breaking news
england wicket keeper
-
ఇంగ్లండ్ వికెట్‌కీపర్ మహోగ్రరూపం.. 11 సిక్సర్లు, 11 ఫోర్లతో విధ్వంసకర శతకం
టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఇంగ్లండ్ యువ వికెట్‌కీపర్ జోర్డన్ కాక్స్ (ఎసెక్స్) మహోగ్రరూపం దాల్చాడు. నిన్న (జులై 17) హ్యాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న కాక్స్ 11 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేశాడు. పొట్టి క్రికెట్లో కాక్స్‌కు ఇదే తొలి సెంచరీ.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్.. టాబీ అల్బర్ట్ (55 బంతుల్లో 84; 12 ఫోర్లు, సిక్స్), కార్ట్‌రైట్ (23 బంతుల్లో 56; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ ప్రెస్ట్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్ ఫుల్లర్ (6 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. ఆదిలో తడబడినప్పటికీ, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జోర్డన్ కాక్స్ శివాలెత్తిపోవడంతో మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కాక్స్ ఒక్కడే ఒంటిచేత్తో ఎసెక్స్కు విజయతీరాలకు చేర్చాడు. సహచర బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బంది పడిన చోట కాక్స్ విలయతాండవం చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారీ లక్ష్యం చిన్నబోయేలా చేశాడు. ఫలింతగా ఎసెక్స్ 4 వికెట్ల తేడాతో హ్యాంప్‌షైర్‌పై ఘన విజయం సాధించింది.మిగిలిన ఎసెక్స్ బ్యాటర్లలో కైల్ పెప్పర్ 23, పాల్ వాల్టర్, క్రిచ్లీ, బెన్కెన్స్టెయిన్ తలో 13, చార్లీ అల్లీసన్ 5, నోవా థైన్ 4, సైమన్ హార్మర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. -
ఆ ఫేక్ షాట్‌తో బిత్తరపోయిన కీపర్, ఫీల్డర్
బ్యాట్స్‌మన్ ఏ షాట్ ఆడుతాడో.. కొంత ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు కీపర్, ఫీల్డర్ తమ దిశను మార్చుకుంటున్నారు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తమను దాటి తప్పించుకోకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఓ అనూహ్య ఫేక్ షాట్‌తో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఇంగ్లండ్ వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్‌ను బోల్తా కొట్టించాడు. 2015లో యూఏఈలో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఓ టెస్టు మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మిస్బా అనూహ్యరీతిలో వికెట్ కీపర్‌ను, స్లిప్ ఫీల్డర్‌ను బురిడీ కొట్టించాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో బంతి గింగిరాలు తిరుగుతూ మిస్బాపైకి వచ్చింది. దీంతో స్వీప్ షాట్ కొట్టేందుకు సిద్ధమైనట్టు మిస్బా పోజు ఇచ్చాడు. బ్యాట్స్‌మన్ మూవ్‌మెంట్‌ను బట్టి అతను స్వీప్ షాట్ కొడతాడని భావించిన స్లిప్ ఫీల్డర్ జేమ్స్ అండర్సన్ లేగ్సైడ్కు మారాడు. కీపర్ జాస్ బట్లర్ కూడా ముందుజాగ్రత్తగా కొద్దిగా లెగ్‌సైడ్‌కు జరిగాడు. ఇంతలో మిస్బా బంతి గమనాన్ని పసిగట్టి.. మెరుపువేగంతో దానిని లేట్ కట్ చేశాడు. దాంతో స్లిప్‌లో క్యాచ్ అవ్వాల్సిన బంతి.. అక్కడ ఎవరూ లేకపోవడంతో బౌండరీ దిశగా దూసుకుపోయింది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఫీల్డర్ ఆపాడు. లేకుంటే ఫోర్ అయ్యేదే. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
క్రికెట్‌కు ప్రయర్ గుడ్‌బై
లండన్ : ఇంగ్లండ్ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 11 నెలల కిందట భారత్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఆడిన ప్రయర్... ఆ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ 7 సెంచరీలతో 4 వేల 99 పరుగులు చేశాడు. 256 అవుట్లలో భాగం పంచుకున్నాడు. 68 వన్డేల్లో 1282 పరుగులు సాధించాడు.