మద్యం తాగి.. రోడ్డు మధ్యలో కారు నిలిపి నిద్రపోయాడు! | Drunken Man Hulchul On Road At Midnight Karnataka | Sakshi
Sakshi News home page

మద్యం తాగి.. రోడ్డు మధ్యలో కారు నిలిపి నిద్రపోయాడు!

Published Sun, Oct 2 2022 10:19 AM | Last Updated on Sun, Oct 2 2022 10:48 AM

Drunken Man Hulchul On Road At Midnight Karnataka - Sakshi

యశవంతపుర(బెంగళూరు): తాగిన మత్తులో కారును డ్రైవర్‌ రోడ్డు మధ్యలో నిలిపి నిద్రలోకి జారిపోయాడు. మడికేరి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. మడికేరి పట్టణంలోని బస్టాండ్‌కు సమీపంలో మద్యం దుకాణం ఉంది. అక్కడ మద్యం తాగిన డ్రైవర్‌ కొద్దిదూరం కారును నడుపుకుంటూ వెళ్లాడు.

మత్తు ఎక్కువగా ఉండటంతో రోడ్డు మధ్యలోనే కారును నిలిపి నిద్రపోయాడు. రోడ్డు మధ్యలో కారు నిలపటాన్ని చూసిన స్థానికులు భయపడ్డారు. రెండు వైపుల వాహనాలు నిలిచి పోయాయి. మడికేరి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసును నమోదు చేశారు.

చదవండి: వీడియో: నాగుపాము నుదుట ముద్దు పెట్టబోయాడు.. రివర్స్‌లో ‘లిప్‌లాక్‌’ పడింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement