breaking news
Dalit Christians
-
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటి?
సాక్షి, అమరావతి: దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల విషయంలో మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కుల విద్వేషాలను, మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. దళితులు మతం మారినంత మాత్రాన వారి వెనుకబాటు తనం, పేదరికం, సామాజిక హోదాలు మారిపోవని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో కులాలు, మతాలు పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి సృష్టించే కార్యక్రమాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇందుకోసం చెప్పేందుకు ఈ రెండేళ్లలో శతకోటి ఉదాహరణలు కన్పిస్తున్నాయన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రతీ మూడు నెలలకోసారి ఏదో మూల జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. నివారించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నారుఇటీవలి కాలంలో ప్రభుత్వంలో ఉన్న వారు, పదవుల్లో ఉన్న వారు.. దళితులను, దళిత క్రైస్తవులతో సహా ఇతర కులాలను లక్ష్యంగా చేసుకొని అన్యాయంగా, అవమానకరంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారని వైఎస్ జగన్ నిలదీశారు. దగ్గరుండి వెనుక నుంచి ప్రోత్సహిస్తుండటం మన కంటికి కన్పిస్తోందన్నారు. ‘రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా మత విద్వేషాలకు అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా.. వద్దా.. అనే దానిపై కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ సాగిస్తోంది. మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు మారవు. మతానికి, రిజర్వేషన్లకు ముడి పెట్టడం ధర్మం కాదని అసెంబ్లీలో 2023 మార్చి 24న తీర్మానం చేశాం. రిజర్వేషన్లతో మతాలకు సంబంధం లేదు. మతం మారడం వల్ల వాళ్ల్ల ఆర్థిక హోదాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగవు. రిజర్వేషన్లకు, మతాలకు మధ్య ముడి పెట్టడం సరికాదని తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్ కమిషన్‌కు వైఎస్సార్ సీపీ బృందం వెళ్లి వినతిపత్రం ఇచ్చి గట్టిగా ఇదే వాదన విన్పించింది. ఈ విషయంలో మీ వైఖరి ఏమిటో చెప్పాలని చంద్రబాబును గట్టిగా అడుగుతున్నా.. చేతనైతే మంచి చేయి.. మంచి చేయకపోతే ఈ మాదిరిగా విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. మీ పార్టీలో ఉన్న వాళ్లు, పదవుల్లో ఉన్న వాళ్లు దళితులను కించపరుస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు? కట్టడి చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు’ అని చెప్పారు.వైఎస్ జగన్‌ను కలిసిన పారిశుధ్య కార్మికులుఅండగా నిలుస్తామని వైఎస్ జగన్ భరోసాసాక్షి, అమరావతి: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్)లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమను కొత్త కాంట్రాక్టర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడంతో వారంతా బుధవారం తాడేపల్లి చేరుకుని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమను విధుల నుంచి తొలగించడం వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్‌లో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్‌ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మికులు తెలిపారు. దీంతో జీవనోపాధి కోల్పోయి తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలన వైఎస్ జగన్‌ను కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వారి ఉద్యోగాల పరిరక్షణ కోసం న్యాయపరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అన్నివిధాలా తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
రఘురామకృష్ణంరాజును సస్పెండ్ చేయాలని దళిత క్రైస్తవుల ర్యాలీ
-
దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కోసం చట్ట సవరణ!
దళిత క్రైస్తవులకు షెడ్యూల్డు క్యాస్ట్ (ఎస్సీ) హోదాను నిరాకరిస్తూ భారత దేశ అత్యు న్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన తీర్పు దురదృష్టకరం. విజయవాడలో ఇటీవల వామపక్ష, కాంగ్రెస్, వైసీపీ తదితర రాజకీయ పక్షాలు; దళిత, క్రైస్తవ, ముస్లిం సంఘాలు; యువజన, విద్యార్థి, మహిళా సంస్థలను ఆహ్వానించి సీపీఐ ఈ తీర్పుపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన క్షణం నుంచే అతని ఎస్సీ రిజర్వేషన్ హక్కు రద్దవుతుంది. ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు బీసీ(సీ) వర్గంలోకి వెళ్లి, వారి సామాజిక స్థితి మరింత దిగజారే ప్రమాదముంది. రాష్ట్రపతి జారీ చేసిన 1950 రాజ్యాంగ ఆదేశంలోని క్లాజ్ 3 ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే షెడ్యూల్డ్ కులాల హోదాను పరిమితం చేయడం; ఇతర మతాలలోకి మారిన దళితులకు ఆ హోదాను నిరాకరించడం, రాజ్యాంగంలోని సమానత్వ హక్కులకు విరుద్ధమైనది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్సీ – మాదిగ కులానికి చెందిన చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (Chinthada Anand vs State Of Andhra Pradesh) కేసులో సుప్రీంకోర్టు (24.3.2026న) పేర్కొన్నట్లుగా – హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను షెడ్యూల్డ్ కుల సభ్యులుగా పరిగణించకూడదని చెప్పడం, రాజ్యాంగంలోని సెక్యు లర్ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. క్లాజ్ 3ని ‘కచ్చితమైనది, తిరుగు లేనిది’గా భావించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు, పురోగతికి తలుపులు మూసివేయడమే! ఈ పరిస్థితుల్లో, 1950 రాష్ట్రపతి ఆర్డర్‌ను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయడం అత్యవసరం.లౌకికవాద సూత్రానికి దెబ్బభారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛను హామీ ఇస్తూ, దానిని ప్రాథమిక హక్కుల పరిధిలో చేర్చింది. వ్యక్తి తన ఇష్టానుసారం ఏ మతాన్నయినా ఆచరించే హక్కు కలిగి ఉండటం, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం. సదుపాయాలు, రిజర్వేషన్లు, చట్టబద్ధ హక్కులు పొందా లంటే హిందూ మతంలోనే కొనసాగాలని పరోక్షంగా నిర్బంధించడం, ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష దాడి చేయడమే! ఇది మత స్వేచ్ఛను నిర్వీర్యం చేయడమే కాకుండా, రాజ్యాంగం ప్రతిష్ఠించిన లౌకికవాద సూత్రాన్ని దెబ్బతీస్తుంది.ఇక ఆర్టికల్ 341ను పరిశీలిస్తే... దాని నిర్మాణం స్పష్టంగా రెండు క్లాజులుగా ఉంది. మొదటి క్లాజు ప్రకారం – ఆయా రాష్ట్రాల్లో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ కులాలను రాష్ట్రపతి, సంబంధిత రాష్ట్ర గవర్నరుతో సంప్రదించిన తరువాత బహిరంగ ప్రకటన ద్వారా నిర్దేశించవచ్చు. రెండవ క్లాజు ప్రకారం, షెడ్యూల్డ్ కులాల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడానికి పార్లమెంట్‌కు మాత్రమే చట్టబద్ధమైన అధికారం ఉంది. రాష్ట్రపతి జారీ చేసిన నోటిఫికేషన్‌ను మరో నోటిఫికేషన్ ద్వారా మార్చే అధికారం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ విధంగా చూస్తే... షెడ్యూల్డ్ కులాల గుర్తింపులో మతాన్ని ప్రమాణంగా నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఇచ్చినట్లు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో ఈ 1950 రాష్ట్రపతి ఆర్డర్‌ను ప్రాతిపదికగా తీసుకుంది. ఆర్టికల్ 341లో నిజంగా అలాంటి అధికా రాలు ఉన్నాయో, లేదో సుప్రీంకోర్టు సమగ్రంగా పరిశీలించలేదు.చదవండి: ఇప్పసారా.. రెండు అంచుల కత్తి!అంతిమంగా ఈ ఆర్డర్ సామాజిక న్యాయం కోసం కాకుండా, వర్గ ఆధిపత్యాన్ని కొనసాగించడానికీ, మత ఆధారిత నియంత్రణను బలపరచడానికీ ఉపయోగపడుతున్న సాధనంగా మారింది. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం (ఫుల్ బెంచ్) ముందు ఈ అంశాన్ని పునర్వి చారణకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. 1950 రాష్ట్రపతి ఆర్డర్‌లోని పేరా 3ను సవరించడం అత్యవసరంగా భావించాలి. దళిత క్రైస్తవులకు, ముస్లింలకు కూడా షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) హోదా కల్పించేలా పార్లమెంట్ చట్ట సవరణ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ అంశంపై స్పష్టమైన తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా తమ బాధ్యతను నిర్వర్తించాలి. గుజ్జుల ఈశ్వరయ్యసీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి -
సీఎం జగన్‌కు ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు
NRI News: యూఏఈలోని ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్లు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్లు. శనివారం సాయంత్రం బుర్ దుబాయ్‌లోని వెస్ట్ జోన్ సూపర్ మార్కెట్ దగ్గర పార్క్‌లో ఈ కృతజ్ఞతా సభ జరిగింది. సీఎం వైఎస్ జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి.. అనంతరం వాళ్లు ప్రసంగించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు వాళ్లు. ఈ కృతజ్ఞత సభకు యూఏఈ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సీఎం జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం, అన్ని వర్గాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు, సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుఏఈ ప్రవాసాంధ్ర దళిత సంఘాల నాయకులు తరపట్ల మోహన్, పాలపర్తి నీలిమ, కాగిత కుమార్, గోసంగి లక్ష్మి, కొల్లే రవి కుమార్, నక్క ఎలిజిబెత్, ఓగురి శ్రీనివాస్,ఈద శరత్ బాబు,మారుమూడి సుధ, నాగమణి, సాగర్,అనిల్ మోక, మురళి నల్లి,రామరాజు గొడి,తాడి రమేష్, సునీల్ ఖన్నా,నక్క శ్రీనుకుమార్, పండు, తదితరులు పాల్గొన్నారు. -
తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం..
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్, ఐపీఎస్‌లపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సీఐడీ ఏడీజీ పై అసత్య ఆరోపణలు మానుకోకుంటే రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెబుతామని వరప్రసాద్‌రావు హెచ్చరించారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మ.. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ బందర్ పార్లమెంటు ఇంఛార్జి రమేష్ మాట్లాడుతూ, రాజుల కుటుంబాలకే రఘురామకృష్ణరాజు కళంకం తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మగా మారాడని, రఘురామకృష్ణరాజు తన పద్ధతి మార్చుకోకుంటే ఆందోళనలు చేస్తామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విజయవాడ సిటీ అధ్యక్షుడు బూదాల శ్రీను అన్నారు. చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి!
న్యూఢిల్లీ: క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలు లభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు బుధవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీలను మతపరంగా తటస్థులుగా పరిగణించాలని ఆ పిటిషన్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సంస్థ కోరింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, ఎస్సీ జాతీయ కమిషన్‌కు, మైనారిటీల జాతీయ కమిషన్‌కు, భారత రిజిస్ట్రార్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని వారిని ఆదేశించింది. ‘ఇస్లాంలో రిజర్వేషన్లు లేవు. ఆ విషయాన్ని విచారణలో భాగం చేయొచ్చు కదా!’ అని కోర్టు అభిప్రాయపడింది. -
దళిత క్రైస్తవులకూ భూపంపిణీ
సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులకు (షెడ్యూల్ కులాల నుంచి క్రైస్తవులుగా మారినవారికి) భూపంపిణీ పథకంలో భాగంగా మూడు ఎకరాల పంపిణీ, భూ కొనుగోలు పథకాలు ప్రభుత్వం వర్తింపజేయనుంది. దళిత క్రైస్తవులకు చట్టబద్ధమైనహక్కులు (విద్యా,ఉద్యోగ రిజర్వేషన్లు తదితర సౌకర్యాలు) మినహా ఇతర రాయితీలను వర్తింపజేస్తూ రాష్ట్ర షెడ్యూల్కులాల అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్ఏసీ) జె.రేమండ్ పీటర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. షెడ్యూల్కులాల సహకార ఆర్థిక సంస్థ మంజూరు చేసే ఆర్థిక సహకార పథకాలతోపాటు, ఏయే పథకాలు షెడ్యూల్ కులాల(హిందువులు)వారికి వర్తిస్తాయో(చట్టబద్ధ హక్కులు మినహా) అవన్నీ ఎస్సీ కన్వర్డెడ్ క్రిస్టియన్లకు, బౌద్ధమతంలోకి మారిన వారికి కూడా వర్తింపజేస్తున్నట్టు ఈ జీవోలో పేర్కొన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ (మైనారిటీస్) సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార ఆర్థికసంస్థ వైస్-చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్లు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ జీవోలో తెలిపారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటివి షెడ్యూల్కులాల వారికే వర్తిస్తాయని జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే, ఈ రాయితీలను పొందేందుకు దళిత క్రైస్తవులు అనర్హులని స్పష్టం చేసింది. -
లోక్‌సభలో 'దళిత క్రైస్తవులు' ప్రత్యేక ప్రస్తావన
న్యూఢిల్లీః దళిత క్రై స్తవులను కేంద్రం ఆదుకోవాలని వైఎస్ఆర్ సీపీ ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో ఈ అంశంపై ఆయన ప్రత్యేక ప్రస్తావనల కింద మాట్లాడారు. దళిత క్రై స్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. దళితులు ప్రత్యేకంగా ఒక మతానికి చెందిన వారని లేదు. చాలా కులాలు, వర్గాలు పురాతన కాలం నుంచి వేర్వేరు మతాలను ఆచరిస్తున్నాయని వివరించారు. అలాగే క్రైస్తవ మతాన్ని కూడా కొన్ని వర్గాలు ఆచరిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోని దళితుల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులు పూర్తిగా మారలేదు. ఇప్పటికీ వారు కుల వివక్షకు గురవుతూనే ఉన్నారని సభ దృష్టికి తెచ్చారు. వారు సామాజిక అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. ఆర్థికంగా, విద్యాపరంగా వారు వెనకబడి ఉన్నారని తెలిపారు. దళిత క్రై స్తవులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి దళితులతో సమానంగా ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించడం లేదని చెప్పారు. అందువల్ల దళితులతో సమానంగా దళిత క్రైస్తవులను గుర్తించి వారిని సామాజిక స్థితిగతుల్లో మార్పు తేవాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు. ** -
'క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'
ఉండి : క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కనుమూరి రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. క్రైస్తవులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డెల్టా ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. వైఎస్ఆర్ ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్నే కాంక్షించేవారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందదన్నారు. బిల్లులో ఎన్నో తప్పులున్నాయని, విభజన జరగకుండా న్యాయపోరాటం చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళతామని తాము ఆశిస్తున్నామన్నారు. కేంద్రంలో సమైక్యం కోరుకున్న వారితోనే పొత్తు ఉంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.


