విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్‌ | US indicts former Cuban president Raul Castro in landmark case | Sakshi
Sakshi News home page

విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్‌

May 21 2026 4:12 AM | Updated on May 21 2026 4:16 AM

US indicts former Cuban president Raul Castro in landmark case

అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు న‌మోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచార‌ణ ప్రారంభ‌మైంది.

ఈ చార్జ్‌షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ  పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. 

ఇదే విషయంపై  అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కింద‌ట హ‌త్య‌కు గురైన నలుగురు అమెరిక‌న్ల కుటుంబాలు ఇప్ప‌టికి  న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధ‌ర‌ణ పౌరులు. వారి వ‌ద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. 

శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరుల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీల‌క పాత్ర‌. అత‌డి అరెస్ట్ కోసం త్వ‌ర‌లోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అత‌డు త‌నంత‌ట తాను అమెరికాకు వ‌స్తాడ‌ని ఆశిస్తున్నాము. లేక‌పోతే ఇత‌ర మార్గాల్లో మేమే ర‌ప్పిస్తామ‌ని" ఆయ‌న పేర్కొన్నారు.

అస‌లు 1996లో ఏమి జ‌రిగిదంటే?
'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్ప‌టిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని ర‌క్షించ‌డం ఆ సంస్థ ప‌ని. 

ఈ సంస్థ‌కు చెందిన  మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘ‌ట‌న‌లో  కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ స‌మ‌యంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అత‌డి ఆదేశాల మేరకే అమెరికా సివిలియ‌న్ విమానాల‌ను కూల్చివేశార‌ని  అమెరికా న్యాయశాఖ  నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల త‌ర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement