breaking news
Discussion metting
-
ఆఫ్ఘనిస్తాన్పై చర్చ: పాకిస్తాన్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సమావేశానికి ఆహ్వానం అందకపోవడంపై పాకిస్తాన్ స్పందించింది. వివాదాస్పద పొరుగుదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిపై ఆగస్టు 6 న నిర్వహించిన భద్రతా మండలి సమావేశానికి ఆహ్వానించకపోవడంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ పరిస్థితుల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పొరుగుదేశంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిపై చర్చకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుకు రాకపోవడంపై పాకిస్తాన్ విచారం వ్యక్తం చేసింది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆహ్వానించలేదంటూ మండిపడింది. తమ దేశంపై తప్పుడు ప్రచారం జరగడానికి ఈ మండలిని వేదికగా ఉపయోగించుకుంటున్నారని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ దేశానికి తాము పొరుగునే ఉన్నామని, ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో తమది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని రాజకీయ ఒప్పందమే సరైనమార్గమంటూ ఆయన ట్వీట్ చేశారు. దోహాలో జరిగిన చర్చల్లో తాము కూడా భాగస్వామ్యం వహించామని ఆశిస్తున్నట్టు హఫీజ్ చౌదరి పేర్కొన్నారు. అటు తాలిబాన్లకు సురక్షితమైన స్వర్గధామం పాకిస్తాన్ మారిందని,వారికి భారీమద్దతును అందిస్తోంటూ పాకిస్తాన్ పైఐరాసలోఆఫ్ఘన్ శాశ్వత ప్రతినిధి గులాం ఇసాక్ జై కూడా మండిపడ్డారు. మరోవైపు ఉగ్రవాదులకు ఊతమిస్తోందంటూ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఈ ప్రాంతంలోని తీవ్రవాద సురక్షిత ప్రాంతాలను తక్షణమే నాశనం చేయాలని తద్వారా తీవ్రవాద గొలుసును అంతం చేయాలని ఐరాస భారత రాయబారి తిరుమూర్తి కోరారు. కాగా నేడు (సోమవారం) సాయంత్రం జరగనున్న ప్రధాని మోదీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ ఫెలిక్స్-ఆంటోయిన్ షిసెకెడి సిలోంబో, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. 15 దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో తీవ్రవాద నిరోధం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అంశాలతో పాటు ‘సముద్ర భద్రత’అంశాన్ని ఎజెండాలో ప్రత్యేక అంశంగా చర్చించడం ఇదే తొలిసారి. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాచారం ప్రకారం ఐరాస భద్రతా మండలి సమావేశానికి భారత ప్రధాని అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
తరుణీ.. మనమెక్కడ!
ఏలూరు సిటీ/స్పోర్ట్స్/వన్‌టౌన్ : ‘ముదితల్ నేర్వగ లేని విద్య గలదె.. ముద్దార నేర్పింపగన్’ అన్నారు పాత తరం కవి. ఈ తరంలో ఆ నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నారు ‘పశ్చిమ’ మహిళలు. అయినా ‘చదువుకున్న పడుచు.. అన్నింటా ముందు నడుచు’ అన్న మాటలకు మాత్రం సంపూర్ణత్వం సిద్ధించడం లేదు. మహిళలు ఉన్నత చదువులను అందుకోవడానికి కుటుంబ, సామాజిక పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. చదువుకున్న వారి అడుగులను సాధికారిత దిశగా పడనివ్వడం లేదు. మహిళా విద్యపై సానుకూల దృక్పథం ఉన్నా.. పరిస్థితులు మాత్రం వారిని వంటింటి కుందేళ్లుగానే మారుస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఇతర ఉపాధి రంగాల్లో అడుగు పెట్టేందుకు మహిళా లోకం సర్వశ్రేష్టమై ఉన్నా... వెళ్లనివ్వడం లేదు. ఇదే అంశంపై ఏలూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ‘సాక్షి’ చర్చావేదికలో బీటెక్, ఎంటెక్ విద్యార్థినులు తమ మనోభావాలను వెల్లడించారు. వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, క్రీడలు, ఉద్యోగ తదిత ర రంగాల్లో మహిళా లోకం ముందంజలో ఉందనే భావన అందరిలోనూ ఉందని.. వాస్తవానికి మాత్రం వారికి అలాంటి స్వేచ్ఛ లేదని విద్యార్థినులు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. యువతులపై పెరిగిపోతున్న వేధింపులు, భౌతిక దాడులు వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి నుంచి మహిళలు బయట పడాలంటే సామాజిక పరిస్థితులతోపాటు అతివల అంతరంగంలోనూ మార్పులు రావాలని ఆకాంక్షించారు. చర్చావేదికలో మాట్లాడిన యువతుల్లో కొందరి మనోభావాలు వారి మాటల్లోనే... చదువు వరకూ బాగుంది మహిళలు అన్నిరంగాల్లో ముందున్నారని చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగానే ఉంది. యువతులకు తల్లిదండ్రుల ప్రోత్సాహమైతే చాలా బాగుంది. పురుషులతో సమానంగా మహిళలనూ చదివించాలనే సామాజిక స్పృహ వచ్చింది. ఇది ఆడపిల్లలకు శుభపరిణామమే. అరుుతే, చదువుకున్న ఆడపిల్లల్లో ఎంతమంది సాధికారత వైపు అడుగులు వేసే పరిస్థితులు ఉన్నాయో చెప్పండి. - అశ్విని పరుచూరి మహిళా రిజర్వేషన్ ఏమైపోరుుంది మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. నిజం చెప్పమనండి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది. కుటుంబ, సామాజిక పరిస్థితులు మహిళా లోకానికి సానుకూలంగా ఉన్నా రాజకీయ పరిస్థితులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారుు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా సాధికారత సాధించగలిగితేనే వారు అభ్యసించిన చదువు సార్థకమవుతుంది. - ఎస్.కావ్య చదువు సార్థకం కావాలంటే.. చదువంటే కేవలం పుస్తకాలే కాదు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. అది మనిషి ఆలోచనల్ని వికసింపజేస్తుంది. ప్రతి మహిళా తాను సంపాదించిన విజ్ఞానాన్ని ఇతరులకు పంచితే సమాజంలో మార్పు వస్తుంది. ఇవన్నీ నిజాలే.. కానీ ఆ చదువు సార్థకం కావాలంటే మహిళ ఏం చేయూలన్నదే మహిళా లోకం ముందున్న తాజా ప్రశ్న. దీనికి జవాబు అందరి వద్దా ఉంది. కానీ.. అనుకూలమైన పరిస్థితులే లేవు. - సీహెచ్ స్వాతి ఆడ పిల్లల్ని ఉద్యోగానికి ఎందుకు పంపరు మగ పిల్లల్ని చదువు కోసమో, ఉద్యోగం కోసమే ఇతర దేశాలకు పంపడానికి ఏమాత్రం సందేహించని తల్లిదండ్రులు చదువుకున్న ఆడపిల్లల్ని మాత్రం అలా ఎందుకు పంపించడం లేదు. ఏ దేశంలోనూ అందుకు అనుకూలమైన సామాజిక పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయంలో తల్లిదండ్రులతోపాటు సామాజిక పరిస్థితుల్లోనూ మార్పు రావాలి. - ఎస్జీ ప్రియాంక అనుకూలత విస్తరించాలి పూర్వం పురుషులకే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. చదువులో సైతం వారికే పెద్దపీట వేసేవారు. ఉన్నత విద్య అనేది అప్పట్లో పురుషులకే పరిమితం.. మహిళలు వంటిం టికే పరిమితం అయ్యేవారు. ఆ రోజులు ఇప్పుడు లేవు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ.. ఆ స్వేచ్ఛ చదువు వరకే పరిమితం కాకూడదు. సమాజ అభివృద్ధికి మహిళల సేవలు ఉపయోగపడాలి. అందుకు అనుకూలమైన పరిస్థితులు విస్తరించాలి. - నయీమిష దేశానికి మహిళల అవసరం ఎంతో ఉంది విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దృష్ట్యా సమాజంలో సగ భాగమైన మహిళలూ ఉన్నత విద్యను అభ్యసించాల్సిన ఆవశ్యకత ఉంది. దేశాభివృద్ధిలో మహిళలూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చదువు ఒక్కటే జీవితం కాదు. చదువు లేకుం టే నేటి సమాజంలో మహిళకు విలువ లేకుండా పోతుంది. - సాయిదుర్గ దాడులకు భయపడొద్దు సమాజంలో మహిళపై గల చులకన భావన పోవాలి. యువతులపై దాడులు జరుగుతున్నారుు నిజ మే. అలాగని బయటకు రావటానికి భయపడాల్సిన పనిలేదు. గతంతో పోలిస్తే మహిళల విషయంలో పరిస్థితులు కొంత సానుకూలంగా మారారుు. ఇందుకోసం మహిళా లోకం ఎంతో పోరాటం చేసింది. అదే పటిమను కొనసాగించాలి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సాధికారత దిశగా సాగాలి. - లావణ్య ప్రతిబంధకాలు ఉన్నాయ్ కానీ.. నా తండ్రి ఉన్నత విద్యావంతులు కారు. అరుునా తన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు కూడా పెద్ద చదువులు చదవాలనే కోరికతో నన్ను చదివిస్తున్నారు. మహిళలకు ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయ్. వాటిని నేర్పుగా.. ఓర్పుగా తొలగించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు పట్టుదలతో శ్రమించాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే మహిళ తాను అనుకున్నది చేయగలదు. - కె.హారిక డిగ్రీలతో ఆగిపోతే ఎలా సామాజిక అభివృద్ధి సాధించాలంటే ప్రతి మహిళ చదువుకోవాలి. డిగ్రీలతో చదువులు ఆగిపోకూడదు. ఉన్నత చదువులు చదవాలి. చదువు పూర్తయ్యూక ఖాళీగా కూర్చుంటే ఒరిగేదేమిటి. కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు రావాలి. ప్రతికూల పరిస్థితులు ఉన్నా అనుకూలంగా మార్చుకోవాలి. మహిళలు ఓర్పుతో నేర్పుగా ముందుకు సాగాలి. - పి.మహిత