తాగుబోతు వీరంగం | drinker halchal in dharmavaram | Sakshi
Sakshi News home page

తాగుబోతు వీరంగం

May 7 2017 12:39 AM | Updated on Sep 5 2017 10:34 AM

ధర్మవరం గూడ్స్‌షెడ్‌ కొట్టాల(సరస్వతీనగర్‌)లో ఓ యువకుడు మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం వీరంగం సృష్టించాడు.

ధర్మవరం : ధర్మవరం గూడ్స్‌షెడ్‌ కొట్టాల(సరస్వతీనగర్‌)లో ఓ యువకుడు మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం వీరంగం సృష్టించాడు. ఇప్పటికే అక్కడ టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతో రెండు వర్గాల వారిపైనా హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కాలనీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఆందోళన నెలకొంది. పోలీస్‌ పికెట్‌ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు యువకుడు వీరంగం సృష్టించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని సదరు తాగుబోతుకు తమదైన శైలిలో కోటింగ్‌ ఇచ్చారు. ఆ తరువాత అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement