సీఎస్‌కేపై గుజరాత్‌ ఘన విజయం | GT vs CSK: Must Win Match For Ruturaj Co Toss Updates Highlights | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కేపై గుజరాత్‌ ఘన విజయం

May 21 2026 7:02 PM | Updated on May 21 2026 11:04 PM

GT vs CSK: Must Win Match For Ruturaj Co Toss Updates Highlights

అహ్మ‌దాబాద్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 89 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 230 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 13.4 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్‌ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, కగిసో రబాడ, రషీద్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు.
Updates:
సీఎస్‌కే ఏడో వికెట్‌ డౌన్‌
రషీద్‌ ఖాన్‌ వేసిన 13వ ఓవర్‌లో 
సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయింది.  తొలి బంతికి కాంబోజ్‌(19) అవుట్‌ కాగా.. నాలుగో బంతికి బ్రెవిస్‌(8) పెవిలియన్‌కు చేరాడు.

శివమ్‌ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) రూపంలో సీఎస్‌కే ఆరో వికెట్‌ కోల్పోయింది. 11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 123/6

దూకుడుగా ఆడుతున్న దూబే
10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 5 వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. శివ‌మ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. 15 బంతుల్లో 41 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్‌
2.3: సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన ఉర్విల్‌ పటేల్‌ (0). స్కోరు: 36-3(3.2)
కార్తిక్‌ శర్మ 6, మాథ్యూ షార్ట్‌ 13 పరుగులతో ఉన్నారు. విజయానికి 194 పరుగులు కావాలి.
2.2: సిరాజ్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ బౌల్డ్‌ (7 బంతుల్లో 16)

సంజూ శాంసన్‌ డకౌట్‌
ఇన్నింగ్స్‌ తొలి బంతికే చెన్నై తమ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (0) వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. మాథ్యూ షార్ట్‌కు తోడుగా రుతురాజ్‌ గైక్వాడ్‌ క్రీజులోకి వచ్చాడు.

గుజరాత్‌ భారీ స్కోరు!
ఓపెనర్లలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించి బలమైన పునాది వేశారు. వీరికి తోడు వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్‌)తో దుమ్ములేపాడు.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో స్పెన్సర్‌ జాన్సన్‌ గిల్‌ను అవుట్‌ చేయగా.. అన్షుల్‌ కాంబోజ్‌ సాయి వికెట్‌ దక్కిచుకున్నాడు. ముకేశ్‌ చౌదరి వాషింగ్టన్‌ సుందర్‌ (7)ను పెవిలియన్‌కు పంపగా.. రాహుల్‌ తెవాటియా (0) రనౌట్‌ అయ్యాడు.

వాషీ అవుట్‌
19.6: ముకేశ్‌ చౌదరి బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరిన వాషీ (7).

మూడో వికెట్‌ డౌన్‌
18.3: రాహుల్‌ తెవాటియా (0) రనౌట్‌. మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌. స్కోరు: 207-3(18.3). వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజులోకి వచ్చాడు.

సాయి సుదర్శన్‌ అవుట్‌
18.2: అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్‌. 53 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన సాయి. రాహుల్‌ తెవాటియా క్రీజులోకి రాగా.. బట్లర్‌ 43 పరుగులతో ఉన్నాడు. 

గుజరాత్‌ డబుల్‌ సెంచరీ
17.6: గుర్జప్నీత్‌ బౌలింగ్‌లో బట్లర్‌ ఫోర్‌ తీయగా.. గుజరాత్‌ డబుల్‌ సెంచరీ మార్కు అందుకుంది. స్కోరు: 201-1(18). బట్లర్‌ 43, సుదర్శన్‌ 78 పరుగులతో ఉన్నారు.

పదిహేను ఓవర్లలో గుజరాత్‌ స్కోరు: 159-1
జోస్‌ బట్లర్‌ 26, సాయి సుదర్శన్‌ 57 పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
12.2: గిల్‌ రూపంలో గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. స్పెన్సర్‌ జాన్సన్‌ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్‌ ఇచ్చి.. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్‌ పెవిలియన్‌ చేరాడు.

మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న గిల్‌ ఖాతాలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. స్కోరు: 129-1. జోస్‌ బట్లర్‌ క్రీజులోకి రాగా.. సుదర్శన్‌ 51 పరుగులతో ఉన్నాడు.

సాయి సుదర్శన్‌ ఫిఫ్టీ
11.1: నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్‌. ఈ సీజన్‌లో అతడికి ఇది వరుసగా ఐదో అర్ధ శతకం.

పది ఓవర్లలో గుజరాత్‌ స్కోరు: 111-0
ఓపెనర్లు గిల్‌ 30 బంతుల్లో 62, సుదర్శన్‌ 30 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.

గిల్‌ అర్ధ శతకం
6.6: నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్‌ గిల్‌. 23 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్‌. స్కోరు: 78-0.

పవర్‌ ప్లేలో గుజరాత్‌ స్కోరు: 62-0 (6)
గిల్‌ 18 బంతుల్లో 35, సుదర్శన్‌ 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీ
5.1: అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ ఫోర్‌ బాదగా.. గుజరాత్‌ యాభై పరుగుల మార్కు అందుకుంది.

తొలి ఓవర్లో గుజరాత్‌ స్కోరు: 8-0
ముకేశ్‌ చౌదరి చెన్నై బౌలింగ్‌ ఎటాక్‌ మొదలుపెట్టగా.. గిల్‌ ఏడు, సాయి సుదర్శన్‌ ఒక పరుగుతో ఉన్నారు.

టాస్‌ గెలిచిన చెన్నై 
ఐపీఎల్‌-2026లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ముందుగా టాప్‌-4లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి అర్హత సాధించింది. తమతో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ను కూడా ప్లే ఆఫ్స్‌నకు తీసుకువెళ్లింది.

మిగిలిన ఒక్క స్థానం కోసం
ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు (రాజస్తాన్‌, పంజాబ్‌, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) అధికారికంగా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై తమ లీగ్‌ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఇందుకు పటిష్ట గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం తలపడేందుకు సిద్ధమైంది.

తుదిజట్లలో మార్పులు ఇవీ
అహ్మదాబాద్‌ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అకీల్‌ హొసేన్‌ స్థానంలో గుర్జప్నీత్‌ సింగ్‌, ప్రశాంత్‌ వీర్‌ స్థానంలో మాథ్యూ షార్ట్‌ వచ్చినట్లు తెలిపాడు.

ఇక గుజరాత్‌ టైటాన్స్‌ సైతం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు. సాయి కిషోర్‌ స్థానంలో ప్రసిద్‌ కృష్ణను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.

గుజరాత్‌ వర్సెస్‌ చెన్నై తుదిజట్లు
గుజరాత్‌
సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.

చెన్నై
సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్‌, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్‌ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement