breaking news
disturbing
-
అసలు... కొసరు
ఏక క్రియా ద్వ్యర్థి కరీ అన్నారు పెద్దలు. రాతి మీద నూరటం కత్తికి పదును కోసం, రాయి నునుపు కోసం కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనుకున్న దానితో పాటు కొన్ని అవాంతర ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పనికివచ్చేవి, కొన్ని పనికిరానివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో అసలు ప్రయోజనం మర్చిపోయి, ఈ కొసరుదే సరి అనుకునే ప్రమాదం కూడా ఉంది. పిల్లలకి స్నానం చేయించి, శుభ్రమైన యూనిఫారం వేసి, తల దువ్వి, షూస్ బాగా మిలమిలా మెరిసేట్టు పాలిష్ చేసి, పుస్తకాలు సద్ది, బ్యాగులో పెట్టి, ప్రేమతో తినిపించి, డబ్బా కట్టి బడికి పంపటానికి సిద్ధం చేస్తారు. బడికి వెళ్ళటంతో ప్రయోజనం సిద్ధించదు. అసలు ప్రయోజనం అక్కడికి వెళ్ళి చదువుకుంటే కలుగుతుంది. తయారు అవటం క్రమశిక్షణలో భాగం మాత్రమే. వరి సాగు చేయటం ధాన్యం కోసం. కాని వరిగడ్డి కూడా వస్తుంది. దాని వల్ల లాభం వస్తుంది అని గడ్డి కోసం వరి సాగు చేయరు. అంతే కాదు గడ్డి ఎక్కువగా పెరగటం కోసం ఎరువు వేయరు.వడ్లు బాగా రావాలని తగిన ఎరువులు వేస్తారు. ఆవులని పాల కోసం పోషిస్తారు. గోమయం, గోమూత్రం కూడా మానవులకి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఒకప్పుడు వాటిని పొలాలలో ఎరువుకి వాడేవారు. గోమయంతో పిడకలు చేసి ఇంధనంగా ఉపయోగించేవారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడేవారు. ఇప్పుడు వాటిని మరెన్నింటికో ఉపయోగిస్తున్నారు. కాని ఎవరూ ఆవులని పేడకోసమో, మూత్రం కోసమో పెంచరు కదా! అవసరం అనుకుంటే ఆవులున్న వారి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు. అరవిందాశ్రమంలో శ్రీ మాతగా ప్రసిద్ధి పొందిన మిర్రా సాధన ప్రారంభించిన మొదట్లో అద్భుతమైన అందంతో ప్రకాశించటం మొదలు పెట్టిందిట. శారీరిక, మానసిక ఆరోగ్యాలు ఉండటమే అందం. వెంటనే ఆవిడ ఇది నా ప్రయోజనం కాదు అని ఆ శక్తిని భౌతిక శరీరం నుండి ఉపసంహరించింది. లక్ష్యసాధనలో ఎదురయ్యే ఇటువంటి వాటిని పరమార్థం అనుకోకుండా ముందుకి సాగాలి. ఖాళీ సీసాలు సేకరించి అమ్ముకునే వాడితో ఒక పెద్దమనిషి ‘‘నీకోసమేనయ్యా నేను రాత్రి అంతా కూర్చుని సీసాలు ఖాళీ చేసేది.’’ అన్నాడట! ఆహా! ఏమి సమర్థింపు!! ఈ సందర్భంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూగారిని స్మరించక తప్పదు. స్వతంత్రోద్యమంలో ప్రధాన భాగంగా విదేశీవస్తు దహనం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో ఎవరో ‘‘మీరు విదేశీ సిగరెట్లు కాలుస్తున్నారు. మనం విదేశీ వస్తువులు వాడం కదా!’’ అన్నారుట. దానికి నెహ్రూ గారు నవ్వుతూ... ‘‘అందుకే కదా దహనం చేస్తున్నాను.’’ అన్నారుట. పేలాల కోసం కుప్పలు తగల బెట్టటం అనే సామెత ఉంది. వరిపేలాల కోసం వడ్లని వేయిస్తారు. కాసిని వడ్లతో సరిపోయేదానికి మొత్తం కుప్పని తగల బెట్టటం తెలివి గల పనేనా? ప్రధానమైన ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తుంటే కొన్ని అనుకోనివి కూడా లభిస్తాయి. వాటిని పట్టించుకుంటే దృష్టి చెదిరే ప్రమాదం ఉంది. క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసం. ఆ లోపు పాలసముద్రం నుండి ఎన్నో విశిష్ట వస్తువులు ఉద్భవించాయి – లోకోపద్రవకారకమైన హాలాహలం నుండి కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు వంటి వారి నుండి లక్ష్మిదేవి వరకు. తెలివిగలవారు దేనిని ఏ విధంగా వినియోగించుకోవాలో, ఆ విధంగా వినియోగించుకున్నారు. తమ లక్ష్యమైన అమృతం సిద్ధించే వరకు పాలసముద్రాన్ని చిలకటం కొనసాగించారు. కల్పవృక్షం వంటి వాటి కోసం మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయలేదు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
ఒంటరిగా మహిళ డ్యాన్స్.. తర్వాత ఏమైందంటే
అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతం.. నవంబర్ 29 ఆదివారం.. సమయం రాత్రి 10 గంటలు.. ఒక అపార్ట్మెంట్లో హన్నా వివేరెట్ అనే మహిళ తన ఇంట్లో సీరియస్‌గా డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుంటూ ఎంజాయ్ మూడ్‌లో ఉంది. ఇంతలో ముందు రూమ్‌లో ఎవరో డోర్ తీసినట్లు అలికిడి వినిపించింది.వెంటనే హన్నా తాను ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే.. ఎదురుగా ఒక మనిషి చేతులను జేబులో పెట్టుకొని కోపంగా చూస్తూ నిలబడ్డాడు. అంతే ఒక్కసారిగా షాక్‌కు గురైన హన్నా భయాందోళనతో మ్యూజిక్ ఆఫ్ చేసి.. ఏయ్ ఎవరు నువ్వు.. లోపలికి ఎందుకొచ్చావు.. బయటికి వెళ్లిపో అంటూ గట్టిగట్టిగా అరిచింది. అయినా ఆ మనిషి ఆమెను పట్టించుకోకుండా లోపలికి రావడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన హన్నా తననేం చేయొద్దు అని గట్టిగట్టిగా అరుస్తూ చేతికందినదాన్ని అతని మీదకు విసరడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత హన్నా 911 నెంబర్‌కు కాల్ చేసి పోలీసులకు విషయాన్ని చెప్పింది. పోలీసులు అక్కడికి చేరుకొని మహిళ చెప్పిన ఆధారాల ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ ఇక్కడ జరిగిన విషయం. అసలు ఆ వ్యక్తి ఎవరు.. తన ఇంటికి ఎందుకు వచ్చాడనేది హన్నానే స్వయంగా వీడియోనూ షేర్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చారు. 'నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఈరోజు నా ఇంటికి వచ్చిన వ్యక్తిని మా పక్క వీదిలో చాలా సార్లు చూశాను. అతని పేరు ఏంజెల్ మోసెస్ రోడ్రిగేజ్. అతని ముఖం నాకు బాగా గుర్తు. నన్ను తరచుగా ఫాలో అయ్యేవాడు. కానీ నాకున్న భయంతో ఒక్కసారి కూడా అతన్ని... ఎవరు నువ్వు అని ఎదురు ప్రశ్నించలేదు. కొన్నిసార్లు నా పక్కనుంచే వెళుతూ నన్ను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదే విషయమై పోలీసులకు చెప్పాలని భావించాను.. కానీ అతను మళ్లీ నాకు కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని అనుకున్నా. కానీ ఇలా మా ఇంట్లో ప్రత్యక్షమవుతాడని మాత్రం ఊహించలేదు. కచ్చితంగా అతను నన్ను ఏదైనా చేసే ఉద్దేశంతోనే వచ్చాడని భావించా. అంతేకాదు.. అతను వెళ్తూ స్పానిష్ భాషలో ఎవరికి ఏదో చెబుతున్నట్లుగా అనిపించింది. నాకు తెలిసి అతనితో పాటు తన స్నేహితులు కూడా వచ్చి ఉంటారు. ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించే ముందు ముఖం కనిపించకుండా ఉండేందుకు డోర్ ముందు ఉన్న క్రిస్టమస్ లైటింగ్ వైర్‌ను తెంచేశాడు. కానీ రూమ్‌లో ఉన్న వెలుతురుకు అతని ముఖం స్పష్టంగా కనపడింది. దీంతో 911కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశానంటూ' చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోపక్క అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా ఇంటి వస్తువులను నాశనం చేసినందుకు ఏంజెల్‌పై పోలీసులు థర్డ్‌డిగ్రీ ఉపయోగించారు. View this post on Instagram A post shared by Hannah Viv (@hannah.viverette) -
ఒక ప్రేమకథ
కిటికీలోంచి ముఖం పెట్టి ప్రభాతబాబు అన్నాడు: ‘‘వ్రాసుకుంటున్నారా? సరే వ్రాసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను’’నేను కాగితం కలం క్రిందకి పెట్టి ‘‘రండి, దయచేయండి’’ అన్నాను.ప్రభాతబాబు కొంచెం సంకోచిస్తూ అన్నాడు: ‘‘కానీ మీరు వ్రాసుకుంటున్నారు కదా!’’‘‘పెద్ద వ్రాయవలసిందేమీ లేదు. ఒకటి రెండు ఉత్తరాలకి సమాధానం రాశాను. దయచేయండి’’ అన్నాను.ఆయన లోపలికి రాగానే నా ఎత్తు కుర్చీ నుంచి దిగి, ఆయన ముందు ఒక పల్లంగా ఉన్న సోఫాలో కూర్చున్నాను.ఆయన నా వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు: ‘‘ఉత్తరాలు బాగా రాస్తారనుకుంటాను.ఒకప్పుడు నాకు కూడా ఉత్తరాలు రాసే చాదస్తం ఉండేది. రాత్రాంతా మేలుకుని స్నేహితులకు లేఖలు రాస్తూ ఉండేవాడిని. అందుమూలన నన్ను ‘ఏ మాన్ ఆఫ్ లెటర్స్’ అనవచ్చు’’‘‘టీ పుచ్చుకుంటారా?’’ అని అడిగాను.టీ మాట వినేసరికి ప్రభాతబాబు సంతోషించి అన్నాడు: ‘‘అయితే ఈ మిట్టమధ్యాహ్నంవేళ మీకేమీ ‘ఆశ్రమపీడ’ కలగదు కదా? గృహస్థాశ్రమం కదా! నేనైతే గృహస్థుణ్ణి కాను,అంచేతనే భయపడుతూ వచ్చాను. మీ శ్రీమతికేమైనా శాంతిభంగం కలిగిస్తానేమోనని’’ప్రభాత వయసు 74 సంవత్సరాలు ఉంటుంది. శరీరం జీర్ణించింది కాని మనస్సు కాదు. బస్సులూ ట్రాములూ స్వేచ్ఛగా ఎక్కి తిరగగలడు. చాలా సంఘప్రేమ ఉన్న మనిషి. ప్రతి మీటింగుకి హాజరవుతూ ఉంటాడు. బంధువులు, స్నేహితుల యోగక్షేమం తెలుసుకుంటూ ఉంటాడు. కొత్తస్నేహాలు చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కొడుకు వయసు వాళ్లయినా సరే, మనువడు వయస్సు వాళ్లయినాసరే అందరూ ఆయన సమ వయస్కులే. తనకి మట్టుకు కొడుకూ లేడు. మనవడూ లేడు. ప్రభాత అవివాహితుడు. ఆయన మాటలు విన్నాక అన్నాను: ‘‘మొన్న రాత్రి మీకోసం ఎదురుచూశాం. ఒక్కళ్లిద్దరు నా స్నేహితులను నాతో పాటు అట్టే పెట్టాను. వాళ్లు మీతో మాట్లాడుదామని వచ్చారు. మేము చాలాసేపే ఎదురుచూశాం మీకోసం!’ప్రభాత కొంచెం నాలుక కరుచుకొని సిగ్గుతో అన్నాడు: ‘‘మరచిపోయాను కళ్యాణబాబూ, పూర్తిగా మరచిపోయాను. మొన్న రాత్రి నేను ఆలిపూల్లో మా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను. అక్కడ నేనొక యానివర్సరీ సందర్భాన్ని నిర్వర్తించాను’’‘‘మీ స్నేహితుని పుట్టిన రోజా?’’ అని అడిగాను.ఆయన తల ఆడిస్తూ అన్నాడు: ‘‘అదేం కాదు. అతను జన్మదినం, గిన్మదినం ఏం జరుపుకోడు. ఆయనెప్పుడూ పూజ చేయడం కానీ ఏ అనుష్ఠానాలు నిర్వర్తించడం కానీ నేనెప్పుడూ చూడలేదు. అందుకే మధ్య మధ్య అతనితో అంటూ ఉంటాను. సైతానుకైనా అనుష్ఠానాలేవో ఉంటాయి. నువ్వేమైనా సైతాను కంటే గొప్నవాడివా? అటు తర్వాత కొంతకాలం చూశాను ఆయన ఒక అనుష్ఠానాన్ని దృఢమైన నిష్ఠతో పరిపాలించడం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే. ఆ సందర్భంలో ఒకే ఒక వ్యక్తిని ఆహ్వానిస్తాడు’’ ‘‘ ఆ వ్యక్తి మీరే కదా?’’ అన్నాను.చిరునవ్వు ముఖంతో నా మాట ఒప్పుకున్నారు ఆయన. ఇంతలో టీ వచ్చింది. ప్రభాత మెల్లిగా తాగుతూ, జేబులో నుంచి సిగరెట్టు పాకెట్టు తీసి ఒక సిగరెట్టు అంటించాడు.ఆయన చవక సిగరెట్టు కాలుస్తాడు. నేను కాల్చనని తెలిసి కూడా, చమత్కారానికి ఒకటి ఇస్తూ అడిగాడు: ఏం కాల్చవా?’’నేను తల ఆడించడం చూసి అన్నాడు: ‘‘బాగుంది, నేనెప్పుడు సిగరెట్టు కాల్చడం మొదలు పెట్టానో తెలియదు. స్తన్యపానం వదలగానే ధూమపానం మొదలుపెట్టానేమో మరి!‘‘ఏం అనుష్ఠానం గురింంచి చెబుతున్నారు?’’ అడిగాను.ప్రభాత అన్నాడు: ‘‘కథ రాయకపోయినా, వాటి రీతి, నీతి కొద్దిగా తెలుసు నాకు. పెళ్లి చేసుకోకపోయినా పెళ్లివారితో వెయ్యిసార్లు వెళ్లాను. కథ సస్పెన్స్ పాడు చేసే అంతటి మూర్ఖుడిని అనుకుంటున్నారా? కథసారాంశం ముందే చెబితే మీరు నా కథ వింటారా?’’ ‘‘కథ అంటే నిక్కచ్చిగా నాకు సంబంధించింది కాదు. అది నా మిత్రుడిది. మీకు చెప్పడంలో ఏమీ ఇబ్బంది లేదు. మన పొట్టలో పెట్టుకుని ఉంచనక్కర్లేదు. కాని ఈ కథ రాయడంలో మీకు సులువు ఉండదు.చాలా పూర్వకాలపు చరిత్రకు చెందిన కథ ఇది. పూర్తిగా పురాతనకాలానిదీ కాదు. పూర్తిగా ఆధునిక పరిస్థితీ కాదు. రోజులైతే పాతవే. అయినా అవి నాలో ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి.నాదప్పుడుయవ్వనదశ. బహుశా ఒక అర్ధశతాబ్దం పూర్వం. అయినా అప్పుడప్పుడు బాగా జ్ఞాపకం వస్తూంటుంది ఆనాటికథ. ఆ కాలం ఓ పడమటి సరిహద్దున ఉన్న ఒక పట్టణానికి కలకత్తా నుంచి బదిలీ అయింది నాకు. నేను ఇంటిపట్టుండేవాడిని. అంచేత వెళ్లడానికి నా మనస్సు ఒప్పలేదు. కలకత్తా నిండా బంధుమిత్రులు. ఆఫీసు సమయం తప్పిస్తే, ఇటూ అటూ తిరుగుతుంటే రోజు గడిచిపోతుంది. ఆ తిరగడంలోనే ఉన్నాయి సాహిత్యం, సంగీతం, నాటకం. నేను వెళ్లే కొత్తచోటు ఉద్యోగం తప్ప మరేం కాలక్షేపం ఉంటుంది? ఆ ఉద్యోగమే ఎలా నిర్వర్తించానో వినండి. సశస్త్ర సైన్యాలకు అయ్యే ఆహారవిహారాల లక్షల రూపాయల ఖర్చుని ప్రతి పైసా ఎలా వ్యయమైందో జాబితా రాయడం నా పని. నాకా పని రుచికరమైనది కాదు. కాని చాకిరీ అంటే చాకిరీ చేయక తప్పదు. ఎలాగంటే భర్త మీద అనురాగం లేకపోయినా, పెళ్లి చేసుకున్న ఆడది ఆయనకి సేవచేయడం తప్ప గత్యంతరం లేనట్లు.ఆ పట్టణంలో నేను ఒక మధ్యతరగతి మెస్ ఆహారం, వసతిగల స్థానంలో మకాం చేశాను. అక్కడైతే బంధురహితంగా ఉంటుందనుకున్నాను, చూసేసరికి అలా లేదు. మా మెస్ ఒక చిన్నతరహా వినోద గృహంగా ఉండేది. పాటలు, మాటలు, నవ్వులు, వేళాకోళాలు, పేకాట, జూదం అన్నీ అక్కడ జరగుతుండేవి. ఎవరికి ఏయే విషయాలలో అభిరుచి ఉంటుందో వాళ్లకు అక్కడ ఆ ఏర్పాటు చేయబడుతుంది. ఆ వినోదగృహంలోకి నా మిత్రుడు శైలేన్సేన్ రావడం మొదలుపెట్టాడు. మా సెక్షన్లోనే అతడు పనిచేసేవాడు. నాలాంటి వాడు కాదు. మనస్ఫూర్తిగా పనిచేసేవాడు. చాలా బుద్ధిమంతుడు. ఆయన గుణాల కంటే రూపం కూడా చాలా ఆకర్షణీయమైనది. అతని పౌరుషం, గాంభీర్యం, ధైర్యం, స్థిరచిత్తం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. అతని వ్యక్తిత్వంలో ఉన్న విశిష్టత నాలో లేదు. అయితే నాలో ఏయే గుణాలు ఉన్నవో, ఆయనలో వాటి అభావం అతనికి అనుభూతమవుతూనే ఉండేది. మా మొదటి పరస్పరాకర్షణ ఈ అసమాన ధర్మాల వల్లనే అనవచ్చు.శైలెన్ మా మెస్‌లో మాట్లాడకుండా కూర్చునేవాడు. లైబ్రరీ అరలోంచి ఒక పుస్తకం బయటికి తీసి చదువుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు మిగతావాళ్లతో కాలక్షేపాలు చేస్తూ కూర్చునేవాడు. చాలా బిడయపడే స్వభావం కలవాడు. ఇప్పుడైతే అలా కాదు.అందరూ వెళ్లిపోయాక వీలుంటే నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. ఒకరోజు ఎవరూ లేని స్థలం, సమయం చూసి నాతో అన్నాడు: ‘‘నీతో ఒక మాట చెప్పాలి’’‘‘సరే చెప్పు’’ అన్నాను.‘‘ఆగిపోయావెందుకు? నువ్వేదైతే చెప్పలేకపోతున్నావో, అది నేనే చెపుతాను.(అటుపైన శైలేన్ గొంతుకను అనుకరిస్తూ ప్రభాత్ అన్నాడు: ‘ప్రభాత్ భాయి నేను ప్రేమలో పడ్డాను. పూర్తిగా మునిగిపోయాననుకో. ఈ అగాథం నుంచి నువ్వు నన్ను పైకి ఎత్తాలి)‘‘నా కథ మీకెలా తెలిసింది?’’ అన్నాడు శైలేన్.‘‘ఎప్పుడైతే మీ ఇంట్లో నిన్ను చూశానో అప్పుడే నాకన్నీ తెలిసిపోయాయి’’శైలేన్ మాట్లాడక ఊరుకున్నాడు. ఆ పట్టణంలో నేను ‘మెస్’లో మకాం చేశాను. శైలేన్ అక్కడ ఉండేవాడు కాదు. అక్కడ అతని తండ్రి ఒక ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉండేవాడు. తండ్రీ, తల్లీ, సోదరీ సోదరులూమొత్తం పెద్దకుటుంబం వాళ్లది. వాళ్లతో ఉండేవాడు శైలేన్. ఆఫీసుకు సెలవు వచ్చినప్పుడు నన్ను వాళ్లింటికితీసుకువెళుతూ ఉండేవాడు. వాళ్ల అమ్మ నన్ను కూడా తన బిడ్డలాగ చూసుకునేది. శైలేన్ సోదరీ సోదరులు నన్ను అనురాగంతో చూస్తూ ఉండేవారు. శైలేన్ ఇల్లు నాకన్నిటిలోకి ఎక్కువ ప్రీతికరంగా ఉండేది. శైలేన్ ఇంట్లో నేను మాధురిని చూశాను. ఆమె సౌందర్యం చూసి శైలేన్ సోదరేమో అనుకున్నాను. మాధురి శైలేన్ చెల్లెలు కాదు సరికదా, ఆమె అతని తల్లిని ‘పిన్ని’ అని పిలిచినా ఆమె అతని పిన్ని కూతురు కూడా కాదని కొంతకాలం తరువాత తెలుసుకోగలిగాను. శైలేన్ ఇల్లూ ఆమె ఇల్లూ కొన్ని గజాల దూరంలో ఒకే వీధిలో ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య గాఢమైన స్నేహం, నిత్యమూ రాకపోకలూ, అన్నపానాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం. ఒక ఇంటి తల్లి ఇంకొక ఇంటి ఆడపిల్లకీ మగపిల్లలకీ గౌరవనీయమైన పిన్ని అన్నమాట.‘‘నీకెలా తెలిసింది’’ అడిగాడు శైలేన్.‘‘నీ దాగుడుమూతలు వ్యవహారం అంతా చూస్తుంటే, నీ టేబుల్ మీద మాధురి పేరుతో ఉన్న పుస్తకాలు, ఆమె పాటల పుస్తకంలో నీ అక్షరాలు అన్నీ చూస్తే తెలుస్తుంది’’ అన్నాను.శైలేన్ పట్టుబడిపోయి, నవ్వడం మొదలుపెట్టాడు. ‘‘ఈ కాసేపటిలో నువ్వు కనిపెట్టేశావు. నిన్ను సి.ఐ.డి విభాగంలో నియమిస్తే బాగుంటుంది, ప్రభూ’’ అన్నాడు.శైలేన్ నన్ను ‘ప్రభూ’ అని గౌరవంగా పిలిచేవాడు. శైలేన్ తన కథంతా నాకు చెప్పాడు. నిజానికిఅతను చెప్పడానికే వచ్చాడు. అదే అతని యవ్వనపు రోజుల ప్రణయగా«థ. ఆ ప్రేమ అంతా ఒకప్పుడు చాటుగానే వ్యవహరించబడింది. ఇంట్లో వాళ్ల దగ్గర ఎంత దాచాడో తనలో కూడా తాను దాచుకున్నాడు.ఇప్పుడు అతను కోరేది రెండు కుటుంబాల వాళ్లూ వాళ్ల ప్రేమను అంగీకరించడం. ఏ మాధురి అయితే ఇదివరలో వాళ్లింటికి కూతురిలా వచ్చేదో, ఇప్పుడు కోడలులా రావాలని అతని వాంఛ.‘‘ఆటంకం ఏమిటి?’’ అడిగాను.‘‘కులం అన్నాడు.‘‘మీ కులాల మాట మండ! ఒక పనిచెయ్. మాధురి తండ్రి తనంత తాను కన్యా ప్రదానం చేయకపోతే, నువ్వు ‘సుభద్రాహరణం’ చేయి నేను మిమ్మల్ని కాపాడుతాను’’ అన్నాను.శైలేన్: లేదు భాయి, అలాగ జరగదు.నేను: ఏం మాధురి భయపడుతోందా?శైలేన్: భయపడుతోంది, జంకుతోంది. తన దుర్మార్గపు తండ్రి అంటే ఆమెకి చాలా ప్రేమ. అతనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి సాహసించడం లేదు.నేను: అయితే నడు, ఆ ఇంజనీర్ పెద్దమనిషికి నేను అంతా నచ్చజెప్పుతాను. నేను నీ వకీలునై మీ ఇద్దరి మధ్య రాజీ చేస్తాను’’శైలేన్: అరే బాబా! అలా నువ్వు చేస్తే వాళ్ళింటి తలుపు మా ముఖం మీద కొట్టి మూసేస్తారు. మా నాన్న ఆ అవమానాన్ని సహించగలడా? ఒక్క కిటికీ అయినా వాళ్లింటి వైపు తెరచి ఉంచడు. అయినా ఈ సంగతి ఎవ్వరికీ తెలియనీయకు. అలా అయితే చిరకాలపు స్నేహం మా రెండు ఇళ్ల మధ్యా నశించిపోతుంది. ఇలాంటి ప్రేమవివాహాలంటే మా అమ్మానాన్నలకి భయం. గాంధర్వ వివాహం చేసుకుంటే మేము దూరమైపోయి ఎక్కడో ఉండిపోతామని, జననీ జనకులనూ, సోదరీ సోదరులని చూడడానికి రామని.నేను నవ్వుతూ అన్నాను: ‘‘శైలేన్, అయితే నవ్వు ఆ మాట మీద ఉండు. ఇంకేమీ పెద్ద ఆశ పెట్టుకోకు.తరువాత రెండు కుటుంబాలలో గుప్తంగా పెళ్లిళ్ల పేరయ్యలు రాకపోకలు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తరువాత నాకు సిమ్లాకు బదిలీ అయింది. నేను సెలవు తీసుకునే రోజున మాధురి వాళ్ల తోటలో నుంచి తెచ్చి ఒక ఎర్రగులాబి గుత్తిని నాకు బహుకరించింది. ఆమె వైపు చూస్తూ అన్నాను:‘‘మాధురీ,నువ్వేమిటి ఇలా చేస్తున్నావు?’’‘‘ప్రభాత్ అన్నయా! నాకు నీ కంటే వేరే నిస్వార్థపరుడైన స్నేహితుడు లేడు. నువ్వు నన్ను మరిచిపోకు’’ అన్నది.నాకు సిమ్లాకు బదిలీ అయిన కొన్నాళ్లకు శైలేన్ పట్నా వెళ్లాడు. మా వయస్సుతో పాటు మా ముఖాలు కూడా మారాయి. బాహ్యంగా ఎన్ని పరివర్తనలు వచ్చినప్పటికీ, మా ఇద్దరి మైత్రీక్షేత్రంలో మటుకు ఏ విధమైన బదిలీ ఎప్పుడూ రాలేదు. దూరంగా ఉన్నా, ఒకళ్ల కబురు మరొకళ్లం లేఖల ద్వారా తెలుసుకుంటూ ఉండేవాళ్లం. అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్లం. మాధురి తల్లి చనిపోయింది. ఇద్దరు సోదరులు పెద్దవాళ్లయ్యారు. తండ్రి పూర్తిగా ముసలివాడయ్యాడు. ఆ మొండి తండ్రి ఇప్పుడు అసహాయుడై పూర్తిగా తన కూతురిపై తన దినచర్య గడిచేందుకు ఆధారపడి ఉన్నాడు. మాధురి ఒక్కసారిగా అతనికి తల్లిగా, కుమార్తెగా వ్యవహరించవలసి వస్తోంది.శైలేన్ తల్లిదండ్రులిద్దరూ మరణించారు. అతని సోదరులు అతనిపై ఆధారపడ్డారు. వాళ్ల పెళ్లి చేసి అన్ని పూచీలు తీర్చాడు. వాళ్లందరూ అతను ఉద్యోగం చేసే చోట ఒక కుటుంబం క్రింద చేరేవారు. అయితే పెళ్లికాని పెద్దన్నయ్య కుటుంబానికి వటవృక్షంలాంటివాడు. ఆపైన నేనూ శైలేన్ ఇంచుమించు ఒకే సమయంలో రిటైర్ అయ్యాము. అయితే శైలేన్కి ఎక్సెటెన్షన్తో పాటు ప్రమోషన్ కూడా వచ్చింది. నాకేమీ రాలేదు. ఇప్పుడు నేనూ, శైలేన్ పెన్షన్ తెచ్చుకునేందుకే వెళ్లినప్పుడు కలుసుకుంటూ ఉంటాము. మేము రిటైర్ అయ్యాక కలకత్తా వచ్చాము. అతను ఉత్తరభారతంలో, నేను దక్షిణ భాగంలోనూ ఉన్నాము. తరచు ఒకరినొకరు చూసుకోవడం తగ్గింది. ఉత్తరప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. శైలేన్ ఒకసారి రాశాడు: ‘‘నీ చేతిరాత ఏ మాత్రం చదవడానికి తెలియడం లేదు’’నాకు కోపం వచ్చి అప్పటి నుంచి అతనికి ఉత్తరాలు రాయడం మానేశాను. ఇప్పుడు కేవలం ఫోను చేసుకుంటాము. అతను అలీపూర్‌లో ఒక అందమైన రెండస్తుల మేడ కట్టుకున్నాడు. ఇంతకు పూర్వం తమ్ముడి బిడ్డలు ఉండేవారు, ఇప్పుడు వరుసకు మనుమలు, మనుమరాళ్లు అతనితో మకాం చేస్తున్నారు. నాకు ఇల్లూ వాకిలీ ఏమీలేవు. ఏదో మా పిత్రార్జితమైన ఒక పూర్వకాలపు ఇల్లు ఉంది. అన్నగారితో పాటు నేనూ దానికి భాగస్వామిని. అయితే పేరుకి మటుకే. ఇంటిలో కొంచెంసేపే ఉంటాను. ఇది 12 సంవత్సరాల క్రితం మాట. పెన్షన్ తీసుకొని తిరిగి వస్తుంటే నా వెనకాల నుంచి హఠాత్తుగా ఒకడు వచ్చి నా చెయ్యిపట్టుకుని అరిచాడు‘‘డబ్బుపై ఎందుకండీ ఇంత మక్కువ?’’చూస్తే అతను శైలేన్. నవ్వుతూ అన్నాను: ‘‘ముసలితనంలో కాంత వదులుతుంది కాని, కనకం కాదు. పళ్ళూ పాలూ కొనుక్కోవాలంటే డబ్బుండాలి కదా’’శైలేన్ నన్ను ఒక టీ దుకాణానికి తీసుకువెళ్లాడు. ‘‘నీతో ఒక మాట చెప్పాలి’’ అన్నాడు. ఒకళ్లకెదురుగా మరొకళ్లం ఒక ఖాళీ టేబుల్ దగ్గర కూర్చున్నాం. ముసలితనం ఒకడి జుట్టు లాగేసింది. మరొకడి పళ్లు ఊడ పీకింది. శైలేన్ ఏమీ ఎక్కువగా మాట్లాడక, కాగితం సంచిలో నుంచి ఒక కవరు బైటకు తీసి నాకు చూపించి చదవమన్నాడు.బాగా పరిచితమైన చేతివ్రాలు. ‘‘ఇది ఆమె రాసిన ఉత్తరం’ అన్నాను.కవర్లో నుంచి ఉత్తరం బయటికి తీసి చదివాను. కాని అందులో రెండే లైనులు: ‘‘నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. తప్పకుండా రా. ఇట్లు నీ మాధురి’’‘‘ముసలితనంలో కూడా కొంతమందికి కాంత వదలదు. ఎక్కడుంది ఆమె?’’నవ్వుతూ అన్నాను.శైలేన్: ‘‘బారక్పూర్లో, సోదరులతో ఉంటోంది’’తండ్రి చనిపోయాక మాధురీ వాళ్లూ లక్నోలో ఇల్లు విడిచి కలకత్తా వైపు వచ్చేశారు. కాని ఎక్కడో స్పష్టంగా తెలియదు. సోదరులు ఉద్యోగాలు చేస్తున్నారు. మాధురి పంతులమ్మ పనిచేస్తోంది. ఆరోగ్యంచెడిపోయాక ఉద్యోగం విరమించుకుంది. తండ్రి పెద్ద ఆస్తి ఏమీ విడిచి పెట్టలేదు. 30 వేల రూపాయలు డిపాజిట్ చేసి కూతురి ఇచ్చాడు.కొడుకులకి కొద్దికొద్దిగా పంచి పెట్టాడు.శైలేన్: ‘‘చాలా కాలం నుంచి ఒంట్లో బాగుండటం లేదు, నడు, ఒక మారు చూసివద్దాం ముఖ్యమైన మాటేమిటో’’ నేను: నువ్వొక్కడివే వెళ్లు. నేను కూడా వస్తే ఆ మాట బయట పడదు’’శైలేన్: ‘కాదు నువ్వు కూడా రా. ఈ వేళే వెళదాం.మరో రోజున వెళ్దాం అన్నాను నేను. కాని ఆలస్యానికి ఒప్పుకోలేదు శైలేన్. మళ్లీ ఎప్పుడు ఎవరు చెప్పగలరు? ఒకళ్లకొకళ్లు ఫోను చేసుకున్నాక వెళ్లాను. బారక్పూర్. శైలేన్ టాక్సీలో వెళ్దామన్నాడు.‘‘పెన్షన్ డబ్బులు చాలామట్టుకు ఖర్చు అయిపోయాయి. నడు, బస్సులో వెళ్దాం’’ అన్నాను.వెళ్లేటప్పుడు కాలేజీ స్ట్రీటు మార్కెటు నుంచి ఒక డజను అప్పుడే కోసిన పెద్ద పుష్పాలు కొని పట్టుకెళ్లాను.శైలేన్ వేళాకోళం చేస్తూ అన్నా ్నడు:‘‘నిన్ను చూస్తే, నీ నాటకాల హాబీ నీలో బాగా స్థిరపడినట్లే ఉంది?’’స్టేషన్‌కి దగ్గరే ఇల్లు. రెండంతస్తుల మేడలో ఒక ఫ్లాట్‌లో ఉంటోది ఆమె. గొళ్లెం కొట్టాక, ఒక ఆవిడ వచ్చి తలుపు తెరిచింది. మమ్మల్ని మేముపరిచయం చేసుకున్నాక, ఆవిడమమ్మల్నిమాధురి వద్దకు తీసుకువెళ్లింది.ఒక చిన్న మంచం మీద మాధురి పడుకుని ఉంది. శుభ్రంగా ఉన్న తెల్లని పరుపు ప్రక్క. ఇల్లు కూడా శుభ్రంగా ఉంది. కాని ఈ మాధురి ముఖం ఏం ఇలా ?ప్రక్కకు అంటి పెట్టుకున్నట్లు అయిపోయింది ఆమె శరీరం. లేచి కూర్చునే శక్తి లేదు ఆమెకు.అయినప్పటికీ మమ్మల్ని చూసేసరికి ఆమెకు లేని శక్తి ఒకటి కలిగింది, ఉత్సాహంతో కూర్చుంది. నాకేసి చూసి నవ్వుతూ అంది: ‘‘నాకు తెలుసు, నువ్వు కూడా వస్తావని’’ఆపైన ఏం వ్యవహారం నడిపించిందో మాధురి, వినండి. తన సోదరుల భార్యలనిద్దరినీ పిలిచి చెప్పింది:‘‘లక్ష్మీదేవి విగ్రహం ముందు కుంకుమభరిణె ఉంది. దాంట్లో కుంకుమ పొడి పెట్టాను. అది తీసుకురండి’’చిన్న మరదలు పట్టుకొచ్చింది ఆ కుంకుమభరిణె. ఆమె చేతులోంచి భరిణె తీసుకుని శైలేన్ చేతిలో పెట్టింది మాధురి:‘ఈ కుంకుమ నా పాపిటిలో అలంకరించు. నేను అవివాహితగా మరణించడానికి ఇష్టపడను’’నేనింకా ఏం పరిశీలించానంటే, మాధురి కేశసంపద పూర్వపు మేఘవర్ణాన్ని పోగొట్టుకుందని, వయస్సు అంత పెద్దగా ముదిరిపోకపోయినాఆమెజట్టు బాగా పలచబడిపోయింది. అక్కడక్కడా నెరిపినట్లుగా కంటికి స్పష్టంగా కనిపిస్తోంది.శలేన్ ఆమె కోరినట్లుగా పాపిటి మధ్య సింధూరాన్ని అలంకరించాడు. ఆమె మరదళ్లు శంఖంఊదదలుచుకున్నారు. (వంగ దేశపు ఆచారాన్ని అనుసరించి), కాని చేత్తో సంజ్ఞ చేసి ఆపు జేసింది మాధురి.‘‘మాధురీ, నీ ముదిరిపోయిన జుట్టులో సింధూరపు రేఖను దాల్చేందుకు ఇన్నాళ్లుఎదురుచూశావా?’పాడ్యమి నాటి చంద్రుని వంటి చిరునవ్వు రేఖ మాధురి ముఖంపై తాండవించింది. ‘‘అవును ప్రభాత్ దా, ఇప్పుడింక మిగతా పెళ్లి మంత్రాలు చదువు’’నేనేమైనా బ్రాహ్మణుడినా మంత్రాలు పఠిచేందుకు? నేను నిజంగా మంత్ర ముగ్ధుడినై పోయాను. అందుచేత మెల్లిగా రెండు వాక్యాలు పలికాను.‘‘యదిదం హృదయం తవ! తదిదం హృదయం మమ’’( ఈ నా హృదయం నీది. ఆ నీ హృదయం నాది)వాళ్లిద్దరూ చదవలేదు. కాని చెవి ఒగ్గి విన్నారు. జీవింతలో ఎంతమంది పెళ్లివారితో ప్రయాణం చేయలేదు! ఎంతో దూరదూరాలు దుర్గమసీమలు తరలి వెళ్లాను. కాని ఇటువంటి పెళ్లిప్రయాణంఎప్పుడూచేయలేదు. కల్యాణ్‌బాబు! ఇటువంటి పౌరోహిత్యం ఎక్కడా నిర్వరించలేదు’’నేను కొన్న పుష్పగుచ్ఛం సఫలంగా ఉపయోగించింది. ఆ పువ్వులని మాధురి పక్కపై ఒక మూల ఉంచాను. కొన్నిక్షణాలకిఆమె రోగశయ్య పూలపాన్పుగా మారింది.కాని మాధురి అటు తర్వాత ఎక్కువరోజులు బతకలేదు. ఆమె తమ్ముళ్లు అనేక విధాలుగా ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. శైలేన్ కూడా ప్రయత్నదోషం చేయలేదు. కలకత్తా తీసుకువచ్చి ఒక నర్సింగ్‌హోంలో ప్రవేశపెట్టాడు. ఆమె కడుపులో వ్రణం మట్టుకు ఏమాత్రం తొలగలేదు. ఆమె ఆపరేషన్ బల్లపై మరణించింది. మరొక డజను రజనీగంధపుష్పాలనుతీసుకువెళ్లానుఆమెను చూడటానికిశైలేన్ స్వయంగా ఆమె శవాన్ని దహనపరచాడు. 5000 రూపాయలను తన జేబులోంచి తీసి ఆమె శ్రాద్ధకర్మ కొరకు వెచ్చించాడు. అన్నదానం చేశాడు. భజనగాళ్లచే భజనలు చేయించాడు. అంతకుపూర్వంఇటువంటి విషయాలలో అతనికి నమ్మకం ఉండేది కాదు. ఇదంతా మాధురి ఇచ్ఛానుసారం చేశాడని గ్రహించుకున్నాను. ఆ మధుర హృదయపుమరొక తుది కోరికకు చెందిన నిదర్శనాన్ని శైలేన్ నాకు చూపించాడు. ఇంతక్రితం తీసిన కాగితపు సంచి నుంచి మరొక పెద్ద కవరు బైటకు తీశాడు. మాధురి కోరిక ఆ కవరు తెరిచి ఆమె మరణానికి పూర్వం చదవకూడదని. తెరిచాక చూస్తే అది లేక కాదు. ఒక ఆకుపచ్చరంగు చిన్న కవరులో 30 వేల రూపాయలకు శైలేన్ పేరిట చెక్క రాయబడి ఉంది.శైలేన్ అన్నాడు: ‘‘నేనీ డబ్బు ఎందుకుతీసుకోవాలి?’’‘‘తీసుకోవయ్యా, పెళ్లి చేసుకున్నందుకు నీకేం కట్నం దొరకలేదు. అలాంటి సొమ్ము ఎవరు వదులుకుంటారు?’’మాధురి సోదరులకు కొంచెం సొమ్ము సమర్పించాడు శైలేన్. ఆ సందర్భంలో నేనొక్కడినే అతిథిని. అతని ఇంటిగోడపై మాధురి పెద్ద ఫోటో ఒకటి వ్రేల్లాడుతూంది. అది ఆమె ప్రథమ యవ్వనపు రోజులనాటి ఛాయా చిత్రం. ఆ తరుణి ఛాయాచిత్రం ముందు మేమిద్దరం ముసలివాళ్లం కుర్చీలు వేసుకొనికూర్చున్నాము. టీ త్రాగాము, కబుర్లు చెప్పుకున్నాము. ఒక్కొక్కప్పుడు ఏమీ మాట్లాడకుండా ఊరికే కూర్చుని ఉన్నాము.శైలేన్ మృత్యువు బారి నుంచి ఒక ప్రేమవస్తువుని రక్షించాడు. నా మట్టుకు నేను వార్ధక్యపు బారి నుంచి ఒక స్నేహాన్ని కాపాడాను.... ప్రభాతబాబు లేచి నిలబడ్డాడు. ఈవేళ ఎదురుగుండా పెట్టిన గొడుగు మాట మరిచిపోయాడు ఆయన. నేను అది తీసి ఆయన చేతికి అందించాను. ఆయన మెల్లిగా నవ్వి, ‘‘థ్యాంక్స్’’ అన్నాడు. బెంగాలీ మూలం : నరేంద్రనాథ్ మిత్రా తెలుగు: రాధాకృష్ణమూర్తి చల్లా -
ప్రకాశం జిల్లాలో స్వైన్ ప్లూ కలవరం
-
కమలంలో కలవరం!
న్యూఢిల్లీ: బిహార్ ఓటమితో బీజేపీలో కలవరం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల చక్రాధిపత్యానికి ఎదురుగాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మోదీ వ్యతిరేక వర్గం స్వరం పెంచింది. పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీతో మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా భేటీకావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లు అయ్యింది. ఈ భేటీలో బిహార్ ఎన్నికల ఫలితాల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్లతో జార్ఖండ్ ఎంపీ గొంతు కలిపారు. ఎన్నికల ప్రచారానికి జనం వచ్చినంత మాత్రాన ఓట్లు పడవని చురకలు అంటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా బయటి రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రచారం చేస్తే లాభం ఉండదని గ్రహించాలని.. స్థానిక నేతలకే ప్రచార బాధ్యతలు అప్పగించాలని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత, ఎంపీ కోరారు. అయితే, ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. మోదీ, అమిత్ షాలను సమర్ధిస్తూ.. గెలుపోటములు సహజమేనని పార్టీ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. గతంలో అద్వానీ హయాంలోనూ పార్టీ ఓడిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శలు చేస్తున్న నేతలకు సూచించారు. బిహార్ ఓటమికి మోదీ, షాలను బాధ్యులను చేయడం సరికాదన్నారు. -
అధికార పార్టీ నేతల్లో కలవరం
‘రాష్ట్రంలో నియంతపాలన నడుస్తోంద’ంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి గణపతి చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. గణపతి వ్యాఖ్యలను పాలక పక్షానికి హెచ్చరికగా భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు తమ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి : ఇంతకాలం మావోయిస్టు పార్టీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపడమే కాకుండా టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత పాలకపక్ష విధానాలను స్వయంగా మావోయిస్టు పార్టీ చీఫ్ గణపతి తప్పుబట్టడం ప్రాధాన్యం సంతరించుంది. మావోయిస్టు పార్టీ విధానమే తన విధానమంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిర్బంధాన్ని అమలు చేస్తున్నారంటూ సీఎంను ఒక నియంతగా పేర్కొనడం సంచనలం కలిగించింది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై గణపతి మండిపడ్డ నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న మావోయిస్టులు ప్రభుత్వంపై విరుచుకపడడంతో అధికార పార్టీ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ బలంగా ఉండి సమాంతర పాలన కొనసాగిస్తోంది. ఇదేక్రమంలో ఆ పార్టీ మళ్లీ తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసు యంత్రాంగం అనుమానిస్తోంది. గతనెలలో పౌరహక్కుల సంఘాలు హైదరాబాద్‌లో తలపెట్టిన సభను ప్రభుత్వం అడ్డుకున్నప్పటి నుంచి కేసీఆర్‌పై విప్లవసంఘాలు, హక్కుల సంఘాల నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో గణపతి కేసీఆర్‌పై చేసిన ప్రకటన అధికారపార్టీ నాయకులను కలవరపెడుతోంది. రెండు నెలలక్రితం ఆదిలాబాద్ పరిసరాల్లో జరిగిన ఎన్‌కౌం టర్లో మహారాష్ట్రకు చెందిన దళం హతమైంది. అప్పటినుంచే అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులకు భద్రతను పెంచారు. పోలీసుస్టేషన్లకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటనను ఖరారు చేసుకోవాలని పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రస్తుతం అదే పద్ధతిలో నాయకుల పర్యటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గణపతి హెచ్చరికతో ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 2నుంచి కొయ్యూర్ మృతవీరుల సంస్మరణార్థం మావోయిస్టు పార్టీ తలపెడుతున్న పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతుండగానే గణపతి ప్రకటన మరింత కలకలం రేపుతోంది.