breaking news
Delhi Metro Rail corporation limited
-
పొగరాదు.. సెగరాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణహిత హైడ్రోజన్ బస్సులు రంగప్రవేశం చేశాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కేంద్ర సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద హైడ్రోజన్ ఆధారిత షటిల్ బస్సు సర్వీసులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) లాంఛనంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, పెట్రోలియం, సహజ వాయువు శాఖల సమన్వయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం.. అత్యాధునిక భద్రత.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) అందించిన రెండు హైడ్రోజన్ బస్సులను డీఎంఆర్సీ నడుపుతోంది. ఒక్కో బస్సులో 35 మంది ప్రయాణించే వీలుంది. ఈ బస్సులు కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి భద్రతను కూడా కల్పిస్తున్నాయి. ప్రతి బస్సులో జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు బస్సు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. కాలుష్య రహిత ఇంధనంతో నడిచే ఈ బస్సులు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే హైడ్రోజన్ రవాణా వ్యవస్థకు రోల్ మోడల్ కానున్నాయి. ప్రయాణ మార్గాలు ఇవే.... సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం), సేవా తీర్థ మెట్రో స్టేషన్ల మధ్య ఈ బస్సులు నడుస్తాయి. సెంట్రల్ విస్టా పరిధిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలైన నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్, అక్బర్ రోడ్, బరోడా హౌస్ వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తాయి. వీటితో పాటు ఇండియా గేట్, నేషనల్ స్టేడియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికీ ఈ సేవలు ఉపయోగపడతాయి. వేళలు, టికెట్ ధరలు... ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు 30 నిమిషాలకోబస్సు అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు భారం కాకుండా స్టేజీల వారీగా కేవలం రూ. 10, రూ. 15 చొప్పున టిక్కెట్ ధరలను నిర్ణయించారు. ప్రయాణికులు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, యూపీఐ లేదా నగదు రూపంలో టిక్కెట్ తీసుకునే వెసులుబాటును కల్పించారు. మెట్రో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి (లాస్ట్ మైల్ కనెక్టివిటీ) ఇబ్బంది పడకుండా ఈ బస్సులు సహాయపడతాయని, రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఇదొక కీలక ముందడుగు అని డీఎంఆర్సీ డైరెక్టర్ అమిత్ కుమార్ జైన్ తెలిపారు. -
డీఎంఆర్సీలో 3428 పోస్టులు
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రెండు కేటగిరీల పోస్టులను పొందుపరిచింది. ఒకటి.. ఎగ్జిక్యూటివ్. రెండు.. నాన్ ఎగ్జిక్యూటివ్.మొదటి కేటగిరీలో 6 రకాల ఉద్యోగాలు, రెండో కేటగిరీలో 8 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం మీద స్టేషన్ కంట్రోలర్, కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్, మెయింటెయినర్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటి వివరాలు.. ఖాళీలు: మొత్తం పోస్టులు 3428 (ఎగ్జిక్యూటివ్-44, నాన్ ఎగ్జిక్యూటివ్-3384) 1. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్-44 (ఎలక్ట్రికల్-14, సివిల్-5, ఆపరేషన్స్-5, హెచ్ఆర్-3, ఫైనాన్స్-10, ఎస్ అండ్ టీ-7) 2. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఉద్యోగాలు: ఎ. స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్ (ఎస్సీ/టీవో)-662 (ఓపెన్-376, ఓబీసీ-104, ఎస్సీ-96, ఎస్టీ-86). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-95 బి. కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్ (సీఆర్ఏ)-1100 (ఓపెన్-556, ఓబీసీ-297, ఎస్సీ-165, ఎస్టీ-82). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-159 సి. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-48 (ఓసీ-26, ఓబీసీ-12, ఎస్సీ-7, ఎస్టీ-3). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-6 డి. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్) -81 (ఓసీ-42, ఓబీసీ-21, ఎస్సీ-12, ఎస్టీ-6). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-11 ఇ. జూనియర్ ఇంజనీర్(మెకానికల్)-10 ఎఫ్. జూనియర్ ఇంజనీర్(సివిల్)-66 (ఓసీ-33, ఓబీసీ-18, ఎస్సీ-10, ఎస్టీ-5). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-9 జి. అకౌంట్ అసిస్టెంట్-24 హెచ్. మెయింటెయినర్-1393 ((ఎలక్ట్రీషియన్-456 (ఓసీ-231, ఓబీసీ-123, ఎస్సీ-68, ఎస్టీ-34); ఫిట్టర్-243 (ఓసీ-134, ఓబీసీ-60, ఎస్సీ-33, ఎస్టీ- 16); ఎలక్ట్రానిక్ మెకానిక్- 602 (ఓసీ-327, ఓబీసీ-110, ఎస్సీ-87, ఎస్టీ-78), రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్-92 (ఓసీ-44, ఓబీసీ-22, ఎస్సీ-12, ఎస్టీ-14)) వేతనం: ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులకు నెలకు రూ.20,600-46,500 చెల్లిస్తారు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఎస్సీ/టీవో పోస్టులకు రూ.13,500-25,520; సీఆర్ఏ, అకౌంట్ అసిస్టెంట్లకు రూ.10,170-18,500; జూనియర్ ఇంజనీర్లకు రూ.13,500-25,520; మెయింటెయినర్ పోస్టులకు 8000-14,140 చెల్లిస్తారు. విద్యార్హత: 1.అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్/ఎస్ అండ్ టీ/సివిల్) పోస్టులకు 2016లో గేట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత బ్రాంచ్‌ల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్. 2.ఎస్సీ/టీవో పోస్టులకు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/తత్సమాన బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా (లేదా) బీఎస్సీ హానర్స్ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్) (లేదా) బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్). 3.సీఆర్ఏలకు మూడేళ్ల/నాలుగేళ్ల డిగ్రీతోపాటు కంప్యూటర్ లిటరసీ (కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం ఆరు వారాల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సు) 4.జూనియర్ ఇంజనీర్లకు సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా 5.మెయింటెయినర్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ వయసు: (2016 జూలై 1 నాటికి)18-28 ఏళ్లు. ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని అన్ని పోస్టులకు, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని జూనియర్ ఇంజనీర్లకు మూడు దశల (రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా ఎంపిక చేస్తారు. ఎస్సీ/టీవో, సీఆర్ఏ పోస్టులకు నాలుగు దశల (రాత పరీక్ష, సైకలాజికల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా; మిగిలిన పోస్టులకు రెండు దశల (రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తు రుసుం: ఓసీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.400; ఇతరులు రూ.150 చెల్లించాలి. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15. వెబ్సైట్: www.delhimetrorail.com


