breaking news
to day news updates
-
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చ మాఫియా అరాచకాలు... యథేచ్ఛగా డ్రగ్స్ దందా... పేకాట క్లబ్బులతో భారీగా దోపిడీ
-
టుడే న్యూస్ అప్ డేట్స్
ఢిల్లీ : నేడు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ ఢిల్లీ : నేడు నూతన కాగ్‌గా రాజీవ్ మెహర్షి ప్రమాణ స్వీకారం హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-1 విజేత శివబాలాజీ 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీని వరించిన విజయం శ్రీకాకుళం : నేడు నేరడీ బ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్న నేతలు, రైతు సంఘాలు విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం తిరుమల : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉదయం సింహ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి ముత్యపు పందిరి సేవ వాషింగ్టన్ : ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ భారీ విరాళం రూ.76 వేల కోట్ల కేటాయింపునకు సిద్ధమైన జుకర్ బర్గ్ ఆరోగ్యం, విద్యాభివృద్ధి లక్ష్యంగా షేర్ల విక్రయానికి నిర్ణయం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఇన్‌ఫ్లో లక్షా 28 వేలు, ఔట్ ఫ్లో 56 వేల క్యూసెక్కులు జర్మనీ ఛాన్స్‌లర్‌గా నాలుగోసారి ఎన్నికైన ఏంజెలా మెర్కెల్ ఇండోర్ వన్డేలో ఆసీస్‌పై భారత్ విజయం 5వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌కు చేరిన భారత్ -
టుడే న్యూస్ అప్ డేట్స్
► నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని సి బ్లాక్ లో సమావేశం జరుగుతుంది. 16వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆర్డినెన్సులకు చట్టరూపం ఇవ్వనున్నారు. ప్రధానంగా ఏడు ఆర్డినెన్స్‌లను బిల్లులుగా ఆమోద ముద్ర వేయనున్నారు. ► నేటి నుంచి టీయూటీఎఫ్(తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) ద్వితీయ మహాసభలు ► ‘వార్దా’ తుపాను గంట గంటకూ బలపడుతూ కోస్తాంధ్ర వైపు కదులుతోంది. తక్కువ వేగంతో పయనిస్తూ ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రి విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 950, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయానికల్లా తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ► ఇవాళ్టి నుంచి బ్యాంకులకు మూడు రోజుల వరుస సెలవులు ► చెన్నై: ఇవాళ తమిళనాడు కేబినెట్ భేటీ జయలలిత మరణం తర్వాత తొలిసారి సమావేశం కానున్న కేబినెట్ ► నేటి నుంచి రైల్వేతో పాటు మెట్రో, సబర్బన్ టికెట్ కౌంటర్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు, కౌంటర్లలో పాత 500 నోట్లను అంగీకరించరు. డిసెంబర్ 15 వరకూ పాత 500 నోట్లు తీసుకునేందుకు సమయమున్నా... మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రైలు ప్రయాణం సమయంలో కేటరింగ్ సేవలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. -
నేటి వార్తా విశేషాలు
శ్రీశైలంలో ఏడో రోజుకు చేరిన దేవీ శరన్నవరాత్రులు.. మహాగౌరి అలంకరణలో దర్శనమివ్వనున్న భ్రమరాంబదేవీ ఆరో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు.. ఉదయం తొమ్మిది గంటలకు హన్మంత వాహనంపై ఊరేగనున్న శ్రీవారు ఇంద్రకీలాద్రికి భారీగా తరలి వచ్చిన భక్తులు.. సరస్వతీ దేవీగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్మమ్మ నేడు ఇంద్రకీలాద్రిపై అన్ని క్యూలలో అమ్మవారికి ఉచిత దర్శనం నేడు అమరావతి శంకుస్థాపన విధుల్లో భాగంగా 100మంది ఎస్పీజీ అధికారుల రాక నిఘా నీడలో ఉద్ధండ్రాయుని పాలెం.. విధుల్లో 9 వేలమంది పోలీసులు అమరావతి శంకుస్థాపనకు నేడు తెలంగాణ పది జిల్లాల నుంచి మట్టి-నీరును పంపించనున్న సర్కార్ నేడు హైదరాబాద్‌కు రానున్న దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్.. తెలంగాణలో నేడు, రేపు పర్యటన -
నేటి వార్తా విశేషాలు
నేడు కాణిపాకం కల్పవృక్ష వాహనంపై ఊరేగనున్న వినాయకుడు నేడు విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించనున్న వైఎస్ జగన్. ఎయిర్ పోర్ట్ బాధిత రైతులకు ఇవ్వనున్న భరోసా నేటి నుంచి రెండు రోజులపాటు నిజామాబాద్‌లో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర నేడు ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్. రెండు రోజుల పాటు పర్యటన నేడు ఉదయం 9గంటలకు తెలంగాణ సీఎల్పీ సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. నేడు తెలంగాణ అసెంబ్లీలో వ్యాట్ బిల్లు ప్రవేశ పెట్టనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు ఢిల్లీలో 'సాగరమాల' కమిటి తొలిభేటి. హాజరుకానున్న చంద్రబాబు నేటి నుంచి తెలంగాణలో ఓటు హక్కు నమోదు నేడు ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అంత్యక్రియలు. నేడు భారత్ దక్షిణాఫ్రికా టీ 20. ఒత్తిడిలో ధోని సేన. సిరీస్ పై కన్నేసిన సఫారీలు నేడు పాకిస్థాన్ జింబాబ్వే మూడో వన్డే. మధ్యాహ్నం ఒంటిగంటలకు మ్యాచ్ నేడు ఐఎస్‌లో పుణె వర్సెస్ ముంబై మ్యాచ్