‘చంద్రబాబుకు దళితులంటే గిట్టదు’ | YSRCP Leader Narayana Swamy Takes On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు దళితులంటే గిట్టదు’

Apr 25 2026 7:33 PM | Updated on Apr 25 2026 7:44 PM

YSRCP Leader Narayana Swamy Takes On Chandrababu

తాడేపల్లి : దళితులకు సమాజంలో గౌరవం తీసుకొచ్చింది దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అని మాజీ మంత్రి నారాయణస్వామి మరోసారి స్పష్టం చేశారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ పాలనలోనే దళితులకు గౌరవం దక్కిందన్నారు. 

ఈరోజు(శనివారం, ఏప్రిల్‌ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన నారాయణస్వామి.. . చంద్రబాబు దళితులంటే తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉంటారన్నారు. చంద్రబాబుకు దళితులంటే అస్సులు గిట్టదన్నారు. 

‘జగన్‌.. నా ఎస్సీలు అంటూ అందరినీ అక్కున చేర్చుకున్నారు.. చంద్రబాబు మాల, మాదిగలను చీల్చి రాజకీయ లబ్ధి పొందారు. జగన్‌ తన క్యాబినెట్‌లో దళితులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవస్ధలో మార్పులు తీసుకొచ్చారు. దళిత సమాజం అభ్యున్నతికి కృషిచేసిన జగన్‌ని మళ్లీ సీఎంని చేసుకుందాం’ అని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement