breaking news
foreign capital
-
రూపాయి బలం మన చేతుల్లోనే!
భారతదేశం కరెంట్ ఖాతా లోటు గతేడాది 22.9 బిలియన్ డాలర్లు. ఆ లోటును ఎవరో ఒకరు నిధులతో పూరించాల్సిందే. ఆ ఏడాది మొత్తం విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడి దారులు దాదాపు 16 బిలియన్ డాలర్ల అమ్మకందారులుగా ఉన్నారు. మరి ఆ లోటును ఎలా భర్తీ చేశాం? అప్పు ద్వారా. ఈక్విటీ స్థానంలో అప్పు ఉపయోగిస్తూ, మిగిలిన తేడాను తన సొంత రక్షణ నిల్వ (బఫర్)తో భర్తీ చేసుకుంటున్న దేశం మనది.రూపాయిని కేవలం ఒక బ్యారెల్ ఆయిల్ బలహీనపరచలేదు. నమ్మదగినవిగా ఉండాల్సిన విదేశీ మూలధన రాబడులపై ఆధారపడే నిధుల సమీకరణ నమూనా దాన్ని బలహీనపరి చింది. ఈ రూపాయి విలువను కాపాడటానికి, విదేశీమారక ద్రవ్య నిల్వలను సంరక్షించుకోడానికి ప్రత్యేక మార్గం ద్వారా– ఆగస్టు 31 నాటికి బ్యాంకులు ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ల ద్వారా 127.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. విదేశీ కరెన్సీ రిస్క్‌లో గణనీయమైన భాగాన్ని ఆర్బీఐ తీసుకోవడం మనం గమనించాల్సిన ఆందోళన కలిగించే సంగతి.రూపాయి విలువ సమస్యలో కొంతభాగం ఆయిల్ వల్లే ఎదురవుతోంది. కానీ ఒక ముఖ్యమైన భాగం మన పెట్టుబ డుల చక్రం (ఇన్వెస్ట్మెంట్ సైకిల్) నుంచి వస్తోంది. మన సొంత పొదుపులతో నిధులు సమకూర్చలేని పెట్టుబడిలోని భాగం బయటినుంచి పెట్టుబడులు రావలసిన అవసరాన్ని సృష్టిస్తుంది. మదుపు, పొదుపుల మధ్య ఉన్న అంతరం గణాంక సమానత్వ సూత్రం ప్రకారం కరెంట్ ఖాతా లోటుగా కనిపిస్తుంది.ఇక్కడే ఒక నిష్పత్తి గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అదే అదనపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి– ఐసీఓఆర్. ప్రతి ఆర్థిక వ్యవస్థలో డబ్బు, ఉత్పత్తి మధ్య ఒక నిశ్శబ్ద మారకపు రేటు ఉంటుంది. ఒక రూపాయి అదనపు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సృష్టించడానికి ఎన్ని రూపాయల అదనపు పెట్టుబడి అవసరం? మూలధన ఉత్పత్తి నిష్పత్తిలో ప్రతి అర పాయింట్ తగ్గింపు, అదనంగా ఒక్క రూపాయి పెట్టబడి పెట్ట కుండా, అదనంగా ఒక్క డాలర్ విదేశీ మూలధనం తీసుకురాకుండా, ఏడాదికి దాదాపు 0.7 నుంచి 1 శాతం అదనపు వృద్ధిని అందించ గలదు. 2004–07 ఆర్థిక సంవత్స రాల మధ్య భారత దేశం ఐసీఓఆర్ దాదాపు 4కి పడిపోయింది. అభివృద్ధి రేటు 9 శాతం ఉండటంలో దాని ప్రభావం కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు భారత్ 9 శాతం అభివృద్ధి రేటు సాధిస్తూ, ప్రపంచం నుంచి అప్పు తీసుకోవడం కాకుండా ప్రపంచానికి అప్పు ఇచ్చింది. 2012 నాటికి ఐసీఓఆర్ బాగా దిగజారింది. కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 4.8 శాతానికి చేరింది. ఇప్పటి వరకు నమోదైన గణాంకాల్లో ఇదే అత్యంత అధిక స్థాయి.దేశంలో వేగవంతమైన అభివృద్ధి చోదక శక్తి అయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈల) రంగానికి తగినంతగా పెట్టుబడులు అందలేదు. ఈ ఎమ్ఎస్ ఎమ్‌ఈల్లో 32 కోట్ల మందికి పైగా పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం మూలధన నిల్వలో చాలా చిన్న భాగంతోనే అవి తమవైన ఉత్పత్తిని సృష్టిస్తున్నాయి. చిన్న, ఎగుమతి ఆధారిత, పోటీ ద్వారా పరీక్షించబడే సంస్థలు మూలధనాన్ని వేగంగా ఉత్పత్తిగా మారుస్తాయి.కేంద్రీకృత మెగా ప్రాజెక్టులు మాత్రం సాధారణంగా దిగుమతి చేసుకున్న విడిభాగాలతో ఆధారపడి విదేశీ ద్రవ్యభారాన్ని పెంచుతూ నెమ్మదిగా పెట్టుబడిని ఉత్పత్తిగా మారుస్తాయి. ఇదే ఎమ్ఎస్ఎమ్ఈలను భారత దేశానికి ఒక శక్తిమంతమైన ఐసీఓఆర్ ఇంజిన్‌గా మారుస్తుంది. కానీ వాటిని ఒకదానితో ఒకటి కలిపే అనుసంధాన వ్యవస్థ అదే స్థాయిలో లేదు. ఈ అంతరం నిర్మాణాత్మక ఐసోలేషన్. దీర్ఘకాలిక కొనుగోలుదారు లేని సంస్థకు సాంకే తిక స్థాయిని పెంచుకోవడానికి కారణం ఉండదు. కేవలం రుణం ఇవ్వడం వల్ల ఆ సమస్య పరిష్కారం కాదు.తిరుప్పూర్, లుథియానా వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక సమూహాలు ఉన్నాయి. కానీ వాటికి అవసరమైన వ్యవస్థాగత సంస్థలు లేవు. పారిశ్రామిక మండలాలను శక్తిమంతం చేసిన సమష్టి మద్దతు వ్యవస్థ మనదగ్గర లేదు. ఉమ్మడి కొలతలు, ప్రమాణాలు, నాణ్యతా పరీక్షలు, కామన్ హీట్ ట్రీట్మెంట్, కామన్ డిజైన్ స్టూడియోలు, స్కిల్ యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్, స్టార్ట్ అప్ ఇకో సిస్టం– ఇలా ఒకే ప్రాంతంలో ఉండటం పోటీని పెంచుతుంది. ఆ దగ్గరతనాన్ని సామర్థ్యంగా మారుస్తాయి. అందుకు మనకు ‘సెంట్రల్ హబ్స్’ అవసరం. ఇది సాంప్రదాయ ఇండస్ట్రియల్ పార్క్‌కు ఒక మెట్టు పైనే.మన మూలధన సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే, భారత్‌కు తక్కువ విదేశీ ద్రవ్యం అవసరం అవుతుంది. విదేశీ మూల ధనం మనకు అనవసరం అన్నది కాదు లక్ష్యం; మన అవకా శాలను చూసి విదేశీ మూలధనం మన వెంట రావడం లక్ష్యం. - పి.వి. విజయ్ కుమార్వ్యాసకర్త యూరొటెక్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ -
మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం
గ్లోబల్ మార్కెట్లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయి. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.ముడి చమురు, ఎరువులు, కీలక ముడి పదార్థాల దిగుమతుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మన బాండ్ మార్కెట్ ‘మంచి అయస్కాంతం’లా పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్త విశ్లేషణలో తేలిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.ఎఫ్ఏఆర్ పరిధి విస్తరణప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ ఇన్వెస్టర్లకు సమ్మతి భారాన్ని తగ్గించేందుకు గానూ, ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కింద నిర్దిష్ట సెక్యూరిటీల జాబితాను జూన్ 5న ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆర్జించే వడ్డీ, మూలధన లాభాల ఆదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.‘ప్రస్తుతానికి ఈ సంస్కరణలు బాండ్ మార్కెట్‌కే పరిమితమైనప్పటికీ దీని పరిధి విస్తరించనుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం’ అని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.బ్యాంకులకు ఊరటవిదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడంతో పాటు కరెన్సీ హెడ్జింగ్ రిస్క్‌ను తగ్గించడానికి ఆర్బీఐ జూన్ 5న బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 3 నుంచి 5 సంవత్సరాల మెచ్యూరిటీ గల ‘విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్’ (ఎఫ్సీఎన్ఆర్-బీ) డిపాజిట్ల కోసం ఆర్బీఐ స్వాప్ సదుపాయాన్ని యాక్సెస్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీని ద్వారా బ్యాంకులు తమ యూఎస్ డాలర్ డిపాజిట్లను ఆర్బీఐతో మార్చుకోవచ్చు. తద్వారా మారకపు విలువల్లో వచ్చే కరెన్సీ ప్రమాదాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే, విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడానికి, సెప్టెంబర్ 30 వరకు బాహ్య వాణిజ్య రుణాలను (ఈసీబీ) పెంచుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: మల్టీప్లెక్స్‌ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్! -
భారత్ విదేశీ చెల్లింపుల సమతౌల్యం భేష్
ముంబై: భారత్ విదేశీ చెల్లింపుల సమతౌల్య పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ– గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ఒక శాతానికి (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువల నిష్పత్తిలో) పరిమితం అయ్యే అవకాశాలు, దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు, తక్కువ స్థాయి రుణ భారం తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆయా అంశాల నేపథ్యంలో చెల్లింపుల సమతౌల్య మిగులు 39 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ సంవత్సరం ఐదుసార్లు అమెరికా ఫెడ్ ఫండ్ రేటును తగ్గించే అవకాశం ఉందని అంచనా. ఇది డాలర్ బలహీనతకు దారితీస్తుంది. దేశ విదేశీ సమతౌల్య పరిస్థితులకు ఇది మంచి పరిణామం (గోల్డిలాక్స్). ► పలు సానుకూల అంశాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరం భారత్ క్యాడ్ అంచనాను (ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చే విదేశీ మారకద్రవ్యం– దేశం నుంచి వెళ్లే విదేశీ మారకద్రవ్యం విలువల మధ్య నికర వ్యత్యాసం) క్రితం 1.3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తున్నాం. 2024–24 అంచనాలను 1.9 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గిస్తున్నాం. ► 2024లో క్రూడ్ బ్యారల్ ఆయిల్ 90 డాలర్ల పైన ఉంటుందన్న తొలి అంచనాలను 81 డాలర్లకు తగ్గిస్తున్నాం. 2023 జనవరి–నవంబర్ కాలంలో చమురు దిగుమతుల విలువ 164 బిలియనడాలర్లు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 189 బిలియన్ డాలరు. తాజా సమీక్షా కాలంలో క్రూడ్ ధరలు 18 శాతం తక్కువగా ఉండడం కారణం. ►సేవల ఎగుమతుల కూడా క్రితం అంచనాలకన్నా ఎంతో బాగున్నాయి. ఆయా అంశాలు ఎకానమీ విదేశీ చెల్లింపుల పటిష్టతకు దోహదపడే అంశాలు. ►అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధానానికి శ్రీకారం చుట్టినప్పుడు, భారత్‌లోకి బలమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ప్రవాహాలు జరుగుతాయి. జూన్ 2024 నుండి జేపీ మోర్గాన్ గ్లోబల్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్‌లో బాండ్లు చేర్చినుందున, బలమైన రుణ ప్రవాహాలకూ అవకాశం ఉంది. ప్రాంతీయ సప్లై చైన్ వైవిధ్యం నుండి ప్రయోజనం పొందడం కొనసాగుతుంది. దీనివల్ల దేశంలోకి అధిక విదేశీ ప్రత్యక్ష ప్రవాహాలు కొనసాగుతాయి. ►బంగారం దిగుమతులు 2022–23లో 37 బిలియన్ డాలర్లుకాగా, 2023–24లో 44 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. నవంబర్ వరకూ ఈ విలువ 39.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే క్రూడ్ ధరలు తగ్గుదల, సేవల ఎగుమతుల కారణంగా బంగారం దిగుమతుల భారం సర్దుబాటుకానుంది. ►మొత్తంగా ఎగుమతుల పరిస్థితులు స్థిరంగా ఉండే వీలుంది. చమురు, బంగారం యేతర దిగుమతులు మునుపటి అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువగానే ఉన్నాయి. ఎల్రక్టానిక్ వస్తువులు, యంత్రాల దిగుమతుల ఇందులో ప్రధానమైనవి. ►భారత్ విదేశీ మారకద్రవ్యనిల్వలు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. కోవిడ్‌కు ముందు (9.5 నెలలకు మాత్రమే)కన్నా పరిస్థితి మెరుపడింది. 550 బిలియన్ డాలర్లపైగా 10 సంవత్సరాల కనిష్ట స్థాయిలో దేశ ఫారెక్స్ నిల్వలు కొనసాగడం హర్షణీయ పరిణామం. ►రూపాయి తక్కువ అస్థిరత ఉన్న కరెన్సీగా భావించవచ్చు. అయితే ‘గోల్డిలాక్స్‘ పరిస్థితులు ఉన్నప్పటికీ, రూపాయి పలు ఆసియా కరెన్సీలతో పోల్చితే దిగువస్థాయి పనితీరును ప్రదర్శించే అవకాశం ఉంది. రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో డాలర్లో రూపాయి మారకపు విలువ 83–82 శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. తరువాతి 12 నెలల్లో 81కి బలపడుతుందని అంచనా. -
పెట్టుబడుల ఊపునకు ఏం చేద్దాం..
ముంబై: రూపాయి భారీ పతనం, కరెంటు అకౌంటు లోటు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం..బ్యాంకర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో (ఎఫ్ఐఐ) వేర్వేరుగా సమావేశమయ్యారు. అంతకంతకూ పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును భర్తీ చేసు కునే దిశగా విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వీటిలో చర్చించారు. ఈ సమావేశాలో పలు సూచనలు చర్చకు వచ్చినట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ టక్రూ వివరించారు. వీటి ఆధారంగా పెట్టుబడులకు ఊతమిచ్చేలా వచ్చే ఎనిమిది, పది రోజుల్లో కొన్ని చర్యలు ఉండగలవని టక్రూ పేర్కొన్నారు.


