షాద్‌ నగర్: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ | Shad Nagar: FOUNDATION FOR CHILDREN IN NEED Distribute bags Free | Sakshi
Sakshi News home page

షాద్‌ నగర్: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో పిల్లలకు బ్యాగుల పంపిణీ

Dec 20 2022 7:54 PM | Updated on Dec 20 2022 8:28 PM

Shad Nagar: FOUNDATION FOR CHILDREN IN NEED Distribute bags Free - Sakshi

విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని..

సాక్షి, రంగారెడ్డి: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత థామస్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో షాద్‌ నగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ZPHS హై స్కూల్ కిషన్ నగర్ ఊర్దూ మీడియం, మరియరాని పాఠశాలలో చదువుతున్న 558 మంది విద్యార్థులకు 558 బ్యాగ్స్, ఉచితంగా పంపిణి చేశారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో మరియరాని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ అలెగ్జాండర్, జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  శివకుమారి, ఇతర సిబ్బంది హాజరై ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్  నీడ్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement