breaking news
Finance Minister Meeting
-
మొండి బకాయిలపై దృష్టి
న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారం, రుణ వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థికశాఖ కీలక వార్షిక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, ఇతర కీలక కార్యక్రమాల వల్ల ఆమె ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. దీనితో సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ ఖరాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థికశాఖ ఇతర సీనియర్ అధికారులు, బ్యాంకుల ఎండీ, సీఈఓలు పాల్గొన్న ఈ సమావేశం వివిధ ప్రభుత్వ పథకాలపై బ్యాంకుల పనితీరు, పురోగతిపై చర్చించింది. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పథకాలపై సమావేశం చర్చించింది. బ్యాంకింగ్‌కు అవసరమైన మూలధన సమకూర్చడం, దేశంలో అందరికీ ఆర్థిక సేవలు వంటి అంశాలపై సమావేశం దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు సవాళ్లను తట్టుకునే సామర్థ్యం ఇదిలాఉండగా, భారత్ ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, సుస్థిర ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడం, దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు వంటి కీలక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆర్థికశాఖ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉందని కూడా నివేదిక భరోసాను ఇచ్చింది. తోటి వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంది. -
మొండిబకాయిల పరిష్కారానికి కమిటీ
ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల భారం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తెలిపారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సారథ్యం వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు వివరించారు. జూన్ ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మొండి బకాయిలు (ఎన్పీఏ) 6.03 శాతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి ఇవి 5.20 శాతం స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏలు ఎక్కువగా ఉన్న ఉక్కు, అల్యూమినియం, టెక్స్టైల్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని దుగ్గల్ వివరించారు. ప్రధానమంత్రి ‘జన ధన్’ యోజనకి మంచి స్పందన వచ్చిందని, ఈ పథకం కింద డిపాజిట్లు రూ. 27,000 కోట్ల పైగా వచ్చాయని ఆమె తెలిపారు. జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య 35 శాతానికి తగ్గిందన్నారు. మరోవైపు, ఎన్పీఏలు పెరిగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని సిన్హా చెప్పారు.