breaking news
Deepesh Devendran
-
టీమిండియా వైపు దూసుకొస్తున్న నయా పేస్ గుర్రం.. ఎవరంటే?
టీమిండియా వైపు మరో పేస్ సంచలనం దూసుకొస్తున్నాడు. గంటకు 145 కి.మీ వేగానికి పైగా బంతులు విసిరి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత తరపున అదరగొట్టిన ఈ యువ పేసర్.. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ సత్తాచాటాడు.అతడే 18 ఏళ్ల స్పీడ్‌స్టర్ దీపేష్ దేవేంద్రన్. దీపేష్ బుధవారం తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌తో జరిగిన మ్యాచ్‌లో మధురై పాంథర్స్ తరపున టీఎన్‌పీఎల్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే దేవేంద్రన్ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో 25 పరుగలిచ్చి 1 వికెట్ పడగొట్టాడు.ఈ రైట్ ఆర్మ్ పేసర్ వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 16వ ఓవర్ మొదటి బంతిని ఏకంగా 146 కి.మీ/గం వేగంతో విసిరి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. అదే ఓవర్లో మరో మూడు సార్లు 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసురుతూ, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడి బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు అతడు కచ్చితంగా భారత సీనియర్ జట్టులోకి వస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అతడి టీమ్మేట్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.కాగా గత కొంత కాలంగా దీపేష్ వైట్‌బాల్ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఆసియాకప్-2025 ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికి.. దీపేష్ టోర్నీ అసాంతం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి టోర్నీలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లోనూ అతడు అదరగొట్టాడు.బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌లు కలిసి దీపేష్ పది వికెట్లు పడగొట్టాడు. వినూ మన్కడ్ ట్రోఫీలోనూ తమిళనాడు తరఫున అతడు సత్తాచాటాడు. ఇక అండర్ 19 ప్రపంచకప్-2026ను భారత్ సొంతం చేసుకోవడంలో దీపేష్ది కీలక పాత్ర. సెమీస్, ఫైనల్లో కలిపి అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.చదవండి: టీమిండియాతో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం -
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్ భారీ స్కోరు
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలతో అఫ్గన్ బ్యాటర్లుకు లైఫ్ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్ భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఫైజల్ షినోజాదాజింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్‌కప్ రెండో సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్ సదాత్ (39), ఖలీద్ అహ్మద్జాయ్ (31) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఫైజల్ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉజైరుల్లా అజేయ శతకంమొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్ బ్యాటర్ ఉజైరుల్లా నియాజాయ్ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫైజల్- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్‌కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.𝙄𝙩 𝙩𝙤𝙤𝙠 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙩𝙤 𝙨𝙩𝙤𝙥 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ✨Deepesh Devendran goes through the gate to hand #TeamIndia a vital wicket 👊#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/eVzeiSfryl— Star Sports (@StarSportsIndia) February 4, 2026ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరుఅండర్-19 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్


