breaking news
Electricity Services
-
‘విద్యుత్ సర్వీస్’ ఇక ఈజీ
హన్మకొండ: విద్యుద్దీకరణ చేపట్టనున్న ప్రాంతాల్లో ఎల్టీ సర్వీసుల మంజూరు సులభతరం చేశారు. పైగా ఖర్చుల భారం కూడా తగ్గించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి జనవరి 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలు కావాల్సి ఉండగా, అవగాహన లేకపోవడం, సమాచార లోపం తదితర కారణాలతో ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి కచ్చితంగా అమలు చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. సర్వీస్ మంజూరుకు అవసరమైన విద్యుత్ లైన్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ఇప్పటి వరకు వినియోగదారుడు భరించాల్సి వచ్చేది. ఇప్పటి నుంచి కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి విద్యుత్ లైన్ నిర్మాణ ఖర్చులు చెల్లించాల్సి ఉండదు. దీంతో విద్యుత్ వినియోగదారుడికి రూ.లక్షకు పైగా సొమ్ము ఆదా కానుంది.రైతులకు ఊరట కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరులో రైతులకు ఊరట లభించింది. ఇప్పటి వరకు 3 స్తంభాల దూరం వరకు నిర్ణీత చార్జీలతో విద్యుత్ సర్వీస్ మంజూరు చేసేవారు. మూడు స్తంభాల దూరం దాటితే ఓఆర్సీ కింద రైతులు రూ.45 వేలకు పైగా చెల్లించేవారు. ప్రస్తుతం నూతన నిబంధనలతో కిలోమీటర్ దూరం వరకు విద్యుత్ లైన్ నిర్మాణానికి ఎలాంటి ఖర్చులూ ఉండవు. పరిశ్రమలకు కూడా కిలోమీటర్ వరకు ఎలాంటి నిర్మాణ ఖర్చులు ఉండవు. గతంలో అధికారులు, సిబ్బంది ఎస్టిమేషన్ సాకుతో వినియోగదారులను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలున్నాయి. కిలోమీటరు దూరం దాటితే ఎస్టిమేట్ మేరకు ఖర్చులు వినియోగదారుడు భరించాలి.ఏకరీతి విధానం తీసుకొచ్చిన టీజీ ఈఆర్సీ విద్యుత్ లైన్ నిర్మాణం అవసరం లేకున్నా... కిలోమీటర్ దూరం విద్యుత్ లైన్ వేయాల్సి ఉన్నా ఒకే నిబంధన, చార్జీలు వర్తించేలా ఏకరీతి విధానాన్ని టీజీ ఈఆర్సీ తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. లోడ్ ఆధారిత చార్జీలు చెల్లిస్తే విద్యుత్ సర్వీస్ మంజూరు చేస్తారు. అవసరమైతే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను కూడా ఏర్పాటు చేస్తారు.ట్రాన్స్ఫార్మర్ ఖర్చులు కూడా డిస్కం భరిస్తుంది. వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చితే ఈ ఖర్చులను వినియోగదారుల నుంచి డిస్కం వసూళ్లు చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇతరులకు విద్యుత్ సరఫరా చేయడానికి వీలులేదు. టీజీ ఈఆర్సీ రెగ్యులేషన్స్ ప్రకారం చార్జీల వివరాలు ఇలా..» ఎల్టీ–1, గృహాలకు విద్యుత్ సర్వీస్ మంజూరు» కిలోవాట్‌కు రూ.500 సర్వీస్ కనెక్షన్ చార్జీలతోపాటు అదనంగా డెవలప్మెంట్ చార్జి, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.» కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.500తోపాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.600 చొప్పున, వీటికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.» 5 కిలోవాట్ పైనుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.2,900తోపాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.1,500 చొప్పున వీటికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.» 20 కిలోవాట్లకు పైన.. ప్రతీ కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.ఎల్టీ–2: గృహేతర, వాణిజ్యం » కిలోవాట్ వరకు.. కనీస చార్జీ రూ.వెయ్యికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.» కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.వెయ్యితోపాట ప్రతీ కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున చెల్లించాలి. అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ ఉంటుంది.» 5 కిలోవాట్ పైనుంచి నుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జీ రూ.5,800తో పాటు ప్రతీ కిలోవాట్‌కు రూ.2 వేల చొప్పున చెల్లించాలి. అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ ఉంటుంది.ఎల్టీ–3: పరిశ్రమలు» 20 కిలోవాట్లపై ప్రతీ కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.» 20 కిలోవాట్ల వరకు ప్రతీ కిలోవాట్‌కు రూ.4 వేల చొప్పున అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ చెల్లించాలి.» 20 కిలోవాట్లపై ప్రతీ కిలోవాట్‌కు రూ.10 వేల చొప్పున అదనంగా సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీ చెల్లించాలి.ఎల్టీ–4: కుటీర పరిశ్రమలు » నిర్ణీత లోడ్ వరకు కిలోవాట్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి.ఎల్టీ–5: వ్యవసాయం » కిలోవాట్‌కు రూ.వెయ్యి చెల్లించాలి. దీనికి అదనంగా డెవలప్మెంట్ చార్జీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. -
‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు
హన్మకొండ: అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. ప్రతీ ఇంటిని విద్యుదీకరించాలని కేంద్ర ప్రభుత్వం తాజగా నిర్ణయించింది. మెజారిటీ గిరిజన జనాభా ఉండి ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతీ ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ లైన్లు వేయడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంతోపాటు ఇతర కారణాలతో విద్యుత్ లైన్లు వేయలేని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మెజారిటీ గిరిజన జనాభా కలిగిన 1,049 గ్రామాలు, తెలంగాణ సదరన్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీఎస్ఎల్) పరిధిలో 229 గ్రామాల్లోని గిరిజన ఇళ్లలో వెలుగులు నింపనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసింది. మెజారిటీ గిరిజన జనాభా ఉన్న 695 గ్రామాల్లోని 25,393 గృహాలకు, 732 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం రూ.144.42 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్ రూపొందించగా.. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.దేశంలో 5 కోట్ల మందికి లబ్ధిగిరిజనులకు మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, గ్రామాల్లో కనీస వసతులు, సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధా న మంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం జుగా) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 25 రకాల సహాయాలు అందుతాయి. 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.రూ.144.42 కోట్ల వ్యయంతో..ఇప్పటికే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా జనసమూహాలకు దూరంగా ఉండి మౌలి క సదుపాయాలకు నోచుకోని కోలం, తొట్టి గిరిజనులు నివా సముండే ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని 257 అవా సాల్లో 3,345 గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి ద్వారా రూ.125కే విద్యుత్ పంపిణీ సంస్థ సొంతగా ఖర్చులు భరించి పేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయినా ఇప్పటి కీ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న మెజారిటీ గిరిజను లున్న గ్రామాలు, గృహాల కోసం కేంద్రం ‘పీఎం జుగా’ను తెచ్చింది.ఎన్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాల్లో జగిత్యా ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సౌకర్యం లేని గృహాలేమీ లేవు. మిగతా 13 జిల్లాల్లో 1,049 మెజారిటీ గిరిజన జనాభా కలిగిన గ్రామాలు ఉన్నట్లు గుర్తించా రు. ఇందులో 25,393 గృహాలు, 732 ప్రభు త్వ కార్యాలయాలు (మొత్తం 26,125) ఉన్నా యి. కాగా ఆన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించే వీలున్న గ్రామాలు 24,753 ఉన్నా యి. వివిధ కారణాలవల్ల విద్యుత్ సౌకర్యం క ల్పించడం వీలుకాని 640 గ్రామాల్లో సోలార్ ద్వారా గృహాలను విద్యుదీకరించనున్నారు. ఈ గ్రామాలు, గృహాల కు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.144.42 కోట్ల వ్య యంతో 352 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 592 కి.మీ. సింగిల్ లైన్, 1,668 కి.మీ. ఎల్టీ లైన్ నిర్మించనున్నారు. 1,565 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. ఈ స్కీమ్ అమలుకు కావాల్సిన ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది.


