breaking news
english titles
-
ఇదో చిన్న సమస్య.. కాకపోతే డ్యామేజ్ మాత్రం?
ఓ సినిమా సక్సెస్ అనేది ఎలా అయితే చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందో.. ఫ్లాప్‌కి చాలానే అంశాలు కారణమవుతుంటాయి. కాకపోతే కొన్నిసార్లు చిన్న సమస్యల్లా అనిపించినవి కూడా పెద్ద డ్యామేజ్ చేస్తున్నాయా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. అలాంటిదే ఇది. ఇంగ్లీష్ టైటిల్స్ అనేది తెలుగు సినిమాలకు ఎప్పటి నుంచో పెడుతున్నారు. కాకపోతే అవి ఏమంత కలిసి రావట్లేదా? అనేది సందేహంగా మారింది.(ఇదీ చదవండి: వేల కోట్ల బడ్జెట్ మూవీ.. ఏఐతో ఒక్కరోజులోనే తీస్తే?)సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి టైటిల్స్ పెట్టిన అవి జనాల్లోకి త్వరగానే వెళ్లిపోతాయి. ఒకవేళ ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే.. పలకడం కష్టమైతే ఫలానా చిరంజీవి సినిమా అనో లేదంటే మహేశ్ బాబు సినిమా అనో పిలుస్తారు. కానీ మీడియం, తక్కువ మందికి తెలిసిన హీరోల మూవీస్ టైటిల్స్ మాత్రం ఇంగ్లీష్ కంటే తెలుగులోనే ఉంటే కాస్త మంచిదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు గత రెండు నెలల్లో వచ్చిన కొన్ని సినిమాలనే తీసుకుందాం.గతేడాది డిసెంబరులో తిరువీర్ అనే చిన్న హీరో చేసిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ రావడంతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అన్నప్పటికీ జనాలకు ఇది పెద్దగా రీచ్ కాలేదు. ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం ఓ కారణమైతే సగటు మాస్ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా టైటిల్ పెట్టకపోవడం కూడా ఓ కారణం అనుకోవచ్చు. స్టోరీకి తగ్గట్లే టైటిల్ పెట్టినప్పటికీ అది చాంతాడంత పొడుగ్గా ఉండటం, చెప్పడానికి నోరు తిరగనంత పెద్దగా ఉండటం కూడా మూవీ పెద్దగా రీచ్ కాకపోవడానికి కారణమే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)ఈ నెల తొలివారంలో దర్శకుడు గుణశేఖర్ తీసిన 'యుఫోరియా' అనే సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీనికి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. టైటిల్ ఇంగ్లీష్‌లో పెట్టడం, దీని అర్థం కూడా చాలామందికి తెలియకపోవడం కూడా ఓ రకంగా మైనస్ అయ్యిందేమో అనిపిస్తుంది. చాలామంది చదువుకున్న వాళ్లు కూడా ఈ పదానికి అర్థం ఏంటని టక్కున అడిగితే చెప్పలేరు. అలాంటిది బీ,సీ సెంటర్లలో ఉండే ఆడియెన్స్‌కి ఈ టైటిల్, మూవీ గురించి ఏమనిపించి ఉంటుంది.ఇకపోతే గతవారం రిలీజైన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు కూడా పాజిటివ్ టాకే వచ్చింది. మీడియా, అర్బన్ ఆడియెన్స్ బాగానే దీనికి కనెక్ట్ అయ్యారు. కానీ బీ,సీ సెంటర్లలో దీనికి పెద్దగా వసూళ్లు రావడం లేదు. లివ్-ఇన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ ఆధరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్స్ లేకపోవడం లాంటిది కాస్త మైనస్ అయితే.. ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం కూడా ఈ చిత్రానికి ఏమైనా మైనస్ అయిందా అనిపిస్తుంది. ఇవే కాదు గత రెండు దశాబ్దాల కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్‌తో వచ్చిన చాలా తెలుగు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఎక్కువశాతం బోల్తాకొట్టాయి.ఆర్ఆర్ఆర్, డీజే టిల్లు, మేజర్, హిట్ తదితర సినిమాలు.. ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ అయ్యాయి. పలు సినిమాలు మంచి విజయాలు కూడా సాధించాయి. కానీ మేజర్‌గా ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని సినిమాల విషయంలోనూ ఇలానే జరుగుతుందని చెప్పలేం కానీ అదృష్టం బాలేకపోతే టైటిలే సినిమాకు ఉరితాడు అయ్యే అవకాశముంది!(ఇదీ చదవండి: ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నువ్వే: చిరంజీవి) -
సినిమాలకు ఇంగ్లిష్ టైటిల్స్ పెడితే సబ్సిడీ కట్!
తిరువనంతపురం: భారతదేశంలో చిత్ర పరిశ్రమలకు ఇంగ్లిష్ టైటిల్స్ తో ఏదో తెలియని సంబంధం. దేశంలో ఉన్న సినీ పరిశ్రమల్లో ఇంగ్లిష్ టైటిల్స్ వాసన లేకుండా సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. ప్రతీ రాష్ట్రంలో మాతృభాషను బ్రతికించుకోవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నా.. సినిమా టైటిల్స్ విషయంలో మాత్రం నామమాత్రంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే ఇక నుంచి మాతృభాషను సాధ్యమైనంతవరకూ బ్రతికించుకోవడానికి కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మాతృభాషలో సినిమా టైటిల్స్ పెట్టిన చిత్రాలకు మాత్రమే సబ్సిడీ వర్తింప చేయడానికి సన్నద్ధమైంది. దీంతో పాటు ఇంగ్లిష్ టైటిల్స్ కు చెక్ పెట్టేందుకు కూడా నడుంబిగించింది. ఇక నుంచి మలయాళ చిత్ర సీమలో ఏ చిత్రానికైనా ఇంగ్లిష్ టైటిల్స్ పెడితే మాత్రం సబ్సిడీ ఉండదని తెలియజేసింది. ఇందుకోసం దర్శకుడు ఆదూర్ గోపాల్ క్రిష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మాతృభాషలోని తెరకెక్కించే సినిమాలకు సంబంధించి విధివిధానాలను పరిశీలించి.. అందుకు తగిన సహకారం అందిస్తుంది. చిత్ర పరిశ్రమలో సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని పర్యవేక్షించి తగిన సూచనలు చేస్తుంది.


