష నౌకను ప్రయోగించడం. ఈ అంతరిక్ష నౌక నవంబరు నెలలో బుధగ్రహం కక్ష్యలో ప్రేవేశించనుంది. బెపీకొలంబలోని లేజర్ పరికరం అంతర్గత శీతలీకరణ కారణంగా గ్రహం ఎంత మేరకు ముడుతలు పడిందో (ఎండుద్రాక్ష చందంగా) లెక్క కట్టనుంది. సౌర కుటుంబంలోని అతి చిన్న గ్రహం బుధుడు సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అది నెమ్మదిగా కుంచించుకుపోతూనే ఉంది. -
చక్రాల కుర్చీలో అంతరిక్ష యాత్ర
హూస్టన్: జర్మన్ ఏరోస్పేస్, మెకాట్రానిక్స్ ఇంజనీర్ మైఖేలా మిచీ బెంథాస్ చరిత్ర సృష్టించింది. ప్రమాదంలో గాయపడిన ఆమె చక్రాల కుర్చీలోనే అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తిచేసింది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ సంస్థ శనివారం ఉదయం న్యూ షెఫర్డ్ ఎన్ఎస్–37 సబ్ అర్బిటాల్ మిషన్‌ను నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి వ్యోమనౌకలో బెంథాస్తోపాటు మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో కాసేపు విహరించి, భూమికిపైకి క్షేమంగా తిరిగివచ్చారు. వీల్‌చైర్‌లో కూర్చొని అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఇదే మొదటిసారి. దివ్యాంగులు సైతం ఇలాంటి యాత్రలు చేయొచ్చని బెంథాస్ నిరూపించారు. ఆమె గతంలో మౌంటెన్ బైకింగ్ చేస్తుండగా గాయపడ్డారు. వెన్నుపూస దెబ్బతినడంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయినప్పటికీ అంతరిక్షం పట్ల జిజ్ఞాస తగ్గలేదు. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు. -
ఉప్పు ఎక్కువగా తింటున్నారా..
బెర్లిన్: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలి పెరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఉప్పుతో కూడిన ఆహారం వల్ల దాహం వేయకపోగా ఆకలిని కూడా పెంచుతున్నట్లు కాస్మోనాట్స్‌పై జరిగిన పరిశోధనలలో గుర్తించారు. జర్మనీలోని జర్మన్ ఏరో స్సేస్ సెంటర్(డిఎల్ఆర్) నుంచి అంగారకుడు మీదకు వెళ్లే పది మందిని రెండు గ్రూపులు విభజించి పరిశీలించారు. మొదటి గ్రూపును 105 రోజులు, రెండో గ్రూపును 205 రోజులు పరిశీలించారు. ఈ రెండు గ్రూపులకు కొన్ని వారాలపాటు ఒకే రకమైన ఆహారాన్ని ఇచ్చి, తరువాత ఉప్పును వేర్వేరు స్థాయిలలో అందించారు. ఎక్కువగా ఉప్పు తీసుకున్న వారి మూత్రంలో ఉప్పు ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఇది ఎక్కువ నీరు తాగడం వల్ల జరగలేదని, ఉప్పు మూత్రపిండాలలోని నీటిని ఆదా చేయడం వల్ల జరిగిందని పరిశోధకులు గుర్తించారు. ఉప్పులోని సోడియం, క్లోరైడ్ అయానులు నీటిఅణువులను లాక్కుని మూత్రం రూపంలో విడుదల చేశాయని చెప్పారు. మూత్రంలో ఉప్పు ఉంటే నీరు మూత్ర పిండాలనుంచి వెనక్కు అంటే శరీరానికి చేరుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇవే పరిశోధనలు చిట్టెలుకల మీద జరిపినప్పుడు యూరియా స్థాయిలు పెరగడాన్ని గమనించారు. యూరియా మూత్రపిండాల్లోని సోడియం క్లోరైడ్‌ని బయటకు పంపడానికి తోడ్పడుతుంది. ఎక్కువ ఉప్పు తీసుకున్న ఎలుకలలో యూరియాను సంకలనం చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దాంతో ఆకలి పెరుగుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా మనుషులలో కూడ ఇలానే జరుగుతుందనే విషయం కాస్మోనాట్స్‌పై జరిపిన పరిశోధనలో తేలింది. ఎందుకంటే వారు తమకు దాహం లేదుగాని బాగా ఆకలేస్తుందని చెప్పారు.


