breaking news
Fumihiko Maki
-
మకీ సంచలన వ్యాఖ్యలు, సీఆర్డీఏ నోటీసులు
అమరావతి : ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలించారంటూ జపాన్ కంపెనీ ‘మకీ అసోసియేట్స్’కు సీఆర్డీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ వ్యాసంలో మకీ చైర్మన్ ఫుమిహికో సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ కంటే ఆంధ్రప్రదేశ్‌లో చెత్తపాలన ఉందని అన్నారు. ప్రతి విషయంలో రాజకీయ జోక్యం ఉంటుందని, సీఆర్డీఏను స్వతంత్రంగా పని చేయనివ్వరు అని ఆయన వ్యాఖ్యానించారు. లోపాయికారి ఒప్పందం ప్రకారమే అంతా జరుగుతుందని ఫుమిహికో పేర్కొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వంతో పాటు సీఆర్డీఏ ప్రతిష్టకు, పరువుకు భంగం కలిగించేలా వివిధ వెబ్సైట్ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ మకీ అసోసియేట్స్ తో పాటు ఆ సంస్థ చైర్మన్ ఫుమిహికో మకీ కి సీఆర్డీఏ వేర్వేర్వుగా నోటీసులు ఇచ్చింది. కాగా రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత లేశ మాత్రం కూడా లేదంటూ అప్పట్లో ‘డిజైన్’ కాంట్రాక్టు దక్కించుకున్న జపాన్ సంస్థ ‘మకీ అండ్ అసోసియేట్స్’ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భారతీయ వాస్తు శిల్పి శాస్త్ర నిపుణుల (ఇండియన్ ఆర్కిటెక్చురల్ ప్రొఫెషన్) ప్రతిష్టను ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని మండిపడింది. అంతర్జాతీయ టెండర్లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేశారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరుతో భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరంటూ ‘మకీ అండ్ అసోసియేట్స్’ ప్రిన్సిపల్ ఆర్కిటెక్టర్ ఫుమిహికో మకీ 2016 డిసెంబర్ 21న భారత ఆర్కిటెక్చర్ సమాఖ్య ఉపాధ్యక్షుడు విజయ్ గర్గ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. -
ఏపీలో చెత్తపాలన!
-
ఏపీలో చెత్తపాలన!
‘మాకి’ చైర్మన్ పుమిహికో - ‘ఆర్కిటెక్చురల్ డైజెస్ట్’లో ప్రత్యేక వ్యాసం - ఆంధ్రప్రదేశ్ కంటే బిహార్ చాలా బెటర్ - ఏపీలో మాకు వింత అనుభవాలు... - సీఆర్డీఏని స్వతంత్రంగా పనిచేయనివ్వరు.. - రాజకీయ జోక్యం ఎక్కువ.. అంతా గోప్యం.. - ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఒట్టి ప్రచారమే.. - అంతా అయోమయం.. గజిబిజి వాతావరణం - లోపాయికారీ ఒప్పందం ప్రకారమే అక్కడ ఎంపికలు - సినిమా డైరెక్టర్ని సంప్రదించాలట.. - ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్‌కూ మా అనుభవం తప్పదు సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి’ అని జపాన్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్కిటెక్చర్ సంస్థ దుమ్మెత్తిపోసింది. ఆర్కిటెక్ట్‌లు అందరూ ఫోర్బ్స్ మ్యాగ్జైన్లా భావించే ‘ఆర్కిటెక్చురల్ డైజెస్ట్’ మ్యాగజీన్లో రాష్ట్రం పరువుపోయే విధంగా ఓ ఆర్టికల్ ప్రచురితమయ్యింది. ‘బిహార్ కంటే ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పాలన ఉంది’ ఈ వ్యాసంలో ఏకిపారేశారు. అంతర్జా తీయంగా పేరొందిన ఆర్కిటెక్చురల్ డైజెస్ట్ (ఏడీ) మ్యాగజీన్ ఇండియాలోకి అడుగు పెట్టి ఐదేళ్లు అయిన సందర్భంగా జపాన్‌కు చెందిన మాకి అండ్ అసోసియేట్స్ ఫౌండర్ చైర్మన్, ప్రపంచ ప్రఖ్యాత ప్రిట్జ్‌కెర్ ప్రైజ్ విజేత ఫుమిహికో మాకి ఈ వ్యాసం రాశారు. ఈ వ్యాసాన్ని ‘ఆర్కిటెక్చురల్ డైజెస్ట్’ ఏప్రిల్ సంచికలో ప్రచురించారు. మాకి అసోసియేట్స్ కూడా ఇండియాలోకి ప్రవేశించి ఐదేళ్లు పూర్తవడం విశేషం. ఇండియాలో తమ ఐదేళ్ల అనుభవాలను పోలుస్తూ ఆంధ్రాలో కంటే బీహార్ రాష్ట్రంలో పెట్టుబడులకు, వ్యాపారాల కు మెరుగైన పరిస్థితులు ఉన్నాయని విదేశీ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో తమఅనుభవాలను ఫుమిహికో మాకి ఏ విధంగా వ్యక్తం చేశారో ఆయన మాటల్లోనే చూడండి... ఏపీలో అంతా అయోమయం.. ‘‘2011 చివర్లో మేము భారత్‌లోకి అడుగు పెట్టాం. ఈ ఐదేళ్ల కాలంలో ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన రెండు అనుభవాలను ప్రత్యక్షంగా చూశాం. అందులో ఒకటి బిహార్ కాగా మరొకటి ఏపీలో. బిహార్‌లో వ్యాపార మన్నా.. అక్కడ పనిచేయాలనా చాలా దుర్భ రమైన పిరిస్థితులను చవిచూడాల్సి వస్తుందం టూ ఒక ప్రచారం ఉంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ స్టేట్(దేశంలో వ్యాపారాలకు అత్యంత అను కూల రాష్ట్రం) అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటించిన పోస్టర్లు కనిపిస్తాయి. కానీ ఐదేళ్లలో మాకు కనిపించింది ఏమిటంటే బిహార్ రాష్ట్రం ఒక చక్కటి ప్రణాళికతతో, సుపరి పాలనతో దూసుకుపోతుండగా, ఏపీ మాత్రం పూర్తి అయోమయంగా ఏ అంశంపై అవగా హన లేకుండా గజిబిజి వాతావరణాన్ని సృష్టించింది. నిబద్ధతలేని విధానాలతో విశ్వాసం కోల్పోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో బీహార్‌లో మ్యూజియం నిర్మించడానికి కాంట్రాక్టు చేజిక్కించుకోవడమే కాకుండా దాన్ని సకాలంలో పూర్తి చేశాం. ఈ సమ యంలో ఎక్కడా ప్రభుత్వం మా పనిలో జోక్యం చేసుకోలేదు. కానీ దీనికి భిన్నంగా ఏపీలో పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి. సీఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదు అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మేము అందించిన డిజైన్లు ఎంపికయ్యాయి. అంతర్జాతీయ ప్రముఖలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ మమ్మల్ని చీఫ్ ఆర్కిటెక్ట్స్‌గా ఎంపిక చేసింది. కానీ ఏమయ్యిందో ఏమో కానీ ఒకసారి మా డిజైన్లు ఎంపిౖకైన తర్వాత జ్యూరీ మాయమైపోయింది. ఇప్పటి వరకు ఆ జ్యూరీ రిపోర్టు ప్రజలకు బహిర్గతం చేయలేదు. అంతేకాదు ఇష్టానుసారంగా సొంత అభిప్రాయాలను, సూచనలను ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక స్పష్టమైన ఆమోద ప్రక్రియ లేకుండా పోయింది. ఈ రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏపీ సీఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదని, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడివున్న ఆదేశాలను పాటించడం తప్ప, తాము ఏమీ చేయలేమని ఆ సంస్థ ఉద్యోగులే మాతో ప్రైవేటు సంభాషణల్లో వెల్లడించారు. కనీసం ముఖ్యమంత్రి అడిగిన విధంగా మాకు డిజైన్లను మార్చి ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదు. ఏదో లోపాయికారీ ఒప్పందం ప్రకారమే ఎంపికలు.. 2016 అక్టోబర్ 24న కారణాలు లేకుండా మమ్మల్ని తొలగిస్తున్నట్లు అధి కారిక ఉత్తర్వులు ఇచ్చారు. మర్నాడే అంటే.. అక్టోబర్ 25న రిక్వెస్ట్ ఫర్ కొటేష న్స్(ఆర్ఎఫ్క్యూ) పిలవడం, డిసెంబర్లో లండన్‌కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌ను ఎంపిక చేయడం జరిగిగాయి. ఏ విధంగా ఎంపిక చేసింది బాహ్య ప్రపంచానికి తెలి యచేయలేదు. ఇంత వరకు కొత్త డిజైన్లు ఏవీ ప్రజలకు చూపించలేదు. దీన్ని బట్టి ఇక్కడ ఏదో లోపాయికారీ ఒప్పందం ప్రకారమే ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రాజధాని డిజైన్ల గురించి తెలుగు సినీ దర్శకుడు రాజమౌళితో చర్చించమని ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌ను అడిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న ఫోస్టర్స్ ఈ గొడవలు ఏమీ పట్టించు కోకుండా పనిచేస్తుందా లేకా మా లాంటి అనుభవమే ఎదురవుతుందా అన్నది కాలమే చెపుతుం ది. మొత్తం మీద బిహర్, ఏపీ మాకు రెండు విభిన్న మైన అనుభవాలను అందించాయి. బిహార్‌తో ఇండియాలో అపారమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయన్న భరోసా వస్తోంది. ఏపీ చేదు అనుభవాలను అందిం చింది. దీన్ని మేం ఒక గుణపాఠంగా భా విస్తాం. ఇలాంటి ఉదంతాలతో భారత్ పేరు ప్రఖ్యాతులు అంతార్జాతీయంగా మసకబారే ప్రమాదం ఉంది.’’ అని ఫుమిహికో మాకి ఆ వ్యాసంలో పేర్కొన్నారు.