cylinder price hikes
-
దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను మరోసారి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్లతో.. రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్‌లపై అదనపు భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే..ఇంధన నిల్వలను బలోపేతం చేయడం, పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించడం, అక్రమ నిల్వలు (హోర్డింగ్).. మళ్లింపులను అరికట్టడం వంటి చర్యల నేపథ్యంలో ఈ ధరల సవరణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక.. కోట్లాది మంది గృహ వినియోగదారుకు ఊరట ఇస్తూ.. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. దీంతో.. రూ.821.50కు చేర్చారు. ప్రధాన నగరాల్లో కమర్షియలు సిలిండర్ ధరలు ఒక్కోలా ఉన్నాయి.ఢిల్లీలో ఒక్క సిలిండర్‌పై రూ.42 పెరిగింది. దీంతో.. ధర రూ.3,113.50కు చేరుకుంది. కోల్‌కతాలో రూ.53.50 పెంపు అమల్లోకి రావడంతో రూ.3,255.50గా మారింది. పెరిగిన రేట్లతో.. తెలంగాణ హైదరాబాద్‌లో(రూ.52 పెంపు) రూ.3,315, ఇటు ఏపీ విజయవాడలో రూ.3,251.50, విశాఖపట్నంలో రూ.3,146.50కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90 వేల మెట్రిక్ టన్నుల గరిష్ఠ స్థాయికి చేరగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కనీసం 30 రోజుల ఎల్పీజీ నిల్వలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం రోజుకు సుమారు 72 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ డిమాండ్ ఉండగా, రిఫైనరీలు 50–52 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నాయి. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో ఎల్పీజీ బ్యాక్లాగ్ 4.5 రోజులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలు, భారీ మొత్తంలో కొనుగోళ్లు పెరగడంతో ఇంధన విక్రయాల్లో అసాధారణ వృద్ధి నమోదైందని ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగగా, 14 జిల్లాల్లో పెట్రోల్ విక్రయాలు 100 శాతానికి మించి పెరిగాయి. దీంతో అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.గత నాలుగు రోజుల్లో ఎల్పీజీ పంపిణీకి సంబంధించిన 6,500 దాడులు నిర్వహించగా, ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే పెట్రోల్ బంకుల్లో 900 తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల ధరల మార్పులు ఎలా ఉన్నాయి?వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చులు, డిమాండ్ ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కానీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు ప్రధానంగా వినియోగించే వాణిజ్య ఎల్పీజీపై ఈ పెంపు ప్రభావం చూపిస్తూ వస్తోంది. ఎందుకు పెంచారు?పశ్చిమాసియాలో యుద్ధం.. హర్ముజ్‌లో నిలిచిన చమురు రవాణాదేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎల్పీజీ డిమాండ్వ్యూహాత్మక ఇంధన నిల్వలను బలోపేతం చేసే ప్రభుత్వ చర్యలుఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 30 రోజుల కనీస నిల్వల నిర్వహణ ఆదేశాలుఅక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు కఠిన చర్యలుసరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన నిర్వహణ వ్యయాలుమొత్తంగా చూస్తే, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు జూన్ నెల ప్రారంభంలోనే ధరల షాక్ తగిలింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అదనపు భారం లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. -
టిఫిన్ తినలేం.. కాఫీ తాగలేం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల ‘పొయ్యి’పై నీళ్లు చల్లింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరతను సాకుగా చూపిస్తూ సామాన్యుడి నడ్డి సైతం విరిచే నిర్ణయం తీసుకుంది. 19 కేజీల వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచడంతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.3,315కి చేరుకుంది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర యుద్ధానికి ముందు రూ. 2,217 ఉంటే.. మార్చి 1న (మొదటి పెంపు) రూ.2,322కు, మే 1న (తాజా పెంపు) రూ.3,315కు చేరింది.అంటే కేవలం 60 రోజుల వ్యవధిలోనే రూ.1,098 అదనపు భారం పడిందన్న మాట. ముఖ్యంగా పెరిగిన సిలిండర్ రేటు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. మార్కెట్లో నెలకొన్న గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు, కొందరు డీలర్లు..ఇప్పటికే ఒక కమర్షియల్ సిలిండర్‌కు బ్లాక్‌లో రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు.ఇప్పుడు భారీగా ధర పెరగడంతో, ఈ సాకుతో బ్లాక్‌లో అమ్మే రేటు కూడా భారీగా పెంచే అవకాశం ఉండటంతో పెద్ద, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు, కేటరర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 2 సిలిండర్లు వాడే టీ బంకులు, చిన్న హోటళ్ల యజమానులపై రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 అదనపు భారం పడుతుందని అంచనా.ఇప్పటికే మెనూలో కోత..మూతగ్యాస్ కొరత, పెరిగిన ధరతో ఇప్పటికే నగరంలోని అనేక హోటళ్లలో వంటకాల్లో కోత విధించారు. గ్యాస్ ఆదా కోసం కొన్ని వంటకాలు తగ్గించేశారు. కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొత్తగా పెరిగిన గ్యాస్ ధర హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ రంగాలను అతలాకుతలం చేసే అవకాశం కన్పిస్తోంది.రోజువారీ వినియోగం 65 వేల సిలిండర్లపైనేహైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ప్రధాన చమురు సంస్ధలతో పాటు ప్రైవేటు సంస్ధలకు సంబంధించి సుమారు 8.15 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు సుమారు 65 వేల సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.15%–20% వరకు ధరల పెరుగుదలప్రస్తుతం ఒక్కో సిలిండర్ రీఫిల్ ధరపై రూ. 994 పెంపుతో రోజుకు రూ.6.46 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.193.8 కోట్ల భారం పడుతుందన్నమాట. ఇది హోటళ్లలో ఆహారం ధరలపై ప్రభావం చూపించడం ఖాయం. హోటళ్ల యజమానులు ఈ భారాన్ని వినియోగదారులపైనే వేస్తారు. దీంతో హోటళ్లలో ఇడ్లీ మొదలుకుని బిరియానీ వంటి ఆహార పదార్థాల ధరలు 15% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.మహా హైదరాబాద్ పరిధిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం ఇలా..జిల్లా వాణిజ్య కనెక్షన్లు (సుమారు) రోజువారీ డిమాండ్ రోజువారీ అదనపు భారంహైదరాబాద్ 4,20,000 35,000 రూ. 3,47,90,000రంగారెడి 2,10,000 18,000 రూ. 1,78,92,000మేడ్చల్–మల్కాజిగిరి 1,85,000 12,000 రూ. 1,19,28,000 -
గ్యాస్ ‘బండ’ భారం.. మరో రూ.25 పెంపు
సాక్షి, హైదరాబాద్: ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతుంటే, మరో పక్క గృహావసర గ్యాస్ సిలిండర్ ధర కూడా వాటితో పోటీ పడుతోంది. ఈ నెలలోనే సిలిండర్‌పై రూ.75 మేర పెంచిన ఆయిల్ కంపెనీలు గురువారం మళ్లీ మరో రూ.25 మేర పెంచేశాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.846.50కి చేరింది. ఒక్క నెలలోనే సిలిండర్ ధర ఏకంగా రూ.100 మేర పెరిగిపోవడంతో సామాన్యుడికి చుక్కలు కనపడుతున్నాయి. 3 నెలల వ్యవధిలో రూ. 200 పెంపు నవంబర్‌లో సిలిండర్ ధర రూ.646.50 ఉండగా, డిసెంబర్లో ఏకంగా రూ.100 మేర పెరిగిపోయింది. దీంతో ధర రూ.746.50కి చేరింది. జన వరిలో ఈ ధరలు స్థిరంగా కొనసాగినా, ఫిబ్రవరి 4న రూ.25, 15న మరోసారి రూ.50 చొప్పున ఆయిల్ కంపెనీలు బాదేశాయి. దీంతో సిలిండర్ ధర రూ.821.50కి చేరింది. తాజాగా మళ్లీ రూ.25 పెంచడంతో అదికాస్తా రూ.846.50 అయ్యింది. ఇలా ఈ మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.200 మేర పెరిగిపోయిం దన్నమాట. రాష్ట్రంలో ప్రస్తుతం 1.18 కోట్ల గృహా వసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. ఈ సిలిండర్‌పై ఇవ్వాల్సిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం క్రమంగా కోత పెడుతూ వస్తోంది. గత ఏడాది మార్చి ముందు వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.220 వరకు సబ్సిడీ జమ చేసిన కేంద్రం.. ప్రస్తుతం కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. అంటే వినియోగదారుడిపై సబ్సిడీ కోత భారం ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌కు రూ.180 పడుతోందన్నమాట. దీనికి ఈ మూడు నెలల్లో పెరిగిన ధరల భారం రూ.200 కలిపితే మొత్తం రూ.380 మేర గ్యాస్ భారం పడినట్లయింది. ఓ పక్క సబ్సిడీలో కోతలు, మరోపక్క ధర పెంపు వాతలతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. -
వంటింట్లో గ్యాస్ మంట
సాక్షి,హైదరాబాద్: వంటింట్లో గ్యాస్ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. గతేడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 646.50 ఉండగా.. చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్లోనే రూ.100 మేర ధర పెంచాయి. దీంతో ధర రూ. 746.50కు చేరింది. తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర రూ.771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్ ధరలో రూ.520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ.200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారులకు వచ్చేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ.40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. పెట్రో ధరలు సైతం మండుతూనే ఉన్నాయి. -
షాకింగ్ : వంటగ్యాస్ ధరకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర బుధవారం వరసగా ఆరోసారి ఎగబాకింది. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు వరుసగా రూ 144.5, రూ 145 వరకూ పెంచినట్టు ఇండేన్ బ్రాండ్ నేమ్‌తో వంటగ్యాస్‌ను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్‌కతాలో రూ 896కు పెరిగాయి. కాగా ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తుండగా, అదనపు సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది. -
సిలిండర్‌పై రూ.62.50 పెంపు
సాక్షి, సిటీబ్యూరో : ఒకవైపు చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు... మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న సిటీజనులపై వంటగ్యాస్ ధర పెంపు రూపంలో మరో పిడుగు పడింది. వంటగ్యాస్ ధర రూ.62.50కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రేటర్ ప్రజలపై సుమారు రూ.11,549 కోట్ల అదనపు భారం పడుతోంది. వంటగ్యాస్ ధర పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1024.50కి చేరింది. ఇప్పటికే డీబీటీ పథకం పుణ్యమా అంటూ.. సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం పన్ను రూపంలో రూ.27.97 అదనంగా వసూలు చేస్తోంది. పైగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ రూ.25లకు కూడా ఎగనామం పెట్టింది. ఫలితంగా వినియోగదారులు ఒక్కో రీఫిల్లింగ్‌పై రూ.52.97 అదనంగా భరిస్తున్నారు. తాజాగా పెరిగిన ధర రూ.62.50తో కలుపుకొంటే మొత్తం రూ.115.47 అదనపు భారం పడినట్లయింది. జనంపై అదనపు భారం గ్రేటర్లో పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 10.75 లక్షల కనె క్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. అయితే అనుసంధానమైన వినియోగదారులపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర, అమ్మకం పన్ను వడ్డన, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఎగవేతతో సగటున రూ.1241 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇకపోతే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కాని సుమారు 15.30 లక్షల మంది వినియోగదారులపై సగటున మరో రూ. 10,308 కోట్ల అదనపు భారం పడనుంది. వీరికి కేంద్ర ప్రభుత్వం పక్షాన ఒక్కో రీఫిల్లింగ్‌పై వర్తించే సబ్సిడీ రూ.558.30కి తోడు పెరిగిన ధర, రాష్ట్ర ప్రభుత్వ అమ్మకం పన్ను వడ్డన, సబ్సిడీ ఎగవేత కలుపుకొని మొత్తం మీద సిలిండర్‌కు 673.77 పైసలు చొప్పున అదనపు భారం పడనుంది. దీంతో గ్రేటర్ వాసులు వంటగ్యాస్ అంటేనే బెంబెలెత్తిపోతున్నారు.


