breaking news
drinker halchal
-
టీటీడీ విజిలెన్స్ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో
తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్ పాయింట్‌కు సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం తాగిన వ్యక్తులు ఖాళీ సీసాను అలిపిరి మెట్ల మార్గంలో వేయడం శ్రీవారి భక్తులు ఆగ్రహానికి కారణమైంది.అయితే, అలిపిరి తనిఖీ కేంద్రానికి కూతవేటు దూరంలో అలిపిరి నడక మార్గం ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా టీటీడీ నిఘా ఉంచింది. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ ద్వారం వద్ద లగేజీ కౌంటర్‌కు అభిముఖంగా ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో అండర్ పాస్ ద్వారా అలిపిరి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ అండర్ పాస్ ద్వారాకాలినడక ప్రారంభిస్తారు. ఏటీఎంకు ఆనుకుని కొంత ఖాళీస్థలం ఉండటంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు.టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ నిద్ర మత్తులో తూలుతోందనే విషయం ఇటీవల వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన ‘మాకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్య ధోరణి విజిలెన్స్ నిఘా విభాగం సిబ్బందిలో పెరిగిపోయింది. సిబ్బంది పనితీరును నిరంతరాయంగా పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వరుస నిఘా వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.🚨 #BRNaiduUnfitForTTDఅలిపిరి మెట్ల మార్గంలో కాకుండా.. మద్యం సీసాలపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్లాలా @ncbn, @PawanKalyan, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ?శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం. మందు తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు… pic.twitter.com/HftbdINhv1— YSR Congress Party (@YSRCParty) June 8, 2025 -
నాకు 90ML బాటిల్ ఇవ్వకపోతే ట్యాంక్ బండ్ లో దూకి చస్తా
-
మద్యం తాగి.. రోడ్డు మధ్యలో కారు నిలిపి నిద్రపోయాడు!
యశవంతపుర(బెంగళూరు): తాగిన మత్తులో కారును డ్రైవర్ రోడ్డు మధ్యలో నిలిపి నిద్రలోకి జారిపోయాడు. మడికేరి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. మడికేరి పట్టణంలోని బస్టాండ్‌కు సమీపంలో మద్యం దుకాణం ఉంది. అక్కడ మద్యం తాగిన డ్రైవర్ కొద్దిదూరం కారును నడుపుకుంటూ వెళ్లాడు. మత్తు ఎక్కువగా ఉండటంతో రోడ్డు మధ్యలోనే కారును నిలిపి నిద్రపోయాడు. రోడ్డు మధ్యలో కారు నిలపటాన్ని చూసిన స్థానికులు భయపడ్డారు. రెండు వైపుల వాహనాలు నిలిచి పోయాయి. మడికేరి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. చదవండి: వీడియో: నాగుపాము నుదుట ముద్దు పెట్టబోయాడు.. రివర్స్‌లో ‘లిప్‌లాక్’ పడింది! -
తప్పతాగి విమానంలో రచ్చ చేసిన యువకుడు.. గెంటేసిన పోలీసులు
ఇంగ్లండ్: విమానంలో తాగి రచ్చ రచ్చ చేశాడు ఓ వ్యక్తి. 11 ఏళ్ల తర్వాత స్నేహితుడితో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నానే ఎగ్జైట్మెంట్లో అతిగా ప్రవర్తించాడు. అంతేకాదు విమానంలోని సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదరు వ్యక్తి కూర్చున్న సీటు దగ్గరకు పోలీసులు వెళ్లారు. అతడు తాగి ఉన్నాడని, వోడ్కా బాటిల్లో మూడో వంతు కాళీ చేశాడని సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో అతడ్ని విమానం నుంచి దిగిపోమని పోలీసులు సూచించారు. అతడు మాత్రం పోలీసులతోనూ వాగ్వాదానికి దిగాడు. నా లగేజ్‌ను మీరు మోసుకొస్తారా? అని పోలీసులను ప్రశ్నించాడు. అంతేకాదు తనతో పోట్లాటకు రావాలని వాగాడు. చివరకు పోలీసులు అతడ్ని విమానం నుంచి దింపి వ్యానులో తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ విమానంలోకి వెళ్లి సదరు వ్యక్తి స్నేహితుడ్ని కూడా విమానం నుంచి దిగాలని ఆదేశించారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులంతా చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు. తాగి రచ్చ చేసిన వ్యక్తి పేరు ఆశ్లే క్రచ్లీ(27). ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నివాసముంటాడు. హాలిడే ట్రిప్‌కు పోర్చుగల్‌కు వెళ్లే సమయంలో ఇలా చేశాడు. 11 ఏళ్ల తర్వాత తనకు హాలిడే వచ్చిందనే ఉత్సాహంలోనే అతడు ఎగ్జైట్ అయి ఇలా చేశాడని అతని తరఫు న్యాయవాది తెలిపారు. క్రచ్లీ తన ప్రవర్తనకు క్షమాపణలు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. విమానంలో ఇబ్బందికర ప్రవర్తనకు క్రచ్లీ రూ.30వేలు జరిమాన కట్టాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులకు రూ.8వేలు, బాధిత సిబ్బందికి రూ.12వేలు చెల్లించాలని చెప్పింది. చదవండి: మద్యపానంతో హాని... యువతకే ఎక్కువ! -
తాగుబోతు వీరంగం
ధర్మవరం : ధర్మవరం గూడ్స్‌షెడ్ కొట్టాల(సరస్వతీనగర్)లో ఓ యువకుడు మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం వీరంగం సృష్టించాడు. ఇప్పటికే అక్కడ టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతో రెండు వర్గాల వారిపైనా హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కాలనీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఆందోళన నెలకొంది. పోలీస్ పికెట్ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు యువకుడు వీరంగం సృష్టించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని సదరు తాగుబోతుకు తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. ఆ తరువాత అదుపులోకి తీసుకున్నారు.