మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2026లో ‘ప్లే ఆఫ్స్’కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై ఘోర పరాజయం ఎదుర్కొంది. మొదట టాపార్డర్ రాణించడంతో భారీ స్కోరు చేసిన టైటాన్స్... బౌలింగ్‌లోనూ సమష్టిగా సత్తాచాటి పట్టికలో రెండో స్థానానికి
చేరింది.
వరుసగా ఇది మూడోసారి
మరోవైపు.. వరుసగా మూడో ఓటమితో చెన్నై సీజన్‌ను ముగించింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత చెన్నై జట్టు ‘ప్లే ఆఫ్స్’నకు చేరకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇలా ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న చెన్నై జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు జట్టుకు భారీ జరిమానా పడింది. ఐపీఎల్ పాలక మండలి తాజాగా ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.
‘‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేటు మెయింటెన్ చేసినందుకు గానూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా విధిస్తున్నాం.
రూ. 24 లక్షల ఫైన్
ఈ సీజన్‌లో చెన్నై ఈ తప్పిదానికి పాల్పడటం ఇది రెండోసారి. కాబట్టి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గైక్వాడ్‌కు రూ. 24 లక్షల ఫైన్ వేశాము.
అదే విధంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్న చెన్నై తుదిజట్టు మొత్తానికి.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా అందరికీ రూ. 6 లక్షల జరిమానా లేదంటే.. వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం (ఇందులో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుంది)’’ అని ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది.
చెన్నై వర్సెస్ గుజరాత్ సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 229/4(20)
చెన్నై: 140(13.4)
ఫలితం: చెన్నైపై 89 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపు

చెన్నై తుదిజట్టు
సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
The beautiful uncertainties of a simple game called CRICKET ✨
Except there was nothing uncertain about how comprehensively #GT closed out their league stage 💙#TATAIPL | #KhelBindaas | #GTvCSK | @gujarat_titans | @ChennaiIPL pic.twitter.com/W5syAIGhJF— IndianPremierLeague (@IPL) May 22, 2026


