breaking news
free bags
-
షాద్ నగర్: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ
సాక్షి, రంగారెడ్డి: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత థామస్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో షాద్ నగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ZPHS హై స్కూల్ కిషన్ నగర్ ఊర్దూ మీడియం, మరియరాని పాఠశాలలో చదువుతున్న 558 మంది విద్యార్థులకు 558 బ్యాగ్స్, ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మరియరాని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ అలెగ్జాండర్, జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివకుమారి, ఇతర సిబ్బంది హాజరై ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమలలో లడ్డూ సంచులు ఉచితం
తిరుమల శ్రీవారి భక్తులకు బుధవారం నుంచి ఉచితంగా లడ్డూ సంచులు (బయో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లు) అందజేస్తున్నారు. ఒక భక్తుడికి 8 లడ్డూలు మించకుండా టోకెన్లు ఇచ్చినవారికి ఒక సంచి ఉచితంగా అందజేస్తారు. అంతకంటే ఎక్కువ టోకెన్లు తీసుకొస్తే ఇవ్వ రాదని నిర్ణయించారు. దీనివల్ల ఆలయం వెలుపల లడ్డూల బ్లాక్ మార్కెటింగ్ నివారించవచ్చని పోటు పేష్కారు కేశవరాజు తెలిపారు.