breaking news
Dalita Gala Sammelanam
-
‘చంద్రబాబుకు దళితులంటే గిట్టదు’
తాడేపల్లి : దళితులకు సమాజంలో గౌరవం తీసుకొచ్చింది దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అని మాజీ మంత్రి నారాయణస్వామి మరోసారి స్పష్టం చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ పాలనలోనే దళితులకు గౌరవం దక్కిందన్నారు. ఈరోజు(శనివారం, ఏప్రిల్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన నారాయణస్వామి.. . చంద్రబాబు దళితులంటే తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉంటారన్నారు. చంద్రబాబుకు దళితులంటే అస్సులు గిట్టదన్నారు. ‘జగన్.. నా ఎస్సీలు అంటూ అందరినీ అక్కున చేర్చుకున్నారు.. చంద్రబాబు మాల, మాదిగలను చీల్చి రాజకీయ లబ్ధి పొందారు. జగన్ తన క్యాబినెట్లో దళితులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవస్ధలో మార్పులు తీసుకొచ్చారు. దళిత సమాజం అభ్యున్నతికి కృషిచేసిన జగన్ని మళ్లీ సీఎంని చేసుకుందాం’ అని విజ్ఞప్తి చేశారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘దళిత గళ సమ్మేళనం’
తాడేపల్లి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళన సమావేశం జరుగుతుంది. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు.


