breaking news
Diversified
-
లార్జ్‌క్యాప్ విభాగంలోకి కొత్తగా 11 కంపెనీలు
న్యూఢిల్లీ: లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో కంపెనీలకు స్థానచలనం చోటుచేసుకోనుంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పరంగా సవరించిన జాబితాను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈ సందర్భంగా ఇండియన్ హోటల్స్, సోలార్ ఇండస్ట్రీస్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, అపోలో హాస్పిటల్స్ తదితర కంపెనీలు మిడ్‌క్యాప్ నుంచి లార్జ్‌క్యాప్ విభాగం కిందకు రానున్నాయి. సీమెన్స్ ఎనర్జీ నేరుగా లార్జ్‌క్యాప్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో లార్జ్‌క్యాప్ విభా గం నుంచి మిడ్‌క్యాప్ కిందకు రైల్ వికాస్ నిగమ్ (ఆర్వీఎన్ఎల్), హీరో మోటోకార్ప్, స్విగ్గీ, పాలీ క్యాబ్ ఇలా 11 కంపెనీలు చేరనున్నాయి. దీనిపై నువమా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసింది. 9 స్మాల్ క్యాప్ కంపెనీలు మిడ్‌క్యాప్ విభాగం కిందకు అప్‌గ్రేడ్ కానున్నాయి. అలాగే, మిడ్‌క్యాప్ కిందకు కొ త్తగా హెక్సావేర్ టెక్నాలజీస్, ఐటీసీ హోటల్స్ చేరనున్నాయి. ఇవి ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ కావడం గమనార్హం. ఏటా జనవరి, జూలైలో యాంఫి (ప్రతి 6 నెలలకు ఒకసారి) కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా జాబితాను ప్రకటిస్తుంటుంది. ఫిబ్రవరి1, ఆగస్ట్ 1 నుంచి మార్పులు అమల్లోకి వస్తాయి. యాంఫి వర్గీకరణకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడుల కోసం స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్, మిడ్‌క్యాప్ ఫండ్స్, స్మాల్‌క్యాప్, మలీ్టక్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఈ వర్గీకర జాబితాకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులూ చేస్తుంటాయి. కనుక ఫండ్స్ పెట్టుబడులకు ఈ జాబితా కీలకంగా పనిచేస్తుంటుంది. ఫండ్స్ పెట్టుబడులకు అనుగుణంగా ఆయా స్టాక్స్ ధరల్లోనూ మార్పులు చూడొచ్చు.మిడ్‌క్యాప్ నుంచి లార్జ్‌క్యాప్ విభాగంలోకి ఇండియన్ హోటల్స్ సోలార్ ఇండస్ట్రీస్ మజ్గాన్ షిప్ బిల్డర్స్ మ్యాక్స్ హెల్త్‌కేర్ శ్రీ సిమెంట్స్ మ్యాన్‌కైండ్ ఫార్మా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లుపిన్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ సీమెన్స్ ఎనర్జీ (కొత్త చేరిక)లార్జ్ క్యాప్ నుంచి మిడ్‌క్యాప్ విభాగంలోకి ఆర్వీఎన్ఎల్ హీరో మోటోకార్ప్ ఇండియన్ ఓవర్సీ బ్యాంక్ కమిన్స్ ఇండియా స్విగ్గీ పాలీక్యాబ్ ఇండియా బోష్ లిమిటెడ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లైఫ్ డాబర్ ఇండియా జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింపుమార్కెట్ విలువ పరంగా టాప్–100 కంపెనీలు లార్జ్‌క్యాప్ కిందకు వస్తాయి. మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250 వరకు మొత్తం 150 కంపెనీలు మిడ్‌క్యాప్ కిందకు పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలినవి స్మాల్‌క్యాప్ కిందకు వస్తాయి. గత ఆరు నెలల కాలంలో స్టాక్ వారీ సగటు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘గత ఆరు నెలల్లో మార్కెట్ ఎంతో అస్థితరలను చూసింది. దీంతో 2024 డిసెంబర్ నుంచి చూస్తే మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింది. లార్జ్‌క్యాప్ విభాగం కటాఫ్ విలువ 2024 డిసెంబర్ చివరికి ఉన్న రూ.లక్ష కోట్లు నుంచి రూ.91,600 కోట్లకు దిగొచి్చంది. మిడ్‌క్యాప్ విభాగం కటాఫ్ (గరిష్ట విలువ) సైతం రూ.33,200 కోట్ల నుంచి రూ.30,800 కోట్లకు తగ్గింది’’అని నువమా నివేదిక తెలిపింది. గత నాలుగేళ్లలో లార్జ్‌క్యాప్ విభాగం కటాఫ్ విలువ గణనీయంగా తగ్గడం ఇదే మొదటిసారి. స్టాక్స్ విలువలు దిద్దుబాటునకు గురి కావడమే ఇందుకు దారితీసింది. -
రిలయన్స్, డిస్నీ డీల్‌కు ఎన్సీఎల్టీ ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. వెరసి ఆర్ఐఎల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాలు(వయాకామ్18, డిజిటల్18), వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా మధ్య విలీన పథకానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇప్పటికే ఈ డీల్‌కు కొన్ని స్వచ్చంద సవరణల తదుపరి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా రూ. 70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా దిగ్గజం ఆవిర్భావినికి మరింత దారి ఏర్పడింది. తమ పరిశీలన ప్రకారం విలీన పథకం సక్రమంగానే ఉన్నట్లు ఎన్సీఎల్టీ పేర్కొంది. అను జగ్మోహన్ సింగ్ (మెంబర్, టెక్నికల్), కిషోర్ వేములపల్లి (మెంబర్, జ్యుడీíÙయల్)లతో కూడిన బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేకపోవడంతోపాటు ప్రజావిధానాలకు వ్యతికేరంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్య కంపెనీ(విలీన సంస్థ) రెండు ఓటీటీలతోపాటు 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. ఆర్ఐఎల్కు 63.16 శాతం వాటా లభించనుండగా.. వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాను పొందనుంది. మీడియా దిగ్గజాలు సోనీ, నెట్‌ఫ్లిక్స్‌తో మరింత తీవ్రస్థాయిలో పోటీకి దిగేందుకు వీలుగా ఆర్ఐఎల్ దాదాపు రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
రుణ చెల్లింపులకు రెడీ: వేదాంతా
న్యూఢిల్లీ: రానున్న త్రైమాసికాలలో రుణ చెల్లింపులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా రీసోర్సెస్ తాజాగా స్పష్టం చేసింది. మైనింగ్, మెటల్, చమురు, గ్యాస్ రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పాదుకొల్పే బాటలో 175 కోట్ల డాలర్ల రుణాలను పొందనున్నట్లు తెలియజేసింది. బ్యాంకుల నుంచి సిండికేట్, బైలేటరల్ రుణాలను అందుకునే సన్నాహాలు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించింది. 2023 మార్చివరకూ అన్ని రుణాలనూ ముందస్తుగా చెల్లించినట్లు తెలియజేసింది. ఈ బాటలో 11 నెలల్లో 200 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు పేర్కొంది. రాను న్న ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అవసరమైన లిక్విడిటీని సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. హిందుస్తాన్ జింక్(హెచ్‌జెడ్‌ఎల్)లో 6.8% వాటా మినహా ఎలాంటి తనఖాలూ లేవని వెల్లడించింది. అంతర్జాతీయ జింక్ ఆస్తుల విక్రయం లేదా 200 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకోకుంటే వేదాంతా క్రెడిట్ రేటింగ్స్ ఒత్తిడిలో పడే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఫిబ్రవరి నెల మొదట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదాంతా తాజా వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
తుది దశకు సింటెక్స్ రిజల్యూషన్
న్యూఢిల్లీ: దివాలా చట్ట చర్యలలో ఉన్న సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణ పరిష్కార ప్రణాళిక(రిజల్యూషన్) తుది దశకు చేరింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)సహా నాలుగు కంపెనీలు సవరించిన బిడ్స్‌ను దాఖలు చేశాయి. వీటిని రుణదాతల కమిటీ(సీవోసీ) పరిశీలించనుంది. రుణ సమస్యల్లో చిక్కుకున్న టెక్స్టైల్స్ కంపెనీ సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుగోలుకి అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్‌తో జత కట్టిన ఆర్ఐఎల్ రూ. 2,800 కోట్ల విలువలో బిడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ఈజీగో టెక్స్టైల్స్(వెల్స్పన్ గ్రూప్), జీహెచ్‌సీఎల్, హిమంత్సింగ్కా వెంచర్స్ సైతం బిడ్స్‌ను దాఖలు చేసినట్లు గత వారమే సింటెక్స్ వెల్లడించింది. సవరించిన బిడ్స్‌ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ సమీక్షించనున్నట్లు కంపెనీ పేర్కొంది. -
పిరమల్ పునర్వ్యవస్థీకరణకు సై
న్యూఢిల్లీ: వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు డైవర్సిఫైడ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ వీటిని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించనున్నట్లు వివరించింది. ఫార్మాస్యూటికల్ బిజినెస్‌ను పూర్తిగా విడదీయడం ద్వారా కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలియజేసింది. పిరమల్ ఫార్మా పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా పిరమల్ ఫార్మా నిలవనున్నట్లు తెలియజేసింది. ఏర్పాటు ఇలా..: బిజినెస్ విడతీతలో భాగంగా వాటాదారులకు ప్రతి 1 పిరమల్ ఎంటర్ప్రైజెస్(పీఈఎల్) షేరుకిగాను 4 పిరమల్ ఫార్మా లిమిటెడ్(పీపీఎల్) షేర్లను కేటాయించనుంది. పీఈఎల్ షేరు ముఖవిలువ రూ. 2 కాగా.. పీపీఎల్ షేరు రూ. 10 ముఖ విలువతో జారీ కానుంది. మరోవైపు పిరమల్ ఫార్మా నిర్వహణలోగల రెండు పూర్తి అనుబంధ సంస్థలను పీపీఎల్లో విలీనం చేయనుంది. తద్వారా ఫార్మా బిజినెస్ నిర్మాణాన్ని సులభతరం చేయనుంది. గత కొన్నేళ్లుగా ఒకే లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా డైవర్సిఫైడ్ బిజినెస్‌లను గ్రూప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. తాజాగా కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ బిజినెస్‌లను రెండుగా విడదీసేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలియజేశారు. వెరసి ఫైనాన్షియల్ సరీ్వసులు, ఫార్మా విభాగాల్లో నాయకత్వ స్థాయిలో ఉన్న స్వతంత్ర కంపెనీలుగా ఆవిర్భవించనున్నట్లు వివరించారు. కంపెనీల తీరిలా..: కాంట్రాక్ట్ తయారీ, అభివృద్ధి(సీడీఎంవో), కాంప్లెక్స్ జనరిక్స్‌లో గ్లోబల్ పంపిణీ, కన్జూమర్ ప్రొడక్టులు తదితరాలతో పిరమల్ ఫార్మా అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు అజయ్ పేర్కొన్నారు. సీడీఎంవో బిజినెస్‌లో మూడు అతి పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇక ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ అతిపెద్ద లిస్టెడ్ డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఏర్పాటు కానున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్ఎల్ ఫిన్వెస్ట్ ప్రయివేట్ లిమిటెడ్‌ను పీఈఎల్లో విలీనం చేయనున్నారు. మరోపక్క డీహెచ్ఎఫ్ఎల్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పీఈఎల్కు పూర్తి అనుబంధ కంపెనీగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొనసాగనున్నట్లు అజయ్ వెల్లడించారు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2,899 వద్ద ముగిసింది. -
మ్యూచువల్ ఫండ్స్ ‘సహీ హై..?
‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’... ఎక్కడో విన్నట్టు ఉంది కదూ..? టీవీ సీరియళ్ల మధ్యలో ప్రకటనలు.. పత్రికల్లో, వార్తా చానళ్లలో వచ్చే ప్రకటనల్లో.. సెలబ్రిటీలు దర్శనమిచ్చి చేస్తున్న కొటేషన్ ఇది. ‘మ్యూచువల్ ఫండ్స్ సరైనవే..’అని దీని అర్థం. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ చేస్తున్న విస్తృత ప్రచార కార్యక్రమంలోభాగమే ఇది. కానీ, ఆచరణలో అది ప్రతిఫలిస్తోందా..? అని ప్రశ్నిస్తే.. జవాబు వెతుక్కునే ముందు చూడాల్సిన గణాంకాలు కొన్ని ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలానికి అని ప్రముఖంగా చెబుతుంటారు కనుక.. దీర్ఘకాలానికి నిఫ్టీ, నిఫ్టీ టీఆర్ఐ సూచీలతో పోలిస్తే డైవర్సిఫైడ్ ఫండ్స్ పనితీరును విశ్లేషించి చూడాలి. ఏటా జనవరి మొదటి ట్రేడింగ్ రోజున కొనుగోలు చేసి 2020 డిసెంబర్ వరకు కొనసాగించి ఉంటే, నిఫ్టీ రాబడుల తీరు ఎలా ఉందీ.. ఈ కాలంలో ఎన్ని పథకాలు ప్రారంభమయ్యాయి.. అదే సమయంలో ఎన్ని నిఫ్టీతో పోలిస్తే మంచి పనితీరు చూపించాయన్నది ఈ గణాంకాల్లో చూడొచ్చు.. ఈటీఎఫ్‌లను ఎందుకు నమ్ముకోకూడదు? నిఫ్టీ ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతూ సూచీలను అనుకరించే ఈటీఎఫ్‌లో ఎక్స్ఛ్పెన్స్ రేషియో (ఫండ్స్ నిర్వహణ చార్జీలు) చాలా తక్కువకే, ఈక్విటీ పథకాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటున్నప్పుడు.. సాధారణ ఈక్విటీ పథకాలనే ఎందుకు ఆశ్రయించడం? ఎందుకంటే మన దేశంలో ఫండ్స్ పథకాలు ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయించబడుతున్నవే. వారికి ట్రయల్ కమీషన్ ముడుతుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ సహీ హై కాదా? నిఫ్టీ, నిఫ్టీ టీఆర్ఐను మించి ఎక్కువ సందర్భాల్లో అధిక రాబడులను ఇచ్చే మెరుగైన విధానాలున్నాయి. ఫండ్స్ పథకాల పనితీరును ఎటువంటి పక్షపాతం లేకుండా పరిశీలించి, తగిన సామర్థ్యం కలిగిన పథకాలను ఎంచుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించొచ్చు. అయితే నిపుణుల సహకారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే కొంత ఫీజు రూపంలో ఇందుకు సంబంధించి చెల్లించేందుకు సిద్ధపడాలి. ప్రసాద్ వేమూరు – సీఎండీ, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ -
ఈక్విటీలు యువజనులకేనా...?
మా నాన్నగారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా మార్గాల కోసం ఆయన చూస్తున్నారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పీఎస్‌యూ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వగలరు. - అనిరుధ్, హైదరాబాద్ పన్ను ఆదా చేయడం కోసం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదనే అపోహ చాలా ప్రబలంగా ఉంది. ఈక్విటీల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి కాబట్టి, ఇవి యువజనులకు మాత్రమే అనువైనవని, వృద్ధులకు తగినవి కావని చాలా మంది భావిస్తారు. కానీ ఇది సరైనది కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు స్వల్పకాలానికే రిస్క్ అని చెప్పవచ్చు. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి, లేదా అంతకు మించిన కాలానికి ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. రిస్క్ తక్కువగా, రాబడులు ఎక్కువగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి స్వల్పమే. ఈఎల్ఎస్ఎస్ల్లో వచ్చే రాబడులపై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే వచ్చే రాబడిపై పన్ను ఉంటుంది. అంతే కాకుండా మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)కూడా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ల్లో లిక్విడిటీ కూడా ఎక్కువ. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లు. కాగా, పన్ను ఆదా ఎఫ్‌డీల్లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లలో లిక్విడిటీ ఏమాత్రం ఉండదు. వీటిని ముందుగా తీసుకోవడానికి లేదు. అంతేకాకుండా వీటిపై రుణం కూడా తీసుకునే వీలు లేదు. ఇతర ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లాగానే ఈఎల్ఎస్ఎస్లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఏడేళ్ల క్రితం నేను మూడు పన్ను ఆదా ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. వాటిని ఎలా విక్రయించాలి? - కృష్ణవేణి, నిజామాబాద్ సాధారణంగా పన్ను ఆదా ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీరు ఈ పన్ను ఆదా ఫండ్స్‌లో ఏడేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఎప్పుడైనా మీరు వీటిని ఉపసంహరించుకోవచ్చు. వీటిని ఉపసంహరించుకోవడం చాలా సులువు. మీకు వచ్చే అకౌంట్ స్టేట్మెంట్ దిగువ భాగంలో ఉండే రిడంప్షన్ ఫారమ్‌ను పూర్తి చేసి, సంతకం పెట్టి సదరు ఫండ్ సంస్థకు గానీ, సంస్థ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి గానీ పంపించాలి. ఇలా పంపించిన మూడు రోజుల తర్వాత మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేస్తే మంచి రాబడులు పొందుతారని మీరు తరచుగా చెబుతుంటారు. ఎలా డైవర్సిఫై చేయాలి? - వికాస్, నెల్లూరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభిన్న రకాలుగా డైవర్సిఫై చేసుకోవచ్చు. డైవర్సిఫైడ్ ఫండ్ల నుంచి ఏదో ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. విభిన్న రంగాలపై దృష్టిసారించిన ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, ఇన్వెస్ట్మెంట్ కాలం, మీరు భరించగలిగే రిస్క్... మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. రిస్క్ తట్టుకోలేని వారైతే లార్జ్ అండ్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయగల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు రకాలైన విభిన్న రంగాల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. వీటిల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.