నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది.
► నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని సి బ్లాక్ లో సమావేశం జరుగుతుంది. 16వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆర్డినెన్సులకు చట్టరూపం ఇవ్వనున్నారు. ప్రధానంగా ఏడు ఆర్డినెన్స్‌లను బిల్లులుగా ఆమోద ముద్ర వేయనున్నారు.
► నేటి నుంచి టీయూటీఎఫ్(తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) ద్వితీయ మహాసభలు
► ‘వార్దా’ తుపాను గంట గంటకూ బలపడుతూ కోస్తాంధ్ర వైపు కదులుతోంది. తక్కువ వేగంతో పయనిస్తూ ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రి విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 950, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయానికల్లా తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
► ఇవాళ్టి నుంచి బ్యాంకులకు మూడు రోజుల వరుస సెలవులు
► చెన్నై: ఇవాళ తమిళనాడు కేబినెట్ భేటీ
జయలలిత మరణం తర్వాత తొలిసారి సమావేశం కానున్న కేబినెట్
► నేటి నుంచి రైల్వేతో పాటు మెట్రో, సబర్బన్ టికెట్ కౌంటర్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు, కౌంటర్లలో పాత 500 నోట్లను అంగీకరించరు. డిసెంబర్ 15 వరకూ పాత 500 నోట్లు తీసుకునేందుకు సమయమున్నా... మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రైలు ప్రయాణం సమయంలో కేటరింగ్ సేవలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.