breaking news
fertility chances
-
మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!
బిడ్డ పుట్టగానే చుట్టాలూ పక్కాలూ అందరి ముఖాల్లో సంతోషమే. బిడ్డ కాళ్లూ వేళ్లూ... ఇలా అవయవాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి అంతా బాగుంటే పండంటి బిడ్డ అంటూ ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎదుగుతున్నకొద్దీ ఆ చిన్నారి కనబరుస్తున్న తెలివితేటలను చూసి ఇంకాస్త మురిసిపోతుంటారు. కానీ ఇలా ఎదిగే సమయంలో ఏవైనా మానసిక సమస్యలు కనిపిస్తే మాత్రం ఆ తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాదు. ఆ బాధను మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. సాధారణంగా ఇలాంటి శారీరక వైకల్యాలూ, లేదా మానసికమైన ఎదుగుదల లోపాలూ కనిపించే పిల్లలు మేనరికపు వివాహాల్లోని జంటలకే పుట్టడం ఎక్కువ. అందుకే డాక్టర్లు కూడా దగ్గరి సంబంధాలు వద్దనే సూచిస్తుంటారు. ఎందుకు? మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకిలా జరుగుతుంది, ఒకవేళ మేనరికపు పెళ్లిళ్లు తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనే పలు అంశాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే కథనమిది.ఓ బిడ్డలో లోపం వచ్చిందంటే ... తల్లిదండ్రులిద్దరిలోంచి వచ్చిన జన్యువులే (జీన్స్) సాధారణంగా ఇందుకు కారణం. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవాలే బిడ్డలకు వస్తాయి. సాధారణంగా ఒక లోపం వచ్చిదంటే... తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరి జీన్ లోపభూయిష్టంగా ఉండవచ్చు. అయితే ఆ లోపం తల్లిదండ్రుల్లో ఎవరినుంచి వచ్చిందో చెప్పడం కష్టం. ఇది ఎలా జరుగుతుందంటే... ఓ అవయవానికి సంబంధించి తల్లిదండ్రులిద్దరి నుంచీ జీన్స్ బిడ్డకు వస్తాయి. ఈ రెండింటిలో ఒకదాంట్లో లోపం ఉందనుకోండి. అప్పుడు అదే అవయవానికి సంబంధించిన మంచి జీన్... లోపమున్న జీన్‌ను డామినేట్ చేసి... ఆ లోపం రాకుండా నివారిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ లోపం ఉంటే...? అప్పుడు ఆ బిడ్డకు ఆ అవయవానికి సంబంధించిన లోపం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి దగ్గరి సంబంధాలూ లేని వేర్వేరు కుటుంబాలకు చెందిన వారనుకుందాం. అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరిలో జన్యులోపం ఉంటే లోపం లేని మరో జన్యువు దాన్ని డామినేట్ చేసి లోపాన్ని నివారిస్తుంది. అయితే ఒకే కుటుంబాల వారిలో (మేనరికాల్లో అదే కుటుంబాల వారి మధ్య పెళ్లి అవుతుంది కాబట్టి) ఇద్దరి జన్యువులూ లోపంతోనే ఉండే అవకాశముంటుంది కాబట్టి ఆ లోపం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దగ్గరి సంతతికి చెందిన... దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో ప్రతి 400 జంటల్లో ఒకరికి లోపమున్న బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200 జంటల్లోనే లోపమున్న బిడ్డ పుట్టేందుకు ఛాన్సులెక్కువ. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలు రక్తసంబంధాలే లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను ఆధునిక వైద్యశాస్త్రం ప్రోత్సహిస్తోంది. కానీ... దగ్గరి సంబంధాల వివాహాలతో పుట్టబోయే బిడ్డలకు ముప్పు పొంచి ఉంటుందిలా... దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్‌సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే ఉదాహరణకు అక్కకూతుర్ని... అంటే కోడలు వరసయ్యే అమ్మాయి తన మామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అనేక రకాల అవయవలోపాల నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం పొంచి ఉంటుంది.పేరెంట్స్ నుంచి బిడ్డలకు పోలికలూ, గుణాలూ లక్షణాలెలా వస్తాయంటే... బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల నాన్నదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ మురిపెంగా పోలికలు చూస్తూ మురిసిపోతుంటారు. బిడ్డలో ఎలా వస్తాయి ఈ పోలికలు? ఎలాగంటే... మనిషి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలన్నీ మొదట ఒకే ఒక తొలికణంతో మొదలైన జైగోట్ నుంచి అనేకానేక కణవిభజనల తర్వాత ఏర్పడతాయి. ఇక మానవుని ప్రతి కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలు. వీటిలో ఈ జతలో... 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి వచ్చి కలిసి... తొలి కణం ఏర్పడుతుంది. దీన్నే మనం పిండం అంటాం. ఈ పిండంలోని 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటంటే... దేహంలోని ప్రతి అంశానికీ, ప్రతి అవయవానికీ, ఎదుగుదలకూ, బిడ్డ అవయవాల షేపుకూ, సైజ్‌కూ, పెరిగే ఒడ్డూ పొడవునకు సంబంధించిన ప్రతి సమాచారమూ ఈ జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు ΄ోలికలు, తల్లిదండ్రుల లక్షణాలూ, శరీరాకృతి, రంగు వంటి అనేక అంశాలు సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి.దగ్గరివాళ్లలో పెళ్లిళ్లతో లోపాలు ఎందుకంటే... క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడి΄ోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసే అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా అసలు ఏ సంబంధమూ లేనివారిని పెళ్లి చేసుకుందని అనుకుందాం. ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్‌లో చెప్పాలంటే డామినేట్ చేస్తుంది. ఇలా లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ ఆ జన్యువులు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయక΄ోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా బయటపడుతుంది. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్‌పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయి΄ోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దంపతులిద్దరూ అపరిచిత కుటుంబాల నుంచి పెళ్లిళ్లు చేసుకుంటే ఒకరిలో అనారోగ్యకరమైన జన్యువు (ఫాల్టీ జీన్) ఉన్నా... దాన్ని దంపతుల్లోని మరో ఆరోగ్యకరమైన జన్యువు డామినేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పేర్కొన్న ఆస్తమా ఉదాహరణలా ఇది అన్నివేళలా ఇలాగే బిడ్డలో వ్యక్తమవ్వాలనే నిబంధన ఏదీ ఉండదు. కొన్ని ఫాల్టీ జీన్స్... ఇలా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే క్రమంలో మరింతగా చెడిపోతూ.... చెడిపోతూ... అకస్మాత్తుగా ఒక పెద్ద లోపంగా బిడ్డలో వ్యక్తం (ఎగ్జిబిట్) కావచ్చు. అందువల్లనే మేనరికాల్లో దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతోఫాల్టీ జీన్స్ అనేవి దంపతులిద్దరిలోనూ ఒకేలా ఉండి అవయవ లోపాలూ లేదా జబ్బులూ వ్యక్తమవుతాయి. ఎలాంటి జబ్బులకు ఆస్కారం ఉంది? మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలూ, పుట్టుకతో వచ్చే జబ్బులు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రో పెల్విక్ అబ్స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు (అనే జబ్బుల లక్షణాల మిశ్రమంతో ప్రయుక్తమయ్యే జబ్బులన్నింటినీ కలుపుకుని ఒకే ఒక మాటరూపంలో ‘సిండ్రోమ్’ అని పిలుస్తారు), బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే డయాబెటిస్, జన్యుపరమైన సమస్యలు రావచ్చు. ఇక కాబోయే తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, బిడ్డ పుట్టగానే చనిపోవడం, బిడ్డకు శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన సమస్యలూ – రకాలు సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 1) ఆటోజోమల్ డామినెంట్ : ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్‌గా ఉంటుంది. దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది. 2) ఆటోజోమల్ రెసెసివ్ : వీటిలో సమస్య బయటపడదుగానీ... సమస్యను / వ్యాధిని కలగజేసే జన్యువులు తల్లిదండ్రులిద్దరిలోనూ నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి. వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య తప్పక బయటపడుతుంది. 3) ఎక్స్ లింక్డ్ సమస్యలు : ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది.పెళ్లి తప్పదనుకుంటే... ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే చాలావరకు మంచిది. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి... వివాహానికంటే ముందుగా : పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ–మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనావేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంటకు కొన్ని రక్తపరీక్షలూ చేయించే అవకాశమూ ఉంటుంది. సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి ఇద్దరికీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ ఆటోజోమల్ డామినెంట్ సమస్యలు వస్తాయని తెలిస్తే వీలైనంతవరకు ఆ పెళ్లి వద్దనుకోవడమే మంచిది. పెళ్లి తర్వాత : పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వెళ్లి పైన పేర్కొన్నవన్నీ పాటించవచ్చు. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవాలి. గర్భం వచ్చాక : ఇక్కడ పేర్కొంటున్న సమస్యలన్నీ జన్యుపరమైనవి కావడంతో పుట్టబోయే పిల్లల్లో ఏ సమస్యా రాకుండా చేయడమన్నది ఏ నిపుణులకూ సాధ్యం కాదు. కాక΄ోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత వెంటనే చెయ్యగలిగిన చికిత్సలేవైనా ఉంటే వాటికోసం తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవడం చేయవచ్చు. లేదా లోపల ఉన్న సమస్యను తెలుసుకోవడం... ఒకవేళ అది మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) అవకాశాల గురించి ఆలోచించడం లేదా బిడ్డను కనడం... ఈ రెండింటిలో వారికి అనువైన / తగిన నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా... మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవ లోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అలాంటి ఇంజెక్షన్లుగానీ మందులు గానీ ఉండవు. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసమో లేదా ఇతరత్రా కుటుంబ భద్రతల దృష్ట్యా అలాంటి వాటిని చేసుకుని... ఆర్థికంగా, మానసికంగాబాధపడటం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డల కోసం కాస్తంత మంచి సంబంధాలు వెదికి బయటి సంబంధాలు చేసుకోవడమే మేలు అని గుర్తుంచుకోవాలి. అయితే ఇది వారి వారి వ్యక్తిగతమైన కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రక్తసంబంధాల్లోనే వివాహాలకు కారణాలివి... ఆర్థిక కారణాలూ, తెలిసినవారి కుటుంబంలో అయితే బిడ్డ బాగోగులు తెలుస్తాయనే ఈ రెండు అంశాలే దగ్గరి బంధుత్వాల్లో పెళ్లిళ్లకు కారణం. అందునా... ప్రధానంగా ఆర్థిక అంశాలే బాగా దగ్గరి సంబంధాలు చేసుకునేలా చాలావరకు ఆ కుటంబాలవారిని ప్రభావితం చేస్తుంటాయి. మేనత్త / మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తి బయటివారికి చెందకుండా... ఆస్తిలో ఆస్తి కలుస్తుందనే అంశమే చాలా సందర్భాల్లో ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, బాగా చూసుకుంటాఓ లేక ఆరళ్లు పెడుతూ బాధలకు గురిచేస్తారో? అదే... బిడ్డ మన కళ్లెదురుగా ఉంటే మనమూ కూతురి బాగోగులు కళ్లారా చూస్తూ ఉండవచ్చు. ఈ రెండు అంశాల కారణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. దాంతో తమ జీవనశైలుల్లోనూ, తమ సాంస్కృతిక విధానంలో దంపతులిద్దరూ తేలిగ్గా ఇమిడిపోతారు... దాంతో దంపతులకు ఇబ్బందులు రావనే భావన ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది.మేనరికపు పెళ్లిళ్లు... దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలు :గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది. మూడో నెలలో (12వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి ‘కోరియా విల్లస్ బయాప్సీ’ అనే పరీక్ష చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యల ముప్పు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాలి. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 – 20 ఎమ్ఎల్ తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్‌కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది. ఐదో నెల చివరిలో 18–22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో ΄ాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్లను గుర్తించి, దానికి తగినట్లుగా తర్వాతి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరో నెలలో 22–24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే గుండెకు సంబంధించిన లోపాలను తెలుసుకోవచ్చు. స్కానింగ్‌లో నూటికి నూరు శాతం లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడం మిస్సయ్యే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక : బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు.డాక్టర్ శ్రీజ గుర్రాల, సీనియర్ కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్ట్ (చదవండి: హార్న్‌బిల్ ఫెస్టివల్ ..! ఫుడ్ మెనూ చూస్తే..మతిపోవడం ఖాయం..!) -
ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి
హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటినే మనం నవ నరసింహ క్షేత్రాలని పిలుస్తున్నాం.. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. వరంగల్ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మి నరసింహస్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు. సంతాన, ఆరోగ్య ప్రదాతగా విశేష ఖ్యాతిగడించాడు స్వామి. వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండలు మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు.ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వార తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది . స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి.. మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుంది. స్వామి వారి నాభి భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీనినుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తరలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు.ఆరోగ్యామృతం ఆ నీరుఇక స్వామివారి పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల ΄ాటు తాగితే అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జల పాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు. రాణి రుద్రమదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందని, ఆ తర్వాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. చింతామణి జలధార నీటిని ఇప్పుడు కూడా విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు స్థానికులు, క్షేత్రాన్ని సందర్శించిన వారు. ఈ జలపాతానికి సమీపంలో మహా లక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జల పాతానికి సమీపంలో మరో చిన్ని జల పాతం ఉంది.ఎలా చేరుకోవాలి?ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది. మల్లూరు క్షేత్రానికి వరంగల్ నుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మణుగూరు నుంచి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.– భాస్కర్ -
దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా?
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన భారత్ గత కొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుదల విషయంలో గణనీయమైన మార్పులను చూసింది. నవంబర్ 2024 నాటికి దేశ జనాభా 145.56 కోట్లుగా ఉంది. ఈ సంఖ్య చైనాను అధిగమించింది. అయినప్పటికీ సంతానోత్పత్తి రేటులో చెప్పుకోదగిన క్షీణతను ఎదుర్కొంటోంది. ఈ ధోరణి భవిష్యత్తులో దేశానికి సానుకూల, ప్రతికూల పరిణామాలను తెచ్చిపెట్టనున్నదని నిపుణులు చెబుతున్నారు.రెండు శాతానికన్నా దిగువకు..1950లో దాదాపు 250 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంది. పెరుగుతున్న ప్రపంచ జనాభా మంచిదా? కాదా అనే చర్చ ఒకవైపు జరగుతుండగా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం 1950లో ఒక మహిళకు 6.2 మంది పిల్లలు ఉన్న భారతదేశంలో ఇప్పుడు సంతానోత్పత్తి రేటు రెండు శాతానికన్నా తక్కువకు పడిపోయింది. ఇదే ధోరణి భవిష్యత్‌లో కొనసాగితే భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2050 నాటికి 1.3 శాతానికి పడిపోనుంది.ఒకవైపు సవాళ్లు.. మరోవైపు అవకాశాలు2050 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు 1.8 శాతానికి తగ్గుతుందని, అది 2100 నాటికి అది 1.6 శాతానికి తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ క్షీణత భారతదేశంతో పాటు పలు దేశాలకు ఒకవైపు సవాళ్లను, మరోవైపు అవకాశాలను అందిస్తుంది. 2021లో భారత్‌లో సుమారుగా రెండు కోట్ల మంది పిల్లలు జన్మించారు. 2050 నాటికి ఈ సంఖ్య కేవలం 1.3 కోట్లకు తగ్గుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రాబోయే కాలంలో సంతానోత్పత్తి రేటులో క్షీణతను చవిచూడనున్నాయి.కారణాలివే..దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వెనుక అనేక కారణాలున్నాయి. ఆలస్యంగా వివాహాలు జరగడం, ఉన్నత విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణను పాటిస్టున్నారు. ఈ పోకడలు భవిష్యత్‌లో కొనసాగి, కొన్ని దశాబ్దాల్లోనే దేశ జనాభా గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.జీవన నాణ్యత కోణంలో మేలుసంతానోత్పత్తి రేటు క్షీణించడాన్ని ఒక సవాలుగా భావించినప్పటికీ, దీనివలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వనరుల నిర్వహణ, జీవన నాణ్యత కోణంలో మేలు జరగనుంది. ఆహారం, నీరు, ఇంధన శక్తి తదితర వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు తక్కువ పిల్లలను కలిగి ఉన్న మహిళలు సగటున ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నియంత్రిత జనాభా దేశంలో దీర్ఘకాలికంగా మరింత స్థిరమైన వృద్ధిని సృష్టిస్తుంది.సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడిసంతానోత్పత్తి రేటు పడిపోతున్న దశలో సమాజంలో యువత నిష్పత్తి తగ్గుతుంది. వృద్ధుల జనాభా పెరుగుతుంది. ఫలితంగా కార్మిక మార్కెట్లో అసమతుల్యత, సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడి ఏర్పడుతుంది. భారతదేశంలో 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా ఇప్పటికే క్షీణిస్తూ వస్తోంది. ఇది 2001లో 36.4 కోట్ల నుండి 2024 నాటికి 34 కోట్లకు చేరుకుంది. ఇదేసమయంలో 60 అంతకంటే అధిక వయసు కలిగినవారి సంఖ్య 1991లో 6.1 కోట్ల నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇది 2024 నాటికి 15 కోట్లుగా అంచనాలున్నాయి. పెరుగుతున్న వృద్ధాప్య జనాభా సామాజికంగా గణనీయమైన సవాళ్లను తెచ్చిపెడుతుంది.విస్తృత ప్రపంచ ధోరణిలో భాగంసంతానోత్పత్తి రేటు క్షీణత అనేది భారతదేశానికి మాత్రమే కాదు.. ఇది విస్తృత ప్రపంచ ధోరణిలో భాగం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్నందున శ్రామికశక్తి, వృద్ధాప్య జనాభా మరిన్ని సవాళ్లను తెచ్చిపెడుతోంది. దీంతో తక్కువ ఆదాయ వనరులు కలిగిన దేశాలలో పరిస్థితి మరింత క్షిష్టంగా మారనుంది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణత అటు అవకాశాలను, ఇటు సవాళ్లు రెండింటినీ అందించనుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లాంటి లక్ష్య వ్యూహాలతో ప్రభుత్వాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
లంచ్ బ్రేక్‌లో లవ్వు!
అసలే జననాల రేటు తగ్గుతోంది. అది చాలదన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికులను భారీగా బలి తీసుకుంటోంది. దీనికి తోడు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి వస్తుండటంతో యువకులు భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు. వెరసి రష్యాలో జనాభా శరవేగంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. దాంతో ఎలాగైనా జనాభాను ఇతోధికంగా పెంచి దేశసేవ చేయాలంటూ రష్యన్లకు ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. అందుకోసం రోజూ పని మధ్యలో లంచ్, టీ విరామ సమయాల్లో కూడా వీలైనంతగా కిందా మీదా పడాల్సిందిగా సూచించారు! పుతిన్ ఇచి్చన ఈ గమ్మత్తైన పిలుపుపై నెటిజన్లు అంతే ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. లంచ్, కాఫీ బ్రేకులను సంతానోత్పత్తికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెస్తోపలోవ్ కూడా పేర్కొనడం విశేషం. ఇది ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ‘‘దయచేసి రోజంతా పనిలో బిజీగా ఉంటున్నామని చెప్పకండి. అది పసలేని సాకు మాత్రమే. సృష్టికార్యానికి ఆఫీసు పని అడ్డంకి కారాదు. లంచ్, కాఫీ బ్రేక్... ఇలా ప్రతి అవకాశాన్నీ సెక్స్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోండి. లేదంటే కాలం ఎవరి కోసమూ ఆగదు. బేబీలను కనేందుకు బ్రేక్ టైంలో కష్టపడండి’’ అంటూ హితబోధ కూడా చేశారు.పడిపోతున్న ప్రజనన నిష్పత్తి ఏ దేశంలోనైనా జనసంఖ్య స్థిరంగా ఉండాలన్నా ప్రజనన నిష్పత్తి కనీసం 2.1గా ఉండాలి. రష్యాలో అది నానాటికీ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రతి మహిళకూ కేవలం 1.4గా ఉంది. 2024 తొలి అర్ధ భాగంలో గత పాతికేళ్లలోనే అత్యంత తక్కువ జననాల రేటు నమోదైంది! ఇది దేశ భవిష్యత్తుకు మరణశాసనమేనంటూ క్రెమ్లిన్ హాహాకారాలు చేస్తోంది.తొలి కాన్పుకు రూ.9.4 లక్షలు! జననాల రేటును పెంచేందుకు రష్యా పలు చర్యలకు దిగింది. అబార్షన్, విడాకులు అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. పిల్లల్ని కని పెంచడమే మహిళల ప్రధాన బాధ్యతంటూ ప్రముఖులు, మత పెద్దలతో చెప్పిస్తోంది. చెల్యాబిన్స్క్ ప్రావిన్స్ తొలి కాన్పుకు ఏకంగా రూ.9.4 లక్షలు ప్రకటించింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!
వివాహం చేసుకోలేదు..ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతాడు..అలాంటిది తనకు 12 దేశాల్లో 100 మంది పిల్లలున్నారు. అదేంటి పెళ్లి కాకుండా, ఒంటిరిగా ఉంటూ అంతమందికి ఎలా తండ్రాయ్యాడు..? అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ అతను ఎవరు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం.ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ తనకు 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు టెలిగ్రామ్‌లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండేందుకే పావెల్ ఇష్టపడుతారు. అలాంటి వ్యక్తి 100 మందికి ఎలా తండ్రాయ్యడో టెలిగ్రామ్ పోస్ట్‌లో వివరంగా తెలిపారు.పావెల్ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రపంచవ్యాప్తంగా నాకు 100కు పైగా పిల్లలు ఉన్నారు. ఎన్నడూ వివాహం చేసుకోని, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తికి ఇది ఎలా సాధ్యమవుతుంది? అనుకుంటున్నారా.. సుమారు 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నా వద్దకు వచ్చి విచిత్రమైన కోరిక కోరాడు. తనకు, తన భార్యకు సంతానోత్పత్తి సమస్య కారణంగా పిల్లలు పుట్టలేదని చెప్పాడు. తనకు సంతానం కలగడానికి నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. దాంతో నాకు విపరీతంగా నవ్చొచ్చింది. ఆ సమస్య ఎంత తీవ్రమైందో నిజానికి ఆ సమయంలో నాకు తెలియదు. స్పెర్మ్ దానానికి అంగీకరించి క్లినిక్‌కు వెళ్లాను. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దొరకడం చాలా కష్టమని డాక్టర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. సంతానంలేని వారికి స్పెర్మ్ దానం చేయడం గొప్ప విషయం అని అన్నాడు. దాంతో సమస్య ఎంత తీవ్రమైందో అర్థమైంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’‘ప్రపంచవ్యాప్తంగా నాకు 12 దేశాల్లో దాదాపు 100 మంది పిల్లలున్నారు. నిజానికి ఇలా చెప్పడం ఆమోదయోగ్యం కాకపోయినా స్పెర్మ్ దాతగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నేను చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా. ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారింది. దాన్ని తగ్గించడంలో నా వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. మరికొందరు ఆరోగ్యవంతమైన పురుషులను వీర్యదానం కోసం ప్రోత్సహించాలనుకుంటున్నాను. దానివల్ల పిల్లలు కావాలనుకునే కుటుంబాలకు ఎంతో సహాయం చేసినట్లవుతుంది’ అని దురోవ్ చెప్పారు. టెలిగ్రామ్‌లో ఈమేరకు చేసిన పోస్ట్‌ను ఇప్పటికే సుమారు 20 లక్షల మంది వీక్షించారు. దాంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
కరోనా బాధితులకు పిల్లలు పుట్టరా..? టెన్షన్ పెడుతున్న రీసెర్చ్!
సాక్షి, ముంబై: ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా కరోనా సోకిన వారిపై చేసిన అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై ఓ రీసెర్చ్ చేశారు. ఇందులో భాగంగా కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని వారు తెలుసుకున్నారు. కాగా, పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్ ఒమెగా జర్నల్ గత వారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ అధ్యయనంలో వైరస్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా తేలినట్లు స్పష్టం చేశారు. ఈ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్యకణాల నమూనాలను విశ్లేషించినట్లు తెలిపారు. కరోనా బారినపడిన వారితో ఆరోగ్యవంతుల.. వీర్య కణాలను పోల్చగా.. గణనీయంగా కణాల తగ్గినట్లు అధ్యయనంలో గుర్తించారు. కరోనా బాధితుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్1, ప్రోసాపోసిన్ తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. ఇక, కొవిడ్‌కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది చదవండి: భారత్‌లో ఎక్స్ఈ స్ట్రెయిన్ కేసులు.. ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు ఇవే.. -
మగవారి కొంపముంచుతున్న కెమికల్స్, ఇలాగైతే కష్టమే!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మానవజాతిలో ఫలదీకరణ సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతోందా? అవునంటున్నారు షన్నా స్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పలు రకాల రసాయనాలు క్రమంగా మగవాళ్లలో వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు, అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. కౌంట్‌డౌన్ పేరిట తాజాగా విడుదల చేసిన పుస్తకం ప్రకారం మనుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973తో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మేర తగ్గిందని, ఇదే తరహా కొనసాగితే 2045 నాటికి స్పెర్మ్‌కౌంట్ జీరోకు చేరవచ్చని చెప్పారు. ఇదే నిజమైతే భవిష్యత్‌లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదని హెచ్చరించారు. ఈ విపత్తుకు కారణమైన రసాయనాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూవారీ ఫుడ్ర్యాపింగ్స్ మొదలు, ప్లాస్టిక్ కంటైనర్ల వరకు వాటర్‌ప్రూఫ్ బట్టల నుంచి రోజూవారీ డియోడరెంట్లు, సబ్బుల వరకు అన్ని చోట్ల ఈ రసాయనాల జాడ ఉందని వివరించారు. వీటిలో పీఎఫ్ఏఎస్గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ఎప్పటికీ ప్రకృతిలో బ్రేక్‌డౌన్ కావని, ఇవి శరీరంలో పర్మినెంట్‌గా ఉంటాయని చెప్పారు. ఇవి శరీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందన్నారు. కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీయింగ్ పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌పై ఆయాదేశాలు స్పందించే తీరులో వ్యత్యాసాలున్నాయని, కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా నిషేధిస్తే, కొన్ని చోట్ల పరిమితంగా వాడుతున్నారని, కొన్ని చోట్ల ఎలాంటి నియంత్రణా లేదని స్వాన్ వివరించారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించకుండా కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రసాయనాల ప్రభావం మహిళల్లో సైతం ఫెర్టిలిటీపై పెరిగిందని స్వాన్ చెప్పారు. ప్రస్తుత మహిళ తన ముత్తవ్వతో పోలిస్తే 35వ ఏట గర్భం దాల్చే శక్తి తగ్గిందన్నారు. అలాగే ఒక మగవాడి వీర్యకణాలు అతడి తాతతో పోలిస్తే సగమయ్యాయన్నారు. ఇది మానవాళి అంతానికి దారి తీసే విపత్తని చెప్పారు. కేవలం స్పెర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఈ కెమికల్స్ కారణంగా మగవారి అంగ పరిమాణం, వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశాలు మేలుకొని ఈ కెమికల్ గండాన్ని ఎదుర్కోవాలని సూచించారు. -
ఈ తండాకు ఏమైంది?
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తీత్రీ తండావాసులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లుగా పెళ్లయిన దంపతులకు సంతానం కలగడంలేదు. దీంతో వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తండా నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి వెంటనే సంతానం కలుగుతోంది. దీంతో తండాకు ఏమైందని స్థానికులు అయోమయం చెందుతున్నారు. తండాకు చెందిన ఆడపడుచులు వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా, వారికి ఏడాది తిరిగే సరికి సంతానం కలుగుతుండగా.. పురుషులకు మాత్రం కావడం లేదు. సుమారు 70 ఏళ్ల క్రితం భర్మావత్ తీత్రీ అనే మహిళ బయ్యారం పెద్దగుట్ట పక్కన తండాను ఏర్పాటు చేయగా ఈ తండాలో ప్రస్తుతం 42 కుటుంబాలు నివసిస్తుండగా, 170 మంది జనాభా ఉంది. ఆరేళ్లుగా.. తండాకు చెందిన బోడ చిరంజీవి, గుగులోత్ సురేష్, గుగులోత్ సుమన్, బానోత్ రమేష్, భర్మావత్ చందకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం వీరు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్మావత్ చంద తమ బంధువుల అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటుండగా, మిగతా వారు సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. వలస వెళ్లిన వ్యక్తికి సంతానం ఇదే తండాకు చెందిన బానోత్ సురేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇతను బతుకుదెరువు కోసం భార్య జ్యోతితో కలసి హైదరాబాద్‌కు వలస వెళ్లగా అక్కడ వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం సురేష్ దంపతులు తండాలో నివసిస్తుండగా తండాలోని మినీ అంగన్వాడీ కేంద్రంలో సురేష్‌కు చెందిన ముగ్గురు పిల్లలు మాత్రమే ప్రీస్కూల్ విద్యార్థులుగా నమోదయ్యారు. పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలలో రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. తండాలో ఆరేళ్లుగా పిల్లలు పుట్టకపోవటంతో కొత్త పిల్లల నమోదు నిలిచిపోయింది. ఎన్ని ఆస్పత్రుల్లో తిరిగినా.. నా పెద్ద కొడుక్కి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశా. ఇప్పటి వరకు సంతా నం కలగలే. మహబూ బాబా ద్, ఖమ్మంలోని పలు ఆస్పత్రులకు వె ళ్లాం. వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు. – బోడ సరోజ, చిరంజీవి తల్లి ఇలా ఎప్పుడూ జరగలే.. తండా ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. తండాకు చెందిన వారికి కొన్నేళ్లుగా ఎందుకు సంతానం కలగటం లేదో అర్థం కావటం లేదు. – వాంకుడోత్ రాంచంద్, తండావాసి కారణాలు అనేకం ఉంటాయి దంపతులకు పిల్లలకు కలగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో పలు సమస్యలు ఉంటాయి. సంతానం లేని వారు ఒక్కసారే ట్రీట్మెంట్ చేసుకొని ఆ తర్వాత వైద్యుల సలహాలను పాటించకపోవటం, పరీక్షించిన వైద్యులు ఇతర వైద్యులకు రెఫర్ చేస్తే అక్కడికి వెళ్లకపోవటం వల్ల సంతానం కలగకపోయే అవకాశాలున్నాయి. – డాక్టర్ బి.వీరన్న, డీజీఓ, మానుకోట ఏరియా ఆస్పత్రి ఇద్దరం ఉన్నప్పటికీ పిల్లలు లేరు పాఠశాలలో ఇద్దరం ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ మా బడిలో తగిన సంఖ్యలో పిల్లలు లేరు. ఆరేళ్లుగా తండాకు చెందిన పలువురికి సంతానం కలగకపోవటంతో చిన్నక్లాసులో అడ్మిషన్లు జరగటం లేదు. – మోహన్, పాఠశాల హెచ్ఎం -
భూతప్పల కాలి స్పర్శ కోసం.. వేయి కళ్లతో!
వాళ్ల కాలి స్పర్శ తగిలితే చాలు.. సర్వ శుభాలు జరుగుతాయని, వ్యాధులన్నీ నయమవుతాయని నమ్మకం. ఆ కాలి అడుగులు తగలడం కోసం ఉపవాస దీక్షతో.. తడిదుస్తులు ధరించి.. వాళ్లొచ్చే దారిలో ఇలా పడుకుంటారు. ఇదంతా అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరపల్లి ప్రాంతంలో జరిగే భూతప్పల ఉత్సవం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మార్గశిరమాసంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడకు వచ్చే భూతప్పల కాలి స్పర్శ కోసం వందలాది మంది భక్తులు వేచి చూస్తుంటారు. భక్తులు బియ్యపుపిండి, బెల్లం కలిపి చలివిడితో హారతులు చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చుకుంటారు. హారతుల ఉత్సవం తర్వాత జరగే భూతప్పల ఉత్సవం ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. భూతప్పల కాలి స్పర్శ కోసం వాళ్లు వచ్చే దారిలో ఎంతోమంది భక్తులు ఉపవాస దీక్షతో, తడిబట్టలతో వేచి ఉంటారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాల ముందు భూతప్పలు కత్తి, డాలు పట్టి విన్యాసాలు చేస్తూ దారివెంట బోర్లాపడుకున్న భక్తులపై నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు.. ఎవరెవరికి వాళ్ల కాలి స్పర్శ తగులుతుందో.. వాళ్లకు సర్వ శుభాలు కలుగుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. ఈ తంతు అనాదిగా ఇక్కడ జరుగుతూనే ఉంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తారు.


