breaking news
fifth ranker
-
బ్రిటన్ను నిలువరిస్తుందా?
కాంస్య పతక పోరు కోసం భారత్ సిద్ధం వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్వార్ప్: చిన్నచిన్న లోపాలను అధిగమించడంలో విఫలమవుతున్న భారత జట్టు... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో కాంస్య పతక పోరు కోసం సిద్ధమైంది. నేడు జరగనున్న ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ప్రత్యర్థి, ప్రపంచ ఐదో ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్, క్వార్టర్ఫైనల్లో స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగిన ఇరుజట్లు సెమీస్‌కు వచ్చేసరికి బలహీనతలను అధిగమించలేకపోయాయి. బెల్జియం స్ట్రయికర్ల దాడులకు భారత డిఫెన్స్ కకావికలమైతే... ప్రపంచ చాంపియన్ ఆసీస్ దూకుడు ముందు బ్రిటన్ తలవంచింది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లలో మెరుగైన టీమ్ ఏదో ప్లే ఆఫ్ మ్యాచ్‌తో తేలిపోతుంది. కీలక సమయంలో ఫార్వర్డ్స్, డిఫెండర్ల మధ్య సమన్వయం కొరవడుతుండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. మరోవైపు భారత్‌తో పోలిస్తే బ్రిటన్ మెరుగ్గా ఆడుతోంది. సెమీస్‌లో ఆసీస్‌ను తక్కువ స్కోరుకు నిలువరించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. ఫైనల్లో ఆసీస్: శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా 3-1తో బ్రిటన్‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. గోవర్స్ బ్లేక్ (28వ ని.లో), బాలె డేనియల్ (38వ ని.లో), వెటన్ జాకబ్ (51వ ని.లో)లు ఆసీస్‌కు గోల్స్ అందించారు. బ్రిటన్ తరఫున కాట్లిన్ నిక్ (36వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. -
స్లోవేకియా, పోలండ్ టీటీ టోర్నీలకు శ్రీజ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ రెండు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు భారత జట్టుకు ఎంపికైంది. ఈ నెలలో స్లోవేకియా, పోలండ్‌లలో జరిగే జూనియర్ సర్క్యూట్ టోర్నీల్లో ఆమె పోటీపడనుంది. ముందుగా ఈ నెల 22 నుంచి 25 వరకు సెనెక్‌లో జరిగే స్లోవేక్ జూనియర్ ఓపెన్ టోర్నీలో, అనంతరం 28 నుంచి జూన్ 1 వరకు వ్లాదిస్లావోవో (పోలండ్) పోలిష్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో ఆమె పోటీపడనుంది. జూనియర్ బాలికల కేటగిరీలో భారత ఐదో ర్యాంకర్ అయిన శ్రీజ ఈ నెలారంభం నుంచి లక్నోలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ రెండు టోర్నీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున భారత జట్టులోకి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి శ్రీజ. తన కుమార్తెకు స్థానం లభించడం పట్ల ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రెండు ఈవెంట్లలోనూ శ్రీజ మంచి ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు.