cuba president
-
ట్రంప్ కొత్త టార్గెట్ ఫిక్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. వెనిజులాలో సైనిక తిరుగుబాటు, ఇరాన్‌తో యుద్ధం తర్వాత ఇప్పుడు అమెరికాకు అతి సమీపంలో ఉన్న క్యూబాను తన గుప్పిట్లోకి తీసుకోవాలని ట్రంప్ తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలానికి దారి తీస్తోంది.అదను చూసి ట్రంప్ వ్యూహంఅమెరికా విధించిన చమురు దిగ్బంధం కారణంగా క్యూబా ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశవ్యాప్తంగా టోటల్ బ్లాక్ అవుట్ ప్రకటించడంతో ఆ ద్వీప దేశం చీకటిమయమైపోయి, అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. ‘క్యూబాను ఏదో ఒక రూపంలో స్వాధీనం చేసుకోవడం మాకు దక్కే గౌరవంగా భావిస్తున్నాను. దాన్ని విముక్తం చేస్తానా? లేదా నా ఆధీనంలోకి తీసుకుంటానా అనేది నా ఇష్టం. ప్రస్తుతం ఆ దేశం చాలా బలహీనంగా ఉంది, నేనేం చేయాలనుకుంటే అది చేయగలను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని విన్న క్యూబా ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలో కాలం గడుపుతున్నారు. ఆర్థిక దిగ్బంధంతో ఉక్కిరిబిక్కిరిగత 67 ఏళ్లుగా క్యూబాలో సాగుతున్న కమ్యూనిస్ట్ పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం క్యూబాపై ఆర్థిక ఒత్తిడిని అంతకంతకూ పెంచుతోంది. క్యూబాకు మిత్రదేశమైన వెనిజులాలో మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత, క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయింది. గత మూడు నెలలుగా తమకు ఎలాంటి ఇంధన రవాణా అందలేదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ఆవేదన వ్యక్తం చేశారు.Trump on Cuba:I do believe I’ll have the honor of taking Cuba. That would be good. That’s a big honor.I can free it or take it, I think I can do anything I want with it. pic.twitter.com/I0TpVCY73j— Clash Report (@clashreport) March 16, 2026త్వరలోనే ఒక ఒప్పందంఅమెరికాకు క్యూబా ఒక అసాధారణ ముప్పుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అయితే ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాతో ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని, లేదా తాము అనుకున్నది చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే క్యూబా ప్రభుత్వం కూడా తమతో రాజీకి రావాలని కోరుకుంటోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర? -
4 జీబీ డేటా 3 వేల రూపాయలు
మొబైల్ ఇంటర్నెట్.. ప్రస్తుతం ఓ నిత్యావసరంగా మారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు కూడా ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తిని విస్తృతిస్తున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి కనెక్ట్ అవడానికి కూడా మొబైల్ ఇంటర్నెటే ఓ సారథిలా ఉపయోగపడుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ లగ్జరీగా ఉంది. చాలా మంది దీని యాక్సస్‌ను పొందలేకపోతున్నారు. దీనిలో కరేబియన్ దీవి క్యూబా ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ.. క్యూబా ఎట్టకేలకు మొబైల్ ఇంటర్నెట్ను అందించడం ప్రారంభించింది. తొలిసారిగా ఎంపిక చేసిన యూజర్లకు అంటే ప్రభుత్వ రంగ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగులు, రాయబారులకు మొబైల్ ఇంటర్నెట్ను అందిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు మొబైల్ ఫోన్ యూజర్లందరకూ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా క్యూబా పనిచేస్తోంది కూడా. క్యూబన్ టెలికాం దిగ్గజం ఈటీఈసీఎస్ఏ ఈ సర్వీసులను అందజేస్తోంది. అయితే ఆ దేశ టెలికాం మార్కెట్లో మోనోపలిగా సేవలందిస్తున్న ఈ సంస్థ, 4 జీబీ డేటాకు 45 డాలర్లు అంటే రూ.3 వేలను ఛార్జ్‌లుగా విధిస్తోంది. తన 50 లక్షల కస్టమర్లందరికీ ఇంటర్నెట్ యాక్సస్‌ను ఈటీఈసీఎస్ఏ కల్పిస్తుందని రిపోర్టు చెప్పాయి. అంటే దేశ జనాభాలో సగం శాతం. 2018 నాటికి దేశం మొత్తానికి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా గట్టిగా చెబుతోంది. వ్యాప్తి చెందుతున్న ఇంటర్నెట్ యాక్సస్‌తో, దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ఈ విప్లవానికి క్యూబా ప్రజలు కూడా సాయం చేస్తారని క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్ డియాజ్ కానెల్ చెప్పారు. 2013 వరకు క్యూబాలో ఇంటర్నెట్ కేవలం పర్యాటక హోటళ్లలోనే అందుబాటులో ఉంది. సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ వై-ఫైలతో ఈ ఇంటర్నెట్ వ్యాప్తిని క్యూబా విస్తృతపరుస్తోంది. అయితే 5జీ టెక్నాలజీ వైపు ప్రపంచ దేశాలన్నీ దూసుకుపోతుంటే, 3జీ కనెక్టివిటీని అందించడానికే క్యూబా తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
క్యూబాలో సొంత ఆస్తిహక్కు!
హవానా: కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు త్వరలో సాకారం కాబోతోంది. ఇందుకు సంబంధించి సవరించిన రాజ్యాంగ బిల్లు వారం రోజుల్లో జాతీయ అసెంబ్లీ ముందుకు రానుంది. 1976లో ఫిడెల్ క్యాస్ట్రో అధ్యక్షతన ఏర్పాటైన సోషలిస్టు రాజ్యాంగం సొంత ఆస్తిహక్కుకి పూర్తిగా వ్యతిరేకం. పాత రాజ్యాంగంలో ఉన్న 137 ఆర్టికల్స్‌కు అదనంగా మరో 224 ఆర్టికల్స్‌ను కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు చట్టబద్దమమవుతుంది. వ్యక్తిగత ఆస్తిని ఆమోదించడం అంటే చట్టబద్ధంగా ప్రైవేటు ఆస్తికి రక్షణనివ్వడమేననీ, తద్వారా ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఇది ఊతమిస్తుందని ప్రభుత్వ అధికారిక పత్రిక గ్రాన్మా అభిప్రాయపడింది. రౌల్ క్యాస్ట్రో అనంతరం మిగ్వెల్ డియాజ్ కానెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 2011లో చేసిన చట్ట సవరణతో ఆస్తి అమ్మకాలపై నిషేధాన్ని తొలగించారు. -
విద్య, వైద్య రంగాల చుక్కాని
సందర్భం మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నేతలలో క్యాస్ట్రో ఒకరు. గుర్తించడమే కాదు చిత్తశుద్ధితో ఆ రంగ అభివృద్ధికి పనిచేసిన నేత. అందరికీ వైద్యం.. నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు. ప్రపంచ పటంలో అంగుళం స్థలం కూడా తీసుకోని అతి చిన్న దేశం క్యూబా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించింది. 50 ఏళ్లపాటు అమెరికా పక్కలో బల్లెంలా నిలిచింది. సైనిక బల గంతో గెలవాలని చూస్తే రెట్టిం చిన బలంతో నిటారుగా నిలి చింది. కుట్రలు, కుతంత్రాలు, హత్యాయత్నాలతో మట్టు పెట్టాలని చూస్తే కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని ప్రయ త్నిస్తే వటవృక్షంలా విస్తరించింది. ఇంత చిన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది? సైనిక పహారాలతోనా, ఫిరంగుల మోతలతోనా? ఎలా సంభవమైంది? ఇనుప సంకెళ్ళతో ఎంతోకాలం ఏ దేశం మనలేదు. భుజబలంతో ఏ రాజ్యం దీర్ఘకాల సుఖసంతోషాలను కొని తీసుకురాలేదు. క్యూబా చిన్నదేశమైనా అమెరికాలాంటి అగ్రరాజ్యం కబళించ లేకపోవడానికి కారణం మనిషి అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చిన వికాసం. ప్రజల బాగో గులు పట్టించుకొని వాటికే పట్టంకడితే చీమంత దేశాన్నయినా గద్దలాంటి పెద్ద దేశం ఏమీ చేయలేదని క్యూబా నిరూ పించి చూపించింది. తమ యోగక్షేమాలు చూసిన నాయకుడిని పరాయిదేశం తుద ముట్టించాలని చూస్తే ప్రజలు రక్షక కవ చంగా నిలవడంతో చిన్న దేశాల ఆత్మవి శ్వాసానికి పెద్ద సంకేతంగా మిగిలిపోయింది. ఫిడెల్ క్యాస్ట్రో చతురంగ బలంలోను, చతుర్విధ కుయుక్తులతో ఐదు దశాబ్దాల పాటు నెట్టుకురాలేదు. మనిషి ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటిని కల్పించేం దుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మానవ వికాసానికి ప్రాతిపదికగా నిలిచే ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి శత విధాలా పనిచేశారు. ఆరోగ్య పరిరక్షణ, విద్యారంగాలపై ధనం, సమయం వెచ్చించి లాటిన్ అమెరికా దేశాలలోనే గొప్ప విజయాలు సాధించారు. అవసరంలో ఉన్న దేశాలకు నిష్ణాతులైన వైద్యులను పంపే ప్రాణదాతగా క్యూబాను క్యాస్ట్రో నిలిపారు. మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నాయకులలో కాస్ట్రో ఒకరు. ప్రపంచమంతా వైద్యరంగం వ్యాపారమయమైంది. ప్రభు త్వాలు ఎంత నియంత్రించినా కట్టడి చేయలేక పోయాయి. కానీ ఫిడెల్ క్యాస్ట్రో వైద్య రంగాన్ని పరిరక్షించుకున్నారు. అందరికీ వైద్యం అందించారు. అదీ నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు. ఒక వెనుకబడిన చిన్నదేశం వైద్య విద్యారంగంలో ప్రగతి సాధించి ఇతర దేశాలకు సైతం వైద్యులను పంపే స్థాయికి చేరడం ప్రపంచదేశాల ప్రశంసలందుకుంది. విద్యకు, వైద్యానికి గల పరస్పర సంబంధాన్ని ఫిడెల్ క్యాస్ట్రో అర్థం చేసుకున్న తీరు అమోఘం. క్యూబాలో పిల్ల లకు మంచి చదువు ఇచ్చారు. చదువుకొని కళాశాల ప్రాంగ ణాలు దాటి వచ్చిన తర్వాత ఉపయోగపడాల్సిన రంగా లను గుర్తించారు. ఏయే వృత్తుల్లో నిపుణులు అవసరమో అంచనావేసి ఆ రంగాలకు తగిన కోర్సులనే చేయించారు. ముఖ్యంగా సమాజంలో వైద్యుల అవసరాన్ని గుర్తించి వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలను ప్రతిభా వంతులుగా తయారుచేయడానికి తరగతిలో ఉపాధ్యాయ బోధన, పటిష్ట విద్యా విధానంతోపాటు తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు పోషకాహారాన్ని ధనిక, పేద తారత మ్యాలు లేకుండా అందేలా చూడటంతో క్యూబా విద్యా ప్రమాణాలు గొప్పగా పెరిగాయి. 1970 దశకంలోనే క్యూబా సంపూర్ణ అక్షరాస్యతతోపాటు అధిక శాతం పట్ట భద్రులుగల దేశంగా గుర్తింపు పొందింది. 1980వ దశకం ప్రారంభంలోనే 90 శాతం మంది విద్యావంతులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పన చేయగలిగిన దేశంగా ప్రశంసలందుకున్నది. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో అనుసరించిన పంథా ఇతర చిన్న చిన్న దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. పోలండ్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, సింగపూర్ దేశాలు విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చి క్యూబా తరహా విజయాల కోసం ప్రయ త్నిస్తున్నాయి. క్యూబా ప్రజల అభ్యున్నతికి, వికా సానికి ఫిడెల్ క్యాస్ట్రో చేసిన కృషి కార ణంగానే బాహ్య శక్తులు ఆయనను ఏమీ చేయలేకపోయాయి. క్యూబాను చావుదెబ్బ కొట్టాలని అమెరికా ఎన్ని విధాలుగా ప్రయ త్నాలు చేసినా క్యూబా ప్రతిసారీ రెట్టింపు శక్తితో లేచి నిలబడేది. పంచదార, పొగాకు, కాఫీ తదితర ఉత్పత్తులకు క్యూబా పెట్టింది పేరు. ఇతర దేశాలలో వీటికి మంచి గిరాకీ ఉండేది. కానీ వాటిని మరే దేశాలు కొనకుండా అమెరికా ఆంక్షలు విధిం చేది. అయితే నాటి సోవియట్ యూనియన్ కొండంత అండగా నిలిచేది. క్యూబా ఉత్పత్తులను తీసుకొని ఆ దేశా నికి పెట్రోల్ ఇచ్చేది. అమెరికా ఆర్థికంగాను, సైనికంగానూ క్యూబాను తొక్కేయాలని ప్రయత్నించినా ఫిడెల్ క్యాస్ట్రో తన దేశ ప్రజల అండదండలతోనే నిలబడగలిగారు. సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు క్యూబాకు క్లిష్ట పరి స్థితులు ఎదురయ్యాయి. క్యాస్ట్రోకు ప్రజలు మళ్ళీ అండగా నిలబడ్డారు. అప్పటి వరకు క్యూబా ఉత్పత్తులు తీసుకున్న సోవియట్ నుంచి సహాయం లేకపోవడంతో క్యూబా ఇక అంతమై పోయినట్టేనని అమెరికా భావించింది. అయితే క్యాస్ట్రో ఆదాయ వనరుల పెంపుదలకు పర్యాటక రంగాన్ని ఎంచుకొని వృద్ధి చేశారు. అందమైన కరీబియన్ దీవుల్లో భాగమెన క్యూబాలో పర్యాటక రంగం పుంజుకుంది. తుపాకీ గొట్టంతోనో, సైనిక పదఘట్టనలతోనో ఏ నేతా దీర్ఘకాలం నిలవలేడు. జన హృదయ వీధుల్లో స్థానం సంపాదించిన వారే నాలుగు కాలాలపాటు మనగలుగు తారు. మానవ వికాస రంగాలను గుర్తించి వాటి అభివృ ద్ధికి, క్యూబా పురోభివృద్ధికి పాటుపడినందువల్లనే ఫిడెల్ క్యాస్ట్రో తిరుగులేని నాయకుడయ్యాడు. చిన్న దేశాల స్వాభి మానానికి చిహ్నంగా నిలిచాడు. చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు


