Fake compliant
-
రూ.400 కోట్ల దారి దోపిడీ కేసు.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?
బెళగావి: సుమారు ఐదు నెలల నుంచి సినిమాను మించి ట్విస్ట్‌లతో సాగిన రూ. 400 కోట్ల నగదు దోపిడీ కథ.. చివరికి ఫేక్ అని తేలింది. ట్రక్ కంటైనర్లలో గోవా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు రూ.400 కోట్ల నగదు.. దోపిడీ జరిగిందంటూ ట్రక్ డ్రైవర్ చేసిన ఫిర్యాదు.. కట్టుకథగా నాసిక్ పోలీసులు తేల్చిపారేశారు. డ్రైవర్ చెప్పింది నిజం కాదని.. దారి దోపిడీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.నగదు తరలిస్తున్న ట్రక్కును అడ్డగించి దోపిడీ చేశారంటూ డ్రైవర్ సందీప్ గత ఏడాది డిసెంబరు 17న మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది అక్టోబరు 22న బెళగావి జిల్లాలోని చోర్లా ఘాట్ ప్రాంతంలో ఈ చోరీ జరిగిందంటూ నమ్మబలికాడు. కొందరు వ్యక్తులు తనను అడ్డగించి.. దాడి చేశారని.. రూ.400 కోట్ల విలువైన రూ.2000 నోట్లతో (రద్దయిన నోట్లు) పరార్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సందీప్.. తనపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను కూడా షేర్ చేశాడు.ఈ కేసును ఛేదించడానికి మహారాష్ట్ర పోలీసులు.. కర్ణాటక, గోవా పోలీసుల సాయంతో విచారణ చేపట్టారు. అంత భారీ నగదును తీసుకెళ్లే ట్రక్కులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. సందీప్ ఫిర్యాదు మేరకు ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారించామని.. అతని ఆరోపణలు కట్టు కథలేనని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ సందీప్ పాటిల్ చెప్పిన వివరాల్లో అనేక పొంతన లేని విషయాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురినీ న్యాయస్థానం ఇప్పటికే విడుదల చేసింది. తప్పుడు ఫిర్యాదు చేసిన డ్రైవర్ సందీప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే యెచనలో పోలీసులు ఉన్నారు. -
బతికున్నవారు మరణించారంటూ టీడీపీ బోగస్ ఫిర్యాదులు
-
గొలుసును పోగొట్టుకుని..చైన్ స్నాచింగ్ అంటూ ఫిర్యాదు
తన గొలుసును ఎక్కడో పోగొట్టుకున్న ఓ మహిళ.. కుటుంబసభ్యులకు చెప్పేందుకు భయపడి... చైన్‌స్నాచింగ్ జరిగిందంటూ నాటకమాడింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయింది. సరూర్‌నగర్ సీఐలు లింగ య్య, సునీల్ తెలిపిన వివరాలివీ... తమ ఇంటి సమీపంలోని దుకాణానికి నడిచి వెళుతుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తన మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంచుకు పోయారని మాతాలక్ష్మీనగర్ కాలనీలోని సాయి ఎన్క్లేవ్ అపార్టుమెంటులో నివసించే గెంటి వనజాక్షి(43) బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీఐ సునీల్, సీఐ శ్రీనివాసులు కేసు విచారణలో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిర్యాదు చేసిన మహిళ వనజాక్షిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఉండే అపార్టుమెంట్లో ఉన్న సీసీ ఫుటేజి పరిశీలించగా చైన్‌స్నాచింగ్ సమయంలో కానీ, అంతకు ముందు కానీ వనజాక్షి బయటకు వెళ్లలేదని గుర్తించారు. దీంతో ఆమెను గట్టిగా ప్రశ్నించగా చైన్ స్నాచింగ్ జరగలేదని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం గొలుసు ఎక్కడో పడిపోయిందని కుటుంబ సభ్యులు ఏమైనా అంటారేమోనని అబద్ధం చెప్పినట్లు ఒప్పుకుంది. ఇంటి పక్కన నివసించే ఓ వ్యక్తి స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎలాగోలా గొలుసు రికవరీ చేసి ఇస్తారని చెప్పటంతో ఈ పని చేసినట్టు చెప్పింది. తప్పుడు పిర్యాదు చేస్తే చర్యలు... ఎవరైనా ఇలాంటి తప్పుడు పిర్యాదుచేస్తే వారిపైనే కేసులు నమోదు చేస్తామని సీఐలు లింగయ్య, సునీల్ స్పష్టం చేశారు. తప్పుడు ఫిర్యాదుల కారణంగా వాస్తవంగా నష్టపోయిన వారికి అన్యాయం జరిగే ప్రమాదముందని తెలిపారు.


