cultural competitions
-
ఎంతో కొంత కళా పోషణ ఉండాలి
గన్ ఫౌండ్రీ (హైదరాబాద్): మనిషన్నాక ఎంతో కొంత కళాపోషణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన శాసన సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీల ముగింపు సభ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... చాలామంది ప్రజా ప్రతినిధులు తమలో ఉన్న ప్రతిభను మర్చిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించే వారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంప్రదాయాన్ని కొనసాగించలేదన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీలను కొందరు రాజకీయం చేసి బహిష్కరించారని, కనీసం వచ్చే సంవత్సరమైనా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్తూ.. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పలువురు శాసన సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. విజేతలు వీరే.. : క్రికెట్లో మంత్రి శ్రీహరి జట్టు విజయం సాధించగా.. బ్యాడ్మింటన్‌లో రాందాస్ నాయక్, ఆదినారాయణ జోడి విజయం సాధించింది. టేబుల్ టెన్నిస్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. పవర్ లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో శంకర్ నాయక్, 93 కేజీల విభాగంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, 105 కేజీల విభాగంలో అనిరుధ్ రెడ్డి విజయం సాధించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శాసనసభ్యుల కోసం రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. దుర్యోధనుడి వేషధారణలో మంత్రి వాకిటి శ్రీహరి పలికిన డైలాగులు, గంభీరమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్టప్ప పాత్రలో శంకర్ నాయక్ ఒదిగిపోగా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గిరిజన పాటలకు హుషారుగా డ్యాన్స్ చేయగా.. రామచంద్రనాయక్ తనదైన స్టెప్పులు వేశారు. -
పోటీలతో ఉత్సాహం
కాకినాడ కల్చరల్ : పోటీలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని జెఎ¯ŒSటీయూకే రెక్టార్ బి.ప్రభాకరరావు అన్నారు. సూర్యకళామందిర్‌లో భారత తపాలాశాఖ 31వ జాతీయ స్థాయి సాంస్కృతిక ప్రాథమిక పోటీలు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను కలిగించడానికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని పోస్ట్‌మాస్టర్ జనరల్ (విశాఖపట్టణం) టి.ఎం.శ్రీలత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్(కాకినాడ శాఖ) అధికారి కె.కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలు శుక్రవారం కూడా జరుగుతాయన్నారు. ఆం«ధ్ర ప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిల్స్‌లోని 104 మంది ఉద్యోగులు ఈ సాంస్కృతిక పోటీలలో పాల్గొంటున్నారన్నారు. ఈ ప్రాథమిక పోటీలలో ప్రథమ స్థానం పొందినవారు నవంబర్‌లో రాజస్థా¯ŒSలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హులని అన్నారు. మొదటి రోజున జానపద గేయాల ఆలాపన, వేణుగానం, గాత్రం విభాగాల్లో జూనియర్స్, సీనియర్స్‌కు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గుంటూరు, రామచంద్రపురం, హనుమకొండ, విశాఖపట్నంకు చెందిన 15 మంది కళాకారులు పాల్గొన్నారు. శుక్రవారం కూచిపూడి, భరత నాట్యం, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహిస్తామని సూపరింటెండెంట్ శ్రీకుమార్ తెలిపారు. కళాకారులు పెద్దాడ సూర్యకుమారి, పాండురంగ రాధాకృష్ణ, చిలుకూరి సుబ్బలక్ష్మి, ఎస్.కృష్ణకుమార్, వి.లోకేష్, వై.కె.కృష్ణవేణిలు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో తపాలా శాఖాధికారులు వై.ఎస్.నరసింగరావు, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
‘ఉస్మానియా’ వాకిట్లో కళల సంబరం
ఉస్మానియా యూనివర్సిటీ కలర్ఫుల్గా మారింది. ఎటు చూసినా ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. వర్సిటీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియం ఈ కళల సంబరానికి వేదికయింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీలను ఓయూ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య ప్రారంభించారు.వర్సిటీలో ఉన్నత విద్యతో పాటు వివిధ కళల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు అంతర్ విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలకు అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు.భరత నాట్యం, కూచిపూడి, జానపద, బంజార, ఆదివాసి నృత్యాల్ని విద్యార్థులు ప్రదర్శించారు.ముగ్గుల పోటీలు, పెయింటింగ్, స్పాట్ పెయింటింగ్, ఫొటోగ్రఫీ పోటీలు ఆడిటోరియం ఆవరణకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.


