CSK vs GT
-
ధోని గురించి ప్రశ్న.. రుతురాజ్ వ్యాఖ్యలు వైరల్
ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2026లో చెత్త ప్రదర్శన కనబరిచింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొన్న చెన్నై.. ఘోర ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.89 పరుగుల తేడాతో చిత్తుగుజరాత్తో మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాటపట్టడం వరుసగా ఇది మూడోసారి. ఇదిలా ఉంటే.. చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.రిటైర్మెంట్ సంకేతాలుమోకాలి నొప్పి కారణంగా ధోని (MS Dhoni) ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని చెన్నై యాజమాన్యం తొలుత ప్రకటించింది. అయితే, ఆ తర్వాత కూడా అతడు అందుబాటులోకి రాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో చెన్నై సొంతమైదానం చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా సోమవారం ధోని దర్శనమిచ్చాడు.సహచర ఆటగాళ్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగిన ధోని.. అభిమానులకు అభివాదం చేస్తూ మైదానం మొత్తం కలియదిరిగాడు. దీంతో ‘తలా’ రిటైర్మెంట్ ఇచ్చాడనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ధోని నోటి నుంచి అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదు.ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ధోని వచ్చే సీజన్లో ఆడతాడా? లేదంటే ఇక అతడి ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లేనా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ధోని గురించి ప్రశ్న.. నాకేం తెలుసు?గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రుతురాజ్‌కు ధోని భవిష్యత్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘వచ్చే ఏడాదే ఈ విషయం గురించి స్పష్టత వస్తుంది. నాకు కూడా దీని గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదు. మీతో పాటే వచ్చే ఏడాదే నేనూ ధోని ఆడతాడా? లేదా? అనేది తెలుసుకుంటాను’’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించే ధోనిని ఈ సీజన్లో తాము బాగా మిస్సయ్యామన్న రుతురాజ్.. ఆయన ఉంటే పరిస్థితి ఉంటే కాస్త భిన్నంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ధోని లేని లోటు ఎవరూ తీర్చలేరని.. అయితే, ప్రస్తుతం ఉన్న జట్టుతో తాము సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు.చదవండి: సీఎస్కేకు మరో దెబ్బ.. ఈసారి తుదిజట్టు మొత్తానికీ శిక్ష! -
సీఎస్కేకు మరో భారీ ఎదురుదెబ్బ.. ఈసారి!
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2026లో ‘ప్లే ఆఫ్స్’కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై ఘోర పరాజయం ఎదుర్కొంది. మొదట టాపార్డర్ రాణించడంతో భారీ స్కోరు చేసిన టైటాన్స్... బౌలింగ్‌లోనూ సమష్టిగా సత్తాచాటి పట్టికలో రెండో స్థానానికి చేరింది.వరుసగా ఇది మూడోసారిమరోవైపు.. వరుసగా మూడో ఓటమితో చెన్నై సీజన్‌ను ముగించింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత చెన్నై జట్టు ‘ప్లే ఆఫ్స్’నకు చేరకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇలా ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న చెన్నై జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు జట్టుకు భారీ జరిమానా పడింది. ఐపీఎల్ పాలక మండలి తాజాగా ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.‘‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేటు మెయింటెన్ చేసినందుకు గానూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా విధిస్తున్నాం.రూ. 24 లక్షల ఫైన్ఈ సీజన్లో చెన్నై ఈ తప్పిదానికి పాల్పడటం ఇది రెండోసారి. కాబట్టి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గైక్వాడ్‌కు రూ. 24 లక్షల ఫైన్ వేశాము. అదే విధంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్న చెన్నై తుదిజట్టు మొత్తానికి.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా అందరికీ రూ. 6 లక్షల జరిమానా లేదంటే.. వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం (ఇందులో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుంది)’’ అని ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది. చెన్నై వర్సెస్ గుజరాత్ సంక్షిప్త స్కోర్లుగుజరాత్: 229/4(20)చెన్నై: 140(13.4)ఫలితం: చెన్నైపై 89 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపుచెన్నై తుదిజట్టుసంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడుThe beautiful uncertainties of a simple game called CRICKET ✨Except there was nothing uncertain about how comprehensively #GT closed out their league stage 💙#TATAIPL | #KhelBindaas | #GTvCSK | @gujarat_titans | @ChennaiIPL pic.twitter.com/W5syAIGhJF— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
గుజరాత్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్-2026లో భాగంగా గురువారం నాటి ఈ పోరులో వీరిద్దరు అర్ధ శతకాలతో రాణించారు.కెప్టెన్ గిల్ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయగా.. సాయి సుదర్శన్ 53 బంతులు ఎదుర్కొని 84 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.74 బంతుల్లో 125 పరుగులుఇక చెన్నైతో మ్యాచ్‌లో సాయి- గిల్ కలిసి తొలి వికెట్‌కు 74 బంతుల్లో 125 పరుగులు జోడించారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత సాధించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు.ఐపీఎల్లో అత్యధికసార్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా సాయి సుదర్శన్- శుబ్‌మన్ గిల్ నిలిచారు. అంతేకాదు.. పాకిస్తాన్ బ్యాటర్లు బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేశారు. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు వందకు పైగా పరుగులు జోడీగా నిలిచారు.ఐపీఎల్లో అత్యధికసార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలు👉సాయి సుదర్శన్- శుబ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)- ఏడుసార్లు👉అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- ఆరుసార్లు👉శిఖర్ ధావన్- డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)- ఆరుసార్లు👉జానీ బెయిర్ స్టో- డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)ఐదుసార్లు👉ఫాఫ్ డుప్లెసిస్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఐదుసార్లుటీ20 క్రికెట్లో అత్యధికంగా పదిసార్లు 100కు పైగా పరుగులు జోడించిన జంటలు👉బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్- కరాచీ కింగ్స్)👉ఏబీ డివిల్లియర్స్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)👉క్రిస్ గేల్- విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)👉సాయి సుదర్శన్- శుబ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించారు. వీరికి తోడు వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.చదవండి: మా చేతిలో పాక్ ఓటమి బాధించింది: బంగ్లాదేశ్ కోచ్6️⃣th fifty in TATA IPL 2026 for Shubman Gill! 👏GT skipper’s consistent run continues as he brings up his second-fastest fifty in the league! #TATAIPL Race to Playoffs 2026 👉 #GTvCSK | LIVE NOW https://t.co/BgI4AiRKkW pic.twitter.com/9aqFJiS8UL— Star Sports (@StarSportsIndia) May 21, 2026 -
సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు.Updates:సీఎస్కే ఏడో వికెట్ డౌన్రషీద్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి కాంబోజ్(19) అవుట్ కాగా.. నాలుగో బంతికి బ్రెవిస్(8) పెవిలియన్‌కు చేరాడు.శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) రూపంలో సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 123/6దూకుడుగా ఆడుతున్న దూబే10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. శివమ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్2.3: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఉర్విల్ పటేల్ (0). స్కోరు: 36-3(3.2)కార్తిక్ శర్మ 6, మాథ్యూ షార్ట్ 13 పరుగులతో ఉన్నారు. విజయానికి 194 పరుగులు కావాలి.2.2: సిరాజ్ బౌలింగ్‌లో రుతురాజ్ బౌల్డ్ (7 బంతుల్లో 16)సంజూ శాంసన్ డకౌట్ఇన్నింగ్స్ తొలి బంతికే చెన్నై తమ ఓపెనర్ సంజూ శాంసన్ (0) వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. మాథ్యూ షార్ట్‌కు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వచ్చాడు.గుజరాత్ భారీ స్కోరు!ఓపెనర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించి బలమైన పునాది వేశారు. వీరికి తోడు వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్)తో దుమ్ములేపాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ గిల్‌ను అవుట్ చేయగా.. అన్షుల్ కాంబోజ్ సాయి వికెట్ దక్కిచుకున్నాడు. ముకేశ్ చౌదరి వాషింగ్టన్ సుందర్ (7)ను పెవిలియన్‌కు పంపగా.. రాహుల్ తెవాటియా (0) రనౌట్ అయ్యాడు.వాషీ అవుట్19.6: ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన వాషీ (7).మూడో వికెట్ డౌన్18.3: రాహుల్ తెవాటియా (0) రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్. స్కోరు: 207-3(18.3). వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు.సాయి సుదర్శన్ అవుట్18.2: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్. 53 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన సాయి. రాహుల్ తెవాటియా క్రీజులోకి రాగా.. బట్లర్ 43 పరుగులతో ఉన్నాడు. గుజరాత్ డబుల్ సెంచరీ17.6: గుర్జప్నీత్ బౌలింగ్‌లో బట్లర్ ఫోర్ తీయగా.. గుజరాత్ డబుల్ సెంచరీ మార్కు అందుకుంది. స్కోరు: 201-1(18). బట్లర్ 43, సుదర్శన్ 78 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో గుజరాత్ స్కోరు: 159-1జోస్ బట్లర్ 26, సాయి సుదర్శన్ 57 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్12.2: గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి.. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు.మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న గిల్ ఖాతాలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. స్కోరు: 129-1. జోస్ బట్లర్ క్రీజులోకి రాగా.. సుదర్శన్ 51 పరుగులతో ఉన్నాడు.సాయి సుదర్శన్ ఫిఫ్టీ11.1: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. ఈ సీజన్లో అతడికి ఇది వరుసగా ఐదో అర్ధ శతకం.పది ఓవర్లలో గుజరాత్ స్కోరు: 111-0ఓపెనర్లు గిల్ 30 బంతుల్లో 62, సుదర్శన్ 30 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.గిల్ అర్ధ శతకం6.6: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్. 23 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. స్కోరు: 78-0.పవర్ ప్లేలో గుజరాత్ స్కోరు: 62-0 (6)గిల్ 18 బంతుల్లో 35, సుదర్శన్ 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ5.1: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఫోర్ బాదగా.. గుజరాత్ యాభై పరుగుల మార్కు అందుకుంది.తొలి ఓవర్లో గుజరాత్ స్కోరు: 8-0ముకేశ్ చౌదరి చెన్నై బౌలింగ్ ఎటాక్ మొదలుపెట్టగా.. గిల్ ఏడు, సాయి సుదర్శన్ ఒక పరుగుతో ఉన్నారు.టాస్ గెలిచిన చెన్నై ఐపీఎల్-2026లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా టాప్-4లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి అర్హత సాధించింది. తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ప్లే ఆఫ్స్‌నకు తీసుకువెళ్లింది.మిగిలిన ఒక్క స్థానం కోసంఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు (రాజస్తాన్, పంజాబ్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) అధికారికంగా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై తమ లీగ్ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఇందుకు పటిష్ట గుజరాత్ టైటాన్స్‌తో గురువారం తలపడేందుకు సిద్ధమైంది.తుదిజట్లలో మార్పులు ఇవీఅహ్మదాబాద్ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అకీల్ హొసేన్ స్థానంలో గుర్జప్నీత్ సింగ్, ప్రశాంత్ వీర్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చినట్లు తెలిపాడు.ఇక గుజరాత్ టైటాన్స్ సైతం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. సాయి కిషోర్ స్థానంలో ప్రసిద్ కృష్ణను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.గుజరాత్ వర్సెస్ చెన్నై తుదిజట్లుగుజరాత్సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.చెన్నైసంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
సిక్సర్ల వీరుడని బిల్డప్.. టీమిండియాకు ఆడుతున్నాడు కానీ!
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 74 నాటౌట్) ఒక్కడే మెరుగైన స్కోరు సాధించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.సిక్సర్ల వీరుడని బిల్డప్‘‘శివం దూబే పరుగులు రాబట్టలేక సతమతమవుతున్నాడు. సిక్సర్ల దూబేగా అతడికి బాగా ప్రచారం కల్పించారు. కానీ అతడు ఐపీఎల్లో ప్రభావంతమైన ఇన్నింగ్స్ ఆడి దాదాపుగా రెండేళ్లు గడిచిపోయింది. కేవలం స్పిన్ బౌలింగ్‌లో మాత్రమే హిట్టింగ్ ఆడేవాడిగా ఉండిపోవద్దు దూబే.టీమిండియాకు ఆడుతున్నాడు కానీ..నిజానికి అంతర్జాతీయ క్రికెట్లో దూబే అద్బుతంగా ఆడుతున్నాడు. కానీ ఐపీఎల్లో తేలిపోతున్నాడు. ఈసారి ఐపీఎల్లో అతడు విఫలం కావడం చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద సమస్యగా పరిణమించింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు దూబే. ఈ సీజన్లో ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా కేవలం 150 పరుగులు సాధించాడు.రుతు ఒక్కడేఇక మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్ల క్రమశిక్షణకు టాపార్డర్ మెరుపులు తోడవడంతోగుజరాత్ టైటాన్స్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతమైదానం చెపాక్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 74 నాటౌట్) ఎట్టకేలకు అర్ధశతకం సాధించగా... మిగతావాళ్లు విఫలమయ్యారు.సాయి అదరగొట్టేశాడుగుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... అర్షద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. సాయి సుదర్శన్ (46 బంతులలో 87; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) దుమ్మురేపగా... కెప్టెన్శుబ్మన్ గిల్ (23 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్ (30 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా నిలిచారు. చెన్నై బౌలర్లలో అకీల్, నూర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: Virender Sehwag: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ఐపీఎల్లో ఒకే ఒక్కడు
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో పద్దెమినిదేళ్లుగా ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.144వ మ్యాచ్దాదాపు ఆరేళ్ల పాటు సన్‌రైజర్స్‌తో కొనసాగిన రషీద్ ఖాన్ (Rashid Khan).. 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి గుజరాత్‌కే ఆడుతున్న ఈ స్పిన్ బౌలర్... ఐపీఎల్-2026లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భాగమయ్యాడు. తద్వారా ఐపీఎల్లో తన 144వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు రషీద్ ఖాన్.ఏకైక ఆటగాడిగా రషీద్కాగా అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి దాకా రషీద్ ఖాన్ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. తద్వారా ఐపీఎల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా.. అత్యధికంగా 144 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా రషీద్ రికార్డులకెక్కాడు. తద్వారా భారత క్రికెటర్ సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.రైనా రికార్డు బద్దలుకాగా రైనా ఐపీఎల్లో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2008లో అరంగేట్రం చేసిన అతడు 2016లో తొలిసారి మ్యాచ్ మిస్ అయ్యాడు. తనకు కూతురు జన్మించిన సందర్భంగా అతడు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అప్పుడు రైనా గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. నాడు ఆర్సీబీతో మ్యాచ్ అతడు మిస్సయ్యాడు.గుజరాత్ అలవోకగా..మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చచ్చీ చెడి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ల ధాటికి 12 ఓవర్లలో 50 పరుగుల మార్క్ దాటిన సూపర్ కింగ్స్... 16వ ఓవర్లో మూడంకెల స్కోరు అందుకుంది. ఫుల్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ ముందు ఈ లక్ష్యం మరీ చిన్నదైపోయింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ మరోసారి దంచికొట్టడంతో 20 బంతులు మిగిలుండగానే టైటాన్స్ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ వికెట్లేమీ తీయలేకపోయాడు. ఒక్క ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్లో అరంగేట్రం నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు🏏రషీద్ ఖాన్- 144 మ్యాచ్‌లు- 2017-2026*- సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్🏏సురేశ్ రైనా- 143 మ్యాచ్‌లు- 2008-2016- చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ 🏏యూసఫ్ పఠాన్- 95 మ్యాచ్‌లు- 2008-2014- రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్🏏సుబ్రమణ్యం బద్రీనాథ్- 74 మ్యాచ్‌లు- 2008-2012- చెన్నై సూపర్ కింగ్స్🏏జితేశ్ శర్మ- 62 మ్యాచ్‌లు- 2022-2026*- పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం🎥 High & handsome from Jos Buttler to seal victory for @gujarat_titans 💙An emphatic chase and a very important 2⃣ points 👏Scorecard ▶️ https://t.co/zJBovAaCoM #TATAIPL | #KhelBindaas | #CSKvGT pic.twitter.com/rcc3CD7gqM— IndianPremierLeague (@IPL) April 26, 2026


