breaking news
foreign and domestic investors
-
ఆటుపోట్లున్నా ముందుకే..!
గత వారం తొలుత అంచనాలకు విరుద్ధంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో కొంత కోలుకున్నాయి. వెరసి ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ముందుకుసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరోపక్క దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదలకానున్నాయి. అక్టోబర్(2025)లో ప్రతిద్రవ్యోల్బణం(మైనస్ 1.21 శాతం) నమోదుకాగా.. నవంబర్ నెలకు సైతం ధరల క్షీణత కనిపించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో కాస్తమెరుగ్గా మైనస్ 0.5 నుంచి –0.6 శాతంస్థాయిలో గణాంకాలు వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ బాటలో నవంబర్ నెలకు వాణిజ్య సంబంధ గణాంకాలు విడుదలకానున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్‌లో వాణిజ్య లోటు(ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం) రికార్డ్ గరిష్టం 41.68 బిలియన్ డాలర్లను తాకింది. నవంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్‌లో దిగుమతుల బిల్లు 76 బిలియన్ డాలర్లను దాటగా.. ఎగుమతులు 34.38 బిలియన్ డాలర్లు మాత్రమే. కరెన్సీ మారకంపై కన్ను గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం 90.56కు పడిపోయింది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 98.4కు బలహీనపడగా.. 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ తొలుత నీరసించినప్పటికీ 4.18 శాతానికి కోలుకున్నాయి. ఫెడ్, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలు కరెన్సీ, బాండ్లపై ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాగా.. యూఎస్ విధించిన అదనపు టారిఫ్‌లకుతోడు మెక్సికో సైతం భారత్ దిగుమతులపై సుంకాలను పెంచడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, మెక్సికో వాణిజ్య అధికారులతో భారత అధికారుల భేటీ టారిఫ్‌ల సమస్యలకు చెక్ పెట్టే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ గణాంకాలు యూఎస్, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. గత నెలకు యూఎస్ వినియోగ ధరలు, రిటైల్ అమ్మకాలు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్గత పటిష్టత, ద్రవ్యోల్బణ ఔట్లుక్ తదితర అంశాలు ఫెడ్ మానిటరీ పాలసీపై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో విడుదలకానున్న జపనీస్ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి సమీక్షను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చిన్న షేర్లు భళా అంచనాలకు అనుగుణంగా గడిచిన వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో 0.25 శాతం కోత పెట్టడంతో చివర్లో మార్కెట్లు రికవరీ అయ్యాయి. వెరసి ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,000 పాయింట్లకు ఎగువన, బీఎస్ఈ సెన్సెక్స్ 85,200స్థాయికి పైన నిలిచాయి. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడం, యూఎస్‌కు తోడు కొత్తగా దేశీ ఎగుమతులపై మెక్సికో సుంకాల పెంపు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం నికరంగా సెన్సెక్స్ 445 పాయింట్లు(0.51 శాతం) క్షీణించి 85,268 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 140 పాయింట్ల(0.53 శాతం) వెనకడుగుతో 26,047 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 0.65 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం! సాంకేతికంగా ముందుకే.. చార్టుల ప్రకారం గత వారం అంచనాలకు భిన్నంగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే రెండో సపోర్ట్ స్థాయిల వద్ద నుంచి కోలుకున్నాయి. వెరసి సాంకేతికంగా కీలకమైన 85,000 పాయింట్లు(సెన్సెక్స్), 26,000 పాయింట్ల(నిఫ్టీ) కీలకస్థాయిలకు ఎగువన ముగిశాయి. ఈ వారం సైతం ఆటుపోట్ల మధ్య బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → నిఫ్టీకి తొలుత 26,000 పాయింట్లు సపోర్ట్‌గా నిలవవచ్చు. తదుపరి 25,800 వద్ద తిరిగి మద్దతు లభించే వీలుంది. 26,000 పాయింట్ల స్థాయికి ఎగువన నిలదొక్కుకుంటే 26,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఆపై సమీప భవిష్యత్‌లో 26,900–27,000 వరకూ పుంజుకునే చాన్స్‌లున్నాయ్. → సెన్సెక్స్ జోరందుకుంటే తొలుత 85,700–85,800 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. ఈ స్థాయిలను అధిగమిస్తే 88,000–88,500 వరకూ బలపడే వీలున్నట్లు అంచనా. ఒకవేళ అమ్మకాలతో బలహీనపడితే 85,000 నుంచి 84,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌పై డాలర్ల వెల్లువ ! పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ఎంతలా అంటే ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాలను గడచిన ఏడాది కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ నమోదు చేసింది, ఈ సానుకూల వాతావరణానికి తగ్గట్టే విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియా వైపు చూస్తున్నారు. తమ పెట్టుబడులకు భారత్ అనువైన చోటుగా ఎంచుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసిన వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 90 శాతం పెరుగుదల కరోనా సంక్షోభం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే మిగిలిన దేశాల కంటే ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇండియాకు డాలర్ల వరద మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22.53 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 11.84 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాది కాలంలోనే పెట్టుబడులు 90 శాతం పెరిగాయి. నగదు రూపంలోనే కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల జారీ చేసిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు నెలలులోనే 17.57 బిలియన్ డాలర్లు నిధులు నగదు రూపంలో వచ్చాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నగదు విలువ కేవలం 6.56 బిలియన్ డాలర్లే. ఏడాది వ్యవధిలో నగదు రూపంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 168 శాతం పెరిగాయి. ఎక్కువగా ఈ రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడలకు సంబంధించి నగదు రూపంలో వచ్చిన పెట్టుబడుల్లో 27 శాతం వాటాతో సింహభాగం ఆటోమొబైల్ ఇండస్ట్రీకే వచ్చాయి. ఆ తర్వాత ఐటీ రంగానికి 17 శాతం సర్వీస్ సెక్టార్‌లోకి 11 శాతం పెట్టుబడులు వచ్చాయి. కర్నాటకకు ప్రాధాన్యం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు కర్నాటకను సేఫ్ ప్లేస్‌గా ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది వచ్చిన పెట్టుబడుల్లో 48 శాతం కర్నాటక రాష్ట్రానికి తరలిపోగా ఆ తర్వాత మహారాష్ట్రకి 23 శాతం, ఢిల్లీకి 11 శాతం నిధులు వచ్చాయి. ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉండటం ఆ రాష్ట్రాలకు సానుకూల అంశంగా మారింది. రికవరీయే కారణం విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌పై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణాల్లో కోవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ త్వరగా రికవరీ మోడ్‌లోకి రావడం ప్రదానంగా నిలిచింది. దీనికి ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుగా నిలిచాయి. ఫలితంగా రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చదవండి : స్టాక్ మార్కెట్లో రంకెలేస్తున్న బుల్.. ప్రపంచంలో భారత్ టాప్ -
ఎన్టీపీసీ ఆఫర్ కు తొలిరోజే భారీ స్పందన
♦ జోరుగా బిడ్చేసిన సంస్థాగత ఇన్వెస్టర్లు ♦ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్ఎస్ న్యూఢిల్లీ: ఎన్టీపీసీ వాటా విక్రయం మంగళవారం శుభారంభం చేసింది. ఈ వాటా విక్రయానికి విదేశీ, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీపీసీ 5 శాతం వాటాను రూ.122 ఫ్లోర్ ధరతో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయం తొలిరోజు సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించారు. వాటా విక్రయం ప్రారంభమైన రెండు గంటల్లోనే సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు 32.98 కోట్ల షేర్లు కేటాయించగా, 1.8 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. 59.62 కోట్ల షేర్లకు (రూ.7,287 కోట్ల విలువైన) బిడ్లు వచ్చాయి. వీటిల్లో రూ.5,325 కోట్ల బిడ్లు బీమా కంపెనీల నుంచి, రూ.925 కోట్ల బిడ్లు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చాయి. బ్యాంక్‌లు రూ.498 కోట్లకు, మ్యూచువల్ ఫండ్స్ రూ.436 కోట్లకు, హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ రూ.102 కోట్లకు బిడ్లు వేశాయి. కాగా ఒక్క ఎల్ఐసీయే రూ.3,000 కోట్లకు బిడ్లు సమర్పించిందని సమాచారం. అధిక బిడ్ రూ.130కు వచ్చింది. నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్ఎస్ 8.24 కోట్ల షేర్లు కేటాయించిన రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం ఓఎఫ్ఎస్ నేడు(బుధవారం) జరగనున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌కు(రూ.116) లభిస్తుంది. ఈ ఎన్టీపీసీ వాటా విక్రయానికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించిందని డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి నీరజ్ కె. గుప్తా చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం విక్రయానికి కూడా ఇదే తరహా స్పందన లభించగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీపీసీ వాటా విక్రయం విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థపై స్టాక్ మార్కెట్‌కున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో ఎన్టీపీసీ 2.3 శాతం నష్టపోయి రూ.124 వద్ద ముగిసింది. ఖజానాకు రూ.5,030 కోట్లు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సవరించిన తర్వాత వచ్చిన తొలి ఓఎఫ్ఎస్ ఎన్టీపీసీదే. కాగా ఈ ఇష్యూకు ఎస్బీబిక్యాప్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్‌వేజ్ సెక్యూరిటీస్, డాషే ఈక్విటీస్ సంస్థలు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్టీపీసీలో ప్రభుత్వ వాటా 74.96 శాతంగా ఉంది. ఈ వాటా విక్రయం తర్వాత ప్రభుత్వ వాటా 69.96 శాతానికి తగ్గుతుంది. ఫ్లోర్ ధర(రూ.122) ఆధారంగా 5 శాతం వాటా విక్రయం కారణంగా ప్రభుత్వానికి రూ.5,030 కోట్లు సమకూరుతాయని అంచనా.


