Dehydration problem
-
మజ్జిగ లేదా నిమ్మరసం చాలా.. డీహైడ్రేషన్‌కు అదే మేలా?
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, తీవ్రమైన వేసవికాలంతో పాటు అధిక తేమ కూడా తోడవుతోంది. వాస్తవానికి, రాబోయే కొన్నేళ్లు దేశ చరిత్రలోనే అత్యంత వేడిగా ఉండే కాలంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది, దీనివల్ల ఎక్కువ మంది డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వడగాలుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో సరైన హైడ్రేషన్ ఉత్పత్తులపై అవగాహన అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.ఎలక్ట్రోలైట్ల లోపం కీలకం...అనారోగ్యం లేదా విరేచనాల సమయంలోనూ, అలాగే రోజువారీ సంరక్షణలోనూ, ఉన్నతమైన హైడ్రేషన్ ఉత్పత్తులతో శరీరానికి తగినంత నీరు అందించడంపై అవగాహనను పెరగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో, డీహైడ్రేషన్ కు ఇప్పటికీ మజ్జిగ లేదా నిమ్మరసం వంటి ఇంటి చికిత్సలే మొదటి పరిష్కారంగా ఉన్నాయి. ఒక వ్యక్తి డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, వారు కేవలం ద్రవాలను మాత్రమే కాకుండా సోడియం, క్లోరైడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతారు. నిజానికి ఎలక్ట్రోలైట్లు శరీరంలోని సంకేత అణువులు. అవి నరాల ద్వారా ప్రయాణించి, కదలికలకు సహాయపడి, వ్యక్తులు చురుకుగా ఉండేలా చేస్తాయి అని అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన వైద్యులు డా. అశుతోష్. మరి అలాంటి ఎలక్ట్రోలైట్ల లోపం కండరాల కదలికను తగ్గించి, అలసట నీరసానికి దారితీస్తుంది. మరి వీటిని పునరుద్ధరించుకోవడానికి ఏం చేయాలి?స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ పానీయాలు, గ్లూకోజ్ పౌడర్లు వివిధ ఎలక్ట్రోలైట్ ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించడంతో, హైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ విభాగం పోటాపోటీగా మారింది. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ భారతదేశ వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా హైడ్రేషన్ విభాగం విపరీతమైన వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో, వినియోగదారులు అనారోగ్య సమస్యలకు అతీతంగా, శక్తి క్షీణించినప్పుడు లేదా అలసిపోయినప్పుడు వేగంగా కోలుకోవడానికి అనేక రకాల ఆరోగ్యకరమైన హైడ్రేషన్ సొల్యూషన్లను కోరుకుంటున్నారు. డీహైడ్రేషన్ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతున్నందున, విరేచనాలు రోజువారీ హైడ్రేషన్ అవసరాలను తీర్చడానికి కెన్ వ్యూ ఓఆర్ఎస్ఎల్, ఇఆర్జెఎల్ వంటి బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వడదెబ్బ, కండరాల నొప్పులు మొదలైన రోజువారీ సందర్భాలలో నీరసంగా అనిపించినప్పుడు లేదా అలసట, బలహీనత కారణంగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఇవి సహాయకారిగా పనిచేస్తున్నాయి. రోజువారీ హైడ్రేషన్ కోసం రూపొందిన ఎలక్ట్రోలైట్ డ్రింక్, మూడు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను (సోడియం, పొటాషియం, క్లోరైడ్) విటమిన్ సి లను వేగవంతమైన హైడ్రేషన్ ను అందిస్తూనే, పండ్ల రసాల తరహాలో రుచికరంగా ఉండేవి అందుబాటులో ఉన్నాయి.అయితే సరైన సందర్భాలకు సరైన హైడ్రేషన్ ద్రావణాలను ఎంచుకోవడంపై అవగాహన కల్పించడానికి కల్పించాలి. ఉదాహరణకు, విరేచనాల కోసం డబ్లు్యహెచ్‌ఓ ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణాలు రోజువారీ హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్ ద్రావణాలు వినియోగించాలి. ఇలాంటి అవగాహన పెంచేందుకు తెలుగు రాష్ట్రాలలో వైద్య నిపుణులు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కెన్ వ్యూ బ్రాండ్ కలిసి పనిచేస్తోంది అని చెప్పారు సంస్థ కు చెందిన ప్రశాంత్ షిండే.ఏడాది పొడవునా...డీహైడ్రేషన్పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంపై పెరిగిన అవగాహన మహమ్మారి అనంతర ఆరోగ్యం పై దృష్టి సారించడం వంటి అంశాలన్నీ కలిసి, క్రియాశీల నివారణ సంరక్షణ వైపు మార్పును వేగవంతం చేశాయి. చాలా మంది ప్రతిరోజూ తగినంత నీరు తాగడాన్ని ఒక ఆరోగ్యకర అలవాటుగా పరిగణిస్తున్నారు. అయితే నిలకడ లేని వాతావరణ పరిస్థితులతో పాటు తీరికలేని జీవనశైలిని గడుపుతున్నందున, డీహైడ్రేషన్ కేవలం వేసవి కాలానికే పరిమితం కావడం లేదు. ఎండలో , ఏసీ ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు, అలాగే జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల సమయంలో కూడా సంభవించవచ్చు. వడదెబ్బ లేదా నీరసం, బలహీనత కారణంగా నిస్సత్తువగా అనిపించినప్పుడు, రోజువారీ సందర్భాలలో ఎలక్ట్రోలైట్లు నీరు తగ్గిపోయినట్లు అనిపించినప్పుడు, వాటిని తిరిగి నింపడానికి ఇఆర్జెఎల్ వంటివి సహాయపడుతుందన్నాయి.డీహైడ్రేషన్ , పిల్లలు, వృద్ధులు శారీరకంగా శ్రమతో కూడిన జీవనశైలి కలిగినవారు ఎక్కువ సమయం ఆరుబయట గడిపేవారితో సహా కొన్ని వర్గాలు డీహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతాయి. చిన్న పిల్లలు తమ దాహాన్ని సరిగ్గా చెప్పలేరు, దీనివల్ల డీహైడ్రేషన్ కు సులువుగా లోనవుతారు. వృద్ధులలో దాహానికి గురి చేసే యంత్రాంగం బలహీనంగా ఉంటుంది, వారు అనారోగ్యం వేడి సంబంధిత డీహైడ్రేషన్ రెండింటికీ గురయ్యే అవకాశం ఉంది. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు డీహైడ్రేషన్ కు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది వారి డీహైడ్రేషన్ ను జాగ్రత్తగా పరిష్కరించడం అవసరం. ఇలాంటి వినియోగదారుల సమూహాలకు, కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి నీటితో పాటు తగినంత ఎలక్ట్రోలైట్లను తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అతిసారం అనేది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య, ఇది చిన్నపిల్లల మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అతిసారం చికిత్సలో ఉపకరిస్తుంది.అవగాహన కార్యక్రమాలు... నిర్వహిస్తున్నాం డీహైడ్రేషన్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి నీరు తాగితే సరిపోతుందని తరచుగా నమ్ముతారు. అయితే, శరీరంపై డీహైడ్రేషన్ మొత్తం శారీరక విధులపై ప్రభావం, ఎలక్ట్రోలైట్ పానీయాలు పోషించే కీలక పాత్రల గురించి పరిమిత అవగాహన మాత్రమే ఉంది. మా ప్రచారాల ద్వారా నీరు తాగే అలవాట్లను సరిదిద్దడం, దేశంలో డీహైడ్రేషన్ ఒక కీలకమైన ప్రజారోగ్య సమస్యగా అవగాహన కల్పించడంపై కృషి చేస్తున్నాం –ప్రశాంత్ షిండె, కెన్ వ్యూ -
భౌభౌ.. బీ కేర్ ఫుల్...ఈ కాలంలోనే వాటి కాట్లు ఎక్కువ
సాక్షి హైదరాబాద్/కాచిగూడ: ఇందుగలవందు లేవనే సందేహంబు వలదు.. ఏ సందు వెదికినా అందందే భౌభౌ మనగలదు అన్నట్టుగా ఉంది నగరంలో వీధి కుక్కల పరిస్థితి. రోజూ వందల సంఖ్యలో నారాయణగూడ ఐపీఎంలో బారులు తీరుతున్న బాధితుల సంఖ్య ఓ నిదర్శనం. ఇక ఎండాకాలం వచ్చిందంటే కుక్కకాట్ల సంఖ్య మరింత పెరుగుతోంది. నారాయణగూడ వైఎంసీ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు కొన్ని రోజులుగా కుక్కకాటు బాధితుల రాక పెరిగింది. ‘ప్రతిరోజూ 250 నుంచి 300 వరకూ బాధితులు వస్తారు. ఎండాకాలం ఆ సంఖ్య 400 నుంచి 600 వరకూ పెరుగుతోంది’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. వేసవిలో కారణాలివీ.. సైకాలజీ టుడే ప్రకారం వేడి, ఉక్కపోత వాతావరణంలో మనుషుల్లో ఎలాగైతే కోపం, చికాకు పెరుగుతుందో అదే శునకాలకు కూడా వర్తిస్తుంది. ఈ సీజన్లో ఆహారం, నీరు అందకపోతే డీహైడ్రేట్ కావడంతో కూడా అవి కరుస్తాయి. దీనికి మరో కోణం కూడా ఉంది. వేసవిలో ఆరుబయట నీడనిచ్చే చెట్లు, పార్కులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జనం సేదతీరాలనుకుంటారు. అందువల్ల కూడా ఈ సీజన్లో కుక్క కాట్లు పెరుగుతున్నాయి. పెట్స్ బైట్స్.. వీధి శునకాలు మాత్రమే కాదు అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ చెప్పిన విషయం ఏమిటంటే ఎండాకాలంలో మొత్తం కుక్క కాట్లలో పెంపుడు శునకాల వాటా 27శాతం ఉంటుందట. శరీరంలో కరిచే ప్రాంతాలపై సంబంధిత నిపుణులు చెబుతున్న ప్రకారం.. కుక్కకాట్లలో 34 శాతం తల, మెడ, చెంపలు, పెదాలపై 21 శాతం, ముక్కు, చెవులపై 8శాతం ఉంటున్నట్టు గుర్తించారు. అదే విధంగా కాలి పిక్కలు, చీల మండలం దగ్గర కరవడం ద్వారా కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. కుక్కకాటుతో గాయం సగటు పరిమాణం 7.15 సెంటీమీటర్లు ఉంటుందట. కోపాన్ని గుర్తించవచ్చు... పెంపుడుదైనా, వీధి కుక్కయినా కోపంగా/చిరాకుగా ఉందని, అది మనుషుల మీద దాడి చేసే అవకాశాలున్నాయనే విషయం ముందస్తుగా గుర్తించవచ్చునంటున్నారు నిపుణులు. కోపంగా ఉన్న శునకం.. చెవులు వెనక్కు సాగదీస్తుందట. నోటిని గట్టిగా మూస్తుందని, తన రెండు కాళ్ల మధ్య తోకను ఉంచి గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తుంటుందని వెల్లడిస్తున్నారు. ఇక మొరగడం సరేసరి. భౌభౌ.. కేర్ ఫుల్... వీధికుక్కలకు ఈ సీజన్లో సరిగా ఆహారం దొరకదు. దానికి తోడు వేడి వాతావరణం కూడా వాటిలో అసహనాన్ని పెంచుతుంది. కాలే కడుపుతో వీధుల్లో ఇవి వీరంగాలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఆహారం అందేలా చూడడంతో పాటు ముఖ్యంగా స్కూల్ లేదు కదా అని చిన్నారులను వీధుల్లోకి పంపవద్దు. పార్కులు, ఆటస్థలాల్లో కొంత రెక్కీ చేశాకే అనుమతించాలి. ఇక పెంపుడు కుక్కల్లో కొన్ని ప్రత్యేకమైన బ్రీడ్స్ అతిగా కరిచేవిగా గుర్తించారు. జర్మన్ షెపర్డ్, పిట్ బుల్ టెర్రిర్ వంటి కొన్ని ప్రత్యేకమైన జాతుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కుక్కలు డీహైడ్రేట్ అవకుండా ఎప్పటికప్పుడు వాటికి నీరు అందేలా చూసుకోవాలి. -
6 గంటల నిద్రతో..అనర్థమే
వాషింగ్టన్: రోజూ ఆరు గంటలే నిద్రపోయే వారిలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నిద్రకు, డీహైడ్రేషన్‌కు ఎలాంటి సంబంధం ఉందన్న కోణంలో అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనానికి చైనా, అమెరికాకు చెందిన యుక్త వయసు వారిని ఎంచుకున్నారు. రాత్రి 6, 8 గంటలు నిద్రపోతున్న వారి మూత్ర నమూనాలను పరీక్షించి పోల్చి చూడగా.. 6 గంటలు నిద్రపోతున్న వారిలో 16 నుంచి 59 శాతం డీహైడ్రేషన్ లక్షణాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని వాసొప్రెషన్ హార్మోనే దీనికి కారణమని తేల్చారు. ఈ హార్మోనే పగలు, రాత్రి శరీరంలో హైడ్రేషన్‌ను నియంత్రిస్తుందని చెప్పారు. నిద్రిస్తున్నప్పుడు ఆరు గంటల వ్యవధి తర్వాత ఈ హార్మోన్ అధిక మొత్తంలో విడుదలవుతుందని, ఒకవేళ 2 గంటలు ముందే నిద్రలేస్తే ఈ హార్మోన్ తగ్గి డీహైడ్రేషన్ బారిన పడుతున్నట్లు పరిశోధకుడు అషెర్ రోసింగర్ తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు వస్తాయని హెచ్చరించారు. అయితే 6 గంటలు నిద్రపోతే దానికి తగ్గట్టు ఎక్కువ నీటిని తాగితే ఏ సమస్యా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్ స్లీప్‌లో ప్రచురితమయ్యాయి. -
ఆరోగ్యంగా కరుణ
► రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ ►పరామర్శల వెల్లువ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శలు వెల్లువెత్తుతున్నారుు. సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం. కరుణానిధి గురువారం ఉదయం న్యూట్రీషన్, డీహైడ్రేషన్ సమస్యతో ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు రెండోరోజు శుక్రవారం అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కరుణానిధి వెంట ఆసుపత్రిలో ఆయన కుమారులు స్టాలిన్, అళగిరి, కుమార్తెలు సెల్వి,కనిమొళి ఉన్నారు. వృద్ధులకు చికిత్స అందించే ప్రత్యేక ఐసీయూ యూనిట్ విభాగంలో కరుణానిధి ఉన్నట్టు సమాచారం. ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫోన్లో పరామర్శించారు. ఎంపీ, కరుణ గారాల పట్టి కనిమొళితో ఆయన మాట్లాడారు. ఎండీఎంకే నేత వైగో, ఇక, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, అధికార ప్రతినిధి కుష్బు, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, కేంద్ర మాజీ మంత్రులు టీఆర్ బాలు, పళని మాణిక్యం ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధిని పరామర్శించినానంతరం మీడియాతో డీఎంకే సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. వైద్యుల సూచన మేరకే ఆయన డిశ్చార్జ్ అవుతారనీ, ఆయన నిర్ణయం మేరకు డిశ్చార్జ్ ఇక్కడ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త సీఎం జయలలిత డిశ్చార్జ్ విషయంగా అపోలో వర్గాల వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తున్నట్టు ఉండడం గమనార్హం. ఇక, కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధినేతకు ఎలాంటి సమస్య లేదు అని, ఆయనకు సాధారణ చెకప్ మాత్రమేనని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు.


