breaking news
extortion gang
-
మృగాళ్లకు అండగా తృణమూల్
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లను ఆ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకం వల్ల బెంగాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వసూళ్ల దందా చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించారు. చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రహదారులకు సంబంధించిన రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాపూర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. కోల్‌కతా ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై ఘోరంగా అత్యాచారం జరిగిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. ఆ అత్యాచార ఘటన పట్ల దేశమంతా కలవరపాటుకు గురైందని, ఇప్పటికీ కోలుకోలేదని అన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో కాలేజీలో మహిళపై అత్యాచారం జరిగిందని ఆక్షేపించారు. ఈ కేసులో నిందితుడికి తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండా ట్యాక్స్ ‘‘బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో, న్యాయం చేకూర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ముర్షీదాబాద్‌లో అల్లర్లు జరిగితే పోలీసులు బాధితులనే వేధించారు. బాధ్యులను వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడుగంటాయి. వారి ప్రాణాలకే భద్రత లేకుండాపోయింది. ఇదంతా ప్రభుత్వ నిర్వాకం కాదా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి అడ్డు తగులుతోంది. గూండా ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు బెంగాల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం తృణమూల్ కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. బెంగాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాం. దేశ ప్రగతికి బెంగాల్‌ను చోదక శక్తిగా మారుస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈశాన్య భారత అభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ మోతిహరీ: ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలన్న నిర్ణయం బిహార్ గడ్డపైనే తీసుకున్నానని, అది ఎలా విజయవంతమైందో ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశ సమగ్రాభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర బహుముఖ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో పర్యటించారు. తొలుతు తూర్పు చంపారన్ జిల్లాలో రూ.7,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతిహరీ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్ ఏక్‌బార్ ఎన్డీయే సర్కార్’ అనే నూతన నినాదం ఇచ్చారు. దీవసూళ్ల దందానిపై జనం పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, సరికొత్త బిహార్‌ను నిర్మించుకుందామని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు. బిహార్‌లో విపక్ష కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వం పేదల భూములు బలవంతంగా లాక్కుందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేదలు, అణగారినవర్గాల పేరిట కాంగ్రెస్–ఆర్జేడీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్ వెనుకబాటుతనానికి ఆ రెండు పారీ్టలే కారణమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గత 45 రోజుల్లో 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మోతిహరీని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ పోరాటానికి బిహార్‌లోని చంపారన్ నూతన దిశను నిర్దేశించిందని మోదీ గుర్తుచేశారు. -
కానిస్టేబుల్స్ కక్కుర్తి.. కారులో డబ్బులున్నాయని తెలిసి దొంగతనం!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జాతీయ రహదారిలో సినీ ఫక్కీలో జరిగిన రూ.2 కోట్ల దారి దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దోపిడీకి పథకం వేసింది ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈనెల 22న ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన రూ.3 కోట్ల నగదును కొందరు రెండు కార్లలో తీసుకుని బెంగళూరు నుంచి హైదరాబాదు బయలు దేరారు. రూ.కోటి నగదు బ్యాగుతో వెళ్తున్న కారు డ్రైవరు.. కడపకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌కు మరొక కారులో తీసుకొస్తున్న రూ.2 కోట్ల నగదు తరలింపుపై సమాచారం చేరవేశాడు. ఎలాగైనా ఆ సొమ్మును దోపిడీ చేయాలని సదరు కానిస్టేబుల్ పథకం వేశాడు. మరో ఇద్దరు వ్యక్తుల(ఒక కానిస్టేబుల్, మరొక వ్యక్తి)తో కలసి పోలీసు దుస్తుల్లో జాతీయ రహదారి–44లోని గార్లదిన్నె మండలం కలగాసిపల్లి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచే వాహనాల సమాచారం గురించి రూ.కోటితో వస్తున్న కారు డ్రైవర్‌కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు వెనుకగా వస్తున్న సదరు డ్రైవర్ గార్లదిన్నె సమీపంలో రూ.2 కోట్లతో వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసేశాడు. కలగాసిపల్లి వద్ద మాటు వేసిన కానిస్టేబుల్ అండ్‌కోకు సంకేతాలు పంపాడు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న మరొక కారును ఆపి.. తమకందిన సమాచారం, ఆనవాళ్ల ఆధారంగా కారు డిక్కీలో నగదు ఉంచిన బ్యాగును లాగేసుకున్నారు. ప్రశ్నించబోయిన కారులోని వ్యక్తులపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు తమ ముందు వెళ్లిపోయిన రూ.కోటి కారులోని వ్యక్తులకు జరిగిన విషయం తెలియజేశారు. అనంతరం గార్లదిన్నె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీతో దర్యాప్తు ముందుకు.. రూ.2 కోట్ల నగదుతో ఉడాయించిన వ్యక్తులు ఇన్నోవా వాహనంలో అనంతపురం వచ్చారు. దోపిడీ చేసే కొన్ని గంటల ముందు అనంతపురం వద్ద వాహనం నంబరు ప్లేట్‌కు స్టిక్కర్ అతికించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో పోలీసులు పసిగట్టారు. దీంతో చోరీకి తెగబడింది వీరేనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. స్టిక్కర్ అతికించిన వ్యక్తి జంగిల్ షూ, జంగిల్ ప్యాంట్ ధరించి ఉండటంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. అనంతరం అతని మొబైల్‌కు వచ్చిన కాల్ డిటైల్స్ పరిశీలించగా.. ఎస్ఆర్ఆర్ కంపెనీకి చెందిన ఓ డ్రైవరు నంబరుతో ఎక్కువగా సంభాషించినట్లు తెలిసింది. కాల్ డీటైల్స్‌తో దొరికిపోయిన డ్రైవర్.. బెంగళూరు నుంచి రూ.3 కోట్ల నగదుతో హైదరాబాద్‌కు వెళ్తున్న విషయాన్ని ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాహకులు దాచిపెట్టారు. దోపిడీకి గురైన రూ.2 కోట్ల గురించి మాత్రమే పోలీసులకు చెప్పారు. మరో రూ.కోటి ముందు వెళ్లిన కారులో తరలించారని దర్యాప్తులో తేలింది. రూ.కోటిని సురక్షితంగా తీసుకెళ్లిన కారు డ్రైవర్‌ను ఆరా తీయగా... ప్రస్తుతం తాను కళ్లకలక వల్ల డ్యూటీకి వెళ్లడం లేదని బుకాయించాడు. అయితే అతడి సెల్‌ఫోన్ నుంచి వైఎస్సార్ జిల్లా ఏఆర్ కానిస్టేబుల్‌కు కాల్స్ వెళ్లినట్లు తేలడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నాడు. దోపిడీలో పాలుపంచుకున్న మరొక కానిస్టేబుల్, ఇంకొక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దోపిడీ అయిన సొమ్ములో కొంతమేర మాత్రమే రికవరీ చేసినట్లు సమాచారం. నిందితుల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అశ్లీలంతో ఎర వేసి బెదిరిస్తూ అందినకాడికి వసూలు చేసే ఎక్స్టార్షన్ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌కు చెందిన 11 మంది నిందితులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఈ ముఠాపై హైదరాబాద్‌లో పది కేసులు నమోదై ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ వారిపై న్యాయస్థానం నుంచి ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్లు తీసుకున్నారు. వీటి ఆధారంగా వారిని ఇక్కడకు తీసుకొస్తున్నారు. రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉండే ఆల్వార్, భరత్పూర్, మా«థుర ప్రాంతాలకు చెందిన 11 మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు అల్వార్, భరత్పూర్లలో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. నకిలీ వివరాలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన ఆకర్షణీయమైన మహిళల ఫొటోలతో ఫేస్బుక్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. ఈ ప్రొఫైల్స్ ద్వారా ఫేస్బుక్లో ఉన్న అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. వీటిని యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్స్‌గా మారిన వాళ్లతో సైబర్ నేరగాళ్లు కొన్నాళ్ల పాటు సదరు యువతి మాదిరిగానే మెసెంజర్లో చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్సాప్ నంబర్లు ఇచ్చేలా చేస్తున్నారు. ఇంటర్నెట్ నుంచి సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్ ద్వారా తమ ఫోన్లో ఉంచి టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్లతో మాట్లాడుతూ తామే నగ్నంగా తయారవుతున్నామంటూ ఆ యాప్‌లోని వీడియోను ప్లే చేస్తున్నారు. దీంతో పూర్తిగా తమ వలలో పడిపోతున్న బాధితులను సైబర్ నేరగాళ్లు అనేక రకాలైన మాటలు చెబుతూ తాము చెప్పినట్లు చేసేలా చేస్తున్నారు. ఇలా సేకరించిన ‘వ్యక్తిగత వీడియో’లను యూట్యూబ్ చానల్స్‌లో ఉంచుతున్నారు. ఆ లింకుల్ని బాధితులకు వాట్సాప్ చేసి తాము కోరిన మొత్తం చెల్లిస్తేనే వీటిని తొలగిస్తామని, లేదంటే ఇతర సోషల్ మీడియాలో పెట్టేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా అందినకాడికి పేటీఎం, గూగుల్ పే, బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆపై పోలీసుల మాదిరిగా బాధితులకు కాల్స్ చేస్తూ మరో అంకానికి తెరలేపుతున్నారు. ఇలా రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతానికి చెందిన వారినీ ఈ గ్యాంగ్ వేధించింది. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు మొత్తం 11 మందిని పట్టుకున్నారు. వీరి విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన 10 మంది నుంచి రూ. 89 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఈ మేరకు ఇక్కడ కేసులు ఉండటంతో ఒకటి రెండు రోజుల్లో సిటీకి తీసుకురానున్నారు. చదవండి: అతడి భార్య, ఆమె భర్త మిస్సింగ్.. పోలీసులే అవాక్కయ్యారు! హైదరాబాద్: ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? -
అక్షయ పాత్ర..అరుదైన విగ్రహాలు..
తమ వద్ద అరుదైన విగ్రహాలు, అక్షయ పాత్ర ఉన్నాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బోల్తా కొట్టించి లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2009లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివీ... కె.శ్రీధర్, సత్యజిత్ రాజేష్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, తనుజిత్‌కుమార్, ఎస్.పోతురాజు, రామలింగ ప్రసాద్ అనే వారు ముఠాగా ఏర్పడి అరుదైన విగ్రహాలు ఉన్నాయంటూ ధనవంతులకు గాలం వేసేందుకు యత్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న అక్షయ పాత్రతో ధనం రెట్టింపవుతుందని నమ్మబలికేవారు. వీరి మాటలకు ఆకర్షితులైన వరంగల్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి జ్యోతికుమార్, కేరళకు చెందిన కేబీ.బహులేయం, కోయంబత్తూర్‌కు చెందిన ఆర్. శివం తదితరులు వీరిని సంప్రదించారు. 2009 మే 10 వ తేదీన వీరందరినీ హైదరాబాద్‌కు ర ప్పించిన ముఠా సభ్యులు.. అందరినీ వెంకటగిరిలోని ఓ గదికి తీసుకెళ్లారు. అక్కడ వీరిని బంధించి రూ.5.50 లక్షల నగదుతో పాటు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. బాధితులు అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయగా 2009 జూలై 1వ తేదీన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు చోరీకి పాల్పడ్డ వివరాలు, బంధించి నగదు, ఆభరణాలు తస్కరించిన ఆధారాలను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు పక్కాగా సమర్పించారు. ఈ మేరకు వీరిపై నేరం రుజువుకావటంతో మంగళవారం రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వీరందరికీ జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. -
1.4 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం
చైన్ స్నాచింగ్‌లు, హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 50 లక్షల విలువైన 14 కిలోల బంగారు ఆభరణలతో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.