breaking news
Dashboard Feature
-
యాక్సిడెంట్ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్
కర్ణాటకలోని బెంగళూరులోని హెబ్బగోడి ఠాణా పరిధిలో ఆదివారం సాయంత్రం ఎలక్ట్రానిక్స్ సిటీలోని అనంతనగర్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. మద్యం మత్తులో కారును అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదీ తొలుత అందరూ అనుకున్న స్టోరీ. కానీ ఈ ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్ వెలుగులో వచ్చింది. ప్రమాదంగా భావించిన ఈ ఘటన చివరికి ఒళ్లు గగుర్పొడిచే హత్యగా తేలింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రశాంత్, రోషన్ ఇద్దరు స్నేహితులు. ప్రశాంత్ బాడీబిల్డర్‌గా పనిచేస్తుండగా, రోషన్ డొమ్లూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కారులోని డాష్‌క్యామ్‌ను డీసీపీ (ఎలక్ట్రానిక్స్ సిటీ) ఎం నారాయణ గమనించి, ఆ ఫుటేజీని పరిశీలించమని ఆదేశించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.ఆదివారం సాయంత్రం కమ్మసంద్రలో కొంతమందితో కలిసి క్రికెట్ ఆడిన వీరు తరువాత మద్యం సేవించారు. మద్యం మత్తులో ప్రశాంత్ లైటర్ కోసం రోషన్ వద్దకు వచ్చి అతనిని దుర్భాషలాడాడని, దీనితో వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరినొకరు దాడి చేసుకున్నాడు. పరిస్థితి దిగజారడంతో, రోషన్ తన టాటా సఫారీలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రశాంత్ కారును వెంబడించి, కదులుతున్న వాహనం ఎడమవైపు ఫుట్‌బోర్డ్‌పైకి ఎక్కి డోర్‌ను పట్టుకుని వేలాడాడు. కారు ఆపమని ప్రశాంత్ వేడుకుంటున్నా రోషన్ పట్టించుకోలేదు. సుమారు 600 మీటర్ల దూరం వరకు కారును వేగంగా, ప్రమాదకరంగా నడిపాడు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే మొదట ఓ కాంపౌండ్ గోడను, ఆ వెంటనే వెనక్కి తిప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విజువల్స్ డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.ఇది ఉద్దేశపూర్వకమైన హత్య అని తేలడంతో, తీవ్ర గాయాలతో రోషన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి విచారణకోసం అదుపులోకితీసుకున్నామని అధికారి నారాయణ తెలిపారు. రోషన్‌కు నాలుక దాదాపు తెగిపోయిందని, చిన్న శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు మాకు తెలిపారు. సోమవారం అతన్ని డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Drunk Driving Nightmare: Bengaluru Roads Claim Another Life in Shocking Car-Ramming IncidentShocking incident from Bengaluru.A drunken brawl turned deadly when Prashanth M (33), a bodybuilder, was killed after Roshan Hegde (37), a software engineer from Mangaluru, allegedly… pic.twitter.com/sJ2c3zldMM— Karnataka Portfolio (@karnatakaportf) January 26, 2026 -
ఢిల్లీలో త్వరలో ‘దర్పణ్ 2.0’ ప్రారంభం!
పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధానిలో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ‘దర్పణ్ 2.0’ అనే అధునాతన పర్యవేక్షణ(మానిటరింగ్) డాష్‌బోర్డ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది.ఏమిటీ ‘దర్పణ్ 2.0’?దర్పణ్ (Dashboard for Analytics, Review and Performance Assessment Nationwide) అనేది వివిధ ప్రభుత్వ పథకాలను 24x7 పర్యవేక్షించేందుకు రూపొందించిన ఒక మల్టీ ల్యాంగ్వేజీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్. ఇది కేవలం సమాచారాన్ని చూపడమే కాకుండా, విశ్లేషణాత్మక అంశాలను అందిస్తుంది.ఫీచర్లు ఇవే..వేర్వేరు విభాగాల మధ్య ఉన్న డేటా అంతరాలను తొలగించి అన్ని ప్రభుత్వ పథకాల పురోగతిని ఒకే చోట చూపిస్తుంది.ప్రభుత్వ పథకాల స్టేటస్‌ను తెలియజేస్తుంది. ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. రియల్ టైమ్‌లో వీటిని ట్రాక్ చేయవచ్చు.ఏదైనా ప్రాజెక్ట్ నెమ్మదించినా లేదా అడ్డంకులు ఎదురైనా ఈ సిస్టమ్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ద్వారా ప్రతి విభాగం పనితీరును స్కోర్ కార్డుల రూపంలో అంచనా వేస్తుంది.అమలు ఎప్పుడంటే..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 12 నుంచి 16 వారాల్లో దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల నోడల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సురక్షితమైన ఏపీఐల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ఈ డాష్‌బోర్డ్‌కు అనుసంధానిస్తారు.భవిష్యత్ లక్ష్యాలుడిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా రూపొందుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విశ్లేషణలకు, పబ్లిక్ డాష్‌బోర్డ్‌లకు పునాది వేయనుంది. దీనివల్ల ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, సాక్ష్యాధారిత విధాన ప్రణాళిక రూపొందించడానికి మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ ‘దర్పణ్’ మోడల్‌ను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్: ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘NexGen UP-CM DARPAN 2.0’ పేరుతో అత్యంత ఆధునిక వెర్షన్‌ను ప్రారంభించింది. ఇందులో 53 విభాగాలకు చెందిన దాదాపు 588 పథకాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్: ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి దర్పణ్ డ్యాష్‌బోర్డ్ అందుబాటులో ఉంది.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్: పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను సమర్థవంతంగా వాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలు: మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా తమ జిల్లా స్థాయి ప్రాజెక్టుల పర్యవేక్షణకు దీనినే ఉపయోగిస్తున్నాయి.కేంద్రపాలిత ప్రాంతాలు: పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అమలులో ఉంది. -
ట్విట్టర్ నుంచి ఆ ఫీచర్ అవుట్!
కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకోవాల్సింది పోయి, ఉన్న ఫీచర్లను తొలగిస్తోంది ట్విట్టర్. బిజినెస్‌లకు ఎక్కువగా ఉపయోగపడే డ్యాష్ బోర్డ్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 2016 జూన్‌లో లాంచ్ చేసిన ఈ ఫీచర్‌ను 2017 ఫిబ్రవరి 3 నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు పేర్కొంది. ట్వీట్లను ట్రాక్ చేయడం, అనాలిటిక్స్ను పొందడం వంటి పలు వాటిని ఈ ఫీచర్ ఆఫర్ చేస్తోంది. అయితే తొలగిస్తున్న ఈ ఫీచర్ అనంతర ప్లాన్స్ ఏమిటన్నది ట్విట్టర్ తెలుపలేదు. బిజినెస్‌ల కోసం ఇదేమాదిరి ఫీచర్లను ఎలా వాడుకోవాలనే దానిపై క్లారిటీ లేదు. భవిష్యత్తులో డ్యాష్ బోర్డు నుంచి ట్విట్టర్ కమ్యూనిటీ బోర్డర్లో మంచి ఫీచర్లను తీసుకొస్తామని తాము ఆశిస్తున్నట్టు ట్విట్టర్ డ్యాష్ బోర్డు పలు ట్వీట్లను చేసింది. ఎక్కువమంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోకపోవడంతో ఈ ప్రొడక్ట్‌ను తొలగిస్తున్నట్టు తెలిపింది. బిజినెస్ యాప్స్ కేటగిరిలో ట్విట్టర్ డ్యాష్ బోర్డుకు చాలా తక్కువగా 432 ర్యాంకు నమోదైంది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ యాప్‌ను 40వేల సార్లే డౌన్ లోడ్ చేశారు. 2016 అక్టోబర్‌లో వైన్‌ను కూడా ట్విట్టర్ క్లోజ్ చేసింది.


