పిరమల్‌ పునర్వ్యవస్థీకరణకు సై

Piramal to demerge financial, pharma business - Sakshi

విడిగా ఫార్మా, ఫైనాన్షియల్‌ బిజినెస్‌లు

రెండు లిస్టెడ్‌ కంపెనీలుగా ఏర్పాటు

పూర్తి అనుబంధ సంస్థగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

న్యూఢిల్లీ: వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చనట్లు డైవర్సిఫైడ్‌ కంపెనీ పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్‌ సరీ్వసుల బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ వీటిని రెండు లిస్టెడ్‌ కంపెనీలుగా విభజించనున్నట్లు వివరించింది. ఫార్మాస్యూటికల్‌ బిజినెస్‌ను పూర్తిగా విడదీయడం ద్వారా కన్సాలిడేట్‌ చేయనున్నట్లు తెలియజేసింది. పిరమల్‌ ఫార్మా పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టయిన అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా పిరమల్‌ ఫార్మా నిలవనున్నట్లు తెలియజేసింది.  

ఏర్పాటు ఇలా..: బిజినెస్‌ విడతీతలో భాగంగా వాటాదారులకు ప్రతి 1 పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌(పీఈఎల్‌) షేరుకిగాను 4 పిరమల్‌ ఫార్మా లిమిటెడ్‌(పీపీఎల్‌) షేర్లను కేటాయించనుంది. పీఈఎల్‌ షేరు ముఖవిలువ రూ. 2 కాగా.. పీపీఎల్‌ షేరు రూ. 10 ముఖ విలువతో జారీ కానుంది. మరోవైపు పిరమల్‌ ఫార్మా నిర్వహణలోగల రెండు పూర్తి అనుబంధ సంస్థలను పీపీఎల్‌లో విలీనం చేయనుంది. తద్వారా ఫార్మా బిజినెస్‌ నిర్మాణాన్ని సులభతరం చేయనుంది.

గత కొన్నేళ్లుగా ఒకే లిస్టెడ్‌ హోల్డింగ్‌ కంపెనీ పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా డైవర్సిఫైడ్‌ బిజినెస్‌లను గ్రూప్‌ నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌ పేర్కొన్నారు. తాజాగా కార్పొరేట్‌ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ బిజినెస్‌లను రెండుగా విడదీసేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలియజేశారు. వెరసి ఫైనాన్షియల్‌ సరీ్వసులు, ఫార్మా విభాగాల్లో నాయకత్వ స్థాయిలో ఉన్న స్వతంత్ర కంపెనీలుగా ఆవిర్భవించనున్నట్లు వివరించారు.   

కంపెనీల తీరిలా..: కాంట్రాక్ట్‌ తయారీ, అభివృద్ధి(సీడీఎంవో), కాంప్లెక్స్‌ జనరిక్స్‌లో గ్లోబల్‌ పంపిణీ, కన్జూమర్‌ ప్రొడక్టులు తదితరాలతో పిరమల్‌ ఫార్మా అతిపెద్ద లిస్టెడ్‌ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు అజయ్‌ పేర్కొన్నారు. సీడీఎంవో బిజినెస్‌లో మూడు అతి పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇక ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగంలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అతిపెద్ద లిస్టెడ్‌ డైవర్సిఫైడ్‌ ఎన్‌బీఎఫ్‌సీలలో ఒకటిగా ఏర్పాటు కానున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్‌ఎల్‌ ఫిన్‌వెస్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ను పీఈఎల్‌లో విలీనం చేయనున్నారు. మరోపక్క డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పీఈఎల్‌కు పూర్తి అనుబంధ కంపెనీగా ఈ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కొనసాగనున్నట్లు అజయ్‌     వెల్లడించారు.

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం లాభపడి రూ. 2,899 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top