breaking news
Domestic market Sensex
-
మార్కెట్‌కు సోలార్ సెగ
ముంబై: భారతీయ సౌర విద్యుత్ పరికరాల దిగుమతులపై 126 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటనతో దేశీయ మార్కెట్లో ఒక్కసారిగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఇంట్రాడే గరిష్టాల నుంచి వెనుదిరిగిన స్టాక్ సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 732 పాయింట్లు బలపడి సెన్సెక్స్ చివరికి 50 పాయింట్ల పరిమిత లాభంతో 82,276 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 25,483 వద్ద ముగిసింది. ఒక దశలో 228 పాయింట్లు ఎగసి 25,653 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఏఐ సంబంధిత ఆందోళనలు కొద్దిగా తగ్గడంతో అమెరికా టెక్ షేర్లు పుంజుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్య విధాన వైఖరి సంకేతాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. → మెటల్, ఆటో, కమోడిటీస్, ఫార్మా, కన్జూమర్ డిస్క్రేషనరీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, ఇంధన, ఎఫ్ఎంసీజీ, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్సు 0.59%, స్మాల్ క్యాప్ సూచీ 0.37 శాతం పెరిగాయి. షేర్లు షివర్!భారత్ నుంచి దిగుమతి చేసుకునే సౌర ఉత్పత్తులపై అమెరికా 126% సుంకం విధింపు తర్వాత దేశీయ సోలార్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.‘భారత సోలార్ తయారీ సంస్థలు యూఎస్ ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు పొందుతూ.., అమెరికాలోని స్థానిక తయారీదారులకు తీవ్రతర పోటీగా మారి వారి లాభాలకు గండి కొడుతున్నాయని విచారణలో తేలింది. ఈ కారణంతోనే భారీ పన్నులు విధించాల్సి వచి్చంది’ అని అమెరికా వాణిజ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అత్యధికంగా వారీ ఎనర్జీస్ 10.47% పతనమై రూ. 2709 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 14.99% క్షీణించింది. ప్రీమియర్ ఎనర్జీస్ 6.27% నష్టపోయి రూ.729 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14.33% పతనమైంది. విక్రమ్ సోలార్ 5.45% పడిపోయి రూ.175 వద్ద నిలిచింది. -
జీడీపీ డేటా, గ్లోబల్ ట్రెండ్‌పై దృష్టి
ప్రభావిత అంశాలు * చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు * రుతుపవనాల గమనం * ఆటో కంపెనీల అమ్మకాల గణాంకాలు * రూపాయి కదలికలు ముంబై: త్వరలో విడుదలయ్యే జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ ట్రెండ్‌పై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు కూడా దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని వారన్నారు. 2016 జనవరి-మార్చి త్రైమాసికానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఈ మంగళవారం వెలువడతాయి. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తీరుతెన్నులు, ద్రవ్యలోటు పరిస్థితి, ఎనిమిది మూలధాన పరిశ్రమల డేటా కూడా ఈ వారం ప్రకటితమవుతాయని, ఇవన్నీ కూడా మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు గురిచేస్తుందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. జూన్ 1న వెలువడే ఆటోమొబైల్ కంపెనీల మే నెల అమ్మకాల డేటా ఆయా షేర్లను హెచ్చు తగ్గులకు లోనుచేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. టాటా మోటార్స్, ఎన్టీపీసీ, మహింద్రా అరబిందో వంటి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు ఈ వారమే వెలువడనున్నాయి. చివరిబ్యాచ్ కార్పొరేట్ ఫలితాలు, రూపాయి కదలికలు, ముడిచమురు ధర తదితరాల్ని ఇన్వెస్టర్లు రానున్నరోజుల్లో నిశితంగా గమనిస్తారని అంచనా. ఫెడ్ నిర్ణయం కీలకం... వడ్డీ రేట్లను క్రమేపీ పెంచుతామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఛైర్పర్సన్ జెనెట్ యెలెన్ గత శుక్రవారం ఇచ్చిన సంకేతాలకు ఈ సోమవారం ఇన్వెస్టర్ల స్పందనతో మార్కెట్ మొదలవుతుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. గతవారం మార్కెట్... గతవారం సెన్సెక్స్ 1,351 పాయింట్ల పెరుగుదలతో 26,653 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 407 పాయింట్లు ఎగిసి 8,157 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్చి 4 తర్వాత ఒకే వారంలో సూచీలు ఇంత అధికంగా పెరగడం ఇదే తొలిసారి. మే నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో రూ. 1,495 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. అయితే ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి రూ. 6,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూపాయి బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలతో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు విక్రయాలు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.


