breaking news
Development Bank
-
ఈ ఏడాది భారత్ వృద్ధి 5.1 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసి యా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్ వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనావేసింది. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండడం 2020పై తమ అంచనాలకు కారణమని తన 2019 అప్డేటెడ్ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. రెండవసారి కోత...: నిజానికి 2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది. 2018లో భారత్ వృద్ధిరేటు 6.8 శాతంగా ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) దేశీయ వృద్ధి రేటును 6.1 శాతం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఐఎఫ్‌ఎస్‌సీల నియంత్రణకు ప్రత్యేక సంస్థ న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ)ల్లో ఆర్థిక లావాదేవీల నియంత్రణ కోసం ఏకీకృత సంస్థ ఏర్పాటుకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తొలి ఐఎఫ్ఎస్సీ గుజరాత్‌లోని గాంధీ నగర్లో ఏర్పాటైంది. దీన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్)గా వ్యవహరిస్తున్నారు. ఈ నియం త్రణ సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, అయితే.. సీవీసీ, కాగ్ పరిధిలో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
పంచ తంత్రం- అభివృద్ధి మంత్రం
ప్రపంచంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడంలో భారత విదేశీ విధానం ప్రశంసనీయం. ఈ విషయంలో తొలి ప్రధాని నెహ్రూ ఆచరించిన అలీన వ్యూహమే నేటి పాలకులకు మార్గదర్శకం. కయ్యానికి కాలుదువ్వకుండా ఇంటా-బయటా, ఇరుగూ పొరుగు దేశాలతో పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో మనకు మనమే సాటి. ఇటీవల అంతర్జాతీయ వ్యవహారాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా అభివృద్ధి చెందుతున్న దేశాలూ తమదైన శైలిలో పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి దేశాలు ఏకతాటిపై నిలిచేందుకు జతకట్టిన ఐదుదేశాల కూటమే బ్రిక్స్. పరస్పర సహకారం, అభివృద్ధే తారకమంత్రంగా లక్షిస్తూ బ్రెజిల్లో జరిగిన ఆరో సదస్సు వివరాలపై విశ్లేషణ. ఆరో సదస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు భాసిల్లే బ్రెజిల్, రష్యా, భారత్,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ‘బ్రిక్స్’ ఆరో సదస్సు జూలై 15-16, 2004న బ్రెజిల్లో జరిగింది. ఆ దేశ రాజధాని బ్రెసీలియాతో పాటు ఫోర్టలెజా నగరాలు ఈ రెండురోజుల కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు, బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్, వాతావరణ మార్పులు అనే అంశాలుప్రధాన అజెండాగా సదస్సు సాగింది. అర్జెంటీనా, చిలీ, కొలంబియా, పెరూ దేశాల నాయకులను కూడా ఆహ్వానించడం ద్వారా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ జనాభాలో 40 శాతం వాటాను కలిగిన బ్రిక్స్ దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1/5 వ వంతు వాటా ఉండటం విశేషం. బ్రిక్స్ బ్యాంక్ - భారత్ పాత్ర ఆరో సదస్సులో అతి ముఖ్యమైన అంశం బ్రిక్స్ బ్యాంక్. ఈ బ్యాంక్’ ఏర్పాటుకు ఆయా దేశాల నాయకులు సమ్మతించారు. 2011-12లో బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటును భారత్ మొదటిసారిగా ప్రతిపాదించింది. దీనికనుగుణంగా 2012 లో ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంక్ ఏర్పాటు దిశగా మార్గదర్శకాలు రూపొందించేందుకు 2013 మార్చిలో దక్షిణాఫ్రికాలో జరిగిన సమావేశంలో ఆవిర్భవించింది. 10,000 కోట్ల డాలర్ల ప్రారంభ అధీకృత మూలధనం, 5,000 కోట్ల డాలర్ల ప్రారంభ వాటా పెట్టుబడితో బ్రిక్స్ బ్యాంక్ నెలకొల్పేం దుకు నాయకులు ఆమోదం తెలిపారు. దీంతో బ్యాంకు ఏర్పాటుకు గత కొంతకాలం నుంచి భారత్ చేస్తున్న ప్రయత్నం ఫలించింది. బ్రిక్స్ బ్యాంక్‌కు సంబంధించి బ్యాంకును ఏర్పాటు చేయాల్సిన ప్రదేశం, అధ్యక్ష పదవి, వాటా హక్కులు లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. బ్రిక్స్ బ్యాంక్‌కు అత్యధిక నిధులు ఇచ్చి , దాని కార్యకలాపాల్లో తనకే ఆధిపత్యం ఉండేలా చైనా ప్రయత్నాలకు భారత్ మొదటి నుంచి అడ్డుకుంటూనే వచ్చింది. ఈ చర్యతో సభ్యదేశాలన్నీ సమాన వాటాలు అందించాలని అంగీకారానికి వచ్చాయి. బ్యాంక్ ముఖ్య కేంద్రం షాంఘై (చైనా)లో ఏర్పాటుకు కూటమి అంగీకరించింది. బ్రిక్స్ బ్యాంక్ ప్రథమ అధ్యక్ష పదవి ఆరేళ్లపాటు భారత్‌కు, అనంతరం వంతుల వారీగా ఒక్కో దేశం అయిదేళ్లపాటు పదవిని చేపట్టేలా ఒప్పందం కుదిరింది. అవస్థాపనా సౌకర్యాలు, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి సభ్యదేశాలకు ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం. బ్రిక్స్బ్యాంక్ ఏర్పాటు - ప్రభావం భారత్‌తోపాటు సబ్-సహారా ఆఫ్రికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు అవస్థాపనా రంగంలో పెట్టుబడుల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అవస్థాపనా రంగానికి అవసరమైన వనరుల లభ్యత తక్కువగా ఉండటం, కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఏటా అవస్థాపనా రంగంపై 800 బిలియన్ డాలర్ల పెట్టుబడి సమకూరుతోంది.రెండు దశాబ్దాల్లో సంవత్సరానికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా. దీనిలో 1.2ట్రిలియన్ డాలర్లు న్యూ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌లపై ఉండవచ్చు. తద్వారా ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణంలో పెరుగుదల కనిపిస్తుంది. కొన్ని ముఖ్య రంగాలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాల విషయంలో నాణ్యత పరంగా, పరిమాణాత్మకంగా అధిక డిమాండ్ ఏర్పడే సూచనలున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైల్వేలు, రహదారు లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణీకరణ లాంటి మౌలిక సౌకర్యాల అభివృద్ధి విషయంలో పెట్టుబడులను సమకూర్చాల్సిన ఆవశ్యకత ఉంది. అనేక దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఆశించిన స్థాయిలో లేవు. సురక్షిత తాగునీరు, మెరుగైన పారిశుధ్ధ్యానికి కృషిచేయాలి. వీటికి సంబంధించిన నిధుల విషయంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందు కాలంతో పోల్చినప్పుడు తర్వాత కాలం లో ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయం తగ్గింది. బ్రిక్స్ బ్యాంక్ భారత్ అవస్థాపనా రంగంలో పెట్టుబడుల అవసరాన్ని తీర్చడమే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలనూ ఆదుకోగలదని బ్రిక్స్ దేశాల్లోని ఆర్థికవేత్తల అభిప్రాయం. భారత్ ప్రతిపాదనే బ్రిక్స్ బ్యాంక్ బ్రెటన్ఉడ్ సంస్థలైన ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆశించిన స్థాయిలో సాయం లేకపోవడంతో బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. రెండేళ్ల క్రితం న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో బ్రిక్స్ బ్యాంక్ ఆలోచనను భారత్ తెరపైకి తీసుకువచ్చింది. ఐ.ఎం.ఎఫ్‌కు ప్రత్యామ్నాయం అమెరికా కాంగ్రెస్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కో టా సంస్కరణలు-2010’ని ఆమోదించకుంటే బ్రిక్స్ బ్యాం క్ మున్ముందు కాలంలో ప్రాచుర్యం పొందుతుంది. నూతన అభివృద్ధి బ్యాంకుతో పాటు కంటింజెంట్ రిజర్వఫండ్ ఏ ర్పాటు చర్యలు బ్రిక్స్ దేశాల్లో వృద్ధి, సుస్థిరతకు దారి తీయడంతోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనాన్ని చేకూర్చగలవని భారత ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. పటిష్టమైన బ్రిక్స్ కూటమి ప్రపంచ వాణిజ్య సంస్థ, వాతావరణ మార్పుల కన్వెన్షన్లలో తన వాదనలను సమర్థంగా వినిపించగలదు. అవస్థాపనా రంగా నికి పెట్టుబడులకు సంబంధించి ఐఎంఎఫ్‌కు ప్రత్యామ్నా యంగా బ్రిక్స్ బ్యాంక్ వెలుగులీనుతుందని ఆశించవచ్చు. ‘కంటింజెంట్ రిజర్వ అగ్రిమెంట్’ బ్రెజిల్ నగరమైన ఫోర్టలెజాలో జూలై 15న జరిగిన బ్రిక్స్ సదస్సులో బ్రిక్స్ బ్యాంక్‌తోపాటు మరో విత్త సంస్థ ఏర్పాటుకు సభ్యదేశాలు ఆమోదించాయి. దీనికి అనుగుణంగా‘కంటింజెంట్ రిజర్వ అగ్రిమెంట్ పేరిట ’ వంద బిలియన్ డాలర్లతో ఏర్పాటవుతుంది. కూటమిలోని సభ్యదేశాలు విత్త సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆదుకోవడానికి ఇది దోహదపడుతుంది. కొత్త అభివృద్ధి బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ ఒప్పందాన్ని సభ్యదేశాల పార్లమెంట్లు ఆమోదించాల్సిన అవసరం ఉంది. తమ విదేశీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలపై అమెరికా, యూరప్ దేశాలు అవలంభిస్తున్న పక్షపాత ధోరణిని బ్రిక్స్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ల ఏర్పాటుతో అధిగమించగలమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్-చైనా సమీక్ష సభ్య దేశాల అధినేతలతో ముఖాముఖి సమావేశాలు జరపడానికి బ్రిక్స్ వేదిక కల్పించిన అవకాశాన్ని నరేంద్రమోడీ సద్వినియోగపరచుకున్నారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌తో ఆయన సమావేశమయ్యా రు. బ్రిక్స్ బ్యాంక్ స్థాపనలో సమానత్వ సూత్రాన్ని పాటించాలని చైనాను ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, శాంతియుత వాతావరణానికి పాటుపడాలని కోరారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సహకారంలో సమతుల్యత ఏర్పడేలా చూడాలని జిన్‌పింగ్ దృష్టికి తీసుకువచ్చారు. సరిహద్దు వివాదం, అంతర్జాతీయ ఉగ్రవాదం పట్ల చైనా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. షాంఘై సహకార సంస్థలో భారత్ క్రియాశీలక పాత్ర పోషించాలని కోరింది. అలాగే నవంబర్‌లో చైనాలో జరిగే ఆసియా, పసిఫిక్ ఆర్థిక సదస్సులో పాల్గొనాల్సిందిగా మోడీని ఆహ్వానించింది. చిరకాల మిత్రుడు రష్యా ఫోర్టలెజాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన మోడీ.. రష్యా తమ చిరకాల మిత్రుడు అని ప్రకటించారు. చైనా లేదా పాకిస్థాన్ మీదుగా పైపులైన్ల ద్వారా సహజ వాయువును సరఫరా చేసే విషయం గురించి మోడీ, పుతిన్‌లు చర్చించారు. ఇరు దేశాల మధ్య అణుశక్తి, రక్షణ, విద్యుత్, అంతరిక్ష పరిశోధనలు, వాణిజ్య సంబంధాలను మరింత ఉన్నతికి చేర్చాలని ఆకాంక్షించారు. పుతిన్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్‌కు వచ్చినప్పుడు రష్యా సహకారంతో నిర్మితమైన కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని సందర్శించాలని మోడీ కోరారు. ద్వైపాక్షిక సంబంధాలపై భారత్, బ్రెజిల్ ఒప్పందాలు భారత్, బ్రెజిల్‌ల మధ్య పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారం, దౌత్య వ్యవహారాల్లో సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటుకు సంబంధించి మూడు ఒప్పందాలపై జూలై 16న సంతకాలు జరిగాయి. బ్రెజిల్ అధ్యక్షురా లు దిల్మా రౌసెఫ్‌తో సమావేశమైన మోడీ ఇరుదేశాలు వాణి జ్యం పెట్టుబడుల రంగంలో సహకారం విస్తృతం చేసుకోవాలని ఆకాంక్షించారు. బ్రిక్స్సభ ముగింపులో దక్షిణాఫ్రికా అ ధ్యక్షుడు జాకబ్‌జుమాతో మోడీ భేటీ అయ్యారు. వచ్చే ఏడా ది భారత్‌లో నిర్వహించే గాంధీ శతజయంత్యుత్సవాలకు భారత్‌కు రావాల్సిందిగా జుమాను మోడీ ఆహ్వానించారు. భారత్ విజయాలు బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు. ఇందులో మొదటి అధ్యక్ష పదవి భారత్‌కు లభించడం. షాంఘై సహకార సంస్థలో భారత్‌కు పూర్తి సభ్యత్వం. ఈ సంస్థలో భారత్ జోక్యాన్ని సహించని చైనా అనుకూల వైఖరిని ప్రదర్శించడం గొప్ప విజయం. చైనా పర్యటనకు రావాలంటూ మోడీని ఆహ్వానించ డం శుభపరిణామం. స్పందించిన భారత్ చైనా అధ్యక్షుడిని తమ దేశం సందర్శించాలంటూ కోరింది. మోడీ మాట.. మైత్రి బాట ఈ సదస్సుకు మొదటిసారి హాజరైన భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రశాంత, సంతులిత, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యకతను ప్రస్తావించారు. బ్రిక్స్ దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పరిచే క్రమంలో ఆయా దేశాలలోని యువత చొరవ చూపా లన్నారు. మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 1.స్వేచ్ఛాయుత అంతర్జాతీయ వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వృద్ధి పెంపునకు ముఖ్యాంశంగా నిలుస్తుంది. కొన్ని దేశాలలో అమలులో ఉన్న కఠిన ద్రవ్య విధానాలు పెట్టుబడుల క్షీణతకు, ఆర్థిక వృద్ధి పురోగమనానికి ప్రతికూలంగా మారే ఆస్కారముంది. 2.సుస్థిరతకు భారత్ మొదటి ప్రాధాన్యమిస్తుంది. అవస్థాపనా రంగంపై పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలతో భారత్‌లోని సగటు మానవుని జీవన ప్రమాణం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. 3.బ్రిక్స్ దేశాలకు చెందిన నగరాలు, స్థానిక సంస్థల మధ్య సంబంధాల పెంపు విషయంలో సభ్యదేశాలకు చెందిన యువత ముఖ్య భూమిక పోషించాలి. 4.బ్రిక్స్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, వనరుల యాజమాన్యం, పట్టణాభివృద్ధి, యువ శాస్త్రవేత్తల ఫోరమ్ ఆవిర్భావంతో సభ్యదేశాల మధ్య సహకారం పెంపొందాలి. 5.అందుబాటులో ఉండేలా బ్రిక్స్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫా మ్ ఏర్పాటు లాంటి ప్రోత్సాహకాలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల మధ్య సహకారం పెంపొందించడానికి అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. సభ్యదేశాలలో పర్యాటకరంగ అభివృద్ధికి సమగ్ర విధానాన్ని అవలంబించాలి.