breaking news
Environment Education Center
-
నింగిని వదిలి.. మట్టితో మమేకమై!
ఆమె చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం శాటిలైట్ పేలోడ్స్ తయారు చేసే ఏరోస్పేస్ సంస్థలో ఉద్యోగం. కెరీర్ పరంగా ఎంతో ఉన్నతమైన స్థానం. కానీ, ఆ ఏసీ ల్యాబ్‌లు, కంప్యూటర్ స్క్రీన్లు ఆమెకు ఏ మాత్రం తృప్తినివ్వలేదు. తన మూలాల్లోకి తిరిగి వెళ్లాలని అనుకుంది. ఉద్యోగాన్ని వదిలేసి, మట్టితో మమేకమై, పర్యావరణానికి మేలు చేసే ఒక అద్భుతమైన ‘జీరో–వేస్ట్ కేఫ్’ను ప్రారంభించింది 27 ఏళ్ల నిష్ఠా చౌహాన్....నిష్ఠా చౌహాన్ ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో పెరిగింది. ఆమె తాత చిరుధాన్యాలను పండించేవారు. అలా ఆమె తన చిన్నతనంలోనే రాగులు, జొన్నలు, సజ్జల వంటి సంప్రదాయ ఆహార ప్రాముఖ్యతను తెలుసుకుంది.అహ్మదాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్’ ప్రాంగణంలో నిష్ఠా మొదటి కేఫ్‌ను ప్రారంభించింది. ఈ కేఫ్‌లో మిల్లెట్ వంటకాలు మాత్రమే ఉంటాయి. ప్లాస్టిక్, డిస్పోజబుల్ వస్తువులు ఇక్కడ పూర్తిగా నిషేధం. గాజు పాత్రల్లోనే ఆహారాన్ని అందిస్తారు. పార్సిల్స్ కోసం అరెకా లీవ్స్, చెరకు పిప్పితో చేసే పాత్రలను వాడుతున్నారు. ఇక్కడ పర్యావరణానికి హాని చేసే ఎయిర్ కండిషనర్లకు బదులుగా, కేఫ్‌ను చల్లబరచడానికి వాటర్–కూలింగ్ సిస్టమ్స్, మిస్టింగ్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు.పిల్లలకు ఎకో వర్క్‌షాప్స్!నిష్ఠా చౌహాన్ పలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌తో కలిసి 5 నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా ఎకో–వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలు నేరుగా తోటలోకి వెళ్లి మట్టిని తాకడం, మొక్కలను గుర్తించడం, కూరగాయలను స్వయంగా కోయడం నేర్చుకుంటారు. ఆపై వంటింట్లోకి వెళ్లి సొంతంగా మిల్లెట్ సలాడ్లు, జ్యూస్‌లు తయారు చేస్తారు. సంప్రదాయక ఆహారానికి, జంక్ ఫుడ్‌కి గల తేడాని గమనిస్తారు. -
అనంతగిరిలో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్
అనంతగిరి, న్యూస్‌లైన్: వికారాబాద్ పట్టణం సమీపంలోని అనంతగిరిగుట్ట- హైదరాబాద్‌కు చేరువలో ఉండడంతో పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అనంతగిరి అడవిని సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అనంతగిరి అటవీ ప్రాంతం ఆహ్లాదకంగా ఉందన్నారు. సాధ్యమైనంత త్వరలో ఎన్విరాన్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకులు ప్రకృతి దృశ్యాలను తిలకించడానికి వ్యూ పాయింట్, నాలుగు గుఢారాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో గుడారానికి 10 లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు. అనంతగిరిలో కార్తీక మాసంలో పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి ప్లాస్టిక్ వస్తువులు పడేస్తున్నారని, ఇకపై అలా జరగకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసి వన భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యూజర్ చార్జీల ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ ఆఫీజర్ ఏవీ.జోసెఫ్, హైదరాబాద్ కన్జర్వేవేటివ్ ఆఫీసర్ రమణారెడ్డి, డీఎఫ్ఓ నాగభూషణం, సబ్ డీఎఫ్ఓ మాధవరావు, ఎఫ్ఆర్ఓ శ్రీలక్ష్మి ఉన్నారు.


