గొంగడి ప్రదర్శన
తెలంగాణ సంస్కృతితో మిళితమైన గొంగడి ప్రదర్శన శుక్రవారం ప్రారంభం కానుంది. దక్కన్ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం, ఉన్ని వేదిక, ఆహార సార్వభౌమత్వ సంఘటన, ఆంత్ర సంస్థలు సంయుక్తంగా బేగంపేట్ దారం వస్త్ర షోరూమ్‌లో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చేయి తిరిగిన నేతపనివారు నేసిన విభిన్న గొంగడులు ఇక్కడ ప్రదర్శిస్తారు. మూడు రోజుల ఈ ఎగ్జిబిషన్లో శనివారం ఒగ్గు కథ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
వివరాలకు ఫోన్: 95733 99911. సనత్‌నగర్