సీఎం జగన్‌కు ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు | Sakshi
Sakshi News home page

ఎన్నారై న్యూస్‌: సీఎం జగన్‌కు ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు

Published Tue, Mar 28 2023 7:42 AM

Dubai Pravasandhra Dalit Christians Special Thanks To AP CM Jagan - Sakshi

NRI News: యూఏఈలోని ప్రవాసాంధ్ర దళిత క్రిస్టియన్లు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.  దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించే విధంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకుగానూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్లు.

శనివారం సాయంత్రం బుర్‌ దుబాయ్‌లోని వెస్ట్‌ జోన్‌ సూపర్‌ మార్కెట్‌ దగ్గర పార్క్‌లో ఈ కృతజ్ఞతా సభ జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోకు పాలాభిషేకం చేసి.. అనంతరం వాళ్లు ప్రసంగించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు వాళ్లు. ఈ  కృతజ్ఞత సభకు యూఏఈ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ..  సీఎం జగన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం, అన్ని వర్గాలకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమాన అవకాశాలు, సమ న్యాయము చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యుఏఈ ప్రవాసాంధ్ర దళిత సంఘాల  నాయకులు తరపట్ల మోహన్, పాలపర్తి నీలిమ, కాగిత కుమార్, గోసంగి లక్ష్మి, కొల్లే రవి కుమార్, నక్క ఎలిజిబెత్, ఓగురి శ్రీనివాస్,ఈద శరత్ బాబు,మారుమూడి సుధ, నాగమణి, సాగర్,అనిల్ మోక, మురళి నల్లి,రామరాజు గొడి,తాడి రమేష్, సునీల్ ఖన్నా,నక్క శ్రీనుకుమార్, పండు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement