స్లోవేకియా, పోలండ్ టీటీ టోర్నీలకు శ్రీజ | Slovakia, Poland TT tournment srija selected | Sakshi
Sakshi News home page

స్లోవేకియా, పోలండ్ టీటీ టోర్నీలకు శ్రీజ

May 19 2014 12:07 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ రెండు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు భారత జట్టుకు ఎంపికైంది.

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ రెండు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు భారత జట్టుకు ఎంపికైంది. ఈ నెలలో స్లోవేకియా, పోలండ్‌లలో జరిగే జూనియర్ సర్క్యూట్ టోర్నీల్లో ఆమె పోటీపడనుంది. ముందుగా ఈ నెల 22 నుంచి 25 వరకు సెనెక్‌లో జరిగే స్లోవేక్ జూనియర్ ఓపెన్ టోర్నీలో, అనంతరం 28 నుంచి జూన్ 1 వరకు వ్లాదిస్లావోవో (పోలండ్) పోలిష్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో ఆమె పోటీపడనుంది.
 
 జూనియర్ బాలికల కేటగిరీలో భారత ఐదో ర్యాంకర్ అయిన శ్రీజ ఈ నెలారంభం నుంచి లక్నోలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ రెండు టోర్నీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున భారత జట్టులోకి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి శ్రీజ. తన కుమార్తెకు స్థానం లభించడం పట్ల ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రెండు ఈవెంట్లలోనూ శ్రీజ మంచి ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement